Mark Chapman
-
షనక ఊచకోత.. చాప్మన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ క్యాండీ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో దంబుల్లా సిక్సర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిక్సర్స్.. మార్క్ చాప్మన్ (61 బంతుల్లో 91 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), చమిందు విక్రమసింఘే (42 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. గుణతిలక 11, కుశాల్ పెరీరా 0, నువనిదు ఫెర్నాండో 4, తౌహిద్ హ్రిదోయ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఫాల్కన్స్ బౌలర్లలో షనక 3 వికెట్లు పడగొట్టగా.. హస్నైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్.. దినేశ్ చండీమల్ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), షనక (15 బంతుల్లో 46 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. షనక సిక్సర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. ముస్తాఫిజుర్ వేసిన 16వ ఓవర్లో మూడు సిక్సర్లు, బౌండరీ సహా 23 పరుగులు పిండుకున్నాడు. సిక్సర్స్ బౌలర్లలో నువాన్ తుషార, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఖిల ధనంజయ, చమిందు విక్రమసింఘే తలో వికెట్ పడగొట్టారు.లీగ్‌లో భాగంగా ఇవాళ (జులై 2) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్, గాలే మార్వెల్స్.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్, క్యాండీ ఫాల్కన్స్ పోటీపడనున్నాయి. -
పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో రెండు దేశాలకు ఆడిన క్రికెటర్లు వీరే..!
క్రీడ ఏదైనా జాతీయ జట్టుకు ప్రాతినథ్యం వహించడమనేది ప్రతి ఆటగాడి కల. ఈ అవకాశం కోసం కొందరు ఆటగాళ్లు జీవితకాలం ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఓ ఆటగాడు రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించడమనేది చాలా గొప్ప విషయమని చెప్పాలి.క్రికెట్‌కు సంబంధించి ఇప్పటివరకు 52 మంది ఆటగాళ్లు రెండు వేర్వేరు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. వన్డే ఫార్మాట్లో 16 మంది, టెస్ట్‌ల్లో 17 మంది, టీ20 ఫార్మాట్లో 19 మంది ఇప్పటివరకు రెండు వేర్వేరు జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించారు.ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటివరకు ఎంత మంది రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదుగురు ఆటగాళ్లు రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించారు.మొదటిగా రోల్ఫ్ వాన్ డర్ మెర్వ్.. 2009లో సౌతాఫ్రికా తరఫున పొట్టి ప్రపంచకప్ ఆడిన వాన్ డర్ మెర్వ్.. 2022, 2024 ప్రపంచకప్ టోర్నీల్లో నెదర్లాండ్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు.రెండో ఆటగాడు డిర్క్ నానెస్.. 2009 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌కు ఆడిన నానెస్.. 2010 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు.మూడవ ఆటగాడు మార్క్ చాప్మన్.. హాంగ్‌కాంగ్‌లో పుట్టిన చాప్మన్ 2014, 2016 టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్లలో పుట్టిన దేశానికి ప్రాతినిథ్యం వహించి.. 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.నాలుగో ఆటగాడు డేవిడ్ వీస్.. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాకు ఆడిన వీస్.. 2021, 2022, 2024 వరల్డ్‌కప్ ఎడిషన్లలో నమీబియాకు ప్రాతినిథ్యం వహించాడు.చివరిగా కోరె ఆండర్సన్.. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌కు ఆడిన ఆండర్సన్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన మార్క్ చాప్మన్, షాహీన్ అఫ్రిది
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌ను ఇవాళ (ఏప్రిల్ 23) విడుదల చేసింది. ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడు ఫార్మాట్లలో టాప్‌లో కొనసాగుతుంది.వ్యక్తిగత ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, షాహీన్ అఫ్రిది, ఐష్ సోధి, టిమ్ సీఫర్ట్ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. పాకిస్తాన్‌తో ఇటీవల జరిగిన టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన చాప్మన్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 33వ స్థానానికి ఎగబాకగా.. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో (టీ20) 3 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అఫ్రిది రెండు స్థానాలు మెరుగపర్చుకుని 17వ స్థానానికి చేరుకున్నాడు. కివీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ 27వ స్థానం నుంచి 24కు.. సోధి 23 స్థానం నుంచి 18వ స్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఎయిరీ తొలిసారి టాప్-50 బ్యాటర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తద్వారా నేపాల్ తరఫున టాప్-50లో చోటు దక్కించుకున్న నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్ కప్‌లో హాంగ్‌కాంగ్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కారణంగా ఎయిరీ ర్యాంకింగ్స్‌లో మార్పు వచ్చింది.ఇవి కాకుండా తాజా ర్యాంకింగ్స్‌లో చెపుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్, వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్, టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతున్నారు. టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. అశ్విన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కేశవ్ మహారాజ్, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతున్నారు. -
న్యూజిలాండ్ బ్యాటర్ ఊచకోత.. పాక్‌కు పరాభవం
న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌కు పరాభవం ఎదురైంది. స్వదేశంలో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి కూడా ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. నిన్న (ఏప్రిల్ 24) జరిగిన ఐదో టీ20లో పర్యాటక జట్టు గెలవడం ద్వారా 2-2తో సిరీస్ సమమైంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు పాక్ గెలువగా.. మూడు, ఐదు మ్యాచ్‌లలో కివీస్ నెగ్గింది. నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. చాప్మన్ ఊచకోత.. రిజ్వాన్ మెరుపులు వృధా రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మహ్మద్ రిజ్వాన్ (62 బంతుల్లో 98 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (22 బంతుల్లో 36), ఇమాద్ వసీం (14 బంతుల్లో 31) ఓ మోస్తరుగా రాణించారు. కివీస్ బౌలర్లలో టిక్నర్ 3, సోధి ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో మార్క్ చాప్మన్ (57 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురవేసింది. చాప్‌మన్‌కు జతగా నీషమ్ (45 నాటౌట్) రాణించాడు. పాక్ బౌలర్లలోషాహీన్ అఫ్రిది, ఇమాద్ వసీం చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన చాప్‌మన్‌కు (34, 65*, 16*, 71*, 104*) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 27 నుంచి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. -
స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన సుందర్..
రాంచీ వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి టి20లో టీమిండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ చాప్‌మన్‌ను సుందర్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఓవర్ చివరి బంతిని సుందర్ ఔట్‌సైడ్ దిశగా వేయగా.. చాప్మన్ స్ట్రెయిట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సుందర్ ఒకవైపుగా డైవ్గా చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి కింద తాకిందేమోనని థర్డ్ అంపైర్ పరిశీలించాడు. రిప్లేలో సుందర్ బంతిని అందుకున్నాకే కింద పడినట్లు చూపించింది. దీంతో చాప్మన్ ఔట్ అయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. కాన్వే 7, గ్లెన్ పిలిప్స్ 2 పరుగులతో ఆడుతున్నారు. Washington Sundar catch.#INDvsNZ #INDvNZpic.twitter.com/Kr0JsJmNs4 — Abdullah Neaz (@Abdullah__Neaz) January 27, 2023 -
ఐదేసిన సౌరభ్ కుమార్.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-ఏతో జరిగిన మూడో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆటలో స్పిన్నర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో (5/103) చెలరేగడంతో టీమిండియా 113 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ అద్భుతమైన పోరాటం కనబర్చి 302 పరుగుల వద్ద ఆలౌటైంది. కివీస్ బ్యాటర్ జో కార్టర్ (230 బంతుల్లో 111; 12 ఫోర్లు, సిక్స్) అద్భుతమై శతకంతో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేయగా.. డీన్ క్లీవర్ (60 బంతుల్లో 44; 9 ఫోర్లు), మార్క్ చాప్మన్ (61 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) తమ వంతు ప్రయత్నం చేశారు. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్‌తో పాటు సర్ఫరాజ్ ఖాన్ (2/48), ఉమ్రాన్ మాలిక్ (1/62), శార్ధూల్ ఠాకూర్ (1/44), ముకేశ్ కుమార్ (1/39) రాణించారు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు డ్రా కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇదే జట్టుతో మూడు అనధికారిక వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. స్కోర్ వివరాలు.. భారత్-ఏ తొలి ఇన్నింగ్స్: 293 ఆలౌట్ (రుతురాజ్ గైక్వాడ్ 108, ఉపేంద్ర యాదవ్ 76; మ్యాథ్యూ ఫిషర్ 4/52) న్యూజిలాండ్-ఏ తొలి ఇన్నింగ్స్: 237 ఆలౌట్ (మార్క్ చాప్మన్ 92, సోలియా 54; సౌరభ్ కుమార్ 4/48, రాహుల్ చాహర్ 3/53) భారత్-ఏ రెండో ఇన్నింగ్స్: 359/7 డిక్లేర్ (రజత్ పాటిదార్ 109, రుతురాజ్ 94, ప్రియాంక్ పంచల్ 62; రచిన్ రవీంద్ర 3/65) న్యూజిలాండ్-ఏ రెండో ఇన్నింగ్స్: 302 ఆలౌట్ (జో కార్టర్ 111, మార్క్ చాప్మన్ 45; సౌరభ్ కుమార్ 5/103) -
SCO Vs NZ: అదరగొట్టిన లీస్క్.. కానీ పాపం చాప్మన్ విజృంభణతో.. ఏకైక వన్డేలోనూ..
Scotland vs New Zealand, Only ODI: టీ20 సిరీస్‌లో స్కాట్లాండ్ను క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్ ఏకైక వన్డే మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. మార్క్ చాప్మన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. కాగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఒక వన్డే మ్యాచ్ ఆడేందుకు కివీస్ స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా మిచెల్ సాంట్నర్ సారథ్యంలోని న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో వరుసగా 68, 102 పరుగులతో స్కాట్లాండ్పై ఘన విజయం నమోదు చేసింది. ఈ క్రమంలో ఏకైక వన్డేలోనూ గెలుపొంది స్కాట్లాండ్ టూర్‌ను విజయంతో పరిపూర్ణం చేసుకుంది. మ్యాచ్ సాగిందిలా! ఎడిన్బర్గ్ వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆతిథ్య స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ మ్యాథ్యూ క్రాస్ 53 పరుగులతో రాణించగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మైఖేల్ లీస్క్ 85 పరుగుల(55 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు)తో అదరగొట్టాడు. 50 for @leasky29 💪#FollowScotland 🏴 pic.twitter.com/nUiVFL2z3Q — Cricket Scotland (@CricketScotland) July 31, 2022 మిగిలిన వాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతావారు ఫర్వాలేదనిపించారు. దీంతో 49.4 ఓవర్లలో 306 పరుగులు చేసి స్కాట్లాండ్ ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో జాకోబ్ డఫీ 3, ఫెర్గూసన్ 2, టిక్నర్ ఒకటి, బ్రాస్‌వెల్ 3 వికెట్లు తీయగా.. డారిల్ మిచెల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అందరూ ఆడేసుకున్నారు! ఇక లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌కు ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (47), ఫిన్ అలెన్(50) శుభారంభం అందించారు. వన్‌డౌన్ బ్యాటర్ క్లీవర్ 32 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన మార్క్ చాప్మన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. WICKET ⚡️ Leasky gets Guptill LBW 👊@BLACKCAPS 128/2 after 23 #FollowScotland 🏴 pic.twitter.com/Bpe4GnIEMm — Cricket Scotland (@CricketScotland) July 31, 2022 75 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. డారిల్ మిచెల్ సైతం 74 పరుగులు(నాటౌట్) చేశాడు. దీంతో 45.5 ఓవర్లకే లక్ష్యం ఛేదించిన న్యూజిలాండ్ ఘన విజయం అందుకుంది. మార్క్ చాప్మన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కాట్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే: ►టాస్: స్కాట్లాండ్- బ్యాటింగ్ ►స్కాట్లాండ్ స్కోరు: 306 (49.4) ►న్యూజిలాండ్ స్కోరు: 307/3 (45.5) ►విజేత: 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్క్ చాప్మన్ చదవండి: ENG VS SA 3rd T20: బట్లర్ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ IND VS WI 2nd T20: టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా.. ? రెండో టీ20లో విండీస్‌తో ఢీకి రెడీ అయిన రోహిత్ సేన -
తమ టి20 చరిత్రలో అత్యధిక స్కోరు.. స్కాట్లాండ్పై భారీ విజయం
స్కాట్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం ఎడిన్బర్గ్ వేదికగా జరిగిన రెండో టి20లో కివీస్ 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఎవరు సెంచరీ మార్క్ అందుకోనప్పటికి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మెన్ బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు, మైకెల్ బ్రాస్‌వెల్(25 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 నాటౌట్) స్కాట్లాండ్ బౌలర్లను ఊచకోత కోయగా.. మిగిలినవారిలో డారిల్ మిచెల్(19 బంతుల్లో 31), జేమ్స్ నీషమ్(12 బంతుల్లో 28), క్లెవర్(16 బంతుల్లో 28) రాణించారు. ఇక న్యూజిలాండ్‌కు టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కాగా టి20ల్లో అత్యధిక స్కోరు అఫ్గనిస్తాన్ పేరిట ఉంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అప్గానిస్తాన్ 278 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం స్కాట్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులే చేయగలిగింది. క్రిస్ గ్రీవ్స్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నీషమ్ 9 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. చాప్మన్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇరుజట్ల మధ్య ఏకైక వన్డే మ్యాచ్ జూలై 31(ఆదివారం) జరగనుంది. చదవండి: Rishabh Pant: పంత్ అరుదైన ఫీట్.. ఈ ఏడాదిలో టీమిండియా తొలి ఆటగాడిగా క్రికెట్ గ్రౌండ్లో ఆత్మాహుతి దాడి.. మ్యాచ్ జరుగుతుండగానే..! -
Mark Chapman: మార్క్ చాప్మన్ అరుదైన రికార్డు.. రెండు దేశాల తరఫున
Ind Vs Nz T20 Series 2021: Mark Chapman 1st Player Score 50 For 2 Countries: అంతర్జాతీయ టి20ల్లో రెండు దేశాల తరఫున అర్ధ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా చాప్మన్ నిలిచాడు. 2014లో తన స్వదేశం హాంకాంగ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన అతను 2015లో ఒమన్‌పై అజేయంగా 63 పరుగులు చేశాడు. ఆపై చాప్మన్ న్యూజిలాండ్‌కు వలస వెళ్లాడు. ఇక ప్రస్తుతం కివీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న చాప్మన్... బుధవారం టీమిండియాతో మొదటి టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో సహచర బ్యాటర్ మార్టిన్ గప్టిల్ చాప్మన్ దగ్గరకు వచ్చి.. అతడిని అభినందించాడు. కాగా జైపూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 కెప్టెన్‌గా పూర్తిస్థాయిలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన తర్వాత.. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో భారత్ మొదటి గెలుపు అందుకుంది. 50 for Mark Chapman! Just after drinks in Jaipur. LIVE scoring | https://t.co/EfsDmsf3YI 📷= BCCI #INDvNZ pic.twitter.com/7PzVrx3T6L — BLACKCAPS (@BLACKCAPS) November 17, 2021 వెంకటేశ్ అయ్యర్ @ 93 మధ్యప్రదేశ్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 93వ ఆటగాడిగా నిలిచిన వెంకటేశ్‌కు కెపె్టన్ రోహిత్ శర్మ క్యాప్ అందించాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ప్రదర్శనతో వెంకటేశ్‌కు గుర్తింపు దక్కింది. 2021 సీజన్ తొలి దశ పోటీల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కని వెంకటేశ్... యూఏఈ లెగ్‌లో 10 మ్యాచ్‌లలో 41.11 సగటు, 4 అర్ధ సెంచరీలతో 370 పరుగులు సాధించాడు. చదవండి: Martin Guptil Vs Deepak Chahar: గప్టిల్ సీరియస్ లుక్.. దీపక్ చహర్ స్టన్నింగ్ రియాక్షన్ -
పాపం ఎలా ఔటయ్యాడో చూడండి
-
వీడియో వైరల్: ఇలా కూడా ఔటవుతారా!
ఆక్లాండ్: ఒక బ్యాట్స్‌మన్ క్యాచ్ రూపంలో కానీ, బౌల్డ్‌గా కానీ, స్టంపింగ్‌గా కానీ, వికెట్లను తాకి హిట్ అవుట్ కానీ పెవిలియన్ చేరడం మాత్రమే మనం ఇప్పటివరకూ చూసుంటాం. అయితే తాజాగా ఒక ఆటగాడు పెట్టుకున్న హెల్మెట్ తల నుంచి జారిపోయి అవుటైన సందర్భం ఎప్పుడైనా చూశామా.. బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసే క్రమంలో నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్ చాప్మన్ హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ బౌలర్ స్టాన్ లేక్ బౌలింగ్‌లో బంతిని హిట్ చేయబోయే సయమంలో హెల్మెట్ ఊడి కిందపడింది. అది వెళ్లి వికెట్లపై నేరుగా పడటంతో చాప్మన్ భారంగా మైదానాన్ని వీడాడు. ఈ తరహాలో అవుట్ కావడంతో ఇలా కూడా ఔటవుతారా అనుకోవడం ప్రేక్షక్షుల వంతైంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో 244 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించి విజయం సాధించిన సంగతి తెలిసిందే.