PC: ICC
T20 world Cup 2021: India Beat Scotland By 8 Wickets Semis Hopes Alive: గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై... ఇప్పుడు స్కాట్లాండ్‌పై... ఇదే దూకుడు తొలి రెండు మ్యాచ్‌లలో చూపించి ఉంటేనా! శుక్రవారం మ్యాచ్ తర్వాత ఇలా అనుకోని సగటు భారత క్రికెట్ అభిమాని ఉండడేమో! విజయంతో పాటు రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత్ తమ సత్తా చాటింది. స్థాయికి తగినట్లుగా చెలరేగి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
ముందుగా జడేజా, షమీ బౌలింగ్‌తో స్కాట్లాండ్‌ను 85 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా... ఆపై రాహుల్, రోహిత్ జోరుతో ఏకంగా 81 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. అయిననూ ఆశలన్నీ అఫ్గానిస్తాన్‌పైనే! ఆదివారం జరిగే పోరులో న్యూజిలాండ్‌ను అఫ్గాన్ ఓడిస్తేనే భారత్‌కు ఈ రన్‌రేట్ లెక్కలన్నీ పనికొస్తాయి. న్యూజిలాండ్ మ్యాచ్ గెలిస్తే మాత్రం నమీబియాతో సోమవారం జరిగే మ్యాచ్ మనకు టైమ్ పాస్‌గానే లెక్క!
చిత్తుగా ఓడించి
దుబాయ్: టి20 ప్రపంచకప్ కీలక పోరులో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తు చేసింది. ముందుగా స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (3/15), షమీ (3/15) ప్రత్యరి్థని కూల్చారు. అనంతరం భారత్ 6.3 ఓవర్లలో 2 వికెట్లకు 89 పరుగులు సాధించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్ శర్మ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు.
బౌలర్లు జోరుగా...
అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన మున్సీ... షమీ వేసిన 11వ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన లీస్‌్క..! ఈ రెండూ తప్ప స్కాట్లాండ్ బ్యాటింగ్‌లో చెప్పుకోవడానికేమీ లేదు. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు జవాబివ్వలేక స్కాటిష్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఇందులో షమీ, బుమ్రా చెరో మెయిడిన్ ఓవర్ కూడా వేశారు. ఒక్కో పరుగు కోసం జట్టు తీవ్రంగా శ్రమించగా... ఇన్నింగ్స్‌లో ఏకంగా 61 (10.1 ఓవర్లు) ‘డాట్ బాల్స్’ ఉండటం, పరుగు తీసిన బంతులు కేవలం 45 మాత్రమే ఉన్నాయంటే భారత్ ఆధిపత్యం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
5 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్ స్కోరు 27/2 కాగా... ఆరో ఓవర్లో జడేజా రెండు వికెట్లతో దెబ్బ కొట్టాడు. ఏ దశలోనూ జట్టు పరుగులు సాధించలేకపోయింది. షమీ వేసిన 17వ ఓవర్లో తొలి మూడు బంతులకు మూడు వికెట్లు (రనౌట్ సహా) పడ్డాయి. ఎవరూ కనీస పట్టుదల కనబర్చకపోవడంతో 14 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఆట ముగిసింది.
మెరుపు వేగంతో...
1 0 1 1 4 1 / 1 4 4 వైడ్ 0 4 1 / 4 6 1 0 4 1 / 6 0 4 0 4 0 / 2 4 6 1 4 రోహిత్ అవుట్ / 4 0 6 1 1 రాహుల్ అవుట్ / 1 0 6 ....... ఛేదనలో భారత ఇన్నింగ్స్ సాగిన తీరిది. 7.1 ఓవర్లలో గెలిస్తే అఫ్గానిస్తాన్ రన్‌రేట్‌ను, 8.5 ఓవర్లలో గెలిస్తే న్యూజిలాండ్ రన్‌రేట్‌ను దాటే స్థితిలో బరిలోకి దిగిన భారత్ అంతకంటే వేగంగా లక్ష్యం చేరింది. రోహిత్, రాహుల్ ప్రత్యర్థిపై మైదానం నలుమూలలా విరుచుకుపడి పరుగులు సాధించడంతో స్కోరు మెరుపులా దూసుకుపోయింది.
స్కాట్లాండ్ అతి పేలవ బౌలింగ్ కూడా టీమిండియా పనిని సులువు చేసింది. భారత ఓపెనర్లు 30 బంతుల్లోనే 70 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ వెనుదిరిగాడు. అనంతరం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్, తర్వాతి బంతికి అవుటయ్యాడు. అయితే మరో మూడు బంతులకే భారత్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
స్కోరు వివరాలు
స్కాట్లాండ్ ఇన్నింగ్స్: మున్సే (సి) హార్దిక్ (బి) షమీ 24; కోయెట్జర్ (బి) బుమ్రా 1; క్రాస్ (ఎల్బీ) (బి) జడేజా 2; బెరింగ్టన్ (బి) జడేజా 0; మెక్లాయిడ్ (బి) షమీ 16; లీస్క్ (ఎల్బీ) (బి) జడేజా 21; గ్రీవ్స్ (సి) హార్దిక్ (బి) అశ్విన్ 1; వాట్ (బి) బుమ్రా 14; షరీఫ్ (రనౌట్) 0; ఇవాన్స్ (బి) షమీ 0; వీల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 85.
వికెట్ల పతనం: 1–13, 2–27, 3–28, 4–29, 5–58, 6–63, 7–81, 8–81, 9–81, 10–85.
బౌలింగ్: బుమ్రా 3.4–1–10–2, వరుణ్ చక్రవర్తి 3–0–15–0, అశి్వన్ 4–0–29–1, షమీ 3–1–15–3, జడేజా 4–0–15–3.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మెక్లాయిడ్ (బి) వాట్ 50; రోహిత్ (ఎల్బీ) (బి) వీల్ 30; కోహ్లి (నాటౌట్) 2, సూర్యకుమార్ (నాటౌట్) 6, ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (6.3 ఓవర్లలో 2 వికెట్లకు) 89.
వికెట్ల పతనం: 1–70, 2–82. బౌలింగ్: వాట్ 2–0–20–1, వీల్ 2–0–32–1, ఇవాన్స్ 1–0–16–0, షరీఫ్ 1–0–14–0, గ్రీవ్స్ 0.3–0–7–0.
చదవండి: IND Vs SCO: టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన భారత్...
Ind Vs Sco KL Rahul: టీమిండియా ఘన విజయం.. కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు
Unerring accuracy does the trick for Jadeja again 👊
— T20 World Cup (@T20WorldCup) November 5, 2021
Another lbw dismissal for him as Leask is gone for 21.#T20WorldCup | #INDvSCO | https://t.co/nlqBbYrz37 pic.twitter.com/WoIMNcXeDH
Comments
Please login to add a commentAdd a comment