న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌కు పరాభవం ఎదురైంది. స్వదేశంలో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి కూడా ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. నిన్న (ఏప్రిల్ 24) జరిగిన ఐదో టీ20లో పర్యాటక జట్టు గెలవడం ద్వారా 2-2తో సిరీస్ సమమైంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు పాక్ గెలువగా.. మూడు, ఐదు మ్యాచ్‌లలో కివీస్ నెగ్గింది. నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది.
చాప్‌మన్ ఊచకోత.. రిజ్వాన్ మెరుపులు వృధా
రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మహ్మద్ రిజ్వాన్ (62 బంతుల్లో 98 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (22 బంతుల్లో 36), ఇమాద్ వసీం (14 బంతుల్లో 31) ఓ మోస్తరుగా రాణించారు. కివీస్ బౌలర్లలో టిక్నర్ 3, సోధి ఓ వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య ఛేదనలో మార్క్ చాప్‌మన్ (57 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురవేసింది. చాప్‌మన్‌కు జతగా నీషమ్ (45 నాటౌట్) రాణించాడు. పాక్ బౌలర్లలోషాహీన్ అఫ్రిది, ఇమాద్ వసీం చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన చాప్‌మన్‌కు (34, 65*, 16*, 71*, 104*) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 27 నుంచి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment