![T20 WC 2021: Indian Team Celebrates Virat Kohli Birthday After Beat Scotland - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/6/virat-kohli55.jpg.webp?itok=4V8QSCnN)
PC: Indiancricket Team Instagram
Virat Kohli Birthday Celebration After Beat Scotland Video Goes Viral: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. స్కాట్లాండ్‌పై అద్భుత విజయంతో రన్‌రేటు భారీగా మెరుగుపరుచుకుంది. తొలుత 85 పరుగులకే ప్రత్యర్థి జుట్టను ఆలౌట్ చేసి.. 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ గెలుపు ద్వారా భారత జట్టు తమ కెప్టెన్ విరాట్ కోహ్లికి.. పుట్టినరోజున గొప్ప కానుక అందించింది.
కాగా టీమిండియా సారథి కోహ్లి నవంబరు 5న 33వ వసంతంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్‌రూంలో సంబరాలు చేసుకున్నారు. మెంటార్ ఎంఎస్ ధోని సహా ఇతర సిబ్బంది సమక్షంలో కోహ్లి పుట్టినరోజు వేడుక సంతోషంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను టీమిండియా ఇన్‌స్టా పేజీలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
‘‘అద్భుత విజయం తర్వాత విరాట్ కోహ్లి బర్త్‌డే ఇలా’’ అన్న క్యాప్షన్‌తో పంచుకున్న ఈ వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. ఇక జన్మదినాన అద్భుత విజయం సాధించడం.. ఈ సందర్భంలో తన సతీమణి అనుష్క శర్మ, చిన్నారి కుమార్తె వామిక తనతో పాటే కలిసి ఉండటం అన్నింటికంటే గొప్ప విషయమని కోహ్లి పేర్కొన్నాడు.
చదవండి: Virat Kohli: పుట్టినరోజున సంతోషం.. జడ్డూ సూపర్.. నవంబరు 7న ఏం జరుగుతుందో మరి!
Comments
Please login to add a commentAdd a comment