Scotland
-
త్రిష వరల్డ్ రికార్డు.. అభినందనల వెల్లువ.. భద్రాద్రిలో సంబరాలు
భారత మహిళల క్రికెట్‌కు భవిష్యత్ తార దొరికింది. అటు బ్యాట్‌తో అదరగొడుతూ... ఇటు బంతితో మెరిపిస్తూ... తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష(Gongadi Trisha) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మహిళల అండర్–19 ప్రపంచకప్ టోర్నీ(U19 Womens T20 World Cup) చరిత్రలో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా 19 ఏళ్ల త్రిష గుర్తింపు పొందింది.వరల్డ్ రికార్డు.. భద్రాద్రిలో సంబరాలుకాగా 2023లో తొలిసారి జరిగిన అండర్–19 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించిన త్రిష 2025 ఈవెంట్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఈ నేపథ్యంలో గొంగడి త్రిషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచకప్ టోర్నీలో శతకంతో బాది వరల్డ్ రికార్డు సాధించిన నేపథ్యంలో ఆమె స్వస్థలం భద్రాచలంలో సంబరాలు జరిగాయి. క్రికెట్లో అసాధారణ ప్రతిభతో సెంచరీ చేయడంతో భద్రాద్రి(Bhadradri) పేరు ఒక్కసారిగా ప్రపంచస్థాయిలో మార్మోగిపోయిందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ కప్ క్రికెట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిపి త్రిషకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, సీనియర్ క్రికెటర్ బుడగం శ్రీనివాస్, కొండరెడ్ల సంఘం వ్యవస్థాపకులు ముర్ల రమేశ్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, ఎస్కే సలీం, సదానందం, పూనెం ప్రదీప్‌కుమార్, రేపాక రామారావు, నరేశ్, కోటేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, బలుసు సతీశ్, రమేశ్, ఆనంద్ పాల్, ప్రవీణ్, ప్రసాద్, శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు.150 పరుగుల తేడాతో ఘనవిజయంఇదిలా ఉంటే.. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత మహిళల జట్టు తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా... స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లోనూ చెలరేగిపోయింది. స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ గ్రూప్–1 మ్యాచ్‌లో నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు 150 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది.‘టీనేజ్ స్టార్’ గొంగడి త్రిష ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకొని భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. స్కాట్లాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష స్కాట్లాండ్ బౌలర్ల భరతం పట్టింది. ఈ క్రమంలో ఈ టోర్నీ చరిత్రలోనే తొలి శతకం నమోదు చేసిన ప్లేయర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.త్రిష ఆల్‌రౌండ్ ప్రదర్శనతెలంగాణకు చెందిన 19 ఏళ్ల త్రిష 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెంచరీ మైలురాయిని అందుకుంది. మరో ఓపెనర్ కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) తో కలిసి త్రిష తొలి వికెట్‌కు 13.3 ఓవర్లలో 147 పరుగులు జోడించింది. కమలిని అవుటయ్యాక సనిక చాల్కె (20 బంతుల్లో 29 నాటౌట్; 5 ఫోర్లు)తో కలిసి త్రిష రెండో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జత చేసింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. 14 ఓవర్లు ఆడి కేవలం 58 పరుగులకే స్కాట్లాండ్ ఆలౌటైంది. 10 వికెట్లను భారత స్పిన్నర్లే తీయడం విశేషం.ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆయుషి శుక్లా 8 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... మరో ఎడంచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మ 5 పరుగులిచ్చి 3 వికెట్లు... లెగ్ స్పిన్నర్ గొంగడి త్రిష 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఈనెల 31న జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో భారత్ తలపడుతుంది. అదే రోజున జరిగే మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆ్రస్టేలియా ఆడుతుంది. ఫిబ్రవరి 2న ఫైనల్ జరుగుతుంది. చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా? -
భారత జట్టులో గొంగడి త్రిష ఆల్ రౌండ్ షో
-
నాన్న కల నెరవేర్చింది
‘కలలు కనడం కష్టం కాదు. కాణీ ఖర్చు కాదు’ లాంటి వెటకారాల మాట ఎలా ఉన్నా.... ఆ కలలే భవిష్యత్తుని నిర్దేశిస్తాయి.వందమందిలో ఒకరిగా ప్రత్యేకతతో వెలిగిపోయేలా చేస్తాయి. ‘నా కూతురు ఆడితే పరుగులు వెల్లువెత్తాల్సిందే’ ‘మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం... అంటూ నా కూతురు గురించి అందరూ ఘనంగా చెప్పుకోవాలి’... ఇలాంటి కలలు ఎన్నో కనేవాడు భద్రాచలానికి చెందిన రామిరెడ్డి.అయితే ఆయన కలలకు మాత్రమే పరిమితం కాలేదు. నిరంతరం తన కలల సాకారానికి ప్రయత్నించాడు. ఆ ఫలితమే స్టార్ క్రికెటర్... త్రిష గొంగడి(Trisha Gongadi). మలేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్ అండర్ 19, టీ 20 వరల్డ్ కప్(Women World Cup)లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి రామిరెడ్డి క్రికెట్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశించినా పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల నెరవేరలేదు. దీంతో ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తూనే పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించేవాడు. ‘మా అమ్మాయిని బాగా చదివించాలి’... అనేది సగటు తండ్రి కోరిక.రామిరెడ్డి మాత్రం అలా కాదు... ‘మా అమ్మాయిని బాగా ఆడించాలి. క్రికెట్లో స్టార్‌ని చేయాలి’ అనుకునేవాడు. సినిమాలు, కామేడీ షోలు కాకుండా టీవీలో క్రికెట్ మ్యాచ్ హైలెట్స్ ఎక్కువగా చూపించేవాడు. చిన్నప్పుడే ఇలా చేయడం వల్ల బ్రెయిన్, మజిల్స్ ఆటకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతాయని ఫిటెనెస్ ట్రైనర్‌గా ఆయన బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ చిన్నతనం నుంచే త్రిష క్రికెట్లో ప్రతిభ కనబరిచేది. దీంతో తన కల విషయంలో మరింత పట్దుదల పెరిగింది. కూతురిని ప్రోఫెషనల్ క్రికెటర్‌గా చూడాలనే లక్ష్యంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు రామిరెడ్డి. అప్పుడు త్రిష వయసు ఏడేళ్లు. సికింద్రాబాద్‌లోని ‘సెయింట్ జాన్ ్స క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకునేది.ఎంతో ఆశ... చివరికి నిరాశ!్రపోఫెషనల్ ట్రైనింగ్‌లో ఆరితేరిన త్రిష పన్నెండేళ్ల వయస్సులో హైదరాబాద్ అండర్ 19 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్ 19 ఇండియా తరఫున సౌత్ ఆఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్నర్‌గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్ర పోషించింది. అయితే త్రిషకు ఈ టోర్నీలో ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. ఆ ఫలితం ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో స్పష్టంగా కనిపించింది. విమెన్ ఐపీఎల్ వేలంలో త్రిషాను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో గత ఐపీఎల్ సీజన్ కు ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. అ గెలుపులో తాను ఒకరిగా ఉండటం కంటే ‘గెలుపుకు మూలం’ అనిపించేలా ప్రదర్శన చేయాలనే పట్టుదల త్రిషలో పెరిగింది.ఇక చూస్కోండివిమెన్ ఐపీఎల్లో ఎదురైన చేదు అనుభవం ‘పవర్ హిట్టింగ్’పై పట్టు సాధించేందుకు త్రిషకు తోడ్పడింది. గత డిసెంబరులో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో వరుసగా 58 నాటౌట్, 32, 52 పరుగులు సాధించింది. ఆ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసిన త్రిష 230 పరుగులు సాధించింది. ఇందులో స్కాట్లాండ్పై చేసిన 110 నాటౌట్ సెంచరీ కూడా ఉంది. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ సెంచరీతో అండర్ 19 టోర్నీలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీసింది.అందనంత ఎత్తులో...టోర్నీలో మిగతా అమ్మాయిలకు అందనంత ఎత్తులో బ్యాటింగ్ యావరేజ్ 76.77తో త్రిష కొనసాగుతోంది. ఆమె తర్వాత రెండోస్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ డావినా పేరిన్ ఉంది. ఈ టోర్నీలో రెండుసార్లు త్రిష 40కి పైగా స్కోర్లు సాధించింది. అయితే అప్పటికే ప్రత్యర్థి జట్లు ముందుగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించే అవకాశం త్రిషకు దక్కలేదు. కానీ స్కాట్ల్యాండ్తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో త్రిష బ్యాట్ నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ (53 బంతుల్లో) జాలువారింది. బ్యాటింగ్ యావరేజ్‌తో పాటు మోస్ట్ రన్స్, హయ్యెస్ట్ స్కోర్ విభాగంలోనూ త్రిష టాప్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ మహిళల అండర్ 19 జట్టు సెమీస్‌కు చేరుకుంది.ఏజెన్సీప్రాంతం నుంచి మొదలైన త్రిష విజయపరంపర అంతర్జాతీయ స్థాయిలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవిమెన్ వరల్డ్ కప్‌లో ఇండియాకు ఆడాలి అండర్ 19, విమెన్ టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా వరల్డ్ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది. విమెన్ అండర్ 19 టోర్నీలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇండియా మహిళల జట్టుకు ఎంపిక కావాలి. రాబోయే వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్‌లో నా పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చాను. నా లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నాను. – గొంగడి త్రిష -
చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. టీ20 వరల్డ్‌కప్‌లో తొలి శతకం
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో భారత ఓపెనర్ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 28) జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసర శతకం బాదిన త్రిష.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రికార్డు నెలకొల్పింది. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. HISTORY BY TRISHA 🇮🇳- Trisha becomes the first Player to score a Hundred in Women's U-19 T20I World Cup History 🏆 pic.twitter.com/05mJwdtbMQ— Johns. (@CricCrazyJohns) January 28, 2025ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాలీ క్రికెట్లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. సెమీస్‌లో భారత్గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు, సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్.. స్కాట్లాండ్ మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయాయి..!ఈ టోర్నీలో భారత్‌తో ఇప్పటివరకు తలపడిన ఒక్క జట్టు కూడా కనీసం మూడంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం. వెస్టిండీస్ (44), మలేషియా (31), శ్రీలంక (58), బంగ్లాదేశ్ (64) జట్లు 70 పరుగుల లోపే తోకముడిచాయి. -
టి20 ప్రపంచకప్.. టీమిండియా ఘన విజయం
కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వార్మప్ మ్యాచ్‌లో భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన ఈ సన్నాహక పోరులో భారత్ ఏకంగా 119 పరుగుల భారీ తేడాతో స్కాట్లాండ్పై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కమలిని (23 బంతుల్లో 32) టాప్‌స్కోరర్ కాగా, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (26), కెప్టెన్ నికీ ప్రసాద్ (25) సనిక చల్కే (17) సహచరులకూ బ్యాటింగ్ ప్రాక్టీస్ అవకాశమిచ్చేందుకు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు.ప్రత్యర్థి బౌలర్లలో అమీ బల్డీ (2/13) కాస్త ప్రభావం చూపింది. 3 ఓవర్లు వేసిన ఆమె 13 పరుగులే ఇచి్చంది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ను భారత బౌలర్లు 18.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌట్ చేశారు. వైజాగ్‌కు చెందిన షబ్నమ్ షకీల్, వైష్ణవి శర్మ, సోనమ్ యాదవ్ తలా 2 వికెట్లు తీశారు.సోమవారం జరిగిన మిగతా వార్మప్ మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా 140 పరుగుల తేడాతో ఆతిథ్య మలేసియాను ఓడించగా, వెస్టిండీస్ 9 పరుగుల తేడాతో నేపాల్‌పై గట్టెక్కింది. అమెరికా జట్టు 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌కు షాక్ ఇచి్చంది. బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందగా, ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో సమోవాపై ఘనవిజయం సాధించింది. పాకిస్తాన్ 11 పరుగులతో నైజీరియాను ఓడించింది.ప్రధాన టోర్నీ ఈనెల 18 నుంచి జరుగుతుంది. అయితే భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం వెస్టిండీస్‌తో ఆడుతుంది. రెండేళ్ల క్రితం 2023లో దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నిర్వహించిన మహిళల అండర్–19 మెగా ఈవెంట్లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను కంగుతినిపించింది. -
నిజాయతీకి ఫిదా!
సాక్షి, సిటీబ్యూరో: ఎవరైనా ఏదైనా పర్యాటక ప్రదేశానికి వస్తే చిరు వ్యాపారులు అధిక ధరలు చెబుతారనేది అందరి అభిప్రాయం. మనం వేరే రాష్ట్రాలు లేదా దేశానికి వెళ్లినప్పుడు ఇలాంటి అనుభవం ఒకటి రెండుసార్లు మనకు కూడా బహుశా ఎదురయ్యే ఉంటుంది! అయితే.. మన హైదరాబాద్‌లో కొద్ది రోజులుగా పర్యటిస్తున్న ఓ విదేశీయుడికి భిన్న అనుభవం ఎదురైంది. చారి్మనార్‌ను చూసేందుకు స్కాట్లాండ్కు చెందిన హ్యూ అనే వ్యక్తి వచ్చాడు. అక్కడ కలియదిరుగుతూ నగర ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆభరణాలు, మట్టి గాజుల గురించి ఆరా తీస్తూ వస్తున్నాడు. అప్పుడే ఓ చిరు వ్యాపారి ముత్యాల హారాలను అమ్ముతూ కనిపిస్తే వాటి ధర ఎంతో అడిగాడు. అయితే.. అందరిలా అవి ఒరిజినల్ ముత్యాలంటూ మభ్య పెట్టకుండా ప్లాస్టిక్ ముత్యాలని నిజాయతీగా చెప్పాడు. అలాగే.. లైటర్‌తో కాల్చి ఇవి, ఒరిజినల్ కాదని పేర్కొన్నాడు. పైగా ధర కూడా రూ.150 అనడంతో చాలా నిజాయతీపరుడివి అంటూ కితాబిచ్చాడు. తిరిగి పర్యాటకుడి వివరాలను ఆరా తీశాడు. స్కాట్లాండ్ అని సమాధానం చెప్పాడు. వెంటనే పర్యాటకుడిని ఆ చిరు వ్యాపారి ఫ్రెంచ్‌లో పలకరించాడు. ఓ..ఫ్రెంచ్ కూడా వస్తుందా అని అడిగి షాక్ అయ్యాడు. ఇదంతా వీడియో తీసి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పైగా హైదరాబాద్ పరువు కాపాడావంటూ నెటిజన్లు అతడిని తెగ పొగిడేస్తున్నారు. -
విలువ తెలియక డోర్‌స్టాప్‌గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు!
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం ప్రభువు మహబూబ్ అలీఖాన్ గతంలో కొనుగోలుచేసి దురదృష్టంగా భావించి షూలోపల పడేసిన ప్రపంచ ప్రఖ్యాత జాకబ్ వజ్రాన్ని ఆయన కుమారుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చాన్నాళ్లు తన టేబుల్‌పై పేపర్‌వెయిట్‌గా వాడారని చరిత్ర చెబుతోంది. అది వందల కోట్ల విలువచేస్తుందని ఆయన తెలీదు. అచ్చం అలాగే కోట్లుపలికే పాలరాతి ప్రతిమను చాలా సంవత్సరాలపాటు బ్రిటన్‌లో ఒక పారిశ్రామికవాడలోని షెడ్డు తలుపు మూసుకుపోకుండా అడ్డుగా వాడారు. చివరకు అది ప్రముఖ శిల్పకారుడు ఎడ్మీ బౌచర్డన్ చెక్కిన అద్భుత ప్రతిమ అని తెల్సి ఇప్పుడు ఔత్సాహిక కుబేరుడు కోట్లు పెట్టి కొనేందుకు ముందుకొస్తున్నారు. ఒకాయన ఏకంగా రూ.27 కోట్లు చెల్లించేందుకు సుముఖత చూపడంతో ఈ శిల్పం కథాకమామిషు తెల్సుకునేందుకు అంతా గూగుల్ తల్లి వద్ద సెర్చింగ్లు మొదలుపెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన 15వ లూయిస్ రాజు వద్ద ఆస్థాన శిల్పకారుడైన ఎడ్మీ చౌడర్డన్ 18వ శతాబ్దంలో ఈ ప్రతిమను చెక్కారు. బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్లోని హైల్యాండ్స్ కౌన్సిల్ ప్రాంతంలో ఆనాటి భూస్వామి, రాజకీయనాయకుడు జాన్ గార్డన్.. ఎడ్మీతో తన స్వీయ ప్రతిమను చెక్కించుకున్నాడు. తర్వాతి కాలంలో ఆయన ఈ ప్రాంతంలో ఇన్వర్గార్డన్ పట్టణానికి రూపకల్పనచేశారు. తర్వాత 19వ శతాబ్దంలో ఒక కోట తగలబడిన ఘటనలోనూ ఇది చెక్కుచెదరలేదు. ఆ సంఘటన తర్వాత 1930వ సంవత్సరంలో అదే ఇన్వర్గార్డన్ పట్టణ కౌన్సిల్ కేవలం ఐదు పౌండ్లకు కొనుగోలుచేసింది. అయితే తర్వాత అది అదృశ్యమైంది. కేవలం ఐదు పౌండ్ల విలువచేసే శిల్పం ఎక్కడో శిథిలమై ఉంటుందని కౌన్సిల్ సభ్యులు భావించారు. అంతా దానిని మర్చిపోయారు.దశాబ్దాల తర్వాత అంటే 1998లో హైల్యాండ్స్ పారిశ్రామికవాడలోని కర్మాగారం గేటు వద్ద దానిని కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ చూశారు. తలుపు మూసుకుపోకుండా అప్పుడు అడ్డుగా దానిని వాడుతున్నారు. మిలమిల మెరిసిపోతున్న ఈ ప్రతిమకు ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావించి దానిని హైల్యాండ్ కౌన్సిల్ స్థానిక ప్రభుత్వానికి అప్పజెప్పారు. ప్రభుత్వాధికారులు దానిని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. తర్వాత దానిని పారిస్ నగరంలోని ‘ది లారీస్’, లాస్ఏంజిల్స్లోని ‘ది గెట్టీ మ్యూజియం’లోనూ ప్రదర్శించారు. ఆనోటా ఈనోట విన్నాక అది ప్రఖ్యాత శిల్పకారుడు చెక్కిన శిల్పమని స్పష్టమైంది. అరుదైనదికావడంతో అది చాలా విలువైనదని గ్రహించి దానిని స్థానిక ప్రభుత్వం అపహరణకు గురికాకుండా లోపల భద్రపరిచింది.సహాయక నిధుల కోసం వేలానికి.. విలువైన వస్తువును దగ్గర పెట్టుకోవడం కంటే దానిని విక్రయిస్తే వచ్చే సొమ్ముతో స్థానికుల సంక్షేమ పథకాలను అమలుచేయొచ్చని స్థానిక ప్రభుత్వం భావించింది. అమ్మడానికి సిద్ధమైంది. వచ్చే నిధులను ఇన్వర్గార్డన్ కామన్‌గుడ్ ఫండ్ కింద ఖర్చుచేస్తామని చాటింపు వేయించింది. చారిత్రక వస్తువును సొంత ఆస్తిగా భావించి వేలం ఎలా వేస్తారని కొందరు కోర్టుకెక్కారు. దీనిపై హైల్యాండ్స్ టెయిన్ షరీఫ్ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. అది వారసత్వ ఆస్తి కాదని తేల్చిచెప్పింది. చదవండి: వెదురుగొట్టం తూనీగ.. పశ్చిమ కనుమల్లో సరికొత్త జాతిఈలోపే గత ఏడాది అక్టోబర్‌లోనే దానిని రూ.27 కోట్లకు కొంటానని ఒక కుబేరుడు ఆసక్తి చూపించారు. తాజాగా కోర్టు తీర్పుతో ప్రతిమ వేలానికి రంగం సిద్ధమైంది. నవంబర్ ఏడోతేదీన తొలిసారిగా వేలానికి పెట్టారు. రోజు రోజుకూ దీనికి బిడ్డింగ్ ధర పెరుగుతోంది. విషయం తెల్సుకున్న ఆనాటి కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు తొలిసారి చూసినప్పుడే దానిని మూడో కంటికి తెలీకుండా ఇంటికి పట్టుకుపోతే బాగుండేది. కోటీశ్వరురాలివి అయ్యేదానివి అని నా స్నేహితులు ఇప్పటికీ నన్ను ఆటపట్టిస్తారు’’అని ఆమె అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్కాట్లాండ్ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. 33 పరుగులు చేసిన కేథరీన్ బ్రైస్ టాప్ స్కోరర్‌గా నిలువగా..సారా బ్రైస్ 27, సస్కియా హోర్లీ 13, ఐల్సా లిస్టర్ 11, మెగాన్ మెక్కాల్ 10 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నాట్ సీవర్ బ్రంట్, లారెన్ బెల్, చార్లీ డీన్, డేనియెట్ గిబ్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. మయా బౌచియర్ (62), డేనియెల్ వ్యాట్ హాడ్జ్ (51) అజేయ అర్ద సెంచరీలతో ఇంగ్లండ్‌ను గెలిపించారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు ఇది వరుసగా మూడో గెలుపు కాగా.. స్కాట్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ గ్రూప్ టాపర్‌గానూ ఎగబాకింది. గ్రూప్-బిలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. స్కాట్లాండ్ సహా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.గ్రూప్-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా టాప్‌లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించింది. భారత్, న్యూజిలాండ్ చెరి నాలుగు పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచిన పాక్ నాలుగో స్థానంలో ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండు గ్రూప్‌ల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు చేరుతాయన్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే -
సౌతాఫ్రికా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్ నుంచి స్కాట్లాండ్ ఔట్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 9) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 17.5 ఓవర్లలో 86 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లు ముకుమ్మడిగా రాణించి స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో స్కాట్లాండ్ వరల్డ్‌కప్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో సౌతాఫ్రికా గ్రూప్-బి టాపర్‌గా కొనసాగుతుంది.రాణించిన వోల్వార్డ్ట్, బ్రిట్స్, కాప్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు వోల్వార్డ్ట్ (40), బ్రిట్స్ (43) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అనంతరం కాప్ (43) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఫలితంగా సౌతాఫ్రికా స్కాట్లాండ్ ముందు భారీ స్కోర్‌ను ఉంచింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బోష్ 11, సూన్ లస్ 18 (నాటౌట్), క్లో టైరాన్ 2, డెర్క్సెన్ ఒక్క పరుగు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో స్లేటర్, బ్రైస్, బెల్, ఫ్రేసర్, కార్టర్ తలో వికెట్ పడగొట్టారు.విజృంభించిన బౌలర్లుభారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించారు. మ్లాబా 3, టైరాన్, డి క్లెర్క్ చెరో 2, ఖాకా, సూన్ లస్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కేవలం ఫ్రేసర్ (14), లిస్టర్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. చదవండి: T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా -
స్కాట్ లాండ్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామని స్థానిక తెలుగు సంఘం నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మ భూమి మాత లేదా భూమి దేవి మన పవిత్ర ప్రకృతి దేవత. ప్రకృతికి బతుకమ్మ ఒక ప్రతీక. ఆమెపై జీవించిన ప్రతి రూపానికి ఆమె తల్లి. మన హిందూ మతం శాశ్వతమైనది (సనాతన ధర్మం) అని నమ్ముతారు. దైవత్వం. ప్రకృతి తల్లి యొక్క విడదీయరాని స్వభావాన్ని గుర్తించి ఆరాధించే లోతైన పర్యావరణ విధానం కోసం ఆధ్యాత్మిక మరియు తాత్విక సాధనాలను అందిస్తుందన్నారు.గ్లాస్గో దక్షిణ భాగంలో, మనకు అధిక సంఖ్యలో హిందూ సమాజం ప్రకృతిలో పెరుగుతోంది. దీనికి సమీపంలో మందిరం లేదా సాంస్కృతిక కేంద్రం లేకపోవడంతో మదర్ ఎర్త్ హిందూ దేవాలయం ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత స్థలాన్ని గుర్తించారు. ఈ ఏడాది నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా స్థానిక తెలుగు సంఘం డాక్టర్ పునీత్ బేడి, రష్మీ నాయక్, డాక్టర్ మమత వుసికెల , వినీల బత్తుల నేతృత్వంలో ప్రతిరోజూ నవరాత్రి, బతుకమ్మలను జరుపుకుంటారు. చిరకాలం నిలిచిపోయే వేడుక జరగడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
వెస్టిండీస్ ధనాధన్ విజయం
దుబాయ్: మాజీ చాంపియన్ వెస్టిండీస్ మహిళల టి20 ప్రపంచకప్‌లో తమ రెండో లీగ్ మ్యాచ్‌లో గెలుపు ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్‌లో సఫారీ చేతిలో ఓడిన 2016 చాంపియన్ ఆదివారం గ్రూప్ ‘బి’లో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఓపెనర్లు సారా బ్రిస్ (2), సస్కియా హార్లీ (11)లను ఆరంభంలోనే అవుట్ చేయడంతో స్కాట్లాండ్ తిరిగి పుంజుకోలేకపోయింది. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కేథరిన్ బ్రిస్ (31 బంతుల్లో 25; 1 ఫోర్), అయిల్సా లిస్టెర్ (33 బంతుల్లో 26; 1 ఫోర్) కాసేపు క్రీజులో నిలబడటంతో స్కాట్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. కరీబియన్ బౌలర్లలో అఫీ ఫ్లెచెర్ 3 వికెట్లు తీయగా, చినెల్లి హెన్రీ, హేలీ మాథ్యూస్, కరిష్మా తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆరంభంలోనే ఓపెనర్లు స్టెఫానీ టేలర్ (4), హేలీ మాథ్యూస్ (8) వికెట్లను కోల్పోయి తడబడింది. అయితే క్వినా జోసెఫ్ ( 18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), డియాండ్రా డాటిన్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), చినెల్లి హెన్రీ (10 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆట ఆడి వేగంగా మ్యాచ్‌ను ముగించారు. దీంతో విండీస్ 11.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసి గెలిచింది. ఒలివియా బెల్కు 2 వికెట్లు దక్కాయి. రాచెల్, ప్రియనాజ్ ఛటర్జీ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు స్కాట్లాండ్ ఇన్నింగ్స్: హార్లీ (సి) డాటిన్ (బి) హేలీ మాథ్యూస్ 11; సారా బ్రిస్ (బి) హెన్రీ 2; కేథరిన్ బ్రిస్ (సి) కరిష్మా (బి) ఫ్లెచర్ 25; లిస్టెర్ (సి) కరిష్మా (బి) ఫ్లెచర్ 26; ప్రియనాజ్ ఛటర్జీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫ్లెచర్ 0; జాక్ బ్రౌన్ (రనౌట్) 11; డార్సీ కార్టర్ (నాటౌట్) 14; కేథరిన్ ఫ్రేజర్ (రనౌట్) 6; రాచెల్ (బి) కరిష్మా 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–59, 4–59, 5–76, 6–76, 7–98, 8–99. బౌలింగ్: హెన్రీ 4–2–10–1, హేలీ మాథ్యూస్ 4–0–21–1, కరిష్మా 4–0–24–1, అశ్మిని మునిసర్ 1–0–8–0, అఫీ ఫ్లెచర్ 4–0–22–3, క్వినా జోసెఫ్ 1–0–2–0, ఆలియా అలెన్ 2–0–10–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) కేథరిన్ బ్రిస్ (బి) ప్రియనాజ్ 8; స్టెఫానీ (బి) రాచెల్ 4; క్వినా జోసెఫ్ (సి) ప్రియనాజ్ (బి) ఒలివియా బెల్ 31; షెర్మయిన్ (సి అండ్ బి) ఒలివియా బెల్ 2; డాటిన్ (నాటౌట్) 28; చినెల్లి హెన్రీ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (11.4 ఓవర్లలో 4 వికెట్లకు) 101. వికెట్ల పతనం: 1–5, 2–32, 3–48, 4–59. బౌలింగ్: రాచెల్ స్లేటర్ 2–0–17–1, కేథరిన్ బ్రిస్ 3–0–22–0, ఒలివియా బెల్ 3–0–18–2, ప్రియనాజ్ 1–0–15–1, అబ్తాహ మక్సూద్ 2.4–0–28–0. -
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ భూమి మాత లేదా భూమి దేవి మన పవిత్ర ప్రకృతి దేవత. ప్రకృతికి బతుకమ్మ ఒక ప్రతీక. ఆమెపై జీవించిన ప్రతి రూపానికి ఆమె తల్లి. మన హిందూ మతం శాశ్వతమైనది (సనాతన ధర్మం) అని నమ్ముతారు మరియు దైవత్వం మరియు ప్రకృతి తల్లి యొక్క విడదీయరాని స్వభావాన్ని గుర్తించి ఆరాధించే లోతైన పర్యావరణ విధానం కోసం ఆధ్యాత్మిక మరియు తాత్విక సాధనాలను మనకు అందిస్తుంది.గ్లాస్గో యొక్క దక్షిణ భాగంలో, మనకు అధిక సంఖ్యలో హిందూ సమాజం ఉంది మరియు అది ప్రకృతిలో పెరుగుతోంది. మాకు సమీపంలో మందిరం లేదా సాంస్కృతిక కేంద్రం లేదు. నిపుణుల బృందం కలిసి సమావేశమై చర్చల ద్వారా మా కమ్యూనిటీ కోసం ఒక సాంస్కృతిక కేంద్రంతో సహా ఒక మందిర్ ఆలోచనను రూపొందించింది. మదర్ ఎర్త్ హిందూ దేవాలయం ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత మరియు అనేక మంది వ్యక్తులతో అనేక సమావేశాల తరువాత, మా కేంద్రం యొక్క భవిష్యత్తు స్థలంగా ఉండే స్థలాన్ని మేము కనుగొన్నాము. ఈ ఏడాది నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు మరియు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి రోజు అంకితం చేయబడిందిఈ సందర్భంగా స్థానిక తెలుగు సంఘం డాక్టర్ పునీత్ బేడి, రష్మీ నాయక్, డాక్టర్ మమత వుసికెల మరియు వినీల బత్తుల నేతృత్వంలో ప్రతిరోజూ నవరాత్రి మరియు బతుకమ్మలను జరుపుకుంటారు. అక్టోబర్ 6న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చిరకాలం మన జ్ఞాపకాలలో నిలిచిపోయే వేడుకగా ఇది జరగబోతోందని మా సంఘం వారు చాలా ఉత్సాహం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
T20 World Cup 2024: బోణి కొట్టిన బంగ్లాదేశ్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన మెగా టోర్నీ ఓపెనర్‌లో బంగ్లా మహిళల జట్టు స్కాట్లాండ్పై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ గ్రూప్-బిలో అగ్రస్థానానికి చేరుకుంది. మెగా టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇవాన్స్ గుడ్‌బై
స్కాట్లాండ్ బౌలర్ అలస్డేర్ ఇవాన్స్(Alasdair Evans) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పదిహేనేళ్ల తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు కెరీర్ కొనసాగించేందుకు సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ఈ సందర్భంగా ఇవాన్స్ కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. కాగా 2009లో కెనడాతో వన్డే మ్యాచ్‌తో ఇవాన్స్ స్కాట్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 42 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో ఈ పేస్ బౌలర్ 58, 41 వికెట్లు తీశాడు. చివరగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో శ్రీలంక తరఫున మ్యాచ్ ఆడాడు. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన అతడు..తాజాగా ఆటకు వీడ్కోలు పలుకుతూ ప్రకటన విడుదల చేశాడు.ఎవరో జోక్ చేస్తున్నారనుకున్నా‘‘నా అరంగేట్రం గురించి ఇప్పటికీ ప్రతీ విషయం గుర్తుంది. ఆరోజు అబెర్డీన్లో మ్యాచ్. హెడ్‌కోచ్ పీట్ స్టెయిన్డిల్ నుంచి రాత్రి ఫోన్ కాల్ వచ్చింది. జట్టులో చాలా మంది ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. నువ్వు రావాల్సి ఉంటుందని చెప్పారు.నేను కూడా ఇంటర్నేషనల్ క్రికెటర్ అవుతానని ఊహించలేదు. అందుకే నాకు హెడ్‌కోచ్ కాల్ చేసినపుడు ఎవరో జోక్ చేస్తున్నారనుకున్నా. నా ప్రయాణంలో అద్భుతమైన క్రికెటర్లతో ఆడే అవకాశం దక్కింది. పదిహేనేళ్లు జట్టుతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అభిమానులకు ధన్యవాదాలు’’ అని ఇవాన్స్ పేర్కొన్నాడు. చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు! -
గ్రీన్ విధ్వంసం.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాటీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో బ్రాండెన్ మెక్కల్లమ్(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 3 వికెట్లతో సత్తా చాటగా.. హార్దీ, అబాట్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. బౌలింగ్‌లో అదరగొట్టిన గ్రీన్.. బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 62 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మార్ష్(31) పరుగులు చేశాడు. స్కాట్లాండ్ బౌలక్లలో బ్రాడ్లీ క్యూరీ రెండు వికెట్లు పడగొట్టగా.. సోలే, జర్వీస్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ సిరీస్‌లో విజయం సాధించిన కంగారులు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌తో ఆసీస్ తలపడనుంది. -
ఆసీస్ బౌలర్ల విజృంభణ
ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో జరుగుతున్న మూడో టీ20 ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ బౌలర్లు తలో చేయి వేసి స్కాట్లాండ్ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో బ్రాండన్ మెక్‌ముల్లెన్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. జార్జ్ మున్సే (25), ఓల్లీ హెయిర్స్ (12), మార్క్ వాట్ (18), మైఖేల్ లీస్క్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో కెమెరూన్ గ్రీన్ 3, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్ తలో 2, స్టోయినిస్, జంపా చెరో వికెట్ పడగొట్టారు. అరంగేట్రం బౌలర్ కూపర్ కన్నోల్లీ 3 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా స్కాట్లాండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించింది. ఆతిథ్య జట్టు మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తుంది.ఈ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఐదు మ్యాచ్ వన్డే సిరీస్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 11 నుంచి ఈ సిరీస్‌లు మొదలుకానున్నాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఇంగ్లండ్‌లో జరుగనున్నాయి. సెప్టెంబర్ 11, 13, 15 తేదీల్లో టీ20లు.. సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. -
జోస్ ఇంగ్లీష్ అరుదైన ఘనత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ?
ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ట్రావిస్ హెడ్ విఫలమైన చోట స్కాటిష్ బౌలర్లను ఇంగ్లిష్ ఊచకోత కోశాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లిష్.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 43 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంగ్లిష్‌కు ఇది రెండో టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న జోష్ 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు.జోష్ది బాస్..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఇంగ్లిష్.. తన సొంత రికార్డునే బ్రేక్ చేశాడు. టీ20ల్లో ఆస్ట్రేలియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లిష్, మాక్స్వెల్, ఆరోన్ ఫించ్ పేరిట సంయుక్తంగా ఉండేది.వీరి ముగ్గురూ 47 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. అయితే తాజా మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే సెంచరీ చేసిన ఇంగ్లిష్.. హెడ్, మాక్సీని అధిగిమించి ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. స్కాట్లాండ్పై 70 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0తో కంగరూలు కైవసం చేసుకున్నారు. -
AUS vs SC: షాకింగ్.. థర్డ్ అంపైర్ లేకుండానే టీ20 సిరీస్
అంతర్జాతీయ క్రికెట్లో ఏదైనా మ్యాచ్‌కు సాధరణంగా ఇద్దరూ ఫీల్డ్ అంపైర్లతో పాటు ఓ థర్డ్ అంపైర్ కూడా బాధ్యతలు నిర్వరిస్తారు. ఈ విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలుసు. కానీ ఓ ఇంటర్ననేషనల్ సిరీస్ థర్డ్ అంపైర్ లేకుండానే జరుగుతోంది. అవును మీరు విన్నది నిజమే.ఎడిన్బర్గ్ వేదికగా ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు థర్డ్ అంపైర్ ఎవరూ లేరు. థర్డ్ అంపైర్‌తో పాటు డీఆర్ఎస్ కూడా అందుబాటులో లేదు. థర్డ్ అంపైర్ అందుబాటులో లేకపోవడంతో రనౌట్, స్టంపౌట్‌లపై ఫీల్డ్ అంపైర్లదే తుది నిర్ణయం.మూడో అంపైర్ లేకపోవడంతో రెండో టీ20లో ఆసీస్ బ్యాటర్ ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు కలిసొచ్చింది. మెక్‌గర్క్ స్టంపౌట్ ఔటైనప్పటకి ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించిడంతో మెక్‌గర్క్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.అయితే ఆస్ట్రేలియా వంటి వరల్డ్‌క్లాస్ జట్టు ఆడుతున్న సిరీస్‌కు థర్డ్ అంపైర్ లేకపోవడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక వరుసగా రెండు టీ20ల్లో ఘన విజయం సాధించిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.చదవండి: AUS vs SCO: జోష్ ఇంగ్లిస్ రికార్డు సెంచరీ.. ఆసీస్ సిరీస్ విజయం -
జోష్ ఇంగ్లిస్ రికార్డు సెంచరీ.. ఆసీస్ సిరీస్ విజయం
ఎడిన్‌బరో: అంతర్జాతీయ టి20ల్లో ఆ్రస్టేలియా తరఫున వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన జోష్ ఇంగ్లిస్ (49 బంతుల్లో 103; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) స్కాట్లాండ్తో జరిగిన రెండో టి20లో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ ఆసీస్ ఆ్రస్టేలియా 70 పరుగుల తేడాతో స్కాట్లాండ్ను చిత్తుచేసింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (0) డకౌట్ కాగా, మూడో స్థానంలో బరిలోకి దిగిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇంగ్లిస్ రికార్డు విశ్వరూపం చూపాడు.స్కాట్లాండ్ బౌలర్ల అనుభవరాహిత్యాన్ని సొమ్ము చేసుకుంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 43 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గతంతో తనతో పాటు ఫించ్, మ్యాక్స్‌వెల్ పేరిట ఉన్న 47 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును అతను బద్దలుకొట్టాడు. ఇతర బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ క్యూరీ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ 16.4 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ మెక్మలెన్ (42 బంతుల్లో 59; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టొయినిస్ 4, కామెరూన్ గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ శనివారం జరగనుంది. -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కంగారులు ఊదిపడేశారు. కేవలం 9.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఆసీస్ చేధించింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెడ్.. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 39; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.దక్షిణాఫ్రికా వరల్డ్ రికార్డు బద్దలు..ఇక ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి ఏకంగా 113 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టు ఆసీస్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది.గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో సఫారీలు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 102 పరుగులు చేశారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ప్రోటీస్ ఆల్‌టైమ్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది. -
ట్రవిస్ హెడ్ ఊచకోత.. మిచెల్ మార్ష్ విధ్వంసం
ఎడిన్బర్గ్ వేదికగా స్కాట్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్ శివాలెత్తిపోయారు. పవర్ ప్లేలో (తొలి ఆరు ఓవర్లలో) రికార్డు స్థాయిలో వికెట్ నష్టానికి 113 పరుగులు చేశారు. అంతర్జాతీయ టీ20 చరిత్రలో (పవర్ ప్లేల్లో) ఇదే అత్యధిక స్కోర్. పవర్ ప్లే ముగిసే సమయానికి ట్రవిస్ హెడ్ 22 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేయగా.. మిచెల్ మార్ష్ 11 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. పవర్ ప్లే మొత్తంలో కేవలం రెండు సింగల్స్ మాత్రమే రాగా.. 17 ఫోర్లు, 7 సిక్సర్లు వచ్చాయి. ట్రవిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు తలో చేయి వేసి స్కాట్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. సీన్ అబాట్ 3 వికెట్లతో రాణించగా.. జేవియర్ బార్ట్లెట్, ఆడమ్ జంపా తలో 2, రిలే మెరిడిత్, కెమరూన్ గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో మున్సే 28, క్రాస్ 27, బెర్రింగ్టన్ 23 పరుగులు చేశారు. మిగతావారంతా తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు.అరంగేట్రంలోనే డకౌట్ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.. తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. మెక్‌గుర్క్ మూడు బంతులు ఆడి బ్రెండన్ మెక్‌ముల్లెన్ బౌలింగ్‌లో చార్లీ కాసెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదన155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 80; 12 ఫోర్లు, 5 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 39; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ ఇంగ్లిస్ (13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కేవలం 9.4 ఓవర్లలోనే (3 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. -
టీ20 వరల్డ్‌కప్ కోసం స్కాట్లాండ్ జట్టు ప్రకటన
యూఏఈ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల స్కాట్లాండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా కేథరీన్ బ్రైస్ ఎంపికైంది. వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్ గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరుగనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.స్కాట్లాండ్: కేథరీన్ బ్రైస్ (కెప్టెన్), క్లో ఏబెల్, అబ్బి అయిట్కెన్ డ్రమ్మండ్, ఒలీవియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియానాజ్ ఛటర్జీ, కేథరీన్ ఫ్రేసర్, సస్కియా హార్లీ, లోర్నా జాక్ బ్రౌన్, ఐల్సా లిస్టర్, అబ్తహా మక్సూద్, మెగాన్ మెక్‌కోల్, హన్నా రెయినీ, రేచల్ స్లేటర్పాకిస్తాన్: ఆలియా రియాజ్, సదాఫ్ షమాస్, ఇరమ్ జావెద్, సిద్రా ఆమీన్, ఒమైమా సొహైల్, నిదా దార్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్), సష్రా సంధు, డయానా బేగ్, సయెదా అరూబ్ షా, తుబా హసన్, తస్మియా రుబాబ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, తహిల మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, ఎల్లిస్ పెర్రీ, అన్నాబెల్ సథర్‌ల్యాండ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వేర్హమ్, అలైసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షట్, తైలా వ్లేమింక్ఇండియా: స్మృతి మంధన, దయాళన్ హేమలత,జెమీమా రోడ్రిగెజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్ సజనా, పూజా వస్త్రాకర్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ఇంగ్లండ్: మైయా బౌచియర్, డేనియెల్ వ్యాట్, అలైస్ క్యాప్సీ, హీథర్ నైట్ (కెప్టెన్), సోఫీ డంక్లీ, డేనియెల్ గిబ్సన్, ఫ్రేయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, బెస్ హీత్, ఆమీ జోన్స్, లారెన్ బెల్, చార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లిన్సే స్మిత్వెస్టిండీస్: నెరిస్సా క్రాఫ్టన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), డియాండ్రా డొట్టిన్, జైదా జేమ్స్, స్టెఫానీ టేలర్, ఆలియా అలెన్, చినెల్ హెన్రీ, అష్మిని మునీసర్, షెమెయిన్ క్యాంప్‌బెల్, చెడీన్ నేషన్, అఫీ ఫ్లెయర్, కరిష్మ రామ్హరాక్, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్, షమీలియా కాన్నెల్ -
మరో పాతికేళ్లలో... బ్రిటన్ ఆలూ మాయం!
బ్రిటన్ ప్రజలు ఇష్టంగా తినే బంగాళదుంప సాగు అక్కడ కనాకష్టంగా మారిందట. మరో పాతికేళ్లలో బ్రిటన్‌లో ఆలూ సాగు అసాధ్యంగా మారినా ఆశ్చర్యం లేదని పలు నివేదికలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 20250 స్కాట్లండ్ ఆలూ సాగు పరిశ్రమ తుడిచిపెట్టుకుపోవచ్చన్నది వాటి సారాంశం. పొటాటో సిస్ట్ నెమటోడ్స్ (పీసీఎన్) అనే తెగులే ఇందుకు కారణం. ఇది సోకే పంటభూముల్లో ఆలూ సాగు అత్యంత కష్టం. నేరుగా మొక్క వేర్లను నాశనం చేసే ఈ తెగులు దెబ్బకు ఆలూ దిగుబడి దారుణంగా పడిపోతుంది. బ్రిటన్‌లో వాడే ఆలూ 80 శాతం స్కాట్లాండ్ భూముల నుంచే వస్తుంది. 450 కోట్ల యూరోల విలువైన ఆలూ పరిశ్రమను ఆదుకునేందుకు బ్రిటిష్ సైంటిస్టుల బృందం నడుం బిగించింది. పీసీఎన్ను తట్టుకునే రెండు వంగడాలను గుర్తించినట్టు మొక్కల వ్యాధుల నిపుణుడు జేమ్స్ ప్రిన్స్ చెప్పారు. వీటి సాయంతో సమస్యను అధిగమిస్తామని ధీమా వెలిబుచ్చారు. – లండన్ -
'సీతారామం'కి రెండేళ్లు.. స్కాట్లాండ్లో మృణాల్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు.. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే!
స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ చార్లీ కాసెల్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కాసెల్ రికార్డులకెక్కాడు. సోమవారం ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ లీగ్ 2లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాసెల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 21 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబడా పేరిట ఉండేది. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్ రికార్డును కాస్సెల్ బ్రేక్ చేశాడు. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్ రికార్డును కాస్సెల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో వరల్డ్రికార్డును కూడా అతడు నమోదు చేశాడు. అరంగేట్రంలో తొలి రెండు బంతుల్లోనే వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్‌గా కాస్సెల్ నిలిచాడు. తను వేసిన మొదటి ఓవర్లో తొలి రెండు బంతుల్లో ఒమన్ బ్యాటర్లు జీషన్ మస్కూద్ అయాన్ ఖాన్‌లను ఔట్ చేసిన కాసెల్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ప్లేయర్ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేయలేకపోయాడు.ఇక ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన ఒమన్.. కాసెల్ దాటికి కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్ 2 వికెట్లు కోల్పోయి చేధించింది.Charlie Cassell's sensational seven-for on debut has helped Scotland bowl Oman out for a modest total 👏Catch all the live #CWCL2 action on https://t.co/CPDKNxoJ9v 📺#SCOvOMA 📝: https://t.co/woV3zYu9sG | 📸: @CricketScotland pic.twitter.com/iGeeVoyvTc— ICC (@ICC) July 22, 2024 -
T20 World Cup 2024: ఓడినా రికార్డు నెలకొల్పారు..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (జూన్ 16) జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల చరిత్రలో స్కాట్లాండ్ ఇదే అత్యధిక స్కోర్. 2022 ఎడిషన్‌లో ఐర్లాండ్‌పై చేసిన 176 పరుగులు ఈ మ్యాచ్ ముందు వరకు ఆ జట్టు అత్యధిక స్కోర్‌గా ఉండింది. నేటి మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఓడినా రికార్డు నెలకొల్పింది.మ్యాచ్ విషయానికొస్తే.. సూపర్-8కు చేరే క్రమంలో స్కాట్లాండ్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకమై ఉండింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే స్కాట్లాండ్ సూపర్-8కు చేరి ఉండేది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఓడటం.. నమీబియాపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించడంతో ఇంగ్లండ్ సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఇదివరకే ఆస్ట్రేలియా సూపర్-8కు క్వాలిఫై అయ్యింది.ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (60), బెర్రింగ్టన్ (42 నాటౌట్), మున్సే (35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 2, ఆస్టన్ అగర్, నాథన్ ఇల్లిస్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (68), మార్కస్ స్టోయినిస్ (59), టిమ్ డేవిడ్ (24 నాటౌట్) చెలరేగడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, షరీఫ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్ వీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
T20 World Cup 2024: ఆస్ట్రేలియా విజయం.. సూపర్-8లో ఇంగ్లండ్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా స్కాట్లాండ్తో ఇవాళ (జూన్ 16) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. ఛేదనలో ఆస్ట్రేలియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో స్కాట్లాండ్ వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది.గ్రూప్-బిలో స్కాట్లాండ్తో సమానంగా ఐదు పాయింట్లు ఉన్న ఇంగ్లండ్ నెట్ రన్‌రేట్ ఆధారంగా సూపర్-8కు అర్హత సాధించింది. ఆసీస్-స్కాట్లాండ్ మ్యాచ్‌కు ముందు నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3.611 రన్‌రేట్‌తో ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. స్కాట్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రాతో 1.255 రన్‌రేట్ చొప్పున ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. గ్రూప్-బి నుంచి ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆస్ట్రేలియా ఎనిమిది పాయింట్లతో (2.791 రన్‌రేట్‌తో) అగ్రస్థానంలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (60), బెర్రింగ్టన్ (42 నాటౌట్), మున్సే (35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 2, ఆస్టన్ అగర్, నాథన్ ఇల్లిస్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (68), మార్కస్ స్టోయినిస్ (59), టిమ్ డేవిడ్ (24 నాటౌట్) చెలరేగడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, షరీఫ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్ వీల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
‘యూరో’ పోరుకు వేళాయె!
ప్రతిష్టాత్మక ‘యూరో’ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు నేడు తెర లేవనుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి మ్యూనిక్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జర్మనీ జట్టుతో స్కాట్లాండ్ పోటీపడుతుంది. జర్మనీలోని 10 పట్టణాల్లో జరిగే ఈ టోర్నీ జూలై 14న బెర్లిన్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 2020 యూరో టోర్నీలో ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో జర్మనీ, స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్... గ్రూప్ ‘బి’లో స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా... గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, స్లొవేనియా, సెర్బియా... గ్రూప్ ‘డి’లో నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా... గ్రూప్ ‘ఇ’లో బెల్జియం, స్లొవేకియా, రొమేనియా, ఉక్రెయిన్... గ్రూప్ ‘ఎఫ్’లో పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, జార్జియా, టర్కీ జట్లు ఉన్నాయి. లీగ్ దశ ముగిశాక ఆరు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 12 జట్లు... మూడో స్థానంలో నిలిచిన నాలుగు ఉత్తమ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ‘యూరో’ టోర్నీని భారత్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ పడింది. మెగా టోర్నీ నుంచి ఓ జట్టు నిష్క్రమించింది. గ్రూప్-బి నుంచి ఒమన్ తదుపరి దశకు చేరకుండా ఎలిమినేట్ అయ్యింది. నిన్న (జూన్ 9) స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన అనంతరం ఒమన్ అధికారికంగా ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్ సూపర్-8కు అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టనుంది. ఈ టోర్నీలో ఒమన్ మరో మ్యాచ్ (జూన్ 13న ఇంగ్లండ్‌తో) ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండానే ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.కాగా, ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రతిక్ అథవాలే (54) అర్ద సెంచరీతో రాణించగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అయాన్ ఖాన్ (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. మార్క్ వాట్, వీల్, క్రిస్టఫర్ సోల్, క్రిస్ గ్రీవ్స్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. బ్రాండెన్ మెక్‌ముల్లెన్ (31 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), జార్జ్ మున్సే (20 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడటంతో 13.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్, ఆకిబ్ ఇలియాస్, మెహ్రన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో స్కాట్లాండ్ రన్‌రేట్‌ను బాగా మెరుగుపర్చుకుని టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. -
టీ20 వరల్డ్‌కప్‌లో భిన్న పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో గతానికి భిన్నంగా చిన్న జట్ల హవా కొనసాగుతుంది. ఫలితంగా 15 మ్యాచ్‌లు పూర్తైనా అగ్ర జట్లు తమ తమ గ్రూప్‌ల్లో టాప్ ప్లేస్‌కు చేరుకోలేకపోయారు. చిన్న జట్లు అనూహ్య రీతిలో రాణించి పెద్ద జట్లను ఓడించడంతో వాటిదే పైచేయిగా ఉంది. గ్రూప్-ఏ నుంచి తొలి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ.. పాకిస్తాన్ సహా కెనడాపై సంచలన విజయాలు సాధించి గ్రూప్ టాపర్‌గా ఉండగా.. భారత్ రెండో స్థానంలో, కెనడా మూడో ప్లేస్‌లో ఉన్నాయి. ఆడిన ఓ మ్యాచ్‌లో ఓడిన పాక్ నాలుగో స్థానంలో ఉండగా.. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఐర్లాండ్ ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. యూఎస్ఏ చేతిలో ఓటమి నేపథ్యంలో పాక్ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి హేమాహేమీ జట్లు ఉండగా.. ఎవరు ఊహించని విధంగా ఈ గ్రూప్‌లో స్కాట్లాండ్ టాప్ ప్లేస్‌లో ఉంది. స్కాట్లాండ్ ఓ మ్యాచ్‌లో గెలిచి (నమీబియా), మరో మ్యాచ్ రద్దు కావడంతో (ఇంగ్లండ్) 3 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా ఉంది. ఆసీస్, నమీబియా, ఇంగ్లండ్, ఒమన్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-సిలో సంచలనాల ఆఫ్ఘనిస్తాన్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. తాజాగా ఆ జట్టు చేతిలో చావుదెబ్బ తిన్న న్యూజిలాండ్ ఆఖరి స్థానంలో నిలిచింది. వెస్టిండీస్, ఉగాండ, పపువా న్యూ గినియా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి సూపర్-8 బెర్త్ రేసులో ముందుండాల్సిన శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి చిట్ట చివరి స్థానంలో ఉండగా.. ఆడిన ఒక్క మ్యాచ్‌లో గెలిచిన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఓడిన నేపాల్ నాలుగో స్థానంలో ఉంది.ప్రపంచకప్‌లో ఇవాళ (జూన్ 8) మరో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. గ్రూప్-డి నుంచి నెదర్లాండ్స్, సౌతాఫ్రికా.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఉగాండ పోటీపడనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఊహించిన ఫలితాలు వచ్చినా ఆఫ్ఘనిస్తాన్, యూఎస్ఏ, స్కాట్లాండ్ జట్లు ఆయా గ్రూప్‌ల్లో టాప్‌లోనే కొనసాగుతాయి. -
స్కాట్లాండ్ బోణీ
బార్బడోస్: టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో స్కాట్లాండ్ తొలి విజయం నమోదు చేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఐదు వికెట్ల తేడాతో నమీబియాపై నెగ్గింది. ఇంగ్లండ్–స్కాట్లాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... ఈ గెలుపుతో స్కాట్లాండ్ మూడు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలోకి వెళ్లింది.స్కాట్లాండ్ తో పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెపె్టన్ ఎరాస్మస్ (31 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. బ్రాడ్ వీల్ 3, బ్రాడ్ కరీ 2 వికెట్లు తీశారు. అనంతరం స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ బెరింగ్టన్ (35 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మైకేల్ లీస్క్ (17 బంతుల్లో 35; 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి స్కా ట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. టి20 ప్రపంచకప్‌లో నేడున్యూజిలాండ్ X అఫ్గానిస్తాన్వేదిక: గయానా; ఉదయం గం. 5 నుంచిబంగ్లాదేశ్ X శ్రీలంక వేదిక: డాలస్; ఉదయం గం. 6 నుంచిదక్షిణాఫ్రికా X నెదర్లాండ్స్వేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిఆ్రస్టేలియా X ఇంగ్లండ్ వేదిక: బ్రిడ్జ్‌టౌన్; రాత్రి గం. 10:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రపంచకప్ 2024లో నేటి (జూన్ 6) మ్యాచ్‌లు.. తొలి మ్యాచ్ ఆడనున్న పాక్
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 6) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. డల్లాస్ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ, పాకిస్తాన్.. బార్బడోస్‌లో జరుగునున్న రెండో మ్యాచ్‌లో నమీబియా, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. పాకిస్తాన్-యూఎస్ఏ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు.. నమీబియా-స్కాట్లాండ్ మ్యాచ్ మధ్య రాత్రి 12:30 గంటలకు మొదలవుతాయి. ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు ఇవాళ ఆడబోయే మ్యాచ్ తొలి మ్యాచ్ కాగా.. యూఎస్ఏ ఇదివరకే ఓ మ్యాచ్ ఆడింది. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.నమీబియా-స్కాట్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-బిలో పోటీపడుతున్న ఈ ఇరు జట్లు ఇదివరకే తలో మ్యాచ్ ఆడాయి. నమీబియా తమ తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై సూపర్ ఓవర్లో విజయం సాధించగా.. స్కాట్లాండ్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం నమీబియా గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానంలో ఉంది. -
రెండు సార్లు ప్రపంచకప్ గెలిచినా, ఇంగ్లండ్‌కు ఆ కల తీరడం లేదు..!
టీ20 వరల్డ్‌కప్‌ల్లో తమ ఖండానికి (యూరప్) చెందిన జట్లపై విజయం సాధించడం ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు తీరని కలగా మిగిలిపోయింది. ఇంగ్లండ్ ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ పోటీల్లో సొంత ఖండానికి చెందిన జట్లపై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్.. సొంత ఖండానికి చెందిన జట్లైన నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లను ఇప్పటివరకు నాలుగు సందర్భాల్లో ఎదుర్కొంది.ఇందులో మూడింట ఊహించని పరాజయాలు ఎదుర్కోగా.. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. 2009, 2014 ఎడిషన్లలో నెదర్లాండ్స్ చేతిలో పరాభావాలు ఎదుర్కొన్న ఇంగ్లండ్.. 2022 ఎడిషన్‌లో ఐర్లాండ్ చేతిలో చావుదెబ్బ తింది. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ నిన్న సహచర యూరప్ జట్టైన స్కాట్లాండ్తో తలపడింది.ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రపంచకప్‌లో సొంత ఖండానికి చెందిన జట్టుపై గెలవాలన్న ఇంగ్లండ్ కల కలగానే మిగిలిపోయింది. యూరోపియన్ దేశాల్లో టెస్ట్ హోదా కలిగిన ఎకైక దేశమైన ఇంగ్లండ్ సొంత ఖండ జట్లు, క్రికెట్ పసికూనలపై ఇప్పటివరకు ఒక్క విజయం సాధించలేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్- స్కాట్లాండ్ మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్‌కు ముందే వర్షం ప్రారంభం కావడంతో టాస్ ఆలస్యంగా పడింది. టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దయ్యే సమయానికి జార్జ్ మున్సే (41), మైఖేల్ జోన్స్ (45) క్రీజ్‌లో ఉన్నారు. -
T20 World Cup 2024: ఇంగ్లండ్-స్కాట్లాండ్ మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గ్రూప్-బిలో స్కాట్లాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (జూన్ 4) మ్యాచ్ జరగాల్సి ఉంది. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో మ్యాచ్ ఆలస్యమైంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది.గ్రూప్-డిలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ కూడా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్-నేపాల్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. డల్లాస్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. తుది జట్లు..స్కాట్లాండ్: జార్జ్ మున్సే, మైఖేల్ జోన్స్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, రిచీ బెరింగ్టన్(కెప్టెన్), మాథ్యూ క్రాస్(వికెట్‌కీపర్), మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, క్రిస్టోఫర్ సోల్, బ్రాడ్ వీల్, బ్రాడ్లీ క్యూరీఇంగ్లండ్: జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్‌కీపర్), ఫిలిప్ సాల్ట్, విల్ జాక్స్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ -
టీ20 వరల్డ్‌కప్ 2024లో నేటి (జూన్ 4) మ్యాచ్‌లు
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 4) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-బిలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. పసికూన స్కాట్లాండ్తో తలపడనుండగా.. గ్రూప్-డిలో భాగంగా నెదర్లాండ్స్-నేపాల్ జట్లు పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్-స్కాట్లాండ్ మ్యాచ్ బార్బడోస్ వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. డల్లాస్ వేదికగా నెదర్లాండ్స్-నేపాల్ సమరం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2024లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. డల్లాస్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కెనడాపై యూఎస్ఏ 7 వికెట్ల తేడాతో గెలుపొందగా.. గయానాలో జరిగిన రెండో మ్యాచ్‌లో పపువా న్యూ గినియాపై వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో చెమటోడ్చి నెగ్గింది.బార్బడోస్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఒమన్‌పై నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించగా.. న్యూయార్క్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. తాజాగా గయానా వేదికగా జరిగిన ఐదో మ్యాచ్‌లో ఉగాండపై ఆఫ్ఘనిస్తాన్ 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.మెగా టోర్నీలో భారత తొలి మ్యాచ్ న్యూయార్క్ వేదికగా రేపు జరుగనుంది. ఐర్లాండ్‌తో జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్‌లో జరుగనుంది. -
పసికూనలపై ప్రతాపం.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సునాయాస విజయాలు
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో పెద్ద జట్లు పసికూనలపై ప్రతాపం చూపుతున్నాయి. శ్రీలంకపై నెదర్లాండ్స్ విజయం మినహా ఇప్పటివరకు జరిగిన అన్ని వార్మప్ మ్యాచ్‌ల్లో పెద్ద జట్లే విజయం సాధించాయి. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇదే తంతు కొనసాగింది. ఫ్లోరిడా, ట్రినిడాడ్ వేదికలుగా నిన్న జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమకంటే చిన్న జట్లైన ఐర్లాండ్, స్కాట్లాండ్లపై విజయాలు సాధించాయి.ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 41 పరుగుల తేడాతో గెలుపొందగా.. స్కాట్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.శ్రీలంక-ఐర్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్లు నమోదు కానప్పటికీ.. ప్రతి ఒక్క ఆటగాడు తలో చేయి వేశారు. ఏంజెలో మాథ్యూస్ (32 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. లంక బౌలర్ల ధాటికి 18.2 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. దసున్ షనక (3.2-0-23-4) ఐర్లాండ్ పతనాన్ని శాశించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కర్టిస్ క్యాంఫర్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఆఫ్ఘనిస్తాన్-స్కాట్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. గుల్బదిన్ నైబ్ (69), అజ్మతుల్లా (48) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రిస్టఫర్ సోల్ (4-0-35-3), బ్రైడన్ కార్స్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. ఆఫ్ఘన్ బౌలర్లు తలో చేయి వేయడంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 56 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించాడు. ముజీబ్, కరీం జనత్ తలో 2 వికెట్లు పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో మార్క్ వాట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్‌తో బంగ్లాదేశ్ 'ఢీ'వార్మప్ మ్యాచ్‌ల్లో ఇవాళ (జూన్ 1) చివరి మ్యాచ్ జరుగనుంది. న్యూయార్క్‌లో ఇవాళ భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు ఇవాల్టి నుంచే వరల్డ్‌కప్ రెగ్యులర్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రేపటి నుంచి మొదలవుతాయి. -
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఛాంపియన్‌గా శ్రీలంక
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్-2024 పోటీల్లో శ్రీలంక జట్టు విజేతగా అవతరించింది. అబుదాబీలో నిన్న (మే 7) జరిగిన ఫైనల్లో లంక జట్టు స్కాట్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక కెప్టెన్ చమారీ ఆటపట్టు మెరుపు శతకంతో (63 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక చమారీ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో చమారీ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. నీలాక్షి డిసిల్వ 26 నాటౌట్, కవిశ దిల్హరి 15, విశ్మి గుణరత్నే 9, హర్షిత మాధవి 8, హాసిని పెరెరా 0 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో రేచల్ స్లేటర్ 2, ప్రయనాజ్, కేథరీన్ ఫ్రేజర్, అబ్తహా మక్సూద్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉదేషిక ప్రబోధని 3 వికెట్లతో చెలరేగగా.. ఇనోశి ప్రియ, సుగందిక కుమారి, కవిశ దిల్హరి తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో ప్రియనాజ్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యాయి. మహిళల పొట్టి ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. -
మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ అర్హత
బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు అర్హత సాధించాయి. అబుదాబిలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి ప్రవేశించి మిగిలిన రెండు బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి. సెమీఫైనల్స్‌లో చమరి అటపట్టు నాయకత్వంలోని శ్రీలంక జట్టు 15 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టును ఓడించగా... కేథరీన్ బ్రైస్ సారథ్యంలోని స్కాట్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. తొలిసారి టి20 ప్రపంచకప్ టోటోర్నీకి అర్హత పొందిన స్కాట్లాండ్ ఈరోజు జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో శ్రీలంకతో ఆడుతుంది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఢాకా, సిల్హెట్లో జరుగుతుంది. గత టి20 ప్రపంచకప్‌లో టాప్–6లో నిలిచిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ నేరుగా ఈ టోటోర్నీకి అర్హత పొందాయి. ఆతిథ్య దేశం హోదాలో బంగ్లాదేశ్, ఐసీసీ ర్యాంక్ ప్రకారం పాకిస్తాన్ ఈ టోటోర్నీలో ఆడనున్నాయి. -
ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
స్కాట్లాండ్ మహిళల క్రికెట్ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. నిన్న (మే 5) జరిగిన క్వాలిఫయర్ సెమీస్‌లో స్కాట్లాండ్ ఐర్లాండ్‌ను ఓడించి ప్రపంచకప్ బెర్త్ ఖరారు చేసుకుంది. 2015 నుంచి వరల్డ్‌కప్ బెర్త్ కోసం తపిస్తున్న స్కాట్లాండ్ ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) అనుకున్నది సాధించింది. మరో సెమీస్‌లో యూఏఈని ఓడించిన శ్రీలంక కూడా స్కాట్లాండ్తో పాటు వరల్డ్‌కప్ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ రెండు జట్లు క్వాలిఫయర్ పోటీల నుంచి ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. A special, special group 💜 pic.twitter.com/8BfoqsptAV— Cricket Scotland (@CricketScotland) May 5, 2024 టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-ఏలో.. స్కాట్లాండ్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో కలిసి గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.Flower of Scotland: World Cup Qualification Edition 🤩🏴 pic.twitter.com/zt8Gsm7gr2— Cricket Scotland (@CricketScotland) May 5, 2024 గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్ రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది.స్కాట్లాండ్-ఐర్లాండ్ మ్యాచ్ (తొలి సెమీస్) విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా.. స్కాట్లండ్ 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేథరీన్ బ్రైస్ ఆల్‌రౌండ్ షోతో (4-0-8-4, 35 నాటౌట్) ఇరగదీసి స్కాట్లాండ్ను ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చింది.రెండో సెమీస్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన యూఏఈ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. మే 7న జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో స్కాట్లండ్, శ్రీలంక అమీతుమీ తేల్చుకుంటాయి. -
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకేలో ఉగాది సంబరాలు!
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (తెలుగు సంఘం) వార్షిక ఉగాది సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇది తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలకు ఒక చిరస్మరణీయ వేడుక. ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో, ఈ కార్యక్రమం సంస్థకు ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అంతేకాకుండా 2024-26 కాలానికి కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించారు.ఎడిన్బర్గ్ కాలేజ్-గ్రాంటన్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది తెలుగువారు హాజరయ్యారు. స్కాట్లాండ్లో నివశిస్తున్న తెలుగు సమాజంలో ఉన్నటువంటి బలమైన బంధం, ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచింది.ముఖ్య అతిథులుగా భారత కాన్సుల్ జనరల్ బిజయ్ సెల్వరాజ్, లోథియన్ ప్రాంతానికి చెందిన ఎంఎస్పిలు సారా బోయాక్, ఫోయ్సోల్ చౌదరి, కొల్లిన్టన్ కౌన్సిలర్ స్కాట్ ఆర్థర్ సహా ప్రముఖులు గౌరవ అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి ఉనికి ఈ కార్యక్రమం వైభవాన్ని పెంచింది. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం ఉన్న ఎడిన్బర్గ్ లాంటి నగరంలో ఉగాదిని జరుపుకోవడం గురించి, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.“టాస్-యుకె ఉగాది సంబరాలు 2024” లో తెలుగు సమాజం ప్రతిభ, సంప్రదాయాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అధికారులు.సిలికానాంధ్రా వారి ‘మనబడి’ ద్వారా తెలుగు నేర్చుకునే పిల్లలు “మా తెలుగు తల్లికి” ప్రార్థనాగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.2022-24 కాలానికి గాను సాంస్కృతిక కార్యదర్శిగా వ్యవహరించిన విజయ్ కుమార్ పర్రి తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతిథులు, ముఖ్య అతిథులు మరియు ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ క్రార్యక్రమాన్ని ప్రారభించారు. సమూహ నృత్యాలు, సోలో గానం, తెలుగు కవితల పారాయణ, అనంత్ రామానంద్ గార్లపాటి చేసిన ముఖ్యమైన ఉగాది పంచాంగంతో సహా మంత్రముగ్దులను చేసే ప్రదర్శనలతో వేదిక ఆకర్షణీయంగా మారింది. ఐదుగురు గాయకులు, బ్యాండ్ ప్లేయర్లతో కూడిన స్థానిక భారతీయ బ్యాండ్ "వాయిస్ ఆఫ్ ఎకో" ప్రదర్శన ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచింది. వారి ఆకర్షణీయమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, ఉత్సవాలకు అదనపు ఉత్సాహాన్ని జోడించాయి.హోస్ట్స్ సత్య శ్యామ్ జయంతి, రంజిత్ నాగుబండి, శ్రుతి పల్లెమోని, స్రవంతి పొట్లూరి, హిమజా మాచిరాజు రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు నైపుణ్యంగా మార్గనిర్దేశం చేసి, శక్తిని, ఉత్సాహాన్ని నింపారు. వారి చమత్కారమైన పరిహాసం, ఆకర్షణీయమైన సంభాషణలు హాజరైనవారిని రోజంతా వినోదభరితంగా ఉంచాయి.సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, ఈ కార్యక్రమంలో సాంప్రదాయ సమకాలీన దుస్తులలో వివిధ ఋతువుల పోకడలను ప్రదర్శించే ఫ్యాషన్ షో ప్రదర్శన కూడా జరగడం విశేషం.ఎడిన్బర్గ్ దీపావళి, కన్నడ అసోషియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ - ఎడిన్బర్గ్, ఎడిన్బర్గ్ హిందు మందిర్ అండ్ కల్చరల్ సెంటర్, ఇండియన్ ఆర్ట్స్ కనెక్షన్, 3 గుడ్ డీడ్స్, స్కాటిష్ ఇండియన్ ఆర్ట్స్ ఫోరం, ఒడిశా సొసైటి ఆఫ్ స్కాట్లాండ్, బీహార్ కమ్యూనిటీ మరియు స్కాటిష్ ఇండియన్ ముస్లిం అసోషియేషన్ వంటి ఇతర భారతీయ సంఘాల అతిథులు చేరడం ఔత్సాహికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.వేడుకను విజయవంతం చేయడంలో ఈవెంట్ స్పాన్సర్లు ప్రధాన స్పాన్సర్లు బ్రైటర్ మోర్టగేజెస్, బెల్లి ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్, సహ-స్పాన్సర్ అల్లి భవన్లు కీలక పాత్ర పోషించారు, .ఇక 2024-26 సంవత్సరానికి కొత్తగా ఎన్నికైన టాస్-యూకే ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గడ్డం, సంయుక్త కార్యదర్శి నిరంజన్ నూక, కోశాధికారి విజయ్ కుమార్ పర్రి, మహిళా మరియు ప్రాజెక్టుల కార్యదర్శి మాధవిలత దండూరి, కల్చరల్ సెక్రెటరీ పండరి జైన్ కుమార్ పోలిశెట్టి, క్రీడా కార్యదర్శి బాలాజీ కర్నాటి, యువజన శాఖా కార్యదర్శి రాజశేఖర్ సాంబ, ఐటి కార్యదర్శి జాకీర్ షేక్, పిఆర్ కార్యదర్శి నరేష్ దీకొండలను సభ్యులకు పరిచయం చేశారు.చివరిగా మాజీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా, గౌరవనీయ చైర్‌పర్సన్‌గా సత్కరించారు.జన గణ మన, కొత్తగా నియమితులైన జనరల్, జాయింట్ సెక్రటరీల ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది. ఇక ఈ కార్యక్రమంలో హాజరైన తెలుగువారు సంస్కృతి, స్నేహం, వేడుకలతో నిండిన రోజుగా మధురమైన జ్ఞాపకాలతో బయలుదేరారు.“టాస్-UK ఉగాది సంబరాలు 2024” ఒక తెలుగు వారసత్వ వేడుక మాత్రమే కాదు. తెలుగు సమాజం ఐక్యత, స్థితిస్థాపకతకు నిదర్శనం. టాస్-యుకె అభివృద్ధి చెందడమేగాక ఉగాది స్ఫూర్తిని తెలుగు వారిలో నింపుతూ.. రాబోయే సంవత్సరాల్లో మరింత మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా తెలుగు వారి శ్రేయస్సుకు చేదోడుగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. (చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!) -
YS Jagan మేమంతా సిద్ధం యాత్ర: స్కాట్లాండ్ యూకేలో సంఘీభావం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం యాత్రకు APలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వేల UK Scotland లోని ఎడిన్బర్గ్లో వైయస్సార్సీపీ UK కన్వీనర్లు డా ప్రదీప్ చింతా , ఓబులేరెడ్డి పాతకోట ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం సంఘీబావ సభ నిర్వహించారుపేద ప్రజల అభ్యిన్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 59 నెలలుగా కష్టపడుతున్నారు , మనమంతా ఈ ఒక్క నెలా జగనన్నకోసం కష్టపడి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనిడా ప్రదీప్ చింతా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు జగనన్నకు బ్రహ్మరథం పడుతున్నారు, 175 సీట్లు తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధం నినాదంతో సభాప్రాంగణం మారుమ్రోగిందిఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ UK కమిటీ సభ్యులు అనిల్ బెంజిమెన్, ప్రభాకర్ రెడ్డి అవుతాల, విజయ్ పెండేకంటి, శ్రీకాంత్ పసుపుల, రఘు, దుష్యంత్ రెడ్డి, జోయెల్, రామిరెడ్డి పుచ్చకాయల, సాయి, కార్తీక్ భూమిరెడ్డి, క్రాంతి పాలెం, త్రినాథ్, గురు, శ్రీనివాస్ వరిగొండ, వాసూ విడుదల, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. యూకే నలుమూలలనుండి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.Read this article in English : Solidarity rally for YSRCP's Memantha Siddham yatra in Scotland -
మహిళా ఎన్ఆర్ఐ ‘చెత్త’ బిజినెస్.. రూ.1000 కోట్లు టార్గెట్
ఉన్నత చదువులు చదువుకుంది. కానీ ఆశించిన ఉద్యోగమేదీ రాలేదు. రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఆమెను రూ. 800 కోట్ల కంపెనీకి అధిపతిగా మార్చింది. గట్టి కృషి, పట్టుదలతో వ్యాపార వేత్తగా రాణిస్తోంది. ఎంతోమంది మహిళా పారిశ్రామిక వేత్తలకు, పర్యావరణవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, పూనమ్ గుప్తా స్ఫూర్తిదాయక గాథను తెలుసుకుందాం రండి..! ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త పూనమ్ గుప్తా ఢిల్లీలో 1976, ఆగష్టు 17న ఢిల్లీలో పుట్టింది. లేడీ ఇర్విన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం. ఆ తర్వాత, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ FORE స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, హాలెండ్లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. 2002లో వివాహం కావడంతో భర్త పునీత్ గుప్తాతో కలిసి స్కాట్లాండ్కు వెళ్లారు. స్కాట్లాండ్లో ఆమెకు ఉద్యోగం దొరక లేదు. అర్హతలున్నప్పటికీ, పదేపదే తిరస్కరణలను ఎదుర్కొంది. సాధారణంగా ఎన్ఆర్ఐలకు ఎదురయ్యే అనుభవమే ఇది. ఇదే సమయంలో అనారోగ్యంతో తల్లి ఆకాల మరణం ఆమెను మరింతషాక్‌కు గురిచేసింది. అయినా ఎక్కడా నిరాశ చెందకుండా విభిన్నంగా ఆలోచించింది. వ్యాపారంవైపు అడుగులు వేసింది. అలా 2003లో స్కాట్లాండ్లోని కిల్మాకోమ్‌లోని కేవలం రూ. లక్ష పెట్టుబడితో పర్యావరణ స్పృహతో, రీసైకిలింగ్ బిజినెస్ పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించింది. స్క్రాప్ పేపర్‌ను రీసైక్లింగ్ చేయాలనే ఆలోచనతో స్కాటిష్ ప్రభుత్వ అనుమతి తీసుకొని మరీ దీన్ని స్థాపించింది. మొదటి రెండేళ్లు పూనమ్ ఒంటరిగానే పనిచేసింది. రెండేళ్ల తర్వాత, ఒక స్నేహితుడు ఆమెతో పార్ట్ టైమ్ ప్రాతిపదికన చేరాడు. వ్యాపారం విస్తరించడంతో భర్త రూ. 1.5 కోట్ల ప్యాకేజీతో కంపెనీలో చేరడం విశేషం. యూకేలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పేపర్ కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుతం ఏడాదికి 800 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా యూరప్, అమెరికాలోని కంపెనీల నుంచి చిత్తు కాగితాలను కొనుగోలు చేసి, దాన్నుంచి మంచి నాణ్యమైన కాగితాన్ని కూడా తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతిచేస్తుంది. ఇలా పీజీ పేపర్ ప్రపంచంలోని 53 దేశాల నుండి వస్తువులను దిగుమతి, ఎగుమతులను చేస్తుంది. పీజీ కంపెనీ ఉత్పత్తులను తొలుత ఎగుమతి చేసింది ఇండియాకే. ఇక్కడితో ఆగిపోలేదు. హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్. మెడికల్‌తో సహా ఐటీ రంగంలోకి కూడా ప్రవేశించింది. దాదాపు 350 మంది ఉద్యోగులతో స్కాట్లాండ్ ప్రధాన కార్యాలయం వేదికగా తన సేవల్ని అందిస్తోంది. 7 దేశాలలో ఉన్న అనేక కార్యాలయాలతో 9 కంపెనీలున్నాయి. రానున్న కాలంలో పీజీ పేపర్ ఆదాయం రూ. 1000 కోట్లను అధిగమించాలనేది పూనమ్ గుప్తా టార్గెట్. పీజీ పేపర్ సీఈవో, యూకేలో ఉమెన్స్ ఎంటర్ప్రైజ్ స్కాట్లాండ్ అంబాసిడర్, అత్యంత గుర్తింపు పొందిన పారిశ్రామిక వేత్తలలో ఒకరు, యూకే-ఇండియా సంబంధాలలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది నాయకులలో ఒకరిగా పేరొందారు పూనమ్. స్థానిక, జాతీయ , అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలకు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తారు. భారత్‌లోని యువతుల విద్యకోసం, మహిళలను సాధికారతకు తప్పకుండా మద్దతు నిస్తున్న గొప్ప దాత కూడా. ఈమెకు ఇద్దరు కుమార్తెలు సాన్వి, అన్య, “వ్యాపారం చేయాలనే ఆలోచన మాత్రమే సరిపోదు; రంగంలోకి దిగాలి. పరిశోధన చేయాలి, ఎక్కడో ఒక చోట మొదలు ప్రారంభించండి లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. అలాగే మీ లాభాలను కంపెనీకి తిరిగి ఇవ్వడం మర్చిపోవద్దు’’ - పూనం గుప్తా -
విజృంభించిన వసీం.. యూఏఈ చేతిలో స్కాట్లాండ్ చిత్తు
యూఏఈతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం స్కాట్లాండ్ జట్టు దుబాయ్‌లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా నిన్న (మార్చి 11 జరిగిన తొలి మ్యాచ్‌లో యూఏఈ స్కాట్లాండ్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగుల నామమాత్రపు స్కోర్ చేయగా.. యూఏఈ 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ముహమ్మద్ వసీం మెరుపు ఇన్నింగ్స్ (43 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి యూఏఈని గెలిపించాడు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో జార్జ్ మున్సే (49 బంతుల్లో 75; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మైఖేల్ లీస్క్ (19), జాక్ జార్విస్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ (4-0-14-3) అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఆయాన్ ఖాన్ (4-0-19-2), బాసిల్ హమీద్ (4-0-26-2) పర్వాలేదనిపించారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీంతో పాటు తినష్ సూరి (35 బంతుల్లో 37; 4 ఫోర్లు), అలీషాన్ షరాఫు (29 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో జాక్ జార్విస్, క్రిస్ గ్రీవ్స్లకు తలో వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 13న జరుగనుంది. -
చైనాలో 24 కోట్ల ఏళ్ల డ్రాగన్ శిలాజం
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో శిలాజాలు బయటపడుతుంటాయి. వందల సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయిన జీవులు క్రమంగా శిలాజంగా మారుతుంటాయి. అయితే, చైనాలో 2003లో బయటపడిన భారీ డ్రాగన్ శిలాజం వయసు 24 కోట్ల సంవత్సరాలు ఉంటుందని సైంటిస్టులు తాజాగా నిర్ధారించారు. ఇంత వయసున్న డ్రాగన్ శిలాజం వెలుగుచూడడం ఇదే మొదటిసారి అని నేషనల్ మ్యూజియమ్స్ స్కాట్లాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలో ట్రియాసిక్ కాలానికి చెందిన ఈ శిలాజం భాగాలను తొలుత 2003లో దక్షిణ చైనాలోని గిజౌ ప్రావిన్స్‌లో గుర్తించారు. గత పదేళ్లలో తవ్వకాల్లో మరిన్ని భాగాలు బయటపడ్డాయి. వాటన్నింటినీ ఒకేచోట అమర్చగా అది ఐదు మీటర్ల డ్రాగన్‌గా తేలింది. 24 కోట్ల ఏళ్ల క్రితమే అది శిలాజంగా మారిపోయిందని పరిశోధకులు కనిపెట్టారు. దీనికి డైనోసెఫాలోసారస్ ఒరియంటలిస్ అని పేరుపెట్టారు. ముక్కు నుంచి తోక దాకా పూర్తి శిలాజాన్ని ఆవిష్కరించామని ఎన్ఎంఎస్ సైంటిస్టు డాక్టర్ నిక్ ఫ్రాసెర్ చెప్పారు. ఇది 8 అంకె ఆకారంలో ఉందని, చైనా డ్రాగన్లను గుర్తుకు తెస్తోందని వివరించారు. డ్రాగన్ కాల్పనిక జీవి కాదని, నిజంగానే ఉండేదని చెప్పడానికి ఈ శిలాజం ఒక ఆధారమని సైంటిస్టులు అంటున్నారు. రాక్షస బల్లుల తరహాలో వాతావరణ మార్పుల కారణంగా కోట్ల సంవత్సరాల క్రితం అవి అంతరించిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, చైనాలో బయటపడిన డ్రాగన్ శిలాజం మెడ చాలా పొడవుగా ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. నదులు, చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి వీలుగా దాని మెడ పొడవుగా సాగి ఉండొచ్చని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్కడ కవి పుట్టిన రోజు ఓ పండుగలా జరుపుకుంటారు!
మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతులు తప్పనిసరి తతంగాలుగా జరుగుతాయి. ఈ తప్పనిసరి తతంగాల్లో ఉత్సాహభరితమైన కార్యక్రమాలు ఉండవు. విందు వినోదాలు ఉండవు. కళా ప్రదర్శనలు ఉండవు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. మన దేశంలో కవుల జయంతులు, వర్ధంతుల కార్యక్రమాల్లో వక్తల ఊకదంపుడు ఉపన్యాసాలకు మించిన విశేషాలేవీ ఉండవు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇంగ్లండ్, స్కాట్లండ్లలోనైతే, రాబర్ట్ బర్న్స్ పుట్టినరోజు కవితాభిమానులకు పండుగరోజు. ఆయన పుట్టినరోజు అయిన జనవరి 25న ఏటా ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. ‘బర్న్స్ నైట్’ పేరుతో విందు వినోదాలు, కవితా గోష్ఠులు, సంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. బర్న్స్ కవిత్వాన్ని చదువుతూ అభిమానులు ఉర్రూతలూగిపోతారు. గాయనీ గాయకులు ఆయన గీతాలను ఆలపిస్తారు. వేడుకలు జరిగే వేదికలకు చేరువలోనే బర్న్స్ జ్ఞాపకాలను తలపోసుకుంటూ భారీస్థాయిలో విందు భోజనాలను ‘బర్న్స్ నైట్ సప్పర్’ పేరుతో నిర్వహిస్తారు. ఈ వేడుకలకు విచ్చేసే అతిథులను సంప్రదాయ బ్యాగ్‌పైపర్ వాయిద్యాలను మోగిస్తూ స్వాగతం పలుకుతారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా బర్న్స్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇంగ్లండ్, స్కాట్లండ్లలోని వివిధ నగరాల్లోని అభిమానులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన స్కాటిష్ కవి రాబర్ట్ బర్న్స్ 1759 జనవరి 25న పుట్టాడు. తన కవిత్వంతో స్కాటిష్ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. ఆయన 1796 జూలై 21న మరణించాడు. స్కాట్స్ భాషను, స్కాటిష్ కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవిదిగ్గజం రాబర్ట్ బర్న్స్ జ్ఞాపకార్థం నిర్వహించే ‘బర్న్స్ నైట్ సప్పర్’ కార్యక్రమాన్ని స్కాటిష్ పార్లమెంటు ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంగా పరిగణిస్తుంది. స్కాటిష్ పార్లమెంటు కూడా ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేస్తుంది. ఈ విందులో స్కాటిష్ బ్రోత్, పొటాటో సూప్, కల్లెన్ స్కింక్, కాక్–ఏ–లీకీ వంటి సూప్స్, గొర్రెమాంసంతో తయారుచేసే హ్యాగిస్ వంటి సంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. ఒక కవి పుట్టినరోజును మరే దేశంలోనూ ఇలా ఒక పండుగలా జరుపుకోవడం కనిపించదు. (చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..) -
వందేళ్ల నాటి కారు..హంసలా ఎంత వయ్యారంగా ఉందో తెలుసా!
అసలు పాటలో ‘హైలో హైలెస్సా! హంస కదా నా పడవ!’ అని ఉంది కదా, మరి శీర్షికలోనే ఈ ‘కారు’కూత ఏమిటను కుంటున్నారా? కాస్త ఈ ఫొటోలను చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ కారు అచ్చం హంసలా ఎంత వయ్యారంగా ఉందో చూస్తున్నారు కదా! ఇదేమీ సరికొత్త మోడల్ కాదు. వందేళ్ల కంటే మునుపటిది. బ్రిటిష్ హయాం రోజుల్లో 1900 ప్రాంతంలో కలకత్తాలో రాబర్ట్ నికోల్ స్కాటీ మాథ్యూసన్ అనే సంపన్న స్కాటిష్ దొరగారు ఉండేవారు. ఆయనగారి ఇల్లు కలకత్తా జూ పక్కనే ఉన్న స్వాన్ పార్కుకు చేరువలో ఉండేది. స్వాన్ పార్కులో తిరుగాడే హంసలను రోజూ గమనిస్తూ ఉండే మాథ్యూసన్ దొరగారికి తన కారును అచ్చం హంసలాగానే తయారు చేయించుకోవాలనే కోరిక పుట్టింది. మనసులో కోరిక పుట్టినదే తడవుగా ఇంగ్లండ్‌లోని కార్ల తయారీ సంస్థ జేడబ్ల్యూ బ్రూక్ అండ్ కంపెనీ వారికి 1909లో ఆర్డర్ చేసి, తన కోసం ఇలా ప్రత్యేకంగా హంసలాంటి కారును తయారు చేయించుకున్నాడు. ఈ కారు 1910లో కలకత్తా చేరుకుంది. అప్పట్లో ఈ కారులో మాథ్యూసన్ దొరగారు కలకత్తా వీథుల్లో విహరిస్తూ ఉంటే జనాలు కళ్లప్పగించి వింతగా చూస్తుండేవారు. ఈ కారుకు కొన్ని విచిత్రమైన ప్రత్యేకతలు కూడా ఉండేవి. ఇందులో హారన్‌కు బదులుగా ఎనిమిది పైపులతో కూడి పైప్ఆర్గాన్ కీబోర్డు ఉండేది. ఒక్కో కీ నొక్కితే ఒక్కో వింత ధ్వని వచ్చేది. కారు అడుగుభాగంలో ప్రత్యేకమైన డక్ట్ రోడ్డు మీద సున్నం వెదజల్లేది. ఇది అచ్చం హంస రెట్టలా కనిపించేది. ఇంజిన్ వేడెక్కినప్పుడు హంస మూతి నుంచి వేడినీళ్లు పిచికారీలా బయటకు వచ్చేవి. అప్పట్లో మాథ్యూసన్ ఈ కారు తయారీ కోసం దాదాపు 15 వేల పౌండ్లు ఖర్చు చేశాడు. మాథ్యూసన్ దీనిని ఎక్కువకాలం వాడకుండానే అమ్మేయాల్సి వచ్చింది. అతడి వద్ద నుంచి ఈ కారును పటియాలా పొరుగు సంస్థానమైన నభా సంస్థానం మహారాజు రిపుదమన్ సింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారు నెదర్లండ్స్‌లోని లోమన్ మ్యూజియమ్‌లో ఉంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు, నాలుగు వేల కోట్లు..) -
Poonam Gupta: వ్యాపారాన్ని ఫైల్ చేసింది!
సాధారణంగా చదువు అయి΄ోగానే వెంటనే ఉద్యోగ వేటలో పడతారు చాలామంది. మంచి ఉద్యోగం కోసం వెతికి వెతికి చివరికి చిన్నపాటి జాబ్ దొరికినా చేరి΄ోతారు. కొంతమంది మాత్రం తాము కోరుకున్న దానికోసం ఎంత సమయం అయినా ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరందరిలాగే ప్రయత్నించింది పూనమ్ గుప్తా. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దీంతో తనే ఒక వ్యాపారాన్నిప్రారంభించి వందలమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగింది. సమస్య ఏదైనా నిశితంగా ఆలోచిస్తే ఇట్టే పరిష్కారం దొరుకుతుందనడానికి పూనమ్ గుప్తానే ఉదాహరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార కుటుంబంలో పుట్టింది పూనమ్ గుప్తా. లేడీ శ్రీరామ్ కాలేజీలో ఎకనమిక్స్‌తో డిగ్రీ పూర్తి చేసిన పూనమ్.. తరువాత ఎమ్బీఏ చేసింది. చదువు అయిన వెంటనే ఉద్యోగాన్వేషణప్రారంభించింది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఇలా జాబ్ ప్రయత్నాల్లో ఉండగానే... 2002లో పునీత్ గుప్తాతో వివాహం జరిగింది. పునీత్ స్కాట్లాండ్లో స్థిరపడడంతో పూనమ్ కూడా భర్తతో అక్కడికే వెళ్లింది. పెళ్లి అయినా.. దేశం మారినా పూనమ్ మాత్రం ఉద్యోగ ప్రయత్నాన్ని మానుకోలేదు. ఎలాగైనా జాబ్ చేయాలన్న కోరికతో అక్కడ కూడా ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. అనుభవం లేదని ఒక్కరూ ఉద్యోగం ఇవ్వలేదు. స్కాట్లాండ్లో అయినా జాబ్ దొరుకుతుందనుకున్న ఆశ నిరాశగా మారింది. అలా వచ్చిన ఆలోచనే... ఉద్యోగం కోసం వివిధ ఆఫీసులకు వెళ్లిన పూనమ్‌కు.. అక్కడ కట్టలు కట్టలుగా పేర్చిన ఫైళ్లు కనిపించేవి. ఉద్యోగం దొరకక సొంతంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ ఫైళ్లను రీసైక్లింగ్ చేయవచ్చు గదా. అన్న ఐడియా వచ్చింది. పేపర్‌ను రీసైక్లింగ్ ఎలా చేయాలి, ఈ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను క్షుణ్ణంగా తెలుసుకుని కంపెనీ పెట్టాలని నిర్ణయించుకుంది. స్కాటిష్ ప్రభుత్వం ఓ పథకం కింద ఇచ్చిన లక్షరూపాయల రుణంతో 2003లో ‘పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్’ కంపెనీని పెట్టింది.ప్రారంభంలో యూరప్, అమెరికాల నుంచి పేపర్ వ్యర్థాలను కొని రీసైక్లింగ్ చేసేది. రీసైక్లింగ్ అయిన తరువాత నాణ్యమైన పేపర్‌ను తయారు చేసి విక్రయించడమే పూనమ్ వ్యాపారం. ఏడాదికేడాది టర్నోవర్‌ను పెంచుకుంటూ కంపెనీ విలువ ఎనిమిది వందల కోట్లకు పైకి చేరింది. ప్రస్తుతం అరవై దేశాల్లో పీజీ పేపర్స్ వ్యాపారాన్ని విస్తరించింది. అమెరికా, చైనా, ఇండియా, ఈజిప్టు, స్వీడన్లలో సొంతకార్యాలయాలు ఉన్నాయి. పూనమ్‌కు అండగా... పీజీ పేపర్స్‌ని పూనమ్ ప్రారంభించిన రెండేళ్లకు భర్త పునీత్‌గుప్తా కూడా ఎనభై లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి కంపెనీలో చే రారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్యాపారాభివృద్ధికి కృషిచేశారు. దీంతో అనతి కాలంలోనే పీజీ పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. పేపర్ ట్రేడింగ్ కంపెనీతోపాటు డెంటల్ హెల్త్ వంటి వ్యాపారాల్లోనూ పూనమ్ రాణిస్తోంది. అందరూ అదర్శమే... ‘‘నాకు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు. ఒక్కోక్కరి నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకుని ఈ స్థాయికి ఎదిగాను. నాన్న, మామయ్య, టీచర్స్ నన్ను చాలా ప్రభావితం చేశారు. పెద్దయ్యాక మదర్ థెరిసా, ఇందిరా గాంధీ వంటి వారు మహిళలు ఏదైనా చేయగలరని నిరూపించి చూపించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకెళ్తూ విజయాలు సాధిస్తున్నాను’’. – పూనమ్ గుప్తా -
మెనోపాజ్‌పై బాస్ ఛీప్ కామెంట్లు..!
లండన్: మెనోపాజ్‌ను సాకుగా చూపుతూ సరిగా పని చేయడం లేదని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బాస్ మీద కేసు పెట్టి రూ.37 లక్షల పరిహారం పొందిందో మహిళ. ఈ ఉదంతం స్కాట్లాండ్లో జరిగింది. కరెన్ ఫర్కార్సన్ అనే 49 ఏళ్ల మహిళ ఒక స్థానిక ఇంజనీరింగ్ సంస్థలో 1995 నుంచీ పని చేస్తోంది. మెనోపాజ్ దశ కారణంగా ఆందోళన, మెదడు ఉన్నట్టుండి మొద్దుబారడం వంటివాటి లక్షణాలతో బాధ పడుతున్నట్టు బాస్‌కు చెప్పింది. విపరీతంగా బహిష్టు స్రావం అవుతుండటం, బయట విపరీతంగా మంచు కురుస్తుండటంతో రెండు రోజులు ఇంటి నుంచి పని చేసింది. మర్నాడు ఆఫీస్‌కు వెళ్లగానే, ’పర్లేదే, వచ్చావు’ అంటూ బాస్ వ్యంగ్యంగా అన్నాడు. తన సమస్య గురించి మరోసారి వివరించినా, ’నొప్పులు, బాధలు అందరికీ ఉండేవే’అంటూ కొట్టిపారేశాడు. దాంతో ఆమె రాజీనామా చేసి కంపెనీపై కేసు పెట్టింది. తన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదన్న బాస్ వాదనను ట్రిబ్యునల్ కొట్టిపారేసింది. అతనిలో ఏ మాత్రమూ పశ్చాత్తాపం కనిపించడం లేదంటూ ఆక్షేపించి పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. -
యూకే గురుద్వారాలో భారత హైకమిషనర్ అడ్డగింత
లండన్: ఖలిస్తాన్ సానుభూతిపరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కెనడాతో ఖలిస్తాన్ అంశంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే అవి యూకేకు కూడా పాకాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఒక గురుద్వారాలోకి వెళ్లకుండా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అతివాదులు అడ్డుకున్నారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ (టీఎఫ్సీ) హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్లో ఖలిస్తానీ సిక్కు యువత రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో ఉన్న దొరైస్వామి అల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గోలో గురుద్వారా గురు గ్రంథ సాహిబ్ కమిటీ సభ్యులతో సమావేశమవడానికి శుక్రవారం వచ్చారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఖలిస్తానీ యువత ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురుద్వార సిబ్బందిని కూడా వారు బెదిరించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకే భారత హైకమిషనర్ అక్కడికి వచ్చినా సిక్కు యువకులు వారిని అడ్డుకున్నారు. ఇద్దరు యువకులు విక్రమ్ దొరైస్వామి కూర్చున్న కారు తలుపుని తీయడానికి ప్రయత్నించారు. దీంతో మరింత ఘర్షణని నివారించడానికి దొరైస్వామి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అడ్డుకోవడం అవమానకరం దొరైస్వామి కాన్వాయ్‌ని ఖలిస్తానీ సానుభూతిపరు లు అడ్డుకోవడాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి దీనిని తీసుకువెళ్లింది. మరోవైపు లండన్‌లో భారత హైకమిషన్ ఈ చర్యను ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ మండిపడింది. బ్రిటన్ ప్రభుత్వానికి, పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. -
స్కాట్లాండ్ లో కుటుంబంతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్న మహేష్ బాబు (ఫొటోలు)
-
వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. టాలీవుడ్ ప్రిన్స్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్న నమ్రత ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన నమ్రత సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీతో స్కాట్లాండ్లో టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. (ఇది చదవండి: హీరోయిన్గా మారిన ‘విక్రమార్కుడు’ చైల్డ్ ఆర్టిస్ట్) స్కాట్లాండ్లోని అతి పురాతనమైన రాయల్ స్కాట్స్ అండ్ ది రాయల్ రెజిమెంట్ మ్యూజియాన్ని సందర్శించారు. చారిత్రాత్మక మ్యూజియంలో తన పిల్లలు సితార, గౌతమ్‌తో దిగిన ఫోటోలను నమ్రత పంచుకుంది. కాగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ సరసన పెళ్లి సందడి భామ శ్రీలీల కనిపించనుంది. అంతకుముందు పూజా హెగ్డేను ఎంపిక చేయగా.. పలు కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. (ఇది చదవండి: మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది: నమ్రత పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
స్కాట్లాండ్ యువకుడితో తెలుగమ్మాయి ప్రేమ
రాజంపేట: స్కాట్లాండ్ దేశానికి చెందిన మాథ్యూస్, అన్నమయ్య జిల్లా కారంపల్లెకు చెందిన నీమకల్లు సోనియారెడ్డి ప్రేమించుకున్నారు. త్వరలో పెద్దల సమక్షంలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. వివరాల్లోకి వెళితే...కారంపల్లె గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కుమార్తె నీమకల్లు కౌసల్యరెడ్డి యూకేలో స్థిరపడ్డారు. ఆమె కుమార్తె సోనియారెడ్డి యూకేలోనే మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ జనరల్ ప్రాక్టీషనర్ విద్య పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో మాథ్యూస్ అనే వ్యక్తితో ఆమెకు స్నేహం ఏర్పడింది. ఆయన కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్యను అభ్యసించి వ్యాపార రంగంలో ఉన్నారు. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరువురు పెద్దలు అంగీకరించారు. ఈ నెల 7న సంప్రదాయబద్ధంగా హైదరాబాద్‌లో వీరు పెళ్లి చేసుకోనున్నారు. వివాహానికి ఇరుకుటుంబాలు కారంపల్లికి చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. విదేశీయులతో స్థానికులు ముచ్చటించడం ఆకట్టుకుంది. తెలుగువారి సంప్రదాయాలు తమకు నచ్చాయని వారు చెబుతున్నారు. -
టీ20 వరల్డ్‌కప్ 2024కు కొత్తగా అర్హత సాధించిన మూడు జట్లు ఇవే..!
వచ్చే ఏడాది వెస్టిండీస్, యూఎస్ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు కొత్తగా మూడు జట్లు అర్హత సాధించాయి. యూరప్, ఈస్ట్ ఏసియా పసిఫిక్ రీజియన్స్ క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ జట్లు తాజాగా ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే మెగా టోర్నీలో పై పేర్కొన్న మూడు దేశాలు 13, 14, 15వ జట్లుగా బరిలోకి దిగుతాయి. టీ20 వరల్డ్‌కప్ 2024 నిబంధనల ప్రకారం.. తొమ్మిదో ఎడిషన్ ప్రపంచకప్ కోసం ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్‌లో టాప్-8లో నిలిచిన జట్లు (డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్).. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. తాజాగా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ 13, 14, 15 స్థానాలకు క్వాలిఫై కాగా.. మరో 5 స్థానాల కోసం వివిధ రీజియన్లలో పోటీ నడుస్తుంది. ప్రస్తుతం ఆసియా క్వాలిఫయర్-బి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మలేసియా, థాయ్‌లాండ్, భూటాన్, చైనా, మయన్మార్ వరుస స్థానాల్లో ఉన్నాయి. -
యూకేలో మొట్టమొదటిసారిగా అష్టావధానం
ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK)లో మొట్టమొదటిసారిగా అష్టావధానం నిర్వహించారు. ప్రణవ పీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచేతుల మీదుగా జులై 9న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతి వలె ఏడుకొండలతో విరాజిల్లుతున్న ఎడింబరో నగరం ఈ కార్యక్రమానికి వేదికయ్యింది. వందలాది మంది తెలుగు ఎన్నారైలు ఈ వేడుకను తిలకించారు.స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ శ్రీమతి మైథిలి కెంబూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయకుడు కుమార్ అనీష్ కందాడ ప్రార్థనా గీతం ఆలపించగా, పల్లవి మంగళంపల్లి తన మధురమైన గాత్రంతో అలరించింది. కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకర్‌ను పట్టుశాలువా, పూల మాలలు, సన్మాన పత్రంతో సత్కరించారు. -
క్వాలిఫయర్స్ టీమ్ ఆఫ్ ది టోర్నీ ప్రకటన.. విండీస్ నుంచి ఒక్కరు కూడా లేరు
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నీని ఐసీసీ కొద్ది సేపటి కిందట ప్రకటించింది. ఈ జట్టులో టోర్నీ విజేత శ్రీలంక నుంచి ముగ్గురు, రన్నరప్ నెదర్లాండ్స్ నుంచి ముగ్గురు, టోర్నీ ఆధ్యాంతం సూపర్‌గా రాణించిన జింబాబ్వే నుంచి ముగ్గురు, సంచలన విజయాలు నమోదు చేసిన స్కాట్లాండ్ నుంచి ఇద్దరు చొప్పున ప్లేయర్లను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ జట్టులో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. సూపర్ సిక్స్ దశలో విండీస్ ఐదో స్థానానికి పరిమితం కావడంతో ఐసీసీ ఆ జట్టును పరిగణలోకి తీసుకోలేదు. బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (7 మ్యాచ్‌ల్లో 350 పరుగులు, 2 సెంచరీలు), షాయ్ హోప్ (7 మ్యాచ్‌ల్లో 341 పరుగులు, సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) సత్తా చాటినా, వీరిని సైతం ఐసీసీ విస్మరించింది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (శ్రీలంక, 417 పరుగులు, 2 సెంచరీలు), విక్రమ్‌జీత్ సింగ్ (నెదర్లాండ్స్, 326, సెంచరీ)లను ఎంపిక చేసిన ఐసీసీ.. వన్‌డౌన్‌లో బ్రాండెన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్, 364, 2 సెంచరీలు, 13 వికెట్లు), నాలుగో స్థానంలో క్వాలిఫయర్స్ టాప్ స్కోరర్ సీన్ విలియమ్స్ (జింబాబ్వే, 600, 3 సెంచరీలు), ఐదో స్థానంలో యువ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ (నెదర్లాండ్స్, 285, సెంచరీ, 15 వికెట్లు), ఆరో ప్లేస్‌లో సికందర్ రజా (జింబాబ్వే, 325, సెంచరీ, 9 వికెట్లు), ఏడో స్థానంలో స్కాట్ ఎడ్వర్డ్స్ (నెదర్లాండ్స్, 314, 4 అర్ధసెంచరీలు), స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా క్వాలిఫయర్స్ లీడింగ్ వికెట్ టేకర్లు హసరంగ (22 వికెట్లు), తీక్షణ (21) (శ్రీలంక), ఫాస్ట్ బౌలర్లుగా క్రిస్ సోల్ (స్కాట్లాండ్, 11 వికెట్లు), రిచర్డ్ నగరవ (జింబాబ్వే, 14 వికెట్లు)లను ఎంపిక చేసింది. ఈ జట్టుకు కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్‌గా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ను ఎంపిక చేసింది. -
#BasDeLeede: తండ్రికి తగ్గ తనయుడు..
ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ జట్టు ఐదోసారి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 1996, 2003, 2007, 2011లో నాలుగుసార్లు డచ్ జట్టు వన్డే వరల్డ్‌కప్ ఆడింది. ఈ నాలుగు సందర్భాల్లో మూడుసార్లు తన జట్టును వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అతనే టిమ్ డీ లీడే.. ఈ పేరు మీకు ఎక్కువగా పరిచయం లేకపోవచ్చు. కానీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం సూపర్ సిక్స్‌లో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒకడి పేరు బాగా మార్మోగిపోయింది. అతనే బాస్ డీ లీడే. బౌలింగ్‌లో ఐదు వికెట్లు.. బ్యాటింగ్‌లో 123 పరుగులు వీరోచిత సెంచరీ.. వెరసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తన జట్టును వన్డే వరల్డ్‌కప్ ఆడే అర్హతను సాధించిపెట్టాడు. 278 పరుగులు లక్ష్యాన్ని కేవలం 42.5 ఓవర్లలోనే చేధించిన డచ్ జట్టు క్వాలిఫయర్-2గా.. పదో జట్టుగా వన్డే వరల్డ్‌కప్‌లోకి అడుగుపెట్టింది. మరి ఒంటిచేత్తో నెదర్లాండ్స్‌ను వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేలా చేసిన బాస్ డీ లీడే.. ఎవరో కాదు.. పైన మనం చెప్పుకున్న టిమ్ డీ లీడే కుమారుడే. బాస్ డీ లీడే తన వీరోచిత పోరాటంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ నెదర్లాండ్స్ వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు అర్హత సాధించిపెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక టిమ్ డీ లీడే 1996లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 11 ఏళ్ల కెరీర్లో కేవలం వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన టిమ్ డీ లీడే 29 మ్యాచ్‌ల్లో 400 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 2018లో నేపాల్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బాస్ డీ లీడే అనతికాలంలోనే మంచి పేరు సంపాదించాడు. మిడిలార్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే బాస్ డీ లీడే మంచి బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 30 వన్డేల్లో 765 పరుగులతో పాటు 24 వికెట్లు, 31 టి20ల్లో 610 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 27 వికెట్లు పడగొట్టాడు. కాగా స్కాట్లాండ్తో మ్యాచ్‌లో విజయం అనంతరం ఐసీసీ నెదర్లాండ్స్‌కు అభినందనలు తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేసిది. ఆ ఫోటోలో బాస్ డీ లీడే.. తన తండ్రి టిమ్ డీ లీడేను గుర్తుచేస్తూ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. ఇదే విషయాన్ని ఐసీసీ వివరిస్తూ తండ్రికి తగ్గ తనయుడు.. బాస్ డీ లీడే సన్నాఫ్ టిమ్ డీ లీడే అంటూ క్యాప్షన్ జత చేసింది. Tim de Leede, Bas de Leede 🏏 Like father, like son 🇳🇱 #CWC23 More: https://t.co/qguNPPA8ai pic.twitter.com/KGECQ1yt5s — ICC (@ICC) July 7, 2023 చదవండి: #NED Vs SCO: ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత Bas De Leede: సెంచరీ హీరో ప్రపంచ రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు! దిగ్గజం సరసన.. -
ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో
CWC Qualifiers 2023: వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు నెదర్లాండ్స్ తమ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై తప్పనిసరిగా గెలవాలి. లక్ష్యం 278 పరుగులు... అదీ 44 ఓవర్లలో సాధిస్తేనే బెర్త్ దక్కుతుంది. అంతకంటే ఒక్క బంతి ఎక్కువ తీసుకొని మ్యాచ్ గెలిచినా లాభం లేదు. స్కాట్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తక్కువ వ్యవధిలో ఒక్కో వికెట్ కోల్పోతూ వచ్చిన జట్టు ఒక దశలో 163/5 వద్ద నిలిచింది. 79 బంతుల్లోనే మరో 115 పరుగులు కావాలి. ఇలాంటి స్థితిలో బాస్ డి లీడె ఒక్కసారిగా చెలరేగిపోయాడు. తర్వాతి 40 బంతుల్లోనే 76 పరుగులు సాధించి జట్టుకు సంచలన విజయం అందించాడు. డి లీడె శతకానికి తోడు జుల్ఫికర్ అండగా నిలవడంతో నెదర్లాండ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరి ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ‘సూపర్ సిక్స్’ దశలో జింబాబ్వేను ఓడించి ఆ జట్టును వరల్డ్ కప్‌కు దూరం చేసి తమ అవకాశాలు మెరుగుపర్చుకున్న స్కాట్లాండ్ అనూహ్య ఓటమితో నిష్క్రమించింది. వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించడం ఇది ఐదోసారి. 2011 తర్వాత మళ్లీ భారత్‌లోనే ఆ జట్టు బరిలోకి దిగుతోంది. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం 2003 వన్డే వరల్డ్ కప్... పార్ల్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 68 పరుగుల తేడాతో ఓడింది. అయితే సచిన్ టెండూల్కర్ సహా 4 వికెట్లు తీసిన టిమ్ డి లీడె ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతని కొడుకే ఈ బాస్ డి లీడె. టోర్నీ ఆసాంతం నిలకడైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతను జట్టును ముందుకు నడపడంలో కీలకపాత్ర పోషించాడు. 285 పరుగులు చేయడంతో పాటు డి లీడె 15 వికెట్లు పడగొట్టడం విశేషం. ప్రధాన ఆటగాళ్లు తప్పుకొన్నా.. కౌంటీల్లో ఒప్పందాల కారణంగా పలువురు ప్రధాన ఆటగాళ్లు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నా... డి లీడె మాత్రం రెండిటిలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్నే ఎంచుకున్నాడు. సీనియర్లు లేకపోయినా స్ఫూర్తిదాయక ఆటతో డచ్ బృందం సత్తా చాటింది. గ్రూప్ దశలో జింబాబ్వే చేతిలో ఓడినా అమెరికా, నేపాల్‌పై సునాయాస విజయాలు సాధించింది. విండీస్‌తో మ్యాచ్ ఆ జట్టు స్థాయిని చూపించింది. 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ తడబడకుండా స్కోరు సమం చేయగలిగింది. తేజ అద్భుతంగా ఆడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తేజ నిడమనూరు అద్భుత సెంచరీతో చెలరేగగా, కీలకమైన సూపర్ ఓవర్లో వాన్ బీక్ 30 పరుగులు కొట్టి జట్టును గెలిపించాడు. ‘సూపర్ సిక్స్’ దశలో ఒమన్‌పై భారీ విజయం జట్టుకు మేలు చేయగా, ఇప్పుడు స్కాట్లాండ్పై గెలుపు ఆ జట్టును ప్రధాన టోరీ్నకి చేర్చింది. 4 అర్ధ సెంచరీలు చేసిన స్కాట్ ఎడ్వర్డ్స్, మరో సెంచరీ చేసిన విక్రమ్‌జిత్ సింగ్‌తో పాటు బౌలింగ్‌లో వాన్ బీక్, ర్యాన్ క్లీన్ కీలక పాత్ర పోషించారు. ‘భారత గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది నా కల’ అని తేజ కొన్నాళ్ల క్రితం ‘సాక్షి’తో ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు అతను భారత్‌పైనే వరల్డ్ కప్ మ్యాచ్ ఆడబోతుండటం విశేషం. నవంబర్ 11న బెంగళూరులో భారత్‌తో తలపడే నెదర్లాండ్స్... అక్టోబర్ 6న తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో హైదరాబాద్‌లో ఆడుతుంది. చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్‌కప్ రేసు నుంచి జింబాబ్వే ఔట్.. స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మధ్య పోటీ
బులవాయో: తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడటంతో... జింబాబ్వే జట్టు వరుసగా రెండోసారి వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించలేకపోయింది. వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం స్కాట్లాండ్ జట్టుతో జరిగిన తమ ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా స్కాట్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 234 పరుగులు సాధించింది. మైకేల్ లీస్క్ (48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూ క్రాస్ (38; 2 ఫోర్లు), బ్రెండన్ మెక్‌ములెన్ (34; 6 ఫోర్లు) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు, చటారా రెండు వికెట్లు తీశారు. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. రియాన్ బర్ల్ (83; 8 ఫోర్లు, 1 సిక్స్), సికందర్ రజా (34; 2 ఫోర్లు, 1 సిక్స్), మధెవెరె (40; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ సోల్ (3/33) జింబాబ్వేను దెబ్బ కొట్టాడు. మెక్‌ములెన్, లీస్క్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 2019లోనూ జింబాబ్వే క్వాలిఫయింగ్ టోర్నీలోనే వెనుదిరిగింది. జింబాబ్వేపై విజయంతో స్కాట్లాండ్ దాదాపుగా ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈనెల 6న నెదర్లాండ్స్‌తో జరిగే తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మెగా ఈవెంట్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ ఓడిపోయినా నెదర్లాండ్స్ కంటే రన్‌రేట్ తక్కువ కాకుండా చేసుకుంటే స్కాట్లాండ్‌కే ప్రపంచకప్ బెర్త్ ఖరారవుతుంది. నెదర్లాండ్స్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే స్కాట్లాండ్పై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. కాగా, క్వాలిఫయర్స్‌లో అజేయంగా ఉన్న శ్రీలంక, భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
రెండు ప్రపంచకప్‌లలో ఎదురేలేని గెలుపు! కానీ ఇప్పుడు.. విండీస్ దుస్థితికి కారణాలివే
వెస్టిండీస్... ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు. కరీబియన్ బౌలింగ్ అంటేనే బ్యాటర్లు బెంబేలెత్తేవారు. తొలి రెండు ప్రపంచకప్ (1975, 1979) టోర్నీలను ఎదురేలేకుండా గెలుచుకుంది. మూడో ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అయితే ఇది గతం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జట్టు ఇప్పుడు భారత్‌కు రావడం లేదన్నది వర్తమానం. అంటే వన్డే ప్రపంచకప్‌కు కరీబియన్ జట్టు దూరమైంది. క్వాలిఫయింగ్ దశలోనే ఇంటికెళ్లనుంది. ఇది విండీస్ అభిమానులకే కాదు... క్రికెట్ విశ్లేషకులకు పెద్ద షాక్! ICC Cricket World Cup Qualifiers 2023- హరారే: వెస్టిండీస్ ప్రపంచకప్ ముచ్చట జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయర్స్‌లోనే ముగిసిపోయింది. వన్డే మెగా టోరీ్నలో ఆడే అర్హత కోల్పోయింది. ‘సూపర్ సిక్స్’ దశలో స్కాట్లాండ్ చేతిలో పరాభవంతో కరీబియన్ జట్టు ని్రష్కమణ అధికారికంగా ఖరారైంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఏడు వికెట్ల తేడాతో విండీస్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో బ్రాండన్ కింగ్ (22 బంతుల్లో 22; 5 ఫోర్లు) రెండు పదుల స్కోరు చేస్తే మిగతా ఇద్దరు చార్లెస్ (0), బ్రూక్స్ (0) ఖాతానే తెరువలేదు. కెప్టెన్ షై హోప్ (13), కైల్ మేయర్స్ (5) చెత్తగానే ఆడారు. 60 పరుగులకే టాప్–5 వికెట్లను కోల్పోయిన విండీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో నికోలస్ పూరన్ (43 బంతుల్లో 21; 2 ఫోర్లు) పెద్దగా మెప్పించలేదు. తలరాతను తలకిందులు చేశాడు షెఫర్డ్ (43 బంతుల్లో 36; 5 ఫోర్లు)తో కలిసిన హోల్డర్ (79 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఏడో వికెట్‌కు 77 పరుగులు జోడించి ఆదుకున్నాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మెక్‌ములెన్ 3, క్రిస్ సోల్, మార్క్‌వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలిచింది. ఓపెన్ మాథ్యూ క్రాస్ (107 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు), మెక్‌ములెన్ (106 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించి విండీస్ ‘కప్’ రాతను కాలరాశారు. కరీబియన్‌కు ఎందుకీ దుస్థితి? జింబాబ్వేకు వచి్చన వెస్టిండీస్ జట్టులోని సభ్యుల్లో ప్రపంచకప్‌కు అర్హత సాధించాలి... భారత్‌కు వెళ్లాలి అన్న కసి, పట్టుదల కనిపించనే లేదు. అవే ఉంటే ఫీల్డింగ్ ఇంత ఘోరంగా చేయరు. బౌలింగ్ ఎంత పేలవం అంటే... నెదర్లాండ్స్‌తో కీలకమైన సూపర్ ఓవర్లో బౌండరీలు దాటే ఆరు బంతులు (4, 6, 4, 6, 6, 4; హోల్డర్ బౌలర్) వేయరు. నిలకడేలేని బ్యాటింగ్‌తో ఆడరు. ఇలా అన్ని రంగాల్లో చెత్త ప్రదర్శన వల్లే రెండుసార్లు ‘విజేత’ తాజా ‘అనర్హత’ అయ్యింది. ఇప్పుడు మిగతా ‘సూపర్ సిక్స్’ దశలో ఒమన్, శ్రీలంకలతో ఆడి ఇంటికెళ్లిపోవడమే మిగిలింది. వెస్టిండీస్ అంటేనే ఒకప్పుడు అరివీర భయంకర బౌలర్లు, దంచికొట్టే బ్యాటింగ్ ఆజానుబాహులు గుర్తొచ్చేవారు. కానీ ప్రస్తుతం నామమాత్రంగా జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్లు... ఫ్రాంచైజీ లీగ్‌ల్లో మాత్రం మెరిపించే వీరులు కనబడుతున్నారు. విండీస్ బోర్డు కుమ్ములాటలు, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులపై తరచూ పేచీలతో స్టార్ ఆటగాళ్లంతా టీమ్ స్పిరిట్ మరిచి వ్యక్తిగతంగా కలిసొచ్చే టి20 లీగ్‌లపై కష్టపడటం నేర్చారు. దీంతో అసలైన సంప్రదాయ క్రికెట్ (టెస్టు), పరిమిత ఓవర్ల ఆట (వన్డే)లను పట్టించుకోవడం మానేశారు. జట్టుగా పట్టుదలతో ఆడటం అనే దాన్నే మర్చిపోయారు. ఇప్పుడు కరీబియన్ ఆటగాళ్లంతా ఐసీసీ తయారు చేసిన భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)ను పూర్తి చేస్తున్నారు. కానీ విండీస్ భవిష్యత్తుకు అవసరమైన షెడ్యూల్‌ను ఎప్పుడో పక్కన బెట్టేశారు. అందువల్లే వెస్టిండీస్ జట్టుకు ఈ దుస్థితి దాపురించింది. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్ -
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్
ICC Cricket World Cup Qualifiers 2023- Scotland Beat West Indies by 7 wkts: ‘‘ఆది నుంచే మా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. ఈ టోర్నీ సవాలుతో కూడుకున్నదని తెలుసు. నిజానికి ఈ మ్యాచ్‌లో మేము టాస్ గెలిస్తే బాగుండేది. ఇలాంటి పిచ్ మీద ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగే ఎంచుకుంటాడు. ఆ విషయంలో మాకేదీ కలిసిరాలేదు. క్యాచ్‌లు వదిలేయడాలు, మిస్‌ఫీల్డింగ్ తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆటలో ఇవన్నీ సహజమే! కానీ ప్రతిసారీ వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టలేము కదా! ఆటలో ఇవన్నీ సహజమే! వాస్తవానికి టోర్నీ ఆరంభానికి ముందే.. స్వదేశంలోనే మేము పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సింది. సరైన సన్నాహకాలు లేకుండా నేరుగా వెళ్లి గొప్పగా ఆడాలంటే అన్నివేళలా కుదరకపోవచ్చు. గెలవాలనే పట్టుదల, కసి మిగిలిన మ్యాచ్‌లలో గెలిచైనా మా అభిమానులకు కాస్త వినోదం పంచుతాం. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువ లేదు. కానీ నిలకడగా ఆడలేకపోవడమే మా కొంపముంచింది. స్కాట్లాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా వాళ్ల బౌలర్లు మెరుగ్గా రాణించారు. గెలవాలనే పట్టుదల, కసి వారిలో కనిపించాయి. మేము వాళ్లను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. తిరిగి వెళ్లిన తర్వాత డారెన్ సామీతో కలిసి మా జట్టులోని లోపాలను సరిచేసుకోవడంపై దృష్టి సారిస్తాం’’ అని వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. స్కాట్లాండ్ చేతిలో ఓడి రెండుసార్లు చాంపియన్ అయిన విండీస్ జట్టు వన్డే వరల్డ్‌కప్-2023లో క్వాలిఫయర్స్‌లోనే ఇంటిబాట పట్టింది. జింబాబ్వేలో జరిగిన సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్‌కప్ రేసు నుంచి అవుట్ తద్వారా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2023లో అడుగుపెట్టే అర్హత కోల్పోయింది. మాజీ చాంపియన్ ఇలా అవమానకరరీతిలో నిష్క్రమించడం అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తోంది. మా ఓటమికి ప్రధాన కారణం అదే ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విండీస్ సారథి షాయీ హోప్ మాట్లాడుతూ.. టాస్ ఓడిపోవడం తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. హరారేలో శనివారం నాటి మ్యాచ్‌లో తాము తొలుత బ్యాటింగ్ చేయాల్సి రావడంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఓటమికి పరోక్షంగా టాస్ ఓడటమే కారణమని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో స్కాట్లాండ్ బౌలర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించిన హోప్.. తమ జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. టోర్నీ మొత్తం తమకు నిరాశనే మిగిల్చిందని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా సూపర్ సిక్సెస్‌లో విండీస్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జూలై 5న ఒమన్, జూలై 7న శ్రీలంకతో వెస్టిండీస్ తలపడాల్సి ఉంది. ఈ రెండు నామమాత్రపు మ్యాచ్‌లలో గెలిచైనా గౌరవప్రదంగా స్వదేశానికి తిరిగి వెళ్లాలని కరేబియన్ జట్టు భావిస్తోంది. స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు: టాస్: స్కాట్లాండ్- బౌలింగ్ వెస్టిండీస్- 181 (43.5) స్కాట్లాండ్- 185/3 (43.3) విజేత: ఏడు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రాండన్ మెక్‌ములెన్ (3 వికెట్లు, 69 పరుగులు). చదవండి: పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే! పసికూన చేతిలో చిత్తు! వరల్డ్‌కప్ నుంచి అధికారికంగా అవుట్ -
ఎదురులేని లంక.. గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోరులో శ్రీలంక జట్టుకు ఎదురులేకుండా పోయింది. గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన చివరి మ్యాచ్‌లో లంక జట్టు 82 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. నాలుగింటికి నాలుగ విజయాలు సాధించిన లంక 8 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను దాదాపు ఖరారు చేసుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 85 బంతుల్లో 75 పరుగులు చేయగా.. చరిత్ అసలంక 65 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. వీరిద్దరు మినహా మిగతావారిలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వాట్ మూడు, క్రిస్ సోల్ రెండు, ఎవన్స్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి స్కాట్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. క్రిస్ గ్రీవ్స్ ఒక్కడే 56 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో స్కాట్లాండ్ 29 ఓవర్లలోనే 163 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లలో మహీష్ తీక్షణ మూడు వికెట్లతో రాణించగా.. హసరంగా రెండు, కాసున్ రజిత, లాహిరు కుమారా, దాసున్ షనకలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే గ్రూప్-బి నుంచి లంకతో పాటు స్కాట్లాండ్, ఒమన్‌లు సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయ్యాయి. అయితే లీగ్స్టేజీ సహా సూపర్ సిక్స్‌లో సాధించే పాయింట్ల ఆధారంగా ఒక జట్టు మాత్రమే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుంది. ఈ విషయంలో లంక గ్రూప్-బి నుంచి ముందు వరుసలో ఉంది. Sri Lanka bag two crucial points against Scotland going into the Super Six stage of the #CWC23 Qualifier 👏#SLvSCO: https://t.co/FCKWkeNT75 pic.twitter.com/RUq8S7nR7l — ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023 Spinning a web 🕸️ For his figures of 3/41, Maheesh Theekshana is the @aramco #POTM from #SLvSCO 🙌 #CWC23 pic.twitter.com/tjbIXmvjsS — ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023 చదవండి: ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
ఘన కీర్తి కలిగిన వెస్టిండీస్‌కు ఘోర అవమానం.. వరల్డ్‌కప్ అవకాశాలు గల్లంతు..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో నిన్న (జూన్ 26) జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ 2023 వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ ఓటమితో విండీస్ ఖాళీ ఖాతాతో సూపర్ సిక్స్‌కు అడుగుపెట్టనుంది. తద్వారా ఫైనల్‌కు చేరే ఛాన్స్‌తో పాటు వరల్డ్‌కప్ అవకాశాలను ఆవిరి చేసుకుంది. సూపర్ సిక్స్‌కు పాయింట్లు ఎలా..? సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయిన జట్టు తమతో పాటు ఆ దశకు చేరుకున్న మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే, మ్యాచ్‌కు రెండు పాయింట్ల చొప్పున 4 పాయింట్లు.. ఒక జట్టుపై గెలిచి మరో జట్టు చేతిలో ఓడితే 2 పాయింట్లు.. రెండు జట్ల చేతిలో ఓడితే పాయింట్లు ఏమీ లేకుండా సూపర్ సిక్స్ దశలో అడుగుపెడతుంది. జింబాబ్వే 4, నెదర్లాండ్స్ 2, వెస్టిండీస్ 0 గ్రూప్-ఏ నుంచి సూపర్ సిక్స్‌కు చేరుకున్న మూడు జట్లలో ప్రస్తుతం జింబాబ్వే ఖాతాలో 4 పాయింట్లు,నెదర్లాండ్స్ ఖాతాలో 2 పాయింట్లు, వెస్టిండీస్ ఖాతాలో 0 పాయింట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, నెదర్లాండ్స్‌లపై విజయాలు సాధించడంతో జింబాబ్వే ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. జింబాబ్వే చేతిలో ఓడి, నిన్నటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించడంతో నెదర్లాండ్స్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడటంతో వెస్టిండీస్ పాయింట్లు ఏమీ లేకుండానే సూపర్ సిక్స్ దశలో పోటీపడుతుంది. గ్రూప్-బి నుంచి ఏ జట్టు ఎన్ని పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుంది..? గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ జట్లు సూపర్ సిక్స్‌కు చేరుకున్నాయి. అయితే శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య ఇవాళ (జూన్ 27) జరుగబోయే మ్యాచ్‌తో ఏ జట్టు ఎన్ని పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుందో తేలిపోతుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే 4 పాయింట్లు, స్కాట్లాండ్ గెలిస్తే 2 పాయింట్లు.. శ్రీలంక, స్కాట్లాండ్ చేతుల్లో ఓడింది కాబట్టి ఒమన్ 0 పాయింట్లతో తదుపరి దశలో పోటీపడతాయి. సూపర్ సిక్స్ దశలో ఎలా..? గ్రూప్ దశలో సాధించిన అదనపు పాయింట్లతో (4 లేదా 2 లేదా 0) ప్రతి జట్టు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటుంది. ఈ దశలో ఓ గ్రూప్‌లోని ఓ జట్టు మరో గ్రూప్‌లోని 3 జట్లతో ఒక్కో మ్యాచ్ అడుతుంది. అన్ని జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడిన తర్వాత టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరతాయి. అలాగే ఈ రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ వరల్డ్‌కప్ ఆశలు ఆవిరి.. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్, జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లు కలిగిన వెస్టిండీస్ జట్టు.. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా ఆవిరి చేసుకుంది. పాయింట్లు ఏమీ లేకుండా సూపర్ సిక్స్ దశకు చేరిన ఆ జట్టు.. ఈ దశలో ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా 6 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. మరోవైపు జింబాబ్వే ఇప్పటికే 4 పాయింట్లు సాధించగా.. శ్రీలంక, స్కాట్లాండ్లతో ఏదో ఒక జట్లు 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుతుంది. గ్రూప్-ఏలో నెదర్లాండ్స్ ఇదివరకు 2 పాయింట్లు సాధించగా.. శ్రీలంక, స్కాట్లాండ్లతో ఓ జట్టు 2 పాయింట్లు ఖాతాలో పెట్టుకుని సూపర్ సిక్స్‌లో పోటీపడుతుంది. 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు రెండు మ్యాచ్‌లు గెలిచినా 8 పాయింట్లతో ఫైనల్‌కు చేరుకుంటాయి. ఇది కాదని విండీస్ సూపర్ సిక్స్ దశలో క్వాలిఫయర్స్‌లో తమకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన శ్రీలంక, స్కాట్లాండ్లతో తలపడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా సంచలనం నమోదైతే తప్ప విండీస్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేదు. -
CWC Qualifier 2023: సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు, తదుపరి షెడ్యూల్ వివరాలు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో గ్రూప్ దశ చివరి అంకానికి చేరుకుంది. మరో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ సూపర్ సిక్స్‌కు చేరుకోగా.. నేపాల్, యూఎస్ఏ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ సూపర్ సిక్స్‌కు చేరుకోగా.. ఐర్లాండ్, యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. సూపర్ సిక్స్ దశ మ్యాచ్‌లు జూన్ 29 నుంచి ప్రారంభమవుతాయి. సూపర్ సిక్స్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు జరుగనుండగా.. ఓ గ్రూప్‌లోని మూడు జట్లు మరో గ్రూప్‌లోని మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టోర్నీలో మరో నాలుగు గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఏ గ్రూప్‌లో ఏ జట్టు ఏ పొజిషన్లో ఉంటుందో డిసైడ్ కాలేదు. గ్రూప్-ఏలో జింబాబ్వే తొలి స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకోగా.. వెస్టిండీస్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌లో (జూన్ 26) విజేత రెండో స్థానంలో నిలుస్తుంది. గ్రూప్-బి నుంచి శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌లో (జూన్ 27) విజేత గ్రూప్ టాపర్ నిలుస్తుంది. మరో జట్టు ఒమన్ తమ కోటా మ్యాచ్‌లు పూర్తి చేసుకోవడంతో ఓడిన జట్టు రెండో స్థానంలో ఉంటుంది. సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు తమ గ్రూప్‌లోని మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే 2 పాయింట్లతో తదుపరి దశకు చేరతాయి. గ్రూప్-ఏలో జింబాబ్వే.. తమ గ్రూప్‌లోని నెదర్లాండ్స్, వెస్టిండీస్‌లపై విజయాలు సాధించడంతో సూపర్ సిక్స్ దశకు రెండు పాయింట్లతో అడుగుపెడుతుంది. అలాగే గ్రూప్-బిలో శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్‌లో విజేత 2 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుంది. సూపర్ సిక్స్ షెడ్యూల్ (అన్ని మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతాయి).. జూన్ 29: ఏ2 వర్సెస్ బి2 జూన్ 30: ఏ3 వర్సెస్ బి1 జులై 1: ఏ1 వర్సెస్ బి3 జులై 2: ఏ2 వర్సెస్ బి1 జులై 3: ఏ3 వర్సెస్ బి2 జులై 4: ఏ2 వర్సెస్ బి3 జులై 5: ఏ1 వర్సెస్ బి2 జులై 6: ఏ3 వర్సెస్ బి3 జులై 7: ఏ1 వర్సెస్ బి1 సూపర్ సిక్స్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు జులై 9న జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఫైనల్లో తలపడటంతో పాటు భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. -
శ్రీలంకకు ధీటుగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన స్కాట్లాండ్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో గ్రూప్-బిలో శ్రీలంకకు ధీటుగా చిన్న జట్టు స్కాట్లాండ్ వరుస విజయాలు సాధిస్తుంది. ఇవాళ (జూన్ 25) ఒమన్‌పై విజయం సాధించడంతో ఆ జట్టు శ్రీలంక తరహాలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తద్వారా గ్రూప్-బి నుంచి శ్రీలంక తర్వాత సూపర్ సిక్స్‌కు చేరుకున్న రెండో జట్టుగా నిలిచింది. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి చవిచూసిన ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. స్కాట్లాండ్ చేతిలో ఓడినా ఒమన్ ఈ గ్రూప్ నుంచి మూడో జట్టుగా సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్-బిలో మరో జట్టైన యూఏఈ 3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలతో ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లు సూపర్ సిక్స్ దశకు చేరగా.. నేపాల్, యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మ్యాచ్ విషయానికొస్తే.. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది. ఫలితంగా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు. 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఏ దశలోనూ విజయం సాధించేట్టు కనపడలేదు. ఆ జట్టు తొలి 6 వికెట్లు క్రమ అంతరాల్లో పోగొట్టుకుంది. అయితే వికెట్ కీపర్ నసీం ఖుషీ (63) ఒమన్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖర్లో స్కాట్లాండ్ బౌలర్ క్రిస్ గ్రీవ్స్ చెలరేగి 5 వికెట్లు పడగొట్టడంతో ఒమన్ కథ ముగిసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
ఈ మెక్‌ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడు.. శతక్కొట్టి చుక్కలు చూపించాడు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఒమన్‌తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో స్కాట్లాండ్ యువ ఆటగాడు బ్రాండన్ మెక్‌ముల్లెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌ముల్లెన్ 92 బంతుల్లోనే శతక్కొట్టి, ఒమన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ తర్వాత మరింత వేగంగా ఆడిన మెక్‌ముల్లెన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రాండన్ మెక్‌ముల్లెన్ పేరు హిట్టింగ్ దిగ్గజం, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ పేరుకు దగ్గరగా ఉండటం, మెక్కల్లమ్ తరహాలో మెక్‌ముల్లెన్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం చూసి నెటిజన్లు ఈ స్కాటిష్ హిట్టర్‌ను మెక్కల్లమ్తో పోలుస్తున్నారు. ఈ మెక్‌ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడంటూ కితాబిస్తున్నారు. పైగా మెక్‌ముల్లెన్ బౌలింగ్‌లోనూ ఇరగదీశాడంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, 23 ఏళ్ల మెక్‌ముల్లెన్.. స్కాట్లాండ్ తరఫున 11 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 326 పరుగులు చేసి.. బౌలింగ్‌లో ఓసారి 5 వికెట్ల ఘనతతో 17 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, బులవాయో వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు. -
కెప్టెన్ వీరోచిత శతకం.. జోరు మీదున్న స్కాట్లాండ్
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్(CWC 2023)లో స్కాట్లాండ్ జట్టు దూకుడు కనబరుస్తోంది. లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 111 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (136 బంతుల్లో 127 పరుగులు, 9 ఫోర్లు, 3సిక్సర్లు) వీరోచిత సెంచరీతో మెరిశాడు. అతనికి తోడుగా మైకెల్ లీస్క్ 41, మార్క్ వాట్ 31 బంతుల్లో 44 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం 283 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన యూఏఈ స్కాట్లాండ్ బౌలర్ల దాటికి 35.3 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 36 పరుగులు మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. స్కాట్లాండ్ బౌలర్లలో షరీఫ్ నాలుగు వికెట్లు తీయగా.. క్రిస్ సోల్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో స్కాట్లాండ్ సూపర్ సిక్స్‌కు మరింత చేరువ కాగా.. మరోవైపు హ్యాట్రిక్ ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. చదవండి: #LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్‌గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా.. -
బౌలర్ పెట్టిన బిక్షతో మ్యాచ్‌ను గెలిపించాడు
జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రధానంగా వెస్టిండీస్, జింబాబ్వే,శ్రీలంకలు ఫెవరెట్‌గా కనిపిస్తున్నాయి. తాజాగా బుధవారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను రనౌట్(మన్కడింగ్) చేసే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. చేజింగ్‌లో భాగంగా స్కాట్లాండ్కు ఆఖరి ఓవర్లో 8 పరుగులు కావాల్సి ఉంది. ఆఖరి ఓవర్ మార్క్ అడైర్ వేశాడు. అడైర్ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్ సహా సింగిల్ తీశాడు. మూడో బంతిని వేసే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న లీస్క్ క్రీజు బయటికి వచ్చాడు. ఇది గమనించిన మార్క్ అడైర్ బంతి వేయడం ఆపివేసి మన్కడింగ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇంతలో అలర్ట్ అయిన లీస్క్ వెంటనే బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. అలా బతికిపోయిన లీస్క్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి స్కాట్లాండ్కు ఒక్క వికెట్ తేడాతో మరిచిపోలేని విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలవాల్సింది.. తమ ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఆ జట్టు బౌలర్ పెట్టిన బిక్షతో లీస్క్ తన జట్టును గెలిపించుకున్నాడు అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: #CWCQualifiers2023: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా! -
స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ల 2023లో భాగంగా బుధవారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ హై థ్రిల్లర్‌ను తలపించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ కేవలం ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగుల స్కోరు చేసింది. 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో కర్టీస్ కాంఫర్ (108 బంతుల్లో 120 పరుగులు, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత సెంచరీకి తోడుగా డోక్రెల్ 69 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. ఐర్లాండ్ బౌలర్లలో బ్రాండన్ మెక్‌ముల్లెన్ ఐదు వికెట్లతో రాణించాడు.అనంతరం 287 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసి ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ క్రిస్టోఫర్ మెక్‌బ్రైడ్ 56 పరుగులు చేయగా..ఏడో స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేసిన మైకెల్ లీస్క్ (61 బంతుల్లో 91 పరుగులు నాటౌట్, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి స్కాట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మార్క్ వాల్ట్ 43 బంతుల్లో 47 పరుగులతో లీస్క్‌కు సహకరించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోషువా లిటిల్, జార్జ్ డోక్రెల్లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక చేజింగ్‌లోనూ స్కాట్లాండ్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. చేజింగ్‌లో వరుసగా 14 మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్ మాత్రమే ఓడిన స్కాట్లాండ్ అప్పటినుంచి 13 మ్యాచ్‌ల్లో ఓటమనేది లేకుండా ముందుకు సాగుతుంది. Leask pulls it off! 💥 Scotland continue their stunning streak of successful run-chases ⚡ They have won 13 of their last 14 ODIs batting second 🔥#CWC23 | #IREvSCO: https://t.co/T7hZENekE0 pic.twitter.com/tQbShg2lZU — ICC Cricket World Cup (@cricketworldcup) June 21, 2023 చదవండి: హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. టాప్-4లో సునీల్ ఛెత్రి -
షూటింగ్లో ప్రమాదం.. గాయపడ్డ స్టార్ హీరో అక్షయ్‌కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ గాయపడ్డారు. షూటింగ్ సెట్లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా అనుకోకుండా అక్షయ్‌కు గాయమైంది. ప్రస్తుతం అక్షయ్ స్కాట్లాండ్లో బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో భాగంగా హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి స్టంట్ సీన్ చేస్తుండగా అక్షయ్ మోకాలికి గాయమైంది. అయినప్పటికీ అక్షయ్ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించడం విశేషం. గాయం తీవ్రత అంతగా లేకపోవడంతో కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. కాగా టైగర్ జిందా హై, సుల్తాన్ వంటి పలు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్, టైగర్లతో పాటు సోనాక్షి సిన్హా ఇందులో నటిస్తుంది. ఇటీవలె ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు మూవీ టీం స్కాట్లాండ్కు పయనమయ్యారు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ క్రికెటర్ గుడ్‌బై
స్కాట్లాండ్ సీనియర్ క్రికెటర్.. మాజీ కెప్టెన్ కైల్ కోయెట్జర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కోయెట్జర్ కెప్టెన్సీలో స్కాట్లాండ్ పలు సంచలన విజయాలు సాధించింది. 2018లో అప్పటి ప్రపంచనెంబర్ వన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్ ఆ తర్వాత కూడా అతని కెప్టెన్సీలో విజయాలు సాధించింది. గతేడాది మేలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న కోయెట్జర్ టి20లకు కూడా గుడ్‌బై చెప్పి కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. తాజాగా బుధవారం అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు కోయెట్జర్ ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కోయెట్జర్ స్కాట్లాండ్ తరపున 89 వన్డేల్లో 3192 పరుగులు, 70 టి20ల్లో 1495 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని ఖాతాలో ఐదు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 156 పరుగులు వన్డేల్లో కోయెట్జర్కు అత్యధిక స్కోరు. ఇక 2015 వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై కోయెట్జర్ ఆడిన 156 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకుంటారు. ఇక 2021 టి20 వరల్డ్‌కప్ సందర్భంగా క్వాలిఫయర్ రౌండ్లో అతని కెప్టెన్సీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి గ్రూప్ టాపర్‌గా సూపర్-12కు అర్హత సాధించడం కోయెట్జర్ కెరీర్లో పెద్ద ఘనత. ఇక తన రిటైర్మెంట్పై స్పందించిన కోయెట్జర్..''ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. స్కాట్లాండ్ క్రికెటర్‌గా.. కెప్టెన్‌గా నాకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్పగా అనిపించింది. ఇన్నాళ్లు నాకు సహకరించిన స్కాట్కాండ్ క్రికెట్ సహా ఆటగాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు'' అంటూ చెప్పుకొచ్చాడు. THANK YOU KYLE ❤️👏🏏🏴https://t.co/qv6WHdkibU pic.twitter.com/XrZkebdlqo — Cricket Scotland (@CricketScotland) March 22, 2023 చదవండి: అభిమానులను పిచ్చోళ్లను చేశారు నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో తొలి ఓటమి.. టీమిండియాకు మరో బిగ్ షాక్ -
చనిపోయిన బిడ్డ మృతదేహం కోసం 48 ఏళ్లు పోరాడిన తల్లి..చివరికి..
ఓ తల్లి ఏడాది వయసున్న బిడ్డను కోల్పోయింది. అసలు బిడ్డను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న తల్లికి కనీసం ఆ బిడ్డ కడచూపు దక్కక అల్లాడిపోయింది. అందు కోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షించిన ఆమె ఓపికకు చేతులెత్తి నమస్కరించాలి. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన తన బిడ్డ మృతదేహాన్ని తనివితీరా చూసుకుని మరీ ఖననం చేసింది. అసలేం జరిగిందంటే..స్కాట్లాండ్లోని ఎడిన్‌బర్గ్‌కు చెందిన 74 ఏళ్ల లిడియా రీడ్ 1975లో ఏడాది వయసు ఉన్న బిడ్డను కోల్పోయింది. ఆ చిన్నారి రీసస్ అనే వ్యాధి కారణంగా మరణించాడు. గర్భిణీ స్త్రీ రక్తంలోని ప్రతిరక్షకాలు ఆమె శిశువు రక్తకణాలను నాశనం చేసి చనిపోయేలా చేయడమే ఆ వ్యాధి లక్షణం. ఆమె కొన్ని రోజుల తర్వాత తన బిడ్డను చూడాలని ఆస్పత్రి వర్గాలను కోరినప్పుడూ ఆమెకు వేరే బిడ్డను చనిపోయారు. దీంతో రీడ్కి తన కొడుకు అవయవాలు పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారా లేక తొలగించారా? అన్న అనుమానంతో కోర్టు మెట్లు ఎక్కింది. తన బిడ్డకు చనిపోయిన అనంతరం వైద్యులు పోస్ట్‌మార్టం కూడా నిర్వహించారని రీడ్ చెబుతుంది. అక్కడ ఆస్పత్రి రూల్స్ ప్రకారం..అంత చిన్న వయసులో చనిపోయిన చిన్నారులను వారే ఖననం చేస్తారు. అందువల్ల ఆమె బిడ్డ చనిపోయాడని తెలియడంతో దుఃఖంలో మునిగిపోయింది. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్ని ఆస్పత్రి వర్గాలే నిర్వర్తించాయి. ఆమె ఆ బాధ నుంచి బయటపడ్డాక ఒక్కసారి తన బిడ్డను చూడాలని శవపేటికను తెరిచి చూపించాలని ఎంతగానో ప్రాధేయపడింది అయితే అందుకు ఆస్పత్రి యజమాన్యం అంగీకరించి, చూపించింది కానీ అది తన బిడ్డ కాదనేది రీడ్ వాదన. అందుకోసం చాలా ఏళ్లు కోర్టులో పోరాడింది. చివరికి సెప్టెంబర్ 2017లో కోర్టు ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆ బిడ్డను ఆమెకు చూపించమని ఆదేశించగా.. ఖననం చేసిన ప్రదేశంలో బిడ్డ లేదని తేలింది. ఆమె పోరాటం కారణంగా సదరు ఆస్పత్రి ఆల్డర్ హే బాగోతం బయటపడింది. చనిపోయిన పిల్లల శరీర భాగాలను ఆస్పత్రులు ఎలా చట్టవిరుద్ధంగా పరిశోధనలకు ఉపయోగిస్తున్నాయో బహిర్గతం అయ్యింది. ఈ మేరకు స్కాట్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ చేసిన దర్యాప్తులో 1970 నుంచి 2000 మధ్య కాలంలో చిన్నపిల్లలకు సంబంధించి దాదాపు 6 వేల అవయవాలు, కణజాలం ఉంచినట్లు తేలింది. ఎట్టకేలకు ఆమె పోరాటం ఫలించి చనిపోయిన తన బిడ్డ మృతదేహాన్ని తిరిగి పొందగలిగింది. ఎలాగైతే చనిపోయేలోగా నా బిడ్డను చూడగలిగానని ఆనందంతో ఉప్పోంగిపోయింది. శనివారమే తన కొడుకు అంత్యక్రియలు జరిపిస్తానని తానే దగ్గరుండి పర్యవేక్షిస్తానని ఆనందబాష్పాలతో చెబుతోంది. (చదవండి: బద్ధ శత్రువులైన ఇరాన్, సౌదీల మధ్య సయోధ్య కుదిర్చిన చైనా!) -
కొడుకునే దోచుకునేందుకు మెడపై కతిపెట్టాడు..కానీ ట్విస్ట్ ఏంటంటే..
కన్న కొడుకునే దోచుకునేందుకు యత్నించాడు ఓ తండ్రి. విచిత్రమేటంటే తాను దొంగతనం చేస్తుంది తన కొడుకు వద్దనే అని ఆ దొంగకు తెలియదు. దీంతో సదరు తండ్రికి కోర్టు 26 నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే..స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నివశిస్తున్న17 ఏళ్ల టీనేజర్ ఓ రోజు తన ఇంటి సమీపంలోని ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లాడు. అతను డబ్బులు కలెక్ట్ చేసుకుని కార్డుని జేబులో పెట్లకుంటుండగా.. ఎరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి గోడకు బలంగా నెట్టేశారు. పైగా ఆ యువకుడిని గోడకు నొక్కెస్తూ వెనక్కు తిరగనివ్వకుండా మెడపై కత్తిపెట్టి బెదిరించాడు ఓ ఆగంతకుడు. దీంతో సదరు యువకుడు భయంతో ఏం కావాలని అడగగా.. ముసుగు ధరించిన వ్యక్తి ఆ యువకుడి వద్ద ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయమని డిమాండ్ చేస్తాడు. ఐతే ఆ ఆగంతకుడి గొంతు విని తన తండ్రి అని గుర్తించి ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత నిదానించుకుని నేనెవరో తెలుసా అని గట్టిగా అడుగుతాడు యువకుడు. నిజంగానే నన్ను డబ్బులు అడుగుతున్నావా అని కూడా ప్రశ్నిస్తాడు ఆ వ్యక్తిని. ఐతే ఆగంతకుడు అదేమి పట్టనంటూ ఔను! అంటూ డబ్బలిస్తావా లేదా అని డిమాండ్ చేస్తూనే ఉంటాడు. దీంతో ఆ యువకుడు వెంటనే వెనక్కు తిరిగి అతని ముసుగు ఒక్కసారిగా లాగేసి..ఏంటిదా నాన్న! అని ఆగంతకుడి రూపంలో ఉన్న తండ్రిని గట్టిగా నిలదీశాడు. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయి చూస్తాడు ఆ తండ్రి. వెంటనే ఆ యువకుడు ఆ ఏటీఎం మెషన్ వద్ద నుంచి వేగంగా బయటకొచ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఆగంతకుడిని అరెస్టు చేయగా..నేరాన్ని అంగీకరిస్తాడు. ఈ మేరకు కోర్టులో సదరు నిందితుడు తన నేరాన్ని అంగీకరించటమే గాక తన కొడుకే ఏటీఎం వద్ద ఉన్నాడిని తనకు తెలియదని చెప్పాడు. దొంగతనం చేసేందుకే ఏటీఎంలోకి వచ్చానని అంగీకరించాడు కూడా. దీంతో కోర్టు దీన్ని ఊహించని అసాధారణమైన కేసుగా పేర్కొంటూ నిందితుడికి 26 నెలల జైలు శిక్ష విధించింది. -
నెలకు రూ.4 లక్షలు: రెండేళ్లు కష్టపడితే, కోటి...కానీ..!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలతో గ్లోబల్‌గా ఉద్యోగాలు ఊడిపోతున్న తరుణంలో ఒక ఆసక్తికర పరిణామం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. అదేంటి అంటే.. నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనాన్ని ఆఫర్ చేస్తున్నా అబెర్డీన్ తీరంలో ఉత్తర సముద్రంలో ఆఫ్‌షోర్ రిగ్గర్ ఉద్యోగానికి అప్లయ్ చేసుకునే నాధుడే దాదాపు కనిపించడం లేదట. విషయం ఏమిటంటే స్కాట్లాండ్లో ఈ ఉద్యోగం. అబెర్డీన్లోని నార్త్ సీ తీరంలో పనిచేయాల్సి ఉంటుంది సముద్రంలోని నిర్దిష్ట ప్రాంతంలో ఏర్పాటైన రిగ్‌లో ఆఫ్‌షోర్ రిగ్గర్ అభ్యర్థి సముద్రగర్భం నుంచి ఖనిజ నిల్వలను అన్వేషించడం, వెలికితీయడం, ఆయిల్ వెలికితీయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా టెక్నికల్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. BOSIET (బేసిక్ ఆఫ్‌షోర్ సేఫ్టీ ఇండక్షన్ అండ్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), FOET (ఫర్దర్ ఆఫ్‌షోర్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), CA-EBS (కంప్రెస్డ్ ఎయిర్ ఎమర్జెన్సీ బ్రీతింగ్ సిస్టమ్), OGUK మెడికల్ ట్రైనింగ్ వంటివి శిక్షణ పొంది ఉండాలి. ఉద్యోగికి సెలెక్ట్ అయితే రోజుకు 12 గంటల పని. రోజుకు రూ.36 వేల చొప్పున నెలకు రూ.4 లక్షలు జీతం చెల్లిస్తారు. ఒక షిప్ట్ ఒకటి నుండి ఆరు నెలల వరకు ఉంటుంది. కంపెనీ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు,సెలవులు కూడా ఉంటాయి. వారం రోజులు సీక్ లీవ్ కూడా ఉంది. అభ్యర్థి రెండేళ్ల పాటు ఉద్యోగంలో ఉండి, 6-6 నెలల 2 షిఫ్ట్‌లను పూర్తి చేస్తే, అప్పుడు జీతం £95,420 (రూ. 1 కోటి)కి చేరుకుంటుంది. ఇంత భారీ ప్యాకేజీతో మొత్తం 5 ఖాళీలకుగాను 24 రోజుల క్రితం నోటిఫికేషన్ ప్రకటించగా అప్లయ్ చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువట. తన ఖచ్చితమైన గుర్తింపును వెల్లడించకుండానే ఎనర్జీ మార్కెట్లో పెద్ద కంపెనీగా చెప్పుకున్న సంస్థ ఈ ప్రకటన ఇచ్చింది. -
ఛీ.. నీతో షేక్‌హ్యాండా? ఘోర అవమానం.. తగిన శాస్తే అంటున్న నెటిజన్లు
ICC Cricket World Cup League Two 2019-23- Nepal won by 3 wkts: నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానేకు ఘోర అవమానం జరిగింది. జట్టులోని ఇతర ప్లేయర్లతో కరచాలనం చేసిన ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు.. కావాలనే సందీప్‌ను విస్మరించారు. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పక్కకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట ప్రత్యక్షం కాగా.. ‘‘తగిన శాస్తే జరిగింది. నీలాంటి వాళ్లకు ఇలాంటి ఘటనలు ఎదురైతేనన్నా కాస్త బుద్ధి వస్తుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2లో భాగంగా స్కాట్లాండ్, నమీబియా నేపాల్ పర్యటనకు వచ్చాయి. ఈ మూడు జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆతిథ్య నేపాల్- పర్యాటక స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన నేపాల్ బౌలింగ్ ఎంచుకోగా.. స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మూడు వికెట్ల తేడాతో గెలుపు లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు 47 ఓవర్లనే పని ముగించింది. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన కుశాల్ మల్ల 81 పరుగులతో చెలరేగగా.. ఏడో స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్ ఐరే 85 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా నేపాల్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో నేపాల్ జట్టును అభినందించే క్రమంలో స్కాట్లాండ్ ఆటగాళ్లు సందీప్ లమిచానేతో కరచాలనం చేసేందుకు విముఖత చూపారు. తమ చర్యతో సందీప్ పట్ల తమకున్న భావనను తెలియజేశారు. ఇందుకు కారణం ఏమిటంటే.. నేపాల్ కెప్టెన్ సందీప్ గతేడాది అత్యాచార ఆరోపణలతో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం బెయిల్ మీద విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం షరతులకు లోబడి నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతడిపై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో ట్రై సిరీస్ ఆడేందుకు అనుమతినిచ్చింది. అయితే, కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం రోహిత్ పౌడేల్‌కు అప్పగించింది. ఇక స్కాట్లాండ్తో మ్యాచ్‌లో రైట్ఆర్మ్ స్పిన్నర్ సందీప్ లమిచానే మూడు వికెట్లు పడగొట్టాడు. 22 ఏళ్ల యువ బౌలర్ 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి అందరికంటే మెరుగైన ప్రదర్శన (ఎకానమీ 2.70) కనబరిచాడు. అయితే, ఆటలో రాణించినా వ్యక్తిత్వంపై పడిన మచ్చ కారణంగా ఇలా అవమానం ఎదుర్కోకతప్పలేదతడికి! హింసకు వ్యతిరేకంగానే అంతకుముందు నమీబియా ఆటగాళ్లు కూడా సందీప్ పట్ల ఇలాగే వ్యవహరించారు. కాగా లింగ వివక్ష పూరిత హింసకు వ్యతిరేకంగా స్కాట్లాండ్, నమీబియా బోర్డుల సూచన మేరకే ఆటగాళ్లు ఈ మేరకు సందీప్‌తో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించినట్లు తెలుస్తోంది. నేపాల్ బోర్డు సెలక్షన్‌తో తమకు పనిలేదని, అయితే, మహిళలపై హింసకు వ్యతిరేకంగా తమ స్పందన తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సందీప్నకు నేపాల్ బోర్డు ముందే చెప్పడంతో అతడు కూడా వారికి దూరంగా ఉన్నట్లు ఈఎస్పీఎన్ తన కథనంలో పేర్కొంది. చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్ ఆమే.. ప్రకటించిన కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్.. వీడియో వైరల్ IND vs AUS: ఇదేమి బాల్‌రా బాబు.. దెబ్బకు రోహిత్ శర్మ షాక్! వైరల్ Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం.. Scotland Cricket Team refuses after match handshake with Sandeep Lamichhane. सन्दीप लामिछानेसँग हात मिलाएनन् स्कटिस खेलाडीलेhttps://t.co/bajsRRvfcDpic.twitter.com/mv3LHF4vYa — NepalLinks ︎ (@NepaliPodcasts) February 17, 2023 -
అవును...ఇది నిజమే!
♦ అన్‌ఫ్రెండ్’ అనే మాట ఫేస్‌బుక్‌కు ముందు ఉందా? అనే ప్రశ్నకు చాలామంది చెప్పే జవాబు ‘లేదు’ అని. అయితే 13వ శతాబ్దానికి చెందిన కవి లయమన్ కవితలో ఈ పదం కనిపిస్తుంది. అప్పటి ఇంగ్లీష్‌ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అయినా అర్ధం కాకుండా మాత్రం పోదు! ♦ ‘హెడ్‌లెస్ చికెన్ మాన్స్టర్’ గురించి ఎప్పుడైనా విన్నారా? నిజానికి దీనికీ చికెన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ‘హెడ్‌లెస్ చికెన్ మాన్స్టర్’ అనేది ఒక రకమైన సముద్రపు దోసకాయ. సదరన్ ఒషియన్కు సమీపంలో దీన్ని కనుగొన్నారు. ♦ ‘టర్టిల్ అనగా ఏమిటి?’ ప్రశ్నకు అందరి నుంచి వినిపించే జవాబు...తాబేలు. స్కాట్లాండ్లో మాత్రం దీనికి వేరే అర్ధం ఉంది. ఎవరి పేరు అయినా ఎంతకూ గుర్తుకు రాని సందర్భంలో, అసహనానికి, తట్టుకోలేని కో పానికి గురయ్యే సమయంలో ఉపయోగించే మాట ఇది. -
ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు...దెబ్బకు ఎయిర్పోర్ట్ క్లోజ్
సాధారణంగా విమానంలో ఏ ప్రయాణికుడి వద్దనైన విమానాశ్రయానికి తీసుకురాని వస్తువులు దొరికితే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుంది. అంతేగానీ ఎయిర్ పోర్ట్‌ని క్లోజ్ చేయరు. కానీ ఇక్కడొక ప్రయాణకుడి లగేజ్ బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు కారణంగా....మొత్తం ఎయిర్‌పోర్ట్‌నే క్లోజ్ చేశారు. వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్లోని విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద ప్యాకేజీ కనిపించింది. దీంతో వందలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ డెస్క్ వద్ద క్యూలో నిలబడి ఉన్నారు. దీంతో విమానాల్లో వెళ్లాల్సిన మరికొంతమంది ప్రయాణికులు కార్ పార్కింగ్‌లోనే నిలబడిపోయి ఉండాల్సి వచ్చింది. విమానాశ్రయంలో సిబ్బంది లగేజీలపై దర్యాప్తు చేస్తున్నందున ఆలస్యమవుతుందని ఎయిర్పోర్ట్ అధికారి తెలిపారు. ఐతే ప్రయాణికుడి లగేజీలో అనుమానాస్పద వస్తువు కారణంగానే.. సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలిపారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడంతో మరింతమంది ప్రయాణికులు క్యూలో పడిగాపులు పడాల్సి వచ్చింది. మరోవైపు విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణకుల రద్దీ ఎక్కువ అవ్వడంతో తనిఖీలు చేయడం మరింత ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే తాము ముందు జాగ్రత్తగా టెర్మినల్ భవనాన్ని మూసివేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అంతేగానీ ఎయిర్‌పోర్ట్‌ని మొత్తం ఖాళీ చేయించలేదని చెప్పారు. (చదవండి: కరోనా విషయమై అగ్రరాజ్యం గుట్టు బట్టబయలు..వెలుగులోకి షాకింగ్ నిజాలు) -
బాటిల్లో 135 ఏళ్ల నాటి లేఖ! అందులో ఏముందంటే.....
స్కాట్లాండ్లోని ఒక ఇంటి ఆవరణలో ప్లంబర్ పీటర్ అలెన్ తవ్వుతున్నాడు. ఆ ఇంటికి సంబంధించిన నీళ్ల పంపుల కోసం నేలను తవ్వుతుండగా...ఒక పురాత గాజు బాటిల్ కనిపించింది. దీంతో అతను ఆశ్చర్యపోయి తన యజమాని ఎలిద్ స్టింప్సన్ వద్దకు తీసుకువచ్చాడు. ఆమె కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ...స్కూల్‌కి వెళ్లిన తన పిల్లలు తిరిగి వచ్చే వరకు ఈ బాటిల్ ఓపెన్ చేయకూడదని గట్టిగా అనుకుంది. ఈలోగా స్కూల్నుంచి పిల్లలు కూడా వచ్చేశారు. వారికి జరిగిన విషయమంతా చెప్పింది ఎలిద్. ఐతే వారు ఏదైన నిధేమో అనుకున్నారు గానీ ఆ బాటిల్లోని చూసి వారు కూడా ఆశ్చర్యపోయారు. ఆ బాటిల్లోని లేఖను ఓపెన్ చేయాలని తెగా ఆతృత పడ్డారు. అది విక్టోరియా కాలం నాటి పురాతన లేఖ. ఐతే ఆ బాటిల్ ఓపెన్ కాకపోవడంతో పగలుగొట్టి మరీ ఆ లేఖ తీసి అందులో ఏముందో చూశారు. అందులో జేమ్స్ రిట్చీ, జాన్ గ్రీవ్ అనే ఇద్దరు మగ కార్మికులు సంతకాలు కనిపించాయి. ఈ బాటిల్లోని విస్కీ తాము తాగలేదని, అక్టోబర్ 6, 1887 అని రాసి ఉంది. సదరు యజమాని ఆ బాటిల్ ముక్కలను సైతం భద్రపరిచింది. ఐతే నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లాండ్ ఆ లేఖను జాగ్రత్తగా భద్రపర్చమని చెప్పింది. Watch the shocking moment hospital security attends to 'ghost patient' after dying the day before pic.twitter.com/cWyPtCYzjk — Newspremises (@News_premises) November 21, 2022 (చదవండి: ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు) -
18 ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లోనే.. అక్కడే తుదిశ్వాస
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బర్గ్ ‘ది టర్మినల్’ హిట్ సినిమాకు స్ఫూర్తి అయిన ఇతని పేరు మెహ్రాన్ కరిమి నసీరి. ఇరాన్‌లోని మస్జీద్ సులేమాన్ సిటీలో పుట్టాడు. బ్రిటన్‌లో స్థిరపడాలనుకున్నాడు. అందుకు బ్రిటన్ నిరాకరించింది. బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్ తన తల్లి స్వస్థలం గనుక తనకు బ్రిటన్‌లో నివసించే హక్కుందని వాదించినా లాభంలేకపోయింది. ఆ సమయానికి పారిస్‌లోని చార్లెస్ డిగాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మెహ్రాన్ అక్కడే ఆగిపోయాడు. ఇక దాన్నే తన స్థిరనివాసంగా మార్చుకున్నాడు. ఏకంగా 18 ఏళ్లు అక్కడే గడిపాడు! అనారోగ్యంతో కొన్నేళ్లు బయటికెళ్లినా ఇటీవల మళ్లీ తిరిగొచ్చి ఎయిర్‌పోర్ట్‌లోనే నివసిస్తున్నాడు. శనివారం తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు. అలా... ఎన్నో ఏళ్లుగా గడపిన విమానాశ్రయంలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నాడు!! -
గులాబీ కలర్ వేసినందుకు ఏకంగా రూ. 19 లక్షలు జరిమానా
ఇంటి ముందర తలుపులకు ఎలాంటి కలర్లు ఉండాలో కొన్ని దేశాల్లో షరతులు ఉంటాయి. ఆయా దేశాల్లో ఏ కలర్ పడితే అది వేస్తే అక్కడ అధికారులు అంగీకరించారు. ఐతే ఒక మహిళ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటి ముందర తలుపులకు తనకు నచ్చిన రంగు వేసింది. దీంతో సదరు కౌన్సిల్ అధికారులు ఈ విషయమై అభ్యంతర వ్యక్తం చేస్తూ సుమారు 19 లక్షలు జరిమానా విధించారు. ఈ వింత ఘటన స్కాట్లాండ్లో చోటు చేసుకుంటుంది. వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఉన్న మిరాండా డిక్సన్ అనే మహిళ తన ఇంటి ముందర తలుపులకు పింక్(గులాబీ) కలర్ వేసింది. దీంతో ఆ సిటీ కౌన్సిల్ ప్లానర్లు ఈ కలర్‌పై అభ్యంతరరం వ్యక్తం చేస్తూ... తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. కానీ ఆ మహిళ మాత్రం తన ఇంటికి ఆ రంగు ఎంతో అందాన్ని ఇచ్చిందని, చూడముచ్చటగా ఉందని చెబుతోంది. ఆమెకు ఈ ఇల్లు 2019లో తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లభించింది. ఈ ఇంటిని రెండేళ్లపాటు మరమత్తులు చేయించింది. ఐతే చివర్లో ఫినిషింగ్ టచ్‌గా ఇంటి ముందు ఉండే తలుపులకు మాత్రం గూలాబి రంగు వేసింది. యూకేలోని బ్రిస్టల్, నాటింగ్‌హిల్, హారోగేట్ వంటి నగరాల్లో ఇంటి ముందు తలుపులు ముదురు రంగులో ఉంటే నా ఇంటి ముఖ ద్వారం మాత్రం ఇలా భిన్నంగా గులాబీ రంగులో ఉండటం తనకు ఆనందంగా ఉంటుందని చెబుతోంది. అదీగాక చాలామంది తన ఇంటి ముందు ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారని, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందని అంటోంది. అంతేగాదు పలువురు తనకు మద్దతు తెలిపారని, ఈ రంగు చాలా బావుటుందంటూ సిటీ కౌన్సలర్లకు నచ్చచెప్పే ప్రయత్నం కూడా చేసింది. కానీ కౌన్సలర్ ప్లానర్లు మాత్రం ససేమిరా అంటూ తెలుపు రంగు వేయాలని ఆదేశించారు. అంతేగాదు ఒకవేళ తలుపులకు రంగు మార్చనట్లయితే సుమారు రూ. 19 లక్షల వరుకు జరిమాన ఎదుర్కోవాల్సి ఉంటుందని తెగేసి చెప్పారు. (చదవండి: లాక్డౌన్ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం) -
స్టన్నింగ్ క్యాచ్.. స్ప్రింగులేమైనా ఉన్నాయా!
స్కాట్లాండ్పై విజయంతో జింబాబ్వే తొలిసారి టి20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో అడుగుపెట్టింది. 15 ఏళ్ల టి20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి సూపర్-12 దశకు చేరుకున్న జింబాబ్వేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోగా.. క్రెయిగ్ ఇర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.ఆరేళ్లుగా ఒక్క ఐసీసీ టోరీ్నలో కూడా ఆడలేకపోయిన జింబాబ్వే ఎట్టకేలకు టి20 ప్రపంచకప్‌లో తమ ముద్ర చూపించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో చెలరేగి ఈసారి ‘సూపర్ 12’ దశకు అర్హత సాధించింది. అయితే ఇదే మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు వెస్లీ మాదేవేర స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బ్యాటర్ మ్యాథ్యూ క్రాస్ ఇచ్చిన క్యాచ్‌ను వెస్లీ మాదవేర అద్భుతంగా అందుకున్నాడు. కళ్లు చెదిరిలో రీతిలో గాల్లోకి అమాంతం ఎగిరి రెండు చేతులో ఒడిసి పట్టాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది. సూపర్ మ్యాన్ క్యాచ్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. " క్యాచ్ అందుకున్నది సూపర్‌మ్యానా లేక వెస్లీ మాధవేరేనా" అంటూ పోస్టు పెట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా... జింబాబ్వే 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 133 పరుగులు సాధించి గెలిచింది. లీగ్ దశలో ఐర్లాండ్‌పై నెగ్గి, ఆ తర్వాత విండీస్ చేతిలో ఓడిన జింబాబ్వే కీలక పోరులో చెలరేగగా, విండీస్‌పై సంచలన విజయంతో టోర్నీని మొదలు పెట్టిన స్కాట్లాండ్ ఆ తర్వాత సాధారణ ప్రదర్శనతో నిష్క్రమించింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: ఫోటో షేర్ చేసిన ఐసీసీ.. వ్యక్తి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నలా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });