గ్రీన్ విధ్వంసం.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్‌ | Green helps Australia complete cleansweep | Sakshi
Sakshi News home page

AUS vs SCO: గ్రీన్ విధ్వంసం.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్‌

Published Sun, Sep 8 2024 10:40 AM | Last Updated on Sun, Sep 8 2024 1:13 PM

Green helps Australia complete cleansweep

ఎడిన్‌బ‌ర్గ్ వేదిక‌గా స్కాట్లాండ్‌తో జ‌రిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాటీష్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 

స్కా​ట్లాండ్‌ బ్యాటర్లలో బ్రాండెన్‌ మెక్‌కల్లమ్‌(56) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కామెరూన్‌ గ్రీన్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. హార్దీ, అబాట్‌ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. 

బౌలింగ్‌లో అదరగొట్టిన గ్రీన్‌.. బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 62 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మార్ష్‌(31) పరుగులు చేశాడు. స్కాట్లాండ్ బౌలక్లలో బ్రాడ్లీ క్యూరీ రెండు వికెట్లు పడగొట్టగా.. సోలే, జర్వీస్ తలా వికెట్ సాధించారు. 

ఇక ఈ సిరీస్‌లో విజయం సాధించిన కంగారులు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌తో ఆసీస్ తలపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement