మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 13) జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోర్‌కు పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
గ్రేస్ హ్యారిస్ (40), తహ్లియా మెక్‌గ్రాత్ (32), ఎల్లిస్ పెర్రీ (32), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (15 నాటౌట్), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (10) రెండంకెల స్కోర్లు చేయగా.. బెత్ మూనీ (2), జార్జియా వేర్హమ్ (0), ఆష్లే గార్డ్‌నర్ (6), సోఫీ మోలినెక్స్ (0) పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, సెమీస్‌కు చేరాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే.. అప్పుడు భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ తలో నాలుగు పాయింట్లతో సెమీస్ రేసులో ఉంటాయి.
అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. ఒకవేళ న్యూజిలాండే పాకిస్తాన్‌ను ఓడిస్తే భారత్ సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి భారత్ ఎట్టి పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి తీరాలి.
తుది జట్లు..
ఆస్ట్రేలియా: బెత్ మూనీ(వికెట్‌కీపర్), గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్(కెప్టెన్), జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినెక్స్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్
భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment