T20 world Cup 2021: Virat Kohli On India Beat Scotland By 8 Wickets: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో స్కాట్లాండ్‌పై అద్భుత విజయం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఆసాంతం ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించి గెలుపు సొంతం చేసుకున్నామన్నాడు. తదుపరి మ్యాచ్‌లోనూ ఇలాంటి ఫలితాన్నే పునరావృతం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
కాగా సెమీస్ చేరాలంటే ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడవలసిన స్థితిలో ఉన్న కోహ్లి సేన.. నవంబరు 5న దుబాయ్‌లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. 85 పరుగులకే స్కాట్లాండ్‌ను ఆలౌట్ చేసింది. ఇక.. 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రన్‌రేటును మెరుగుపరుచుకుంది.
ఆద్యంతం ఆధిపత్యం
ఇక నవంబరు 8న నమీబియాతో మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం నమోదు చేయడం సహా.. నవంబరు 7 నాటి న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గనిస్తాన్ మ్యాచ్ ఫలితంపైనే కోహ్లి సేన సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే గ్రూపు-2లోని పాకిస్తాన్ సెమీస్‌కు చేరగా... రెండో స్థానం కోసం టీమిండియా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్ పోటీ పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లి మాట్లాడాడు... ‘‘ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాం. మిగిలిన మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడాలని భావిస్తున్నాం. నవంబరు 7న ఏ జరుగుతుందన్నదే ఇప్పుడు అన్నింటికంటే ఆసక్తికరంగా మారింది. ఈరోజు మా ప్రదర్శన గురించి పెద్దగా ఏమీ చెప్పాలనుకోవడం లేదు. చేయగలిగింది చేశాం.
ఈ పిచ్‌పై టాస్ ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. 110- 120 లోపు వాళ్లను కట్టడి చేయాలనుకున్నాం. అయితే మా బౌలర్లు అత్యద్భుతంగా ఆడారు. ఇక కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
జడేజా సూపర్‌గా బౌలింగ్ చేశాఉ. షమీ కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. నా కుటుంబం నాతో పాటు ఇక్కడే ఉంది. పుట్టినరోజున ఈ సంతోషం చాలు’’ అని బర్త్‌డే ‘బాయ్’కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా(4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
స్కోర్లు:
స్కాట్లాండ్- 85 (17.4)
భారత్- 89/2 (6.3)
చదవండి: Ind Vs Sco KL Rahul: టీమిండియా ఘన విజయం.. కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment