మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 9) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 17.5 ఓవర్లలో 86 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లు ముకుమ్మడిగా రాణించి స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో స్కాట్లాండ్ వరల్డ్‌కప్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో సౌతాఫ్రికా గ్రూప్-బి టాపర్‌గా కొనసాగుతుంది.
రాణించిన వోల్వార్డ్ట్, బ్రిట్స్, కాప్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు వోల్వార్డ్ట్ (40), బ్రిట్స్ (43) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అనంతరం కాప్ (43) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఫలితంగా సౌతాఫ్రికా స్కాట్లాండ్ ముందు భారీ స్కోర్‌ను ఉంచింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బోష్ 11, సూన్ లస్ 18 (నాటౌట్), క్లో టైరాన్ 2, డెర్క్‌సెన్ ఒక్క పరుగు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో స్లేటర్, బ్రైస్, బెల్, ఫ్రేసర్, కార్టర్ తలో వికెట్ పడగొట్టారు.
విజృంభించిన బౌలర్లు
భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించారు. మ్లాబా 3, టైరాన్, డి క్లెర్క్ చెరో 2, ఖాకా, సూన్ లస్, డెర్క్‌సెన్ తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కేవలం ఫ్రేసర్ (14), లిస్టర్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
చదవండి: T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
Comments
Please login to add a commentAdd a comment