
పాపం కోహ్లి.. దురదృష్టం వెంటాడుతోంది..
Virat Kohli has the worst toss record in the last 50 years - Aakash Chopra: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో... అబుదాబిలో అఫ్గనిస్తాన్‌తో తలపడింది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలోనూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని టాస్ గండం వెంటాడింది. మూడు మ్యాచ్‌లలో కోహ్లి టాస్ ఓడిపోయాడు. ముఖ్యంగా రాత్రి ఏడున్నర(స్థానిక కాలమానం ప్రకారం)కు మ్యాచ్‌లు ఆరంభం కావడం.. జయాపజయాలపై మంచు ప్రభావం చూపే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వరుస ఓటములకు ఇది కూడా ఒక కారణంగా పరణమించిందని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. విరాట్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘కోహ్లి మరియు టాస్‌లు.. కథేంటి? ఈ ఏడాది తను 8 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అయితే, కేవలం ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచాడు. గత యాభై ఏళ్లలో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 మ్యాచ్‌లలో టాస్ విషయంలో కెప్టెన్ల రికార్డులు పరిశీలిస్తే... కోహ్లిదే చెత్త రికార్డు.
40 శాతం మ్యాచ్‌లలో మాత్రమే కోహ్లి టాస్ గెలిచాడు. ఈ విషయంలో రాహుల్ ద్రవిడ్ బెస్ట్. 58- 60 శాతం విజయాలు ఉన్నాయి. ధోని విషయానికి వస్తే... 47-18గా రికార్డు ఉంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే కోహ్లిని దురదృష్టం వెంటాడుతుందని స్పష్టమవుతోంది’’అని పేర్కొన్నాడు.
కాగా గత 14 మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే కోహ్లి టాస్ గెలిచాడు. ఇక స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే... స్సిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేని స్కాట్లాండ్‌పై భారీ తేడాతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
చదవండి: Ind vs Sco: ఇప్పుడు ‘గెలిచినా’ సెమీస్ చేరాలంటే పెద్ద కథే.. అయితే ఈ ప్లేయర్లు మాత్రం