స్కాట్లాండ్‌పై భారత్ సంచలన విజయం..
86 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 6.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్(19 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ(16 బంతుల్లో 30, 5ఫోర్లు, 1సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడంతో లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. దీంతో టీమిండియా రన్‌రేట్ భారీగా మెరుగు పడింది. ఈ విజయంతో గ్రూప్2లో భారత్ మూడో స్ధానానికి చేరుకుంది.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. 5 ఓవర్లకు 70/1
దూకుడుగా ఆడుతున్న టీమిండియా 70 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, వీల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
దూకుడుగా ఆడుతున్న టీమిండియా.. 2 ఓవర్లకు 23/0
86 పరుగుల స్వల్ప లక్ష్యఛేధనతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతుంది. 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా భారత్ 23 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(15), రోహిత్(7) పరుగులతో ఉన్నారు.
భారత బౌలర్ల విజృంభణ.. 85 పరుగులకే కుప్ప కూలిన స్కాట్లాండ్
భారత బౌలర్ల విజృంభించడంతో 85 పరుగులకే స్కాట్లాండ్ కుప్పకూలింది. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో 24 పరుగులతో మున్సే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో జడేజా, షమీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, బూమ్రా రెండు, ఆశ్విన్ ఓ వికెట్ సాధించాడు.
ఐదో వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్.. లీస్క్(21) ఔట్
58 పరుగుల వద్ద స్కాట్లాండ్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 21 పరుగుల చేసిన లీస్క్, .జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసే సరికి స్కాట్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది.
29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్..
భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ బ్యాటర్లు విలవిలలాడుతున్నారు. కేవలం 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి స్కాట్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో 7వ ఓవర్ వేసిన జడేజా.. రెండు వికెట్లను పడగొట్టి ప్రత్యర్ధి జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. 9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.
రెండో వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్.. మున్సే(24) ఔట్
సమయం: 19: 50.. 27 పరుగుల వద్ద స్కాట్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగుల చేసిన మున్సే, షమీ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 6ఓవర్లు ముగిసేసరికి స్కాట్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రాస్(1),బెర్రింగ్టన్(0) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్.. కొయెట్జర్(1) ఔట్
సమయం: 19: 40.. భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కొయెట్జర్(1) రూపంలో స్కాట్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కొయెట్జర్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. 3 ఓవర్లు ముగిసేసరికి స్కాట్లాండ్ వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మున్సే(11),క్రాస్(0) పరుగులతో ఉన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
దుబాయ్: టీ20 ప్రపంచకప్- 2021లో భాగంగా శుక్రవారం(నవంబర్5) టీమిండియా కీలక మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్‌లతో బరిలోకి దిగనుంది.
అయితే ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే భారత్ జట్టు సెమీస్ రేసులో నిలవనుంది. కాగా భారత్, స్కాట్లాండ్ జట్లు ఇప్పటి వరకూ టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఒక్కసారి తలపడ్డాయి. 2007 టీ20 ప్రపంచకప్‌లో జరగబోయిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ.. వర్షం కారణంగా ఒక బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది.
టీమిండియా: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా,రవిచంద్రన్ అశ్విన్
స్కాట్లాండ్: జార్జ్ మున్సే, కైల్ కొయెట్జర్(కెప్టెన్), మాథ్యూ క్రాస్, రిచీ బెర్రింగ్టన్, కలమ్ మెక్‌లియోడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సాఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లీ వీల్, ఈవాన్స్
Comments
Please login to add a commentAdd a comment