
హామిల్టన్ వేదికగా పాకిస్తాన్‌తో రెండో వన్డేలో తలపడేందుకు న్యూజిలాండ్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవాలి అని కివీస్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ మార్క్ చాప్‌మన్ గాయం కారణంగా రెండో వన్డేకు దూరమయ్యాడు.
నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా చాప్‌మన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి చాప్‌మన్ బయటకు వెళ్లిపోయాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చాప్‌మన్ రెండో వన్డేకు దూరమయ్యాడు.
ఇది నిజంగా కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పుకోవాలి. తొలి వన్డే చాప్‌మాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 111 బంతుల్లో 132 పరుగులతో తన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేశాడు. ఇక చాప్‌మాన్ స్ధానాన్ని వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్‌తో న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్ భర్తీ చేసింది. సీఫెర్ట్ దాదాపు ఆరేళ్ల తర్వాత న్యూజిలాండ్ వన్డే జట్టులోకి వచ్చాడు.
సీఫర్ట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పాక్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సీఫర్ట్ దుమ్ములేపాడు. సీఫర్ట్ ఐదు మ్యాచ్‌లలో 249 పరుగులతో ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు వన్డే జట్టులో చోటిచ్చారు.
న్యూజిలాండ్ జట్టు: విల్ యంగ్, నిక్ కెల్లీ, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టిమ్ సీఫెర్ట్, ముహమ్మద్ అబ్బాస్, మైకేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్), మిచెల్ హే(వికెట్ కీపర్), నాథన్ స్మిత్, జాకబ్ డఫీ, విలియం ఒరూర్కే, బెన్ సియర్స్, ఆదిత్య అశోక్
చదవండి: IPL 2025, MI VS KKR: చరిత్ర పుటల్లో సూర్యకుమార్