క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నీని ఐసీసీ కొద్ది సేపటి కిందట ప్రకటించింది. ఈ జట్టులో టోర్నీ విజేత శ్రీలంక నుంచి ముగ్గురు, రన్నరప్ నెదర్లాండ్స్ నుంచి ముగ్గురు, టోర్నీ ఆధ్యాంతం సూపర్‌గా రాణించిన జింబాబ్వే నుంచి ముగ్గురు, సంచలన విజయాలు నమోదు చేసిన స్కాట్లాండ్ నుంచి ఇద్దరు చొప్పున ప్లేయర్లను ఐసీసీ ఎంపిక చేసింది.
ఈ జట్టులో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. సూపర్ సిక్స్ దశలో విండీస్ ఐదో స్థానానికి పరిమితం కావడంతో ఐసీసీ ఆ జట్టును పరిగణలోకి తీసుకోలేదు. బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (7 మ్యాచ్‌ల్లో 350 పరుగులు, 2 సెంచరీలు), షాయ్ హోప్ (7 మ్యాచ్‌ల్లో 341 పరుగులు, సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) సత్తా చాటినా, వీరిని సైతం ఐసీసీ విస్మరించింది.
ఓపెనర్లు పథుమ్ నిస్సంక (శ్రీలంక, 417 పరుగులు, 2 సెంచరీలు), విక్రమ్‌జీత్ సింగ్ (నెదర్లాండ్స్, 326, సెంచరీ)లను ఎంపిక చేసిన ఐసీసీ.. వన్‌డౌన్‌లో బ్రాండెన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్, 364, 2 సెంచరీలు, 13 వికెట్లు), నాలుగో స్థానంలో క్వాలిఫయర్స్ టాప్ స్కోరర్ సీన్ విలియమ్స్ (జింబాబ్వే, 600, 3 సెంచరీలు), ఐదో స్థానంలో యువ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ (నెదర్లాండ్స్, 285, సెంచరీ, 15 వికెట్లు), ఆరో ప్లేస్‌లో సికందర్ రజా (జింబాబ్వే, 325, సెంచరీ, 9 వికెట్లు), ఏడో స్థానంలో స్కాట్ ఎడ్వర్డ్స్ (నెదర్లాండ్స్, 314, 4 అర్ధసెంచరీలు), స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా క్వాలిఫయర్స్ లీడింగ్ వికెట్ టేకర్లు హసరంగ (22 వికెట్లు), తీక్షణ (21) (శ్రీలంక), ఫాస్ట్ బౌలర్లుగా క్రిస్ సోల్ (స్కాట్లాండ్, 11 వికెట్లు), రిచర్డ్ నగరవ (జింబాబ్వే, 14 వికెట్లు)లను ఎంపిక చేసింది. ఈ జట్టుకు కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్‌గా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ను ఎంపిక చేసింది.
Comments
Please login to add a commentAdd a comment