స్కాట్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం ఎడిన్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టి20లో కివీస్ 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఎవరు సెంచరీ మార్క్ అందుకోనప్పటికి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మెన్ బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు.
మార్క్ చాప్‌మన్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు, మైకెల్ బ్రాస్‌వెల్(25 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 నాటౌట్) స్కాట్లాండ్ బౌలర్లను ఊచకోత కోయగా.. మిగిలినవారిలో డారిల్ మిచెల్(19 బంతుల్లో 31), జేమ్స్ నీషమ్(12 బంతుల్లో 28), క్లెవర్(16 బంతుల్లో 28) రాణించారు. ఇక న్యూజిలాండ్‌కు టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కాగా టి20ల్లో అత్యధిక స్కోరు అఫ్గనిస్తాన్ పేరిట ఉంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అప్గానిస్తాన్ 278 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం స్కాట్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులే చేయగలిగింది. క్రిస్ గ్రీవ్స్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నీషమ్ 9 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. చాప్‌మన్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇరుజట్ల మధ్య ఏకైక వన్డే మ్యాచ్ జూలై 31(ఆదివారం) జరగనుంది.
చదవండి: Rishabh Pant: పంత్ అరుదైన ఫీట్.. ఈ ఏడాదిలో టీమిండియా తొలి ఆటగాడిగా
క్రికెట్ గ్రౌండ్‌లో ఆత్మాహుతి దాడి.. మ్యాచ్ జరుగుతుండగానే..!
Comments
Please login to add a commentAdd a comment