ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 59; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఊచకోత కోయడంతో 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (41), జోష్ ఇంగ్లిస్ (37) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్ 3, జోఫ్రా ఆర్చర్, సకీబ్ మహమూద్ తలో 2, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్
180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. సీన్ అబాట్ 3, హాజిల్‌వుడ్, జంపా చెరో 2, బార్ట్‌లెట్, గ్రీన్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్ (37), ఫిలిప్ సాల్ట్ (20), సామ్ కర్రన్(18), జోర్డన్ కాక్స్ (17), జేమీ ఓవర్టన్ (15), సాకిబ్ మహమూద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్ 13న జరుగుతుంది.
A terrific video by England on team's hat-trick against Australia last night. 👌pic.twitter.com/tZzlLT8vbS
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024
ఇంగ్లండ్ హ్యాట్రిక్
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ హ్యాట్రిక్ వికెట్లు తీసింది. ఆసీస్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి రెండు బంతులకు.. 19వ తొలి బంతికి ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీశారు. 18వ ఓవర్‌లో సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్‌లను జోఫ్రా ఆర్చర్.. 19వ ఓవర్ తొలి బంతికి కెమరూన్ గ్రీన్‌ను సాకిబ్ మహమూద్ ఔట్ చేశారు. ఈ ముగ్గురూ క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడినప్పటికీ ఇదొక్కటే చెప్పుకోదగ్గ ప్రదర్శన.
4,4,6,6,6,4 by Travis Head against Sam Curran in a single over.
- The ruthless version of Head is scary! 🤯pic.twitter.com/QfFQCwgHN9— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024
ట్రవిస్ హెడ్ ఊచకోత
ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ తన సహజ సిద్దమైన హిట్టింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను భయపెట్టారు. హెడ్.. సామ్ కర్రన్ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. హెడ్.. ఆసీస్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హెడ్ కంటే ముందు పాంటింగ్, డేనియల్ క్రిస్టియన్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్ ఒకే ఓవర్‌లో 30 పరుగులు బాదారు.
Comments
Please login to add a commentAdd a comment