బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌ | Injured Cameron Green Ruled Out Of England Tour | Sakshi
Sakshi News home page

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌

Published Fri, Sep 27 2024 9:04 PM | Last Updated on Fri, Sep 27 2024 9:04 PM

Injured Cameron Green Ruled Out Of England Tour

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్‌ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా గ్రీన్‌కు వెన్ను సంబంధించిన సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో ఇవాళ జరుగుతున్న నాలుగో వన్డేకు గ్రీన్‌ అందుబాటులో లేడు. ఈ గాయం నేపథ్యంలో గ్రీన్‌ బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో పాల్గొంటాడా లేదా అన్నది సందిగ్దంగా మారింది. 

గాయం​ తీవ్రతపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం​ లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండో వన్డేకు దూరంగా ఉన్న గ్రీన్‌ మూడో వన్డేలో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. ఆ మ్యాచ్‌లో గ్రీన్‌ 2 వికెట్లు తీసి 45 పరుగులు చేశాడు. తాజాగా గ్రీన్‌ గాయం బారిన పడటంతో ఈ పర్యటనలో ఆసీస్‌ ఇంజ్యూరీస్‌ సంఖ్య ఐదుకు చేరింది. ఈ సిరీస్‌ ప్రారంభమైన నాటి నుంచి గాయాల కారణంగా నాథన్‌ ఇల్లిస్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, రిలే మెరిడిత్‌, బెన్‌ డ్వార్షుయిస్‌ జట్టుకు దూరమయ్యారు.

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ముగియగా.. ఆసీస్‌ రెండు, ఇంగ్లండ్‌ ఒక్క మ్యాచ్‌లో గెలుపొందాయి. నాలుగో వన్డే ఇవాళ లార్డ్స్‌ వేదికగా జరుగుతుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఇంగ్లండ్‌ 21 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఫిలిప్‌ సాల్ట్‌ (22), విల్‌ జాక్స్‌ (10) ఔట్‌ కాగా.. బెన్‌ డకెట్‌ (58), హ్యారీ బ్రూక్‌ (35) క్రీజ్‌లో ఉన్నారు.  ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌వుడ్‌, మిచెల్‌ మార్ష్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

చదవండి: 56 ఏళ్ల కిందటి చెత్త రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్‌ బ్యాటర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement