Womens T20 World Cup 2024
-
ఒక్కొక్కరికి రూ. 1 కోటీ 30 లక్షలు!
ప్రపంచ క్రికెట్లో టాప్-3 అయిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పోలిస్తే న్యూజిలాండ్ క్రికెటర్లకు సాధారణంగా ఆట ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. ఎవరో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా ఇతర ఆదాయంపై ఆధారపడేవారే. ఇక ఒక్కసారి రిటైర్ అయితే నేరుగా ఏదైనా ఉద్యోగంలో చేరిపోతే తప్ప పని నడవదు. ఇక ఆ దేశపు మహిళా క్రికెటర్ల పరిస్థితి మరీ ఇబ్బందికరం.పురుష టీమ్ సభ్యులతో పోలిస్తే వీరికి దక్కేది చాలా తక్కువ మొత్తం. మహిళా క్రికెటర్లంతా ఆటపై ఇష్టం, ఆసక్తితో కొనసాగడమే. ఇలాంటి సమయంలో టీ20 వరల్డ్ కప్ విజయం ద్వారా వచ్చిన మొత్తం వారికి కాస్త ఊరటను అందించింది! విజేతగా నిలవడంతో కివీస్ మహిళల టీమ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో ఐసీసీ రూ. 23 లక్షల 40 వేల డాలర్లు అందించింది. ఈ మొత్తాన్ని జట్టులో 15 మందికి సమంగా పంచారు.ఫలితంగా ఒక్కొక్కరికి 2 లక్షల 56 వేల న్యూజిలాండ్ డాలర్లు (సుమారు రూ.1 కోటీ 30 లక్షలు) లభించాయి. వరల్డ్ కప్‌కు ముందు వరుసగా 10 టీ20లు ఓడి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు చివరకు చాంపియన్‌గా నిలిచింది. దాంతో ఆర్థికపరంగా కూడా జట్టులోని సభ్యులకు వెసులుబాటు దక్కడం ఈ టీమ్ గెలుపులో మరో సానుకూలాంశం! చదవండి: ‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు.. తండ్రిలాంటి వాడినంటూ..’ -
వరల్డ్ ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్ అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో చిత్తు చేసిన న్యూజిలాండ్ మహిళల జట్టు.. తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది.గత 15 ఏళ్లగా ఊరిస్తున్న పొట్టివరల్డ్కప్ టైటిల్‌ను ఎట్టకేలకు వైట్ ఫెర్న్స్ తమ సొంతం చేసుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా తలరాత మారలేదు. పురుషుల జట్టు మాదిరిగానే మరోసారి సౌతాఫ్రికా అమ్మాయిలు కూడా ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు. తొలిసారి వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడాలనుకున్న దక్షిణాఫ్రికా కల మాత్రం నేరవేరలేదు. ఏదమైనప్పటి అద్బుత పోరాటంతో ఫైనల్ వరకు వచ్చిన సౌతాఫ్రికాపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసిన నేపథ్యంలో విజేత, రన్నరప్ సహా ఈ టోర్నీలో పాల్గొన్న జట్లకు ఎంత మేర ప్రైజ్ మనీ దక్కిందన్న అంశాన్ని పరిశీలిద్దాం.విజేతకు ఎంతంటే?అయితే ఐసీసీ ఈ ప్రపంచకప్ నుంచి పురుషులు, మహిళల ప్రైజ్ మనీ సమానంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఛాంపియన్ న్యూజిలాండ్‌కు 2.34 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.19.67 కోట్లు) బహుమతి లభించింది.►అదే విధంగా గ్రూపు దశలో నాలుగింటికి మూడు మ్యాచ్‌లు గెలిచిన డివైన్ బృందానికి ఛాంపియన్‌గా అందుకున్న మొత్తంతో పాటు అదనంగా రూ. 78 లక్షలు ముట్టింది. అంటే న్యూజిలాండ్ మొత్తంగా ప్రైజ్‌మనీ రూపంలో రూ.20.45 కోట్లు దక్కనుంది.గ్రూప్ దశలో ఒక మ్యాచ్ గెలిచిన ప్రతి జట్టుకు రూ. 26.19 లక్షల నగదు బహుమతి అందింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌కు భారీగా ప్రైజ్ మనీ లభించింది.రన్నరప్‌కు ఎంతంటే?►రన్నరప్ దక్షిణాఫ్రికాకు 1.17 మిలియన్ డాలర్లు (రూ. 9. 83 కోట్లు). అంతేకాకుండా లీగ్ స్టేజీలో 3 మ్యాచ్‌లు గెలిచిన సౌతాఫ్రికాకు రూ. 78 లక్షలు ఇందుకు అదనంగా లభించాయి. దీంతో మొత్తంగా సూమారు రూ.10.62 కోట్ల నగదు బహుమతిని దక్షిణాఫ్రికా అమ్మాయిలు అందుకున్నారు.సెమీస్ చేరిన జట్లకు ఎంత ముట్టిందంటే?►గ్రూపు-ఎ నుంచి ఆస్ట్రేలియా, గ్రూపు-బి నుంచి వెస్టిండీస్ సెమీ ఫైనలిస్టులుగా అందుకున్న మొత్తం చెరో 5.67 కోట్ల రూపాయలు.►ఇక లీగ్ స్టేజీలో నాలుగింటికి 4 మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్‌కు అదనంగా దక్కిన మొత్తం 1.4 కోట్ల రూపాయలు.►అదే విధంగా గ్రూపు స్టేజిలో మూడు మ్యాచ్‌లు గెలిచిన విండీస్‌కు కు దక్కిన మొత్తం...రూ. 78 లక్షలు.►ఇక గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన భారత్‌కు కేవలం రూ. 52 లక్షలు మాత్రమే దక్కింది. ఎందుకంటే లీగ్ స్టేజీలో భారత్ కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
W T20 WC 2024: కొత్త చాంపియన్ న్యూజిలాండ్
ఒక జట్టు తలరాత మారలేదు. పురుషులు, మహిళల జట్టేదైనా కావొచ్చు కానీ... దక్షిణాఫ్రికా ఐసీసీ ప్రపంచకప్ భాగ్యానికి మాత్రం నోచుకోలేదు. మరో‘సారీ’ చోకర్స్గానే మిగిలారు. మరో జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నేళ్లయినా న్యూజిలాండ్ పురుషుల జట్టు సాధించలేకపోయిన వరల్డ్‌కప్ (వన్డే, టి20) టైటిల్స్‌ను న్యూజిలాండ్ మహిళల జట్టు (2000లో వన్డే) సాధించి ఔరా అనిపించింది. దుబాయ్: దక్షిణాఫ్రికాను చూస్తే ఎవరైనా అయ్యో పాపం అనక మానరు! సరిగ్గా నాలుగు నెలల కిందట టీమిండియా చేతిలో పురుషుల జట్టు, ఇప్పుడేమో న్యూజిలాండ్ చేతిలో మహిళల దక్షిణాఫ్రికా టీమ్ ఫైనల్లో పరాజయంతో ప్రపంచకప్ కలను కలగానే మిగిల్చుకున్నాయి. సఫారీకిది తీరని వ్యథే! మరీ ముఖ్యంగా అమ్మాయిలకైతే గతేడాది సొంతగడ్డపై, ఇప్పుడు దుబాయ్‌లో వరుసగా రన్నరప్ ట్రోఫీనే దిక్కయింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో న్యూజిలాండ్ కొత్త విశ్వవిజేతగా అవతరించింది. అమీతుమీలో కివీస్ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. మూడో ప్రయత్నంలో టి20 ప్రపంచకప్‌ను దక్కించుకుంది. 2009, 2010లలో న్యూజిలాండ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. విజేత న్యూజిలాండ్ జట్టుకు 23 లక్షల 40 వేల (రూ. 19 కోట్ల 67 లక్షలు) డాలర్లు, రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టుకు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 83 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్ అమెలియా కెర్ (43; 4 ఫోర్లు), ఓపెనర్ సుజీ బేట్స్ (32; 3 ఫోర్లు), మిడిలార్డర్లో బ్రూక్ హ్యాలిడే (28 బంతుల్లో 38; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎమ్‌లాబా 2 వికెట్లు తీయగా, అయబొంగ, ట్రియాన్, డి క్లెర్క్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేసి ఓడిపోయింది. ఓపెనర్లు కెపె్టన్ లౌరా వోల్వార్ట్ (33; 5 ఫోర్లు), తజ్మిన్ బ్రిట్స్ (17; 1 ఫోర్) 6.5 ఓవర్లలో 51 పరుగులు చేసి శుభారంభమిచ్చారు. ఇక మిగిలిన 13.1 ఓవర్లలో 108 పరుగులు చేస్తే కప్ గెలిచేసేది. కానీ అదే స్కోరుపై బ్రిట్స్, కాసేపటికి లౌరా అవుట్ కావడంతోనే అంతా మారిపోయింది. తర్వాత వచ్చిన అనెకె (9), మరిజాన్ (8), డి క్లెర్క్ (6), ట్రియాన్ (14), సునె లుస్ (8), డెర్క్సెన్ (10) కివీ బౌలర్ల ధాటికి బెంబేలెత్తారు. రోజ్మేరీ, అమెలియా కెర్ చెరో 3 వికెట్లు తీశారు. కెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి. -
SA vs NZ W T20: వరల్డ్‌కప్ విజేత న్యూజిలాండ్
మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో తొలిసారి న్యూజిలాండ్ మహిళల టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాపై 32 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. స్కోర్లు: న్యూజిలాండ్ 158/5, సౌతాఫ్రికాపై 126/9మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. దుబాయ్ వేదికగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. వైట్‌ఫెర్న్స్ బ్యాటర్లలో ఓపెనర్ సుజీ బేట్ 31 బంతుల్లో 32 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లిమెర్(9) మాత్రం నిరాశపరిచింది.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్‌డౌన్ బ్యాటర్ అమేలియా కెర్ 38 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 43 రన్స్ సాధించింది. ఆమెకు తోడుగా బ్రూక్ హాలీడే(28 బంతుల్లో 38) రాణించింది. వీరిద్దరి కారణంగా న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. మిగతా వాళ్లలో కెప్టెన్ సోఫీ డివైన్(6) విఫలం కాగా.. మ్యాడీ గ్రీన్ 12, వికెట్ కీపర్ ఇసబెల్లా గేజ్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు.సౌతాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖాకా, క్లోయీ ట్రియాన్, నాడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ తీయగా.. నోన్కులులేకో మ్లాబా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఎవరు గెలిచినా చరిత్రే!కాగా 14 ఏళ్ల తర్వాత తొలిసారి న్యూజిలాండ్ మహిళా జట్టు వరల్డ్‌కప్ ఫైనల్ చేరగా.. సౌతాఫ్రికా వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదిస్తే తమ దేశం ఖాతాలో మొట్టమొదటి ఐసీసీ వరల్డ్‌కప్‌ను జమచేస్తుంది. లేదంటే.. న్యూజిలాండ్‌కు తొలి ప్రపంచకప్ దక్కుతుంది.మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికాతుదిజట్లున్యూజిలాండ్సుజీ బేట్స్, జార్జియా ప్లిమెర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గాజ్(వికెట్ కీపర్), రోజ్మేరీ మైర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ (కెప్టెన్), టాజ్మిన్ బ్రిట్స్, అన్నేక్ బాష్, క్లోయి ట్రియాన్, మారిజానే కాప్, సునే లుస్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), నోన్కులులేకో మ్లాబా, అయబోంగా ఖాకా.చదవండి: IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే! -
గుర్తించారు... చాలు! క్రికెటర్ శ్రేయాంక పాటిల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
‘కుదిరితే క్షమించు. లేదంటే శిక్షించు. కానీ మేమున్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. దయచేసి గుర్తించు..’ అని అనేది ఓ సినిమాలో డైలాగ్! నిజమే.. క్షమించినా, శిక్షించినా, విమర్శించినా, ద్వేషించినా... అసలంటూ గుర్తించటమే కావలసింది. ఆటలోనైనా, బతుకు పోరాటంలోనైనా గెలుపోటములు ఎలా ఉన్నా ముందైతే గుర్తింపు ముఖ్యం. ఆ విషయాన్నే భారత మహిళా క్రికెట్ జట్టులోని ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో చక్కగా వ్యక్తం చేశారు. ‘మీ అభిమానానికి, మీ విమర్శలకూ నిజంగా అభివందనాలు. ఈవిధంగానైనా మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. ఓటమి మమ్మల్ని ఒకవైపు బాధిస్తున్నా, గెలుపు కోసం మరింతగా ఆకలిని మాలో రాజేసింది.. ‘ అని రాశారు. యూఏఈలో ప్రస్తుతం జరుగుతున్న టి20 విమెన్ వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీస్‌కి క్వాలిఫై కాలేక సోయిన సంగతి అటుంచితే... ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రేయాంక పాటిల్ పెట్టిన ఈ పోస్ట్...ముఖ్యంగా స్పాన్సరర్లు మహిళల క్రికెట్ జట్టును గుర్తించి, మరింతగా ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. View this post on Instagram A post shared by Shreyanka Patil (@shreyanka_patil31) -
T20 WC 2024: సెమీస్‌లో ఆసీస్-దక్షిణాఫ్రికా ఢీ
మహిళల టి20 ప్రపంచకప్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు ఆ్రస్టేలియానే. అంతలా పొట్టి ప్రపంచకప్‌లో దుర్బేధ్యమైన జట్టుగా ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తోంది. ఆరు టైటిళ్లతో అరుదైన ముద్ర వేసుకుంది. ఇప్పుడు తాజా మెగా ఈవెంట్లోనూ తమకు షరామామూలైన ఫైనల్ బెర్త్‌ను సాధించే పనిలో ఉంది. గురువారం దక్షిణాఫ్రికాతో తొలి సెమీఫైనల్ సమరానికి సిద్ధమైంది. ఇందులో చిత్రమేమిటంటే ఈ మెగా ఈవెంట్ చరిత్రలోనే కేవలం ఒక్కసారి ఫైనల్ చేరిన జట్టు... ఒకే ఒక్కసారి మాత్రమే టైటిల్ పోరుకు అర్హత సాధించని హాట్ ఫేవరెట్ ఆ్రస్టేలియాను ‘ఢీ’కొట్టబోతోందిమహిళల టి20 ప్రపంచకప్ 2009లో మొదలైతే... ఆ ప్రథమ టైటిల్ పోరుకు మాత్రమే ఆ్రస్టేలియా అర్హత సాధించలేదు. తర్వాత జరిగిన ఏడు ప్రపంచకప్‌లలోనూ వరుసబెట్టి తుదిపోరుకు చేరిన కంగారూ జట్టు ప్రత్యర్థుల్ని కంగారు పెట్టించి మరీ ఆరు టైటిళ్లను సాధించింది. ఇందులో రెండుసార్లు (2010, 2012, 2014; 2018, 2020, 2023) ‘హ్యాట్రిక్’ టైటిల్స్ ఉండటం మరో విశేషం. గత మెగా ఈవెంట్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకుంటే సొంతగడ్డపై కూడా సఫారీకి ఓటమి తప్పలేదు. తాజా టోర్నీలోలో ఇరుజట్లు సెమీస్‌లో తలపడుతుండటంతో గత పరాభవానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో సఫారీ అమ్మాయిలు ఉన్నారు. కానీ ఈ టోరీ్నలో అజేయంగా దూసుకెళ్తున్న ఫేవరెట్‌ను ఓడించడం అంతసులువు కానేకాదని దక్షిణాఫ్రికా శిబిరానికి బాగా తెలుసు. దీనికి తగిన ఎత్తుగడలతో బరిలోకి దిగాలని చూస్తోంది. మరోవైపు గత ప్రపంచకప్ ఆడిన 11 మందిలో ఒక్క మెగ్ లానింగ్ (రిటైర్డ్) మినహా మిగతా పది మంది కూడా అందుబాటులో ఉండటం జట్టుకు లాభించే అంశం. ఆసీస్ అంటేనే ఆల్‌రౌండ్ జట్టు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. అమ్మాయిలంతా ఫామ్‌లో ఉండటంతో ఆసీస్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. -
T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4కు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి ఊహించని జట్టు సెమీస్‌కు దూసుకువచ్చింది. కాగా బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సిన ఈ మెగా టోర్నీ వేదికను ఐసీసీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చిన విషయం తెలిసిందే.బంగ్లాలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తలెత్తిన అల్లర్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీపడ్డాయి.టీమిండియాకు కలిసి రాలేదుఅయితే, టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టు పేలవ ప్రదర్శనతో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో గ్రూప్-ఏలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4లో సగర్వంగా అడుగుపెట్టాయి. అయితే, గ్రూప్-బి టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్ ఊహించని రీతిలో ఒక్క మ్యాచ్ ఫలితంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.ఒక్క మ్యాచ్‌తో ఫలితం తారుమారువెస్టిండీస్తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హీథర్ నైట్ బృందం.. విండీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో గ్రూప్-బి పాయింట్ల పట్టిక తారుమారైంది. మొదటిస్థానంలో ఉన్న ఇంగ్లండ్ మూడో స్థానానికి, మూడో స్థానంలో ఉన్న వెస్టిండీస్ టాప్‌లోకి వచ్చింది. ఇరు జట్లు పాయింట్ల పరంగా(6) సమానంగా ఉన్నా.. నెట్‌రన్‌రేటులో వెస్టిండీస్(1.536).. ఇంగ్లండ్(1.091) కంటే మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం.ఫలితంగా గ్రూప్-బి నుంచి వెస్టిండీస్ సెమీస్‌కు వచ్చింది. మరోవైపు.. ఇదే గ్రూపులో ఉన్న సౌతాఫ్రికా కూడా ఆరు పాయింట్లే కలిగి ఉన్నా.. నెట్‌రన్‌రేటే(1.382) ఆ జట్టుకూ మేలు చేసి టాప్-4లో చేర్చింది. అలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా మహిళా టీ20 వరల్డ్‌కప్-2024లో తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.షెడ్యూల్, వేదికలు ఇవే👉మొదటి సెమీ ఫైనల్- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- అక్టోబరు 17, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్.👉రెండో సెమీ ఫైనల్- వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, అక్టోబరు 18, షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా.👉రెండు మ్యాచ్‌లూ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు మొదలవుతాయి.ఆస్ట్రేలియా జట్టుఅలిసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబీ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మొలినెక్స్, బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్, అన్నాబెల్ సదర్లాండ్, హీథర్ గ్రాహం, జార్జియా వేర్హామ్.సౌతాఫ్రికా జట్టులారా వోల్వార్డ్ (కెప్టెన్), అన్నేక్ బాష్, టాజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, మికే డి రైడర్, అయాండా హ్లూబీ, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయబోంగా ఖాకా, సునే లూస్, నోన్కులులెకో మ్లాబా, సెష్నీ నాయుడు, తుమీ సెఖుఖున్, క్లోయ్ ట్రియాన్.వెస్టిండీస్ జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), ఆలియా అల్లేన్, షమీలియా కాన్నెల్, డియోండ్రా డాటిన్, షెమైన్ కాంప్బెల్లె (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, స్టెఫానీ టేలర్, చినెల్ హెన్రీ, చెడియన్ నేషన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, కరిష్మా రాంహారక్, మాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్.న్యూజిలాండ్ జట్టుసోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గాజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవే, లీ తహుహు.చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’ -
W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకే ఛాన్స్’
Mithali Raj on Women's T20 World Cup debacle: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. లీగ్ దశలోనే నిష్క్రమణకు ప్రధాన కారణం గత మూడేళ్లుగా జట్టులో పురోగతే లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. దుబాయ్‌లో ఉన్న ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలపై, క్రికెటర్లలో కొరవడిన పట్టుదలపై తన అభిప్రాయాలను పంచుకుంది.‘ప్రపంచకప్‌కు సన్నాహంగా ఆడిన ఆసియా కప్‌లో చిన్న జట్లతో ఆడేటప్పుడు రిజర్వ్ బెంచ్‌ను పటిష్టం చేసేందుకు వారికి అవకాశాలివ్వాలి. పురుషుల జట్టు చేస్తోంది అదే. మెగా ఈవెంట్లు, పెద్ద టోర్నీలకు ముందు ఈ కసరత్తు చాలా అవసరం. కానీ మన మహిళల జట్టు విషయంలో అలాంటిదేదీ ఉండదు. రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశాలివ్వరు. ఇది జట్టు నిర్మాణానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది’ అని వివరించింది.పలు ప్రశ్నలకు మిథాలీ ఇచ్చిన సమాధానాలు... టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై మీ విశ్లేషణ? దీనిపై మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియాతో మ్యాచే గురించే! తప్పక గెలవాల్సిన పోరు అది. ఓ దశలో పటిష్ట స్థితిలో కనిపించినా... మళ్లీ కంగారే. మరో పాత కథే! గత రెండు, మూడేళ్లుగా జట్టు సాధించిన పురోగతి నాకైతే కనపించట్లేదు. గట్టి జట్లను ‘ఢీ’కొట్టేముందు చేసే కసరత్తు, ఆటలో ఎత్తుగడలేవీ మెప్పించడం లేదు. అంతర్జాతీయస్థాయిలో కొన్ని జట్లు క్రమంగా పుంజుకున్నాయి. దక్షిణాఫ్రికానే దానికి సరైన ఉదాహరణ.ఆస్ట్రేలియా కంటే కూడా న్యూజిలాండ్‌తో ఎదురైనా పరాజయమే భారత్ నిష్క్రమణకు కారణమని భావిస్తున్నారా? ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మనం పరిస్థితులకు తగ్గట్లుగా వెంటనే మారకపోవడమే ఆ మ్యాచ్ ఓటమికి కారణం. మందకొడి వికెట్‌పై వన్డే ప్రపంచకప్‌లో అయితే ముందు నింపాదిగా ఆడి తర్వాత పుంజుకొని ఆడే సౌలభ్యం వుంటుంది. కానీ టీ20 ఫార్మాట్లో అలాంటి అవకాశం ఉండదు. త్వరితగతిన సందర్భాన్ని బట్టి ఆటతీరు మార్చుకోవాలి. సోఫీ డివైన్ చేసింది అదే. కానీ మనం మాత్రం అలా ఆడలేకపోయాం.తరుచూ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం వల్ల ఆయా స్థానాల్లో స్పష్టత కొరవడిందా? జెమీమా, హర్మన్‌ప్రీత్‌లు తరచూ 3, 4 స్థానాలు మార్చుకోవడం కారణమని నేననుకోను. బ్యాటింగ్‌లో ఓపెనర్ల శుభారంభమే అత్యంత కీలకం. షఫాలీ వర్మ దూకుడుగా ఆడుతుందని అందరికీ తెలుసు కానీ అలా జరగలేదు. ఓపెనర్లిద్దరు బాగా ఆడిఉంటే మిడిల్ ఓవర్లలో యథేచ్ఛగా ఆడే అవకాశముంటుంది. మొదట పవర్ ప్లే, ఆఖర్లో డెత్ ఓవర్లు మంచి స్కోరుకు బాట వేస్తాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ టోర్నీలోని కీలక మ్యాచ్‌ల్లో అలాంటి శుభారంభాలు, చివర్లో దూకుడు కరువయ్యాయి. ఆసియా కప్‌లో కనిపించిన లోపాలపై దృష్టి పెట్టాల్సింది. కానీ అలా ఏమీ జరగలేదు. ప్రపంచకప్ ముంగిట ఫీల్డింగ్ విభాగంపై దృష్టి సారించకపోవడం పెద్ద తప్పిదమని మీరు అంగీకరిస్తారా? ఈ విషయంలో ఆస్ట్రేలితో జరిగిన మ్యాచ్ నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్ తప్ప 11 మందిలో మిగతా వారంతా మైదానంలో చురుగ్గా కనిపించలేదు. కీలకమైన మ్యాచ్‌లో ఇద్దరితో కట్టడి ఎలా సాధ్యమవుతుంది. ఫిట్నెస్ అతిముఖ్యం. దీనిపై మనం ఒక బెంచ్‌మార్క్‌ను పెట్టుకోవాల్సిందే. నిజాయితీగా అడుగుతున్నా ఏడాదంతా ఎంత మంది మన క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతున్నారో చెప్పగలరా! ఆ శ్రద్ధలేకే మైదానంలో ఫీల్డింగ్ విభాగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. హర్మన్‌ప్రీత్ 2018 నుంచి కెప్టెన్ ఉన్నా... ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో సారథ్య మార్పు అవసరమా? ఒకవేళ సెలక్టర్లు కెప్టెన్‌ను మార్చాలనుకుంటే మాత్రం నేను యువ క్రికెటర్‌కు పగ్గాలివ్వాలని కోరుకుంటాను. సారథ్య మార్పునకు ఇదే సరైన సమయం. ఇంకా ఆలస్యం చేస్తే... మనం ఇంకో ప్రపంచకప్‌కూ దూరమవుతాం. చేస్తే ఇప్పుడే కొత్త సారథిని ఎంపిక చేయాలి. మరీ ప్రపంచకప్ సమీపంలో చేస్తే ఒరిగే ప్రయోజనం కూడా ఉండదు.స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే..వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అందుబాటులో ఉన్నప్పటికీ 24 ఏళ్ల జెమీమాకు పగ్గాలిస్తే మంచిదనిపిస్తుంది. ఆమెకు ఎక్కువకాలం సారథిగా కొనసాగే వీలుంటుంది. పైగా మైదానంలో చురుకుదనం, ఫీల్డింగ్‌లో అందరిలో ఉత్తేజం నింపే శక్తి ఆమెకుంది. ఈ టోర్నీ ఆసాంతం ఆమె కనబరిచిన చురుకుదనం నన్ను బాగా ఆకట్టుకుంది. అలాంటి జెమీమాకు పగ్గాలిస్తే జట్టులో కొత్త ఉత్తేజాన్ని నింపినట్లవుతుంది. చదవండి: W T20 WC: ఇంగ్లండ్ ఇంటికి...సెమీఫైనల్లో వెస్టిండీస్ -
T20 World Cup 2024: న్యూజిలాండ్‌తో కీలక సమరం.. పాక్ టార్గెట్ 111
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-ఏలో ఇవాళ (అక్టోబర్ 14) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. సెమీస్ బెర్తే లక్ష్యంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నష్రా సంధు మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దెబ్బతీసింది. ఒమైమా సొహైల్, నిదా దార్, సదియా ఇక్బాల్ తలో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో సుజీ బేట్స్ 28, జార్జియా ప్లిమ్మర్ 17, అమేలియా కెర్ 9, సోఫి డివైన్ 19, బ్రూక్ హ్యాలీడే 22, మ్యాడీ గ్రీన్ 9, ఇసబెల్లా గేజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్ గెలుపోటములపై టీమిండియా భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓ మోస్తరు విజయం సాధిస్తే భారత్ సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ పాక్ న్యూజిలాండ్‌ను భారీ తేడాతో ఓడిస్తే పాకిస్తానే సెమీస్‌కు చేరుకుంటుంది. న్యూజిలాండ్ గనక పాక్‌ను చిత్తు చేస్తే భారత్, పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకుంటుంది. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. -
ఆఖరి ఓవర్లో అలా చేస్తారా? టీమిండియా కెప్టెన్‌దే తప్పు?
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో తమ సెమీస్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు సెమీస్ ఆశలన్నీ పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కివీస్‌పై పాక్ విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్ పరంగా టీమిండియా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ పాక్ ఓటమి చెందితే వరల్డ్‌కప్‌లో భారత్ కథ ముగిసినట్టే. ఇక ఆసీస్‌తో మ్యాచ్ విషయానికి వస్తే.. 152 పరుగుల ఓ మోస్తారు లక్ష్యాన్ని చేధించడంలో భారత్ విఫలమైంది. లక్ష్య చేధనలో మన అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమయ్యారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆఖరి వరకు పోరాడినప్పటకి జట్టును విజయతీరాలను చేర్చలేకపోయింది. అయితే 54 పరుగులతో హర్మన్ టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటకి అభిమానుల నుంచి విమర్శల ఎదుర్కొంటుంది. ఆఖరి ఓవర్లో కౌర్ బ్యాటింగ్ విధానాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.ఆఖరి ఓవర్లో భారత విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్రీజులో హర్మన్ ప్రీత్ ఉండడంతో మ్యాచ్‌పై భారత అభిమానులు ఇంకా ఆశలు వదులుకోలేదు. ఆసీస్ కెప్టెన్ మెక్‌గ్రత్ చివరి ఓవర్ వేసే బాధ్యతను పేసర్ అన్నాబెల్ సదర్లాండ్కు అప్పగించింది.ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కౌర్ సింగిల్ తీసి పూజాకు స్ట్రైక్ ఇచ్చింది. రెండో బంతికి పూజా క్లీన్ బౌల్డ్ అయింది. మూడో బంతికి అరుంధతి రెడ్డి రనౌట్‌గా వెనుదిరిగింది. నాల్గవ డెలివరీలో హర్మన్‌ప్రీత్ స్ట్రైక్‌కి తిరిగి వచ్చింది. కానీ ఆమె మళ్లీ సింగిల్ కోసం వెళ్లి శ్రేయాంక పాటిల్‌ను స్ట్రైక్‌లోకి తీసుకొచ్చింది. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన సమయంలో ఐదో బంతిని అన్నాబెల్ వైడ్ డెలివరీగా సంధించింది. వైడ్ బంతికి పరుగుకు ప్రయత్నించి శ్రేయాంక పాటిల్ రనౌట్ అయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాధా యాదవ్ ఎల్బీగా పెవిలియన్‌కు చేరింది. చివరి బంతికి రేణుకా సింగ్ సింగిల్ తీసింది. దీంతో ఆఖరి ఓవర్లో కేవలం భారత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ క్రమంలో హర్మన్ స్ట్రైక్‌ను తన వద్ద ఉంచుకోకపోవడం సర్వాత విమర్శల వర్షం కురుస్తోంది. జట్టుకు విజయానికి 14 పరుగులు అవసరమైనప్పడు టెయిలాండర్లకు స్ట్రైక్ ఎలా ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. Why didn’t Harmanpreet Kaur keep the strike to herself? #INDvAUS— Surbhi Vaid (@vaid_surbhi) October 13, 2024 -
ఆసీస్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్‌కు చేరాలంటే?
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో ఆదివారం ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన కీలక మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 152 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా విఫలమైంది.ఛేజింగ్‌లో భారత అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి పరాజయం పాలైంది. ఈ ఓటమితో భారత జట్టు తమ సెమీస్ అవకాశాలను దాదాపు చేజార్చుకుందనే చెప్పాలి. ఇప్పుడు భారత్ సెమీస్ ఆశలన్నీ దాయాది పాకిస్తాన్ పైనే పెట్టుకుంది.పాక్ గెలిచేనా?గ్రూపు- ఎ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకోగా.. రెండో స్ధానం కోసం భారత్, కివీస్ మధ్య నెలకొంది. భారత జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉంది. అయితే టీమిండియా తమ నాలుగు లీగ్ మ్యాచ్‌లన్నీ ఆడేయగా, కివీస్‌కు మరో మ్యాచ్ మిగిలి ఉంది. భారత్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింట విజయాలు, మరో రెండింట ఓటములను చవిచూసింది. భారత్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. కాగా న్యూజిలాండ్ తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సోమవారం పాకిస్తాన్‌తో జరగనున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కివీస్ గెలిస్తే ఎలాంటి సమీకరణంతో పని లేకుండా మూడు విజయాలతో సెమీస్ ఆర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరి టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధిస్తే.. భారత్,కివీస్, పాక్ చెరో నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తారు. అయితే న్యూజిలాండ్(+0.282), పాకిస్తాన్(-0.488) కంటే భారత్(+0.322) రన్‌రేట్ మెరుగ్గా ఉన్నందన సెమీస్‌కు క్వాలిఫై కానుంది. కాగా బలహీనమైన పాక్ జట్టుపై కివీస్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. దాదాపుగా భారత్ సెమీస్ అవకాశాలు గల్లంతు అయినట్లే.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే -
టీమిండియా ముందు నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచిన ఆస్ట్రేలియా
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 13) జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోర్‌కు పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గ్రేస్ హ్యారిస్ (40), తహ్లియా మెక్‌గ్రాత్ (32), ఎల్లిస్ పెర్రీ (32), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (15 నాటౌట్), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (10) రెండంకెల స్కోర్లు చేయగా.. బెత్ మూనీ (2), జార్జియా వేర్హమ్ (0), ఆష్లే గార్డ్నర్ (6), సోఫీ మోలినెక్స్ (0) పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, సెమీస్‌కు చేరాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే.. అప్పుడు భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ తలో నాలుగు పాయింట్లతో సెమీస్ రేసులో ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. ఒకవేళ న్యూజిలాండే పాకిస్తాన్‌ను ఓడిస్తే భారత్ సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి భారత్ ఎట్టి పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి తీరాలి.తుది జట్లు..ఆస్ట్రేలియా: బెత్ మూనీ(వికెట్‌కీపర్), గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్(కెప్టెన్), జార్జియా వేర్హామ్, అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినెక్స్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్చదవండి: స్కాట్లాండ్ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ -
T20 World Cup 2024: టీమిండియాతో కీలక సమరం.. ఆసీస్ కెప్టెన్ దూరం
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 13) జరగాల్సిన హైఓల్టేజీ సమరానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. కాలి పాదం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ అలైసా హీలీ ఈ మ్యాచ్‌కు దూరమైంది. శుక్రవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా హీలీ గాయం బారిన పడింది. ప్రస్తుతం ఆమె చేతి కర్రల సాయంతో నడుస్తుంది. హీలీ తదుపరి మ్యాచ్ సమయానికంతా కోలుకుంటుందని ఆసీస్ క్రికెట్ బోర్డు అశాభావం వ్యక్తం చేసింది. హీలీ గైర్హాజరీలో భారత్‌తో మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్‌గా తహిల మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది. ఎల్లిస్ పెర్రీ తహిలకు డిప్యూటీగా ఉండనుంది. బెత్ మూనీ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనుంది.ఇదిలా ఉంటే, ఇవాళ జరుగబోయే కీలక మ్యాచ్‌లో భారత్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెమీస్‌కు చేరాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే.. అప్పుడు భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ తలో నాలుగు పాయింట్లతో సెమీస్ రేసులో ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. ఒకవేళ న్యూజిలాండే పాకిస్తాన్‌ను ఓడిస్తే భారత్ సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి భారత్ ఎట్టి పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి తీరాలి. ఆసీస్ కెప్టెన్ అలైసా హీలీ లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం.చదవండి: స్కాట్లాండ్ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ -
స్కాట్లాండ్ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. 33 పరుగులు చేసిన కేథరీన్ బ్రైస్ టాప్ స్కోరర్‌గా నిలువగా..సారా బ్రైస్ 27, సస్కియా హోర్లీ 13, ఐల్సా లిస్టర్ 11, మెగాన్ మెక్కాల్ 10 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నాట్ సీవర్ బ్రంట్, లారెన్ బెల్, చార్లీ డీన్, డేనియెట్ గిబ్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. మయా బౌచియర్ (62), డేనియెల్ వ్యాట్ హాడ్జ్ (51) అజేయ అర్ద సెంచరీలతో ఇంగ్లండ్‌ను గెలిపించారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు ఇది వరుసగా మూడో గెలుపు కాగా.. స్కాట్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ గ్రూప్ టాపర్‌గానూ ఎగబాకింది. గ్రూప్-బిలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. స్కాట్లాండ్ సహా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.గ్రూప్-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా టాప్‌లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించింది. భారత్, న్యూజిలాండ్ చెరి నాలుగు పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచిన పాక్ నాలుగో స్థానంలో ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండు గ్రూప్‌ల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు చేరుతాయన్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే -
టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్
మహిళల టీ20 ప్రపంచకప్-2024 నుంచి మరో జట్టు నిష్క్రమించింది. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్ జట్టు ఎలిమినేట్ అయ్యింది. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడటంతో బంగ్లాదేశ్ ఇంటిబాట పట్టింది. ఈ గ్రూప్ నుంచి స్కాట్లాండ్ ఇదివరకే ఎలిమినేట్ అయ్యింది.సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. శోభన మోస్తరి (38), నిగార్ సుల్తానా (32 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మారిజన్ కాప్, డెర్క్సెన్, మ్లాబా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. తంజిమ్ బ్రిట్స్ (42) రాణించడంతో 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అన్నెకె బోష్ (25) ఓ మోస్తరు పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహిమా ఖాతూన్ రెండు వికెట్లు పడగొట్టగా.. రితే మోనీ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సౌతాఫ్రికా అగ్రస్థానానికి (గ్రూప్-బి పాయింట్ల పట్టికలో) చేరుకుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్ -
T20 World Cup 2024: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేసి లంకేయులను కట్టడి చేశారు. అమేలియా కెర్, లీగ్ క్యాస్పెరెక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఏడెన్ కార్సన్ ఓ వికెట్ దక్కించుకుంది. లంక బ్యాటర్లలో చమారీ ఆటపట్టు (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. విష్మి గౌతమ్ 8, హర్షిత మాధవి 18, కవిష దిల్హరి 10, అనుష్క సంజీవని 5, నిలాక్షి డిసిల్వ 14, అమా కాంచన 10 పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. జార్జియా స్లిమ్మర్ (53), అమేలియా కెర్ (34) చెలరేగడంతో 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో సుజీ బేట్స్ 17, సోఫీ డివైన్ 13 పరుగులు చేశారు. లంక బౌలర్లలో సచిని నిసంసల, చమారీ ఆటపట్టు తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఆడిన నాలుగో మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన శ్రీలంక గెలుపు రుచి చూడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన ఘట్టం -
టీ20 వరల్డ్‌కప్ 2024.. భారత్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి..!
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూప్-ఏ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య పోటీ నెలకొంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది.గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్ బెర్త్‌ను అనధికారికంగా ఖరారు చేసుకుంది. భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో గెలిచి మూడో స్థానంలో ఉంది. పాక్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్ గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది.భారత్ సెమీస్‌కు చేరాలంటే..?గ్రూప్ మ్యాచ్‌లన్నీ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు చేరతాయి. ప్రస్తుత సమీకరణల ప్రకారం ఆసీస్ మొదటి స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. భారత్ సెమీస్ చేరాలంటే ఆదివారం (అక్టోబర్ 13) ఆస్ట్రేలియాతో జరుగబోయే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో గెలిస్తే ఎలాంటి అవాంతరాలు లేకుండా సెమీస్‌కు చేరుకుంటుంది.ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓడితే.. న్యూజిలాండ్ ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. భారత్ సెమీస్ చేరాలంటే కివీస్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వాలి. లేదంటే కనీసం ఒక్క దాంట్లోనైనా చిత్తుగా ఓడాలి. అప్పుడు భారత్ మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌కు చేరుకుంటుంది.ఒకవేళ కివీస్.. శ్రీలంక, పాకిస్తాన్‌లపై గెలిచి, భారత్.. ఆసీస్ చేతిలో ఓడిందంటే అప్పుడు కివీసే సెమీస్‌కు చేరుకుంటుంది. ఇక్కడ పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలను సైతం కొట్టి పారేయడానికి వీల్లేదు. పాక్ తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారీ తేడాతో గెలిచి.. భారత్ ఆస్ట్రేలియా చేతిలో, న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడితే పాక్ సెమీస్‌కు చేరుకుంటుంది. చదవండి: IND VS BAN: మూడో టీ20కి వర్షం ముప్పు..? -
ఆసీస్ బౌలర్ల విజృంభణ.. 82 పరుగులకే కుప్పకూలిన పాక్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 11) జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు. ఆష్లే గార్డ్నర్ 4, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్హమ్ తలో 2, మెగాన్ షట్, సోఫీ మోలినెక్స్ చెరో వికెట్ తీయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో అలియా రియాజ్ (26) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఇరమ్ జావెద్ (12), సిద్రా అమిన్ (12), నిదా దార్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలంటే పాక్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పినిసరి. అయితే ఈ స్కోర్‌తో పాక్ బౌలర్లు ఆసీస్ బ్యాటర్లను నిలువరించడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో పాక్ రెగ్యులర్ కెప్టెన్ ఫాతిమా సనా లేకుండా బరిలోకి దిగింది. ఫాతిమా సనా.. తన తండ్రి ఆకస్మిక మరణవార్త తెలిసి స్వదేశానికి వెళ్లిపోయింది. పాక్ తదుపరి మ్యాచ్ ఆడే సమయానికి సనా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది. పాక్ అక్టోబర్ 14న తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఇదిలా ఉంటే, పాక్‌తో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. అప్పుడు గ్రూప్-ఏ నుంచి మరో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడతాయి. ప్రస్తుతం గ్రూప్-ఏలో భారత్, పాక్, న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. చదవండి: పాకిస్తాన్ సెలెక్షన్ కమిటీలోకి మాజీ అంపైర్ -
T20 World Cup 2024: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన విండీస్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (అక్టోబర్ 10) జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తాన్ (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. దిలారా అక్తెర్ (19), శోభన (16), రితూ మోనీ (10) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో కరిష్మా రామ్హరాక్ అద్భుతంగా బౌలింగ్ చేసి (4-0-17-4) బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టింది. అఫీ ఫ్లెచర్ 2, హేలీ మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 12.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. హేలీ మాథ్యూస్ 34, స్టెఫానీ టేలర్ 27, షెమెయిన్ క్యాంప్‌బెల్ 21, డియాండ్రా డొట్టిన్ 19, చిన్నెల్ హెన్రీ 2 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో నహిద అక్తెర్, మరుఫా అక్తెర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వెస్టిండీస్ గ్రూప్-బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా..స్కాట్లాండ్ ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది.ఇదిలా ఉంటే, గ్రూప్-ఏలో పోటీలు అత్యంత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా టాప్‌లో ఉండగా.. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ గ్రూప్‌లో సెమీస్ బెర్త్‌ల కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. గ్రూప్ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం టాప్-2లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 13న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెమీస్‌కు చేరవచ్చు. చదవండి: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. చివరి స్థానానికి పడిపోయిన పాకిస్తాన్ -
T20 World Cup 2024: తండ్రి ఆకస్మిక మరణం.. స్వదేశానికి పయనమైన పాక్ కెప్టెన్
తండ్రి ఆకస్మిక మరణంతో పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా టీ20 ప్రపంచకప్-2024 నుంచి వైదొలిగింది. 22 ఏళ్ల ఫాతిమా వరల్డ్‌కప్‌లో పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉండదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఫాతిమా ఇవాళే స్వదేశానికి పయనమైనట్లు పీసీబీ తెలిపింది. ఫాతిమా గైర్హాజరీలో వైస్ కెప్టెన్ మునీబా అలీ పాక్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు పీసీబీ పేర్కొంది. పాక్ రేపు (అక్టోబర్ 11) డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ప్రపంచకప్‌లో పాక్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి ఓడి (భారత్ చేతిలో), ఒక దాంట్లో (శీలంకపై) గెలిచింది. పాక్ ప్రస్తుతం గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, భారత్ టాప్-2లో ఉండగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉంది. గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ సెమీస్ రేసులో నిలవాలంటే తదుపరి ఆసీస్‌తో జరుగబోయే మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంటుంది. పాక్ అక్టోబర్ 14న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ సమయానికి రెగ్యులర్ కెప్టెన్ ఫాతిమా సనా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఫాతిమా సనా ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మంచి ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆమె మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఫాతిమా సనా బంతితోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం -
T20 World Cup 2024: రాణించిన మంధన, హర్మన్.. శ్రీలంక టార్గెట్ 173
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. స్మృతి మంధన (50), హర్మన్‌ప్రీత్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. షఫాలీ వర్మ 43 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో జెమీమా 16, రిచా ఘోష్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో చమారీ ఆటపట్టు, కాంచన తలో వికెట్ పడగొట్టగా.. మంధన రనౌటైంది. సెమీస్ రేస్‌లో ముందుండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంది. -
సౌతాఫ్రికా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్ నుంచి స్కాట్లాండ్ ఔట్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 9) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 17.5 ఓవర్లలో 86 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లు ముకుమ్మడిగా రాణించి స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో స్కాట్లాండ్ వరల్డ్‌కప్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో సౌతాఫ్రికా గ్రూప్-బి టాపర్‌గా కొనసాగుతుంది.రాణించిన వోల్వార్డ్ట్, బ్రిట్స్, కాప్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు వోల్వార్డ్ట్ (40), బ్రిట్స్ (43) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అనంతరం కాప్ (43) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఫలితంగా సౌతాఫ్రికా స్కాట్లాండ్ ముందు భారీ స్కోర్‌ను ఉంచింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బోష్ 11, సూన్ లస్ 18 (నాటౌట్), క్లో టైరాన్ 2, డెర్క్సెన్ ఒక్క పరుగు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో స్లేటర్, బ్రైస్, బెల్, ఫ్రేసర్, కార్టర్ తలో వికెట్ పడగొట్టారు.విజృంభించిన బౌలర్లుభారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించారు. మ్లాబా 3, టైరాన్, డి క్లెర్క్ చెరో 2, ఖాకా, సూన్ లస్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కేవలం ఫ్రేసర్ (14), లిస్టర్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. చదవండి: T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా -
T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్ 8) జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. బెత్ మూనీ (40), ఎల్లిస్ పెర్రీ (30), అలైసా హీలీ (26) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. బ్రూక్ హ్యలీడే, రోస్‌మేరీ మెయిర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. మెగాన్ షట్, సదర్‌ల్యాండ్ తలో మూడు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టారు. సోఫీ మోలినెక్స్ రెండు, జార్జియా వేర్హమ్, తహిళ మెక్‌గ్రాత్ తలో వికెట్ పడగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్‌లో జార్జియా ప్లిమ్మర్ (29), సుజీ బేట్స్ (20), లియా తహుహు (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో ఆసీస్ గ్రూప్-ఏలో (పాయింట్ల పట్టిక) అగ్రస్థానానికి చేరింది. పాక్, న్యూజిలాండ్, భారత్, శ్రీలంక ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా -
T20 WC 2024: శ్రీలంకతో మ్యాచ్.. భారత జట్టుకు గుడ్ న్యూస్
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం దుబాయ్ వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో టీమిండియా తలపడనుంది. తమ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. భారీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్ధానానికి చేరుకునే అవకాశం ఉంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఈ కీలక పోరుకు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ అందుబాటులో ఉండనుంది. ఆదివారం పాకిస్తాన్ జరిగిన మ్యాచ్‌లో కౌర్ గాయపడింది. మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో హర్మాన్ మెడకు గాయమైంది. దీంతో ఆమె 29 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగింది.ఆ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా భారత సారథి పాల్గోనలేదు. దీంతో హర్మాన్ శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె అందుబాటుపై భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది. హర్మాన్ గాయం అంత తీవ్రమైనది కాదని, ఆమె శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు మంధాన తెలిపింది.మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, లంకతో మ్యాచ్‌కూ దూరమయ్యే అవకాశముందని స్మృతి ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొంది. పాక్‌పై ఆడిన భారత జట్టునే లంకతో మ్యాచ్‌కూ కొనసాగించే ఛాన్స్ ఉంది. కాగా పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. భారత్ కంటే ముందు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. -
సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
గత టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఇంగ్లండ్ మహిళల జట్టు బదులు తీర్చుకుంది. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టును ఓడించి ఈ టోర్నీలో ఇంగ్లండ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.ఫలితంగా గ్రూప్ ‘బి’లో తమ అగ్రస్థానాన్ని ఇంగ్లండ్ పటిష్టపర్చుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ (39 బంతుల్లో 42; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ ఎకెల్‌స్టోన్ (2/15)తో పాటు ఇతర బౌలర్లు ప్రత్యర్థిని నిలువరించారు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు సాధించి గెలిచింది. నాట్ సివర్ బ్రంట్ (36 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు), డానీ వ్యాట్ (43 బంతుల్లో 43; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 55 బంతుల్లో 64 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రాణించిన కెప్టెన్దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ వోల్వార్ట్ మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. తొలి వికెట్‌కు వోల్వార్ట్, తజ్మీన్ బ్రిట్స్ (19 బంతుల్లో 13; 1 ఫోర్)తో కలిసి 31 బంతుల్లో 31 పరుగులు జోడించడంతో జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. ఆ తర్వాత అనేక్ బాష్ (26 బంతుల్లో 18; 1 ఫోర్) కూడా కొద్దిసేపు కెప్టెన్‌కు అండగా నిలిచింది. 10 ఓవర్లు ముగిసేసరికి సఫారీ టీమ్ స్కోరు 54 పరుగులకు చేరింది. ఈ దశలో ఇంగ్లండ్ స్పిన్నర్లు ప్రత్యరి్థని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో ఉన్నవోల్వార్ట్ను ఎకెల్‌స్టోన్(Sophie Ecclestone) చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కెప్టెన్ వెనుదిరిగిన తర్వాత మిగిలిన 26 బంతుల్లో దక్షిణాఫ్రికా 36 పరుగులు చేసింది. మరిజాన్ కాప్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు), ఇన్నింగ్స్ చివర్లో డెర్క్సెన్ (11 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శన దక్షిణాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోరును అందించాయి.కీలక భాగస్వామ్యం... షార్జా మైదానంలో గత నాలుగు మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైన స్కోరును దక్షిణాఫ్రికా నమోదు చేయగా... దానిని ఛేదించే లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. ఆరంభంలోనే మయా బౌచర్ (20 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరిగినా... వ్యాట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. అలైస్ క్యాప్సీ (16 బంతుల్లో 19; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో వ్యాట్, బ్రంట్ భాగ స్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది.ఈ ఇద్దరు సీనియర్ల జోడీని విడదీసేందుకు సఫారీ బౌలర్లు ఎంత శ్రమించినా లాభం లేకపోయింది. 11–15 ఓవర్ల మధ్యలో 39 పరుగులు చేసిన ఇంగ్లండ్ చివరి 5 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. అయితే చివర్లో కొంత ఒత్తిడి ఎదురైనా ఇంగ్లండ్ గెలుపు గీత దాటింది. విజయానికి 11 పరుగుల దూరంలో వ్యాట్ వెనుదిరగ్గా... బ్రంట్ మిగిలిన పనిని పూర్తి చేసింది. సఫారీ ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. మంగళవారం జరిగే గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో న్యూజిలాండ్ తలపడుతుంది. ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లువేదిక- షార్జాటాస్- సౌతాఫ్రికా.. బ్యాటింగ్సౌతాఫ్రికా స్కోరు: 124/6 (20)ఇంగ్లండ్ స్కోరు: 125/3 (19.2)ఫలితం: సౌతాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం.చదవండి: IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది