ఎడిన్‌బర్గ్ వేదికగా స్కాట్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ బౌలర్లు తలో చేయి వేసి స్కాట్లాండ్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు.
స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో బ్రాండన్ మెక్‌ముల్లెన్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. జార్జ్ మున్సే (25), ఓల్లీ హెయిర్స్ (12), మార్క్ వాట్ (18), మైఖేల్ లీస్క్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో కెమెరూన్ గ్రీన్ 3, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్ తలో 2, స్టోయినిస్, జంపా చెరో వికెట్ పడగొట్టారు. అరంగేట్రం బౌలర్ కూపర్ కన్నోల్లీ 3 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు.
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా స్కాట్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించింది. ఆతిథ్య జట్టు మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తుంది.
ఈ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఐదు మ్యాచ్ వన్డే సిరీస్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 11 నుంచి ఈ సిరీస్‌లు మొదలుకానున్నాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఇంగ్లండ్‌లో జరుగనున్నాయి. సెప్టెంబర్ 11, 13, 15 తేదీల్లో టీ20లు.. సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment