paksitan
-
అర్షద్ కూడా మా బిడ్డ లాంటివాడే: నీరజ్ చోప్రా తల్లిదండ్రులు
ప్యారిస్ ఒలింపిక్స్-2024లోస్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్లో.. నీరజ్ ఈ సీజన్లోనే అత్యుత్తమగా ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. అయితే.. ఆది నుంచి నీరజ్‌కు గట్టిపోటీగా భావించిన పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ అనూహ్య రీతిలో బల్లాన్ని ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి సంచలనం సృష్టించాడు.ఒలింపిక్ రికార్డు తన అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ రికార్డు నెలకొల్పి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫలితంగా రెండో స్థానానికే పరిమితమైన నీరజ్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. అయితే, చాలా మంది వీరిద్దరి మధ్య పోటీని ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌గా అభివర్ణించారు. కానీ.. ఇలాంటి పోలికలు సరికావని అంటున్నారు నీరజ్ చోప్రా తల్లిదండ్రులు. మా బిడ్డ లాంటివాడేఅర్షద్ను కూడా తమ బిడ్డలాగే భావిస్తామని.. వారిద్దరు పోటీపడుతుంటే చూడముచ్చటగా ఉంటుందని ప్రేమను చాటుకున్నారు. ‘‘ఫైనల్ చూస్తున్నపుడు మేమేమీ కంగారుపడలేదు. మా పిల్లలు అక్కడ పోటీపడినట్లుగా అనిపించింది. మనకు స్వర్ణం వచ్చిందా.. రజత పతకం వచ్చిందా అన్నది ముఖ్యం కాదు. అక్కడున్నవాళ్లంతా ఎంతో కష్టపడి వచ్చినవారే. అయితే, వారిలో వీళ్లిద్దరు అద్భుతంగా ఆడారు’’ అని నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి నీరజ్, అర్షద్ నదీమ్‌పై ప్రశంసలు కురిపించారు. తమ కుమారుడు గాయాల పాలయ్యాడని.. అతడు సాధించిన ఈ వెండి పతకం కూడా పసిడితో సమానమని పేర్కొన్నారు.ఎలాంటి శత్రుత్వం లేదుఇక నీరజ్ వాళ్ల ఆంటీ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ దాయాదుల పోరు అనే చర్చకు తావులేదు. ఇది కేవలం ఆటగాళ్ల మధ్య పోటీ మాత్రమే. నదీమ్‌తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని నీరజ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. నిజానికి అర్షద్ నదీమ్.. కాంపిటీషన్లకు వెళ్తున్నపుడు మేము అతడి కోసం కూడా ప్రార్థిస్తాం. మీడియా వేదికగా నదీమ్ తల్లిదండ్రులకు మేము ఈ విషయం చెప్పేందుకు సంతోషిస్తున్నాం. అతడు ఎల్లప్పుడూ బాగుండాలని మేము కోరుకుంటాం’’ అని పేర్కొన్నారు.ఆ రెండు కలిసి వచ్చాయిఅదే విధంగా.. నీరజ్ చోప్రా తండ్రి సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘అర్షద్ నదీమ్ కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఆటగాడు. అతడు పడ్డ కష్టానికి ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఫలితం దక్కింది. దీనిని మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌గా చూడకూడదు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఆటగాళ్లు అక్కడ పోటీపడ్డారు. ఈరోజు నదీమ్‌ది. హార్డ్‌వర్క్‌తో పాటు అదృష్టం కూడా అతడికి కలిసి వచ్చింది.ఫలితాలు కూడా ఈ రెండింటి కలయికగానే ఉంటాయి’’ అని అన్నారు. ఎన్డీటీవీతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఓ ఆటగాడి తల్లిదండ్రులుగా తాము ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని.. ఒక్కోసారి కొడుకు కళ్లారా చూసుకునే సమయం కూడా ఉండదని ఉద్వేగానికి లోనయ్యారు.చదవండి: #Arshad Nadeem: కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా -
‘పాకిస్తాన్లో అలా ఉండదు.. సూపర్ హిట్ గ్యారెంటీ’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సూపర్ హిట్ అవుతుందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలా కాకుండా ఈ ఈవెంట్ పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఉపఖండ దేశాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యానే తాను ఈ మాట చెప్తున్నట్లు సల్మాన్ బట్ పేర్కొన్నాడు.రూ. 167 కోట్ల మేర నష్టంగతేడాది నుంచి ఐసీసీ టోర్నీల జాతర జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 నిర్వహించగా.. అమెరికా- వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్-2024కు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. అయితే, క్రికెట్‌కు అంతగా క్రేజ్‌లేని అమెరికాలో తొలిసారిగా ఈ ఈవెంట్ నిర్వహించడం వల్ల ఐసీసీ భారీగా నష్టపోయిందనే వార్తలు వచ్చాయి.సుమారు రూ. 167 కోట్ల మేర ఐసీసీ అపెక్స్ కౌన్సిల్‌కు నష్టం వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అమెరికాలో జరిగిన టీ20 టోర్నీకి.. మా దేశంలో జరిగే ఈవెంట్‌కు అసలు పోలికే ఉండదు.టీ20 వరల్డ్‌కప్ కంటే చాంపియన్స్ ట్రోఫీ పెద్ద హిట్ అవుతుంది. నిజానికి అక్కడ(అమెరికా) పిచ్‌లు సరిగా లేవు. జనావాసాలకు స్టేడియాలు చాలా దూరం. అంతేకాదు హోటల్స్ కూడా ఎక్కడో దూరంగా ఉంటాయి. అసలు అక్కడి స్థానికులకు కూడా తమ సిటీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.భద్రత విషయంలోనూ విదేశీయులు మాత్రమే అక్కడికి వెళ్లి మ్యాచ్‌లు వీక్షించారు. అయితే, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఇక్కడి ప్రజలు ఆటగాళ్లను ఆదరించడంతో పాటు ప్రేమిస్తారు, గౌరవిస్తారు కూడా! క్రికెట్ అంటే ఇక్కడి వాళ్లకు చాలా ఇష్టం.అలాగే జట్లు గంటల పాటు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. మహా అయితే.. ఆరు నిమిషాల్లో టీమ్ హోటల్ నుంచి స్టేడియానికి చేరుకోవచ్చు. భద్రత విషయంలోనూ ఎలాంటి సందేహాలు ఉండవు. ఉపఖండ దేశాల్లో ఉన్నట్లు అమెరికాలో క్రికెటర్లకు క్రేజ్ ఉండదు’’ అని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం టీమిండియా పాకిస్తాన్ వెళ్లే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు కోసం ఐసీసీ.. బీసీసీఐ కోరినట్లుగానే పాక్ వెలుపల వేదిక ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
నా కుటుంబం జోలికి వస్తే ఇలాగే చేస్తా: పాక్ స్పీడ్‌స్టర్
పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ హ్యారిస్ రవూఫ్ తనపై జరుగుతున్న ట్రోలింగ్ పట్ల స్పందించాడు. ఆటగాడిగా తనను విమర్శిస్తే పట్టించుకోనని.. అయితే.. తన కుటుంబం జోలికి వస్తే అస్సలు ఊరుకోనని స్పష్టం చేశాడు.ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయంతో కూడా తన సంబంధం ఉండదని.. తన స్పందన ఇలాగే ఉంటుందని రవూఫ్ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.గ్రూప్-ఏలో ఉన్న బాబర్ ఆజం బృందం తొలుత అమెరికా, టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా, ఐర్లాండ్ జట్లపై గెలిచినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లీగ్ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడిన పాక్.. సూపర్-8 రేసు నుంచి అప్పటికే అవుటై పోయింది.పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలుఈ క్రమంలో మాజీ క్రికెటర్లు సహా సొంత అభిమానులు సైతం పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులో ఐక్యత లేకుండా గ్రూపులు కట్టి.. సర్వనాశనం చేశారని మండిపడుతున్నారుఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్ తన భార్యతో కలిసి అమెరికా వీధుల్లో వెళ్తుండగా ఓ వ్యక్తి అతడిని విమర్శిస్తూ మాటల యుద్ధానికి దిగాడు. దీంతో రవూఫ్ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తూ.. అతడి పైకి దూసుకెళ్లాడు.భార్య వద్దని వారిస్తూనే ఉన్నా.. కోపాన్ని నియంత్రించుకోలేక సంమయనం కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్ తొలిసారిగా స్పందించాడు.నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి రానంతవరకే‘‘సోషల్ మీడియా వరకు ఈ విషయం రావొద్దని అనుకున్నా. కానీ వీడియో ఎలాగో బయటకు వచ్చింది. కాబట్టి నేను స్పందించక తప్పడం లేదు.పబ్లిక్ ఫిగర్లుగా ఉన్న కారణంగా పబ్లిక్ నుంచి అన్ని రకాల ఫీడ్‌బ్యాక్‌ను మేము తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లే మమ్మల్ని సమర్థిస్తారు. ఒక్కోసారి విమర్శిస్తారు కూడా!కానీ.. నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి రానంతవరకే నేను వాటన్నింటినీ భరిస్తాను. ఒకవేళ ఈ విషయంలో వాళ్లు హద్దు దాటితే నేను కూడా వారికి తగ్గట్లుగానే బదులిస్తాను.ప్రొఫెషన్లకు అతీతంగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది’’ అని హ్యారిస్ రవూఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో ఈ రైటార్మ్ పేసర్ ఏడు వికెట్లు తీశాడు.pic.twitter.com/KuUSZWoDaq— Haris Rauf (@HarisRauf14) June 18, 2024 -
అనుకున్నది సాధించలేకపోయాం.. కారణం అదే: బాబర్ ఆజం
టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. కెనడాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. ఏడు వికెట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించి సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, రన్‌రేటు పరంగా వేగంగా లక్ష్యాన్ని ఛేదించాలని భావించినా.. పిచ్ స్వభావం కారణంగా వీలుపడలేదని విచారం వ్యక్తం చేశాడు.గ్రూప్-ఏలో భాగమైన పాకిస్తాన్- కెనడాల మధ్య మంగళవారం రాత్రి మ్యాచ్ జరిగింది. న్యూయార్క్ వేదికగా టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెనడా ఓపెనర్ ఆరోన్ జాన్సన్(44 బంతుల్లో 52) అర్థ శతకంతో మెరవగా.. మిగతా వాళ్లలో ఇద్దరు మినహా మిగతా వాళ్లంతా కనీసం పది పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి కెనడా కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారిస్ రవూఫ్, ఆమిర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్యం చిన్నదే అయినా.. దానిని ఛేదించడానికి పాకిస్తాన్ కష్టపడాల్సి వచ్చింది. బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించని పిచ్‌పై పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీ(53 బంతుల్లో 53) చేయగా.. బాబర్ ఆజం(33 బంతుల్లో 33) పరుగులు చేశాడు. మిగత వాళ్లలో సయీమ్ ఆయుబ్ 6, ఫఖర్ జమాన్4, ఉస్మాన్ ఖాన్ 2(నాటౌట్) పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ క్రమంలో 17.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి పాక్ 107 పరుగులు చేయగలిగింది.ఇక గ్రూప్-ఏలో ఉన్న పాక్ ఇప్పటికే వరుసగా యూఎస్ఏ, టీమిండియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, తాజా విజయంతో పాక్ ఖాతాలో రెండు పాయింట్లు చేరినా.. యూఎస్ఏ(4 పాయింట్లు) కంటే వెనుకబడే ఉంది.నిజానికి కెనడాతో మ్యాచ్‌లో పాక్ లక్ష్యాన్ని 14 ఓవర్లలోనే పూర్తి చేస్తే సూపర్-8 దశకు చేరే క్రమంలో యూఎస్ఏకు గట్టి పోటీ ఇచ్చి ఉండేది. ఇక పాక్ అవకాశాలు మెరుగుపడాలంటే తదుపరి ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గెలవడంతో పాటు.. గ్రూప్-‘ఏ’లోని ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో కెనడాపై విజయానంతరం బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘మాకు ఈ గెలుపు అత్యసవరం. మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.తొలి ఆరు ఓవర్లలో మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. అయితే, యూఎస్ఏ కంటే నెట్ రన్‌రేటు పరంగా మెరుగుపడాలనే ఆలోచనతోనే ముందుకు సాగాము. నిజానికి 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సింది. కానీ పిచ్ అందుకు సహకరించలేదు’’ అని పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనతో టోర్నీలో ముందుసాగుతామని బాబర్ ఆజం ఈ సందర్భంగా పేర్కొన్నాడు.గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక ఇలా..ఇండియా- 2(ఆడినవి)- 2(గెలిచినవి) - 0(ఓడినవి) - 4(పాయింట్లు) - +1.455(నెట్ రన్‌రేటు)యూఎస్ఏ- 2(ఆడినవి)- 2(గెలిచినవి)0(ఓడినవి)- 4(పాయింట్లు)- +0.626(నెట్ రన్‌రేటు)పాకిస్తాన్- 3(ఆడినవి)- 1(గెలిచినవి)- 2(ఓడినవి)- 2(పాయింట్లు) - +0.191(నెట్ రన్‌రేటు)కెనడా- 3(ఆడినవి) - 1(గెలిచినవి)- 2(ఓడినవి)- 2(పాయింట్లు)- -0.493(నెట్ రన్‌రేటు)ఐర్లాండ్- 2(ఆడినవి)- 0(గెలిచినవి)- 2(ఓడినవి)- 0(పాయింట్లు)- -1.712(నెట్ రన్‌రేటు) View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC 2024 IND Vs PAK: మ్యాచ్ రూపురేఖల్ని మార్చేసిన బుమ్రా
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్ 9) జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో అద్భుత విజయం సాధించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో బుమ్రా తన ప్రతాపాన్ని చూపి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు (బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్) తీశాడు. భారత్ విజయావకాశాలు పూర్తిగా అడుగంటిన వేళ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మ్యాచ్ రూపురేఖల్నే మార్చేసింది. ఆ ఓవర్లో బుమ్రా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రమాదకారిగా కనిపించిన ఇఫ్తికార్ అహ్మద్‌ను ఔట్ చేశాడు. తన మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ కారణంగా బుమ్రా వరుసగా రెండో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించాడు. పాక్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత బౌలర్లు ఆదిలో విఫలమయ్యారు. 4 ఓవర్లలో పాక్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసి లక్ష్యంగా దిశగా సాగుతుండింది. ఈ దశలో (ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో) బుమ్రా తన అనుభవాన్నంతా రంగరించి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఔట్ చేశాడు. అనంతరం ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మరోసారి బంతిని అందుకున్న బుమ్రా ఈ సారి అప్పటికే క్రీజ్‌లో సెట్ అయిపోయిన రిజ్వాన్‌ను ఔట్‌ను చేసి భారత శిబిరంలో గెలుపుపై ఆశలకు బీజం పోశాడు. ఈ మధ్యలో హార్దిక్ పాండ్యా (4-0-24-2) రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను రక్తి కట్టించగా.. బుమ్రా 19వ ఓవర్లో మరోసారి తన ప్రతాపాన్ని చూపాడు. పాక్ గెలుపు ఖాయమనుకున్న వేళ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలకమైన ఇఫ్తికార్ వికెట్ తీసి పాక్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. పాక్ గెలుపుకు చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. చివరి ఓవర్ నాలుగు, ఐదు బంతులకు నసీం షా బౌండరీలు బాదినప్పటికీ పాక్ ఓటమి అప్పటికే ఖరారైపోయింది. బుమ్రా ప్రదర్శన కారణంగా ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి, సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకుంది. టీ20ల్లో భారత్ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ (120), టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఏ జట్టైనా డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ ఇదే కావడం విశేషం. పాక్‌పై ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో దాయాదిపై తమ రికార్డును (7-1) మరింత మెరుగుపర్చుకుంది. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ బుమ్రా పాక్‌పై ఇలాంటి మ్యాచ్ విన్నింగ్స్ పెర్ఫార్మెన్సే (2/19) కనబర్చి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో బుమ్రాతో పాటు హార్దిక్ చూపిన పట్టుదలకు క్రికెట్ ప్రపంచం మొత్తం జేజేలు పలుకుతుంది. గెలుపు సునాయాసమనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో పాక్ ఆటగాళ్లు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. పాక్‌పై గెలుపు అనంతరం న్యూయార్క్ మైదానంలో భారత అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. పాక్ పేసర్లు చెలరేగడంతో 19 ఓవర్లలో 119 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం భారత పేసర్లు సైతం విజృంభించి పాక్‌కు సాధ్యమైంది తమకెందుకు సాధ్యం కాదన్న రీతిలో ప్రతిఘటించి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించారు. భారత బౌలర్ల దెబ్బకు పాక్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసినప్పటికీ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు చేతిలో ఇంకా 3 వికెట్లు ఉన్నాయి. బుమ్రా, హార్దిక్‌తో పాటు సిరాజ్ (4-0-19-0), అర్ష్‌దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) కూడా రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పంత్ (42) రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ సూపర్-8 అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. -
రాణించిన రషీద్, సాల్ట్.. పాక్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్ 2024కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్ చిత్తుగా ఓడింది. నిన్న (మే 30) ముగిసిన నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా నిన్న జరిగిన నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్‌స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు సాధించారు.అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్‌స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి.ఇదిలా ఉంటే, యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా రేపటి నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్, ఇంగ్లండ్ జట్లు వేర్వేరే గ్రూప్‌ల్లో ఉన్నాయి. పాక్.. భారత్‌తో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుండగా.. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుతో పాటు గ్రూప్-బిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టోర్నీలో భారత్-పాక్‌ల మెగా సమరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
పాక్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 360 పరుగుల తేడాతో ఘన విజయం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ అన్ని విభాగాల్లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ కేవలం 271 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో) పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాథన్ లియోన్ 3, స్టార్క్, కమిన్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి (డిక్లేర్) 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, ఆమిర్ జమాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. పాక్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టిన మిచెల్ మార్ష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా గడ్డపై గడిచిన 24 ఏళ్లలో టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది వరుసగా 15వ ఓటమి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
ఐపీఎల్‌పై మనసు పారేసుకున్న పాకిస్తాన్ స్టార్ బౌలర్
ఐపీఎల్ 2024 సీజన్ వేలానికి ముందు పాకిస్తాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి క్రికెటర్ కోరుకునే విధంగానే తనకు కూడా ఐపీఎల్ ఆడాలని ఉందని అన్నాడు. ఐపీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్‌లలో ఒకటని.. ఇలాంటి లీగ్‌లో ఆడాలని ప్రతి ఆటగాడు కలలు కంటాడని తెలిపాడు. భవిష్యత్తులో అవకాశం వస్తే తాను తప్పక క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొంటానని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు ఓ లోకల్ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ హసన్ అలీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాకిస్తాన్ క్రికెటర్లు కేవలం ఒకే ఒక్క ఎడిషన్‌లో ఆడిన విషయం తెలిసిందే. లీగ్ ప్రారంభమైన తొలి ఏడాది (2008) మాత్రమే పాక్ క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొన్నారు. అనంతరం భారత్-పాక్‌ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో దాయాది దేశ క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కలేదు. 2008 ఎడిషన్‌లో షాహిద్ అఫ్రిది (డెక్కన్ ఛార్జర్స్), షోయబ్ మాలిక్, మొహమ్మద్ ఆసిఫ్ (ఢిల్లీ డేర్ డెవిల్స్), కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్), మిస్బా ఉల్ హాక్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), షోయబ్ అక్తర్, సల్మాన్ బట్, ఉమర్ గుల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), అజహార్ మెహమూద్ (పంజాబ్ కింగ్స్) ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించారు. -
శతాబ్దంలో ఒక్కటీ గెలవలేదు.. ఈ మ్యాచ్‌లోనైనా సౌతాఫ్రికా చరిత్ర తిరగరాస్తుందా..?
సౌతాఫ్రికా-పాకిస్తాన్ జట్ల మధ్య చెన్నై వేదికగా ఇవాళ (అక్టోబర్ 27) కీలక సమరం జరుగనుంది. ప్రస్తుత ఎడిషన్‌లో హ్రాటిక్ పరాజయాలు, చివరి మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. మరోవైపు సౌతాఫ్రికా ఈ టోర్నీలో భారీ విజయాలతో దూసుకుపోతూ, పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. నెదర్లాండ్స్ చేతిలో ఊహించని షాక్ మినహాయించి, ప్రస్తుత ఎడిషన్‌లో సౌతాఫ్రికా పరిస్థితి పాక్‌తో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట భారీ విజయాలు సాధించి, భారత్ కంటే మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంది. పాక్‌దే పైచేయి.. వన్డే ప్రపంచకప్‌లో పాక్-సౌతాఫ్రికాల మధ్య ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు జరగ్గా.. సౌతాఫ్రికా మూడు, పాక్ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఈ శతాబ్దంలో ఒక్కటీ గెలవలేదు.. పాక్-సౌతాఫ్రికాల మధ్య వన్డే, టీ20 వరల్డ్‌కప్‌ల మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఈ శతాబ్దంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. 2009 టీ20 వరల్డ్‌కప్‌లో మొదలైన పాక్ జైత్రయాత్ర 2022 టీ20 వరల్డ్‌కప్ వరకు కొనసాగింది. పాక్.. 2009, 2010, 2012, 2022 టీ20 వరల్డ్‌కప్‌ల్లో.. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌ల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లోనైనా సౌతాఫ్రికా.. పాక్‌ను ఓడిస్తుందో లేదో వేచి చూడాలి. -
ప్రపంచకప్‌లో నేడు కీలక సమరం.. ఆసీస్‌తో పాక్ 'ఢీ'
వన్డే ప్రపంచకప్ 2023లో ఇవాళ (అక్టోబర్ 20) అత్యంత కీలక సమరం జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు ఈ మ్యాచ్ బరిలోకి దిగనున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు కీలకం కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించకుంది. పాక్‌తో పోలిస్తే ఆసీస్‌కే అత్యంత కీలకం ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు చెరి 3 మ్యాచ్‌లు ఆడగా.. పాక్ రెండింటిలో, ఆస్ట్రేలియా ఓ మ్యాచ్‌లో గెలుపొందాయి. ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట ఓడిన ఆసీస్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. పాక్‌తో పోలిస్తే ఆసీస్‌కు ఈ మ్యాచ్‌లో విజయం చాలా అవసరం. సెమీస్ రేసులో నిలవాలంటే ఆసీస్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. సెమీస్ రేసులో న్యూజిలాండ్, భారత్ ముందంజ.. సెమీస్ రేసులో న్యూజిలాండ్, భారత్‌లు ముందంజలో ఉండగా.. సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లు ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్ టాప్-4లోకి చేరి సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా పాక్‌ను ఓడించాలి. ఆరో స్థానంలో ఆసీస్.. నాలుగో ప్లేస్‌లో పాక్ భారత్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడి శ్రీలంకపై కంటితుడుపు విజయాన్ని సాధించిన ఆసీస్.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ తర్వాత ఆరో స్థానంలో ఉండగా.. నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించి, భారత్ చేతిలో ఓడిన పాక్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపోటములు పాయింట్ల పట్టికలో స్థానాలను తారుమారు చేయడంతో పాటు సెమీస్ బెర్తులపై ఓ అవగాహణ తీసుకువస్తాయి. పాక్‌కు ముందుంది ముసళ్ల పండగ.. ఇప్పటివరకు నెదర్లాండ్స్, శ్రీలంక లాంటి చిన్న జట్లను ఓడించిన పాక్.. తదుపరి మ్యాచ్‌ల్లో (ఆసీస్‌తో మ్యాచ్ కాక) సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన జట్లతో పాటు చిన్న జట్లైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఢీకొట్టాల్సి ఉంది. ఆసీస్ విషయానికొస్తే.. భారత్, సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్ల చేతుల్లో ఓడి, శ్రీలంకపై విజయం సాధించిన ఆసీస్.. తదుపరి మ్యాచ్‌ల్లో (పాక్‌తో మ్యాచ్ కాకుండా) చిన్న జట్లైన నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన జట్లతో తలపడాల్సి ఉంది. ఎవరిది పై చేయి..? వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్‌లు జరగ్గా ఆరింట ఆస్ట్రేలియా, నాలుగు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరి వరల్డ్‌కప్‌లో (2019) జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. తుది జట్లు (అంచనా).. ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్ -
పాకిస్తాన్లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు -
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అసెంబ్లీని రద్దు చేసే ముందు ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రతిపక్ష నాయకుడు రజా రియాజ్ తో ఈరోజు సమావేశం కానున్నారు. వీరిద్దరూ కలిసి ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దు తర్వాత పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తారు. ఆగస్టు 11న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దు విషయాన్ని రాష్ట్రపతి అరిఫ్ అల్వి దృష్టికి తీసుకెళ్తూ ఆయనకు లేఖ రాయనున్నారు ప్రస్తుత ప్రధాని షెబాజ్ షరీఫ్. అంతకు ముందే అసెంబ్లీ రద్దయిన తర్వాత ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించడానికి, ఎన్నికలు నిర్వహించడానికి తాత్కాలిక ప్రధానిని నియమించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇందులో భాగంగా ఆయన ప్రతిపక్ష నేత రజా రియాజ్ తో ఈరోజు చర్చించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే షెబాజ్ షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తారు. తాత్కాలిక ప్రధాని రేసులో ఉన్నవారిలో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి హఫీజ్ షేక్, నవాజ్ షరీఫ్ వద్ద ఆర్ధిక కార్యదర్శిగా పనిచేసిన తరీక్ బజ్వా, 2018లో తాతకాలిక ప్రధానిగా పని చేసిన మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ, పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి తస్సాదక్ హుస్సేన్ జిలాని, మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాకేబుల్ బఖీర్, నవాజ్ షరీఫ్ వ్యక్తిగత సహాయకుడు ఫవాద్ హాసన్ ఫవాద్, మాజీ విదేశాంగ శాఖమంత్రి హుస్సేన్ హరూన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. డిసెంబరులో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల ఏర్పాటుకు కొంత సమయం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో అసెంబ్లీని రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం. ప్రభుత్వం రద్దైన మరుక్షణమే పాకిస్తాన్ ఎలక్షన్ కమీషన్ రంగంలోకి దిగి తదుపరి ప్రభుత్వ ఎన్నిక కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. పూర్తి పదవీకాలం పూర్తైన తర్వాత అయితే ఎన్నికలు 60 రోజుల్లోనే నిర్వహిచాల్సి ఉంటుంది. అలా కాకుండా ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే మాత్రం పాక్షితం ఎన్నికల కమిషన్ కు 90 రోజుల గడువు ఉంటుంది. ఈలోపే వారు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: 27 ఏళ్ల తర్వాత థాయ్ యువరాజు రీఎంట్రీ.. అందు కోసమేనా? -
పిల్ల బచ్చాలను పంపమని మేమడిగామా..? టీమిండియాపై పాక్ కెప్టెన్ అతి వ్యాఖ్యలు
శ్రీలంక వేదికగా కొద్ది రోజుల కిందిట జరిగిన ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ ఏసియా కప్-2023 ఫైనల్లో పాకిస్తాన్-ఏ టీమ్.. యువ భారత జట్టుపై 128 పరుగుల తేడాతో గెలుపొంది, ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ గెలుపు తర్వాత కొందరు నెటిజన్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును విమర్శించడం మొదలుపెట్టారు. పాక్ సీనియర్ జట్టుతో (అనుభవం+వయసు) ఆసియా కప్ బరిలోకి దిగిందని, ఫైనల్లో ఓడిన భారత్ యువ జట్టుతో పోరాడిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లపై తాజాగా పాక్-ఏ జట్టు కెప్టెన్ మహ్మద్ హరీస్ స్పందించాడు. తమ గెలుపును ఒప్పుకోని వారికి హరీస్ చురకలంటించాడు. అంతర్జాతీయ అనుభవం లేని యువ భారత జట్టును ఆసియా కప్‌కు పంపమని తాము బీసీసీఐని అడగలేదని, అనుభవజ్ఞులున్నారంటున్న తమ జట్టులో ఒకరిద్దరూ మాత్రమే 10 లోపు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారని కౌంటరిచ్చాడు. మాకు పదుల సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంటే, ఆసియా కప్ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లకు వందల సంఖ్యలో (260 మ్యాచ్‌లు) ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది కదా అని ఎదురుదాడికి దిగాడు. పెద్ద వయసు వారిని బరిలోకి దించామని అంటున్నారు.. భారత్-ఏ టీయ్ యావరేజ్ వయసు 20.80 అయితే, పాక్-ఏ జట్టు సగటు వయసు 23.20 అని, వయసు రిత్యా ఇది పెద్ద తేడా కాదని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. వాస్తవానికి బీసీసీఐ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ అనుభవం కూడా లేని యువ భారత జట్టును ఎమర్జింగ్ ఆసియా కప్‌కు పంపింది. అదే పాక్ మాత్రం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న ఏడుగురు ఆటగాళ్లను బరిలోకి దించింది. కెప్టెన్ సహా ఆ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు పాక్ టీ20 జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. ఎలాగైనా ఆసియా కప్ గెలవాలనే కుయుక్తితో పీసీబీ ఉద్దేశపూర్వకంగానే సీనియర్ జట్టును బరిలోకి దించిందన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు యువకులతో కూడిన జట్టే అయినా భారత్ ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించింది. ఫైనల్ వరకు చేరింది. అయితే ఫైనల్లో కొన్ని తప్పిదాల కారణంగా పాక్‌కు మ్యాచ్ అప్పగించింది. కెప్టెన్ యశ్ ధుల్, సాయి సుదర్శన్, నికిన్ జోస్, నిషాంత్ సింధు, మానవ్ సుతార్, హర్షీత్ రాణా, హంగార్గేకర్ అద్భుతంగా రాణించారు. ఫైనల్లో తయ్యాబ్ తాహిర్ సెంచరీ చేయడంతో పాక్ 352 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన భారత్ 224 పరుగులకు ఆలౌటైంది. -
వరల్డ్ కప్‌లో మరో మ్యాచ్ తేదీ మార్పు.. ఇది కూడా పాక్ మ్యాచే..!
వన్డే వరల్డ్‌కప్‌లో మరో మ్యాచ్ తేదీ మార్పు జరుగనుందని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దేవీ నవరాత్రుల ప్రారంభ తేదీ (అక్టోబర్ 15) కావడంతో భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్డ్ తేదీ కంటే ఒక రోజు ముందే జరుగుతుందన్న ప్రచారం నడుస్తుండగానే.. నవంబర్ 12న జరగాల్సిన పాకిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్ తేదీలో కూడా మార్పు ఉంటుందని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. పాక్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు వేదిక అయిన కోల్‌కతాలో నవంబర్ 12న కాళీ పూజ ఘనంగా జరుగనుండటంతో, ఆ రోజు పాక్ మ్యాచ్ నిర్వహిస్తే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయని కోల్‌కతా పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు (క్యాబ్) లేఖ రాసారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశాన్ని క్యాబ్ అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ కొట్టిపారేయడం విశేషం. తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో స్నేహశిష్ మాట్లాడుతూ.. కోల్‌కతా పోలీసుల నుంచి తమకు ఎలాంటి లేఖ రాలేదని చెప్పారు. ఒక వేళ ఇలాంటిది ఏమైనా ఉంటే పరిశీలిస్తామని అన్నారు. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న జరిగే ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై) అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ) అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్) (ఈ మ్యాచ్ ఒక రోజు ముందే జరగవచ్చు) అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే) అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల) అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో) నవంబర్ 2: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-2 (ముంబై) నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా) నవంబర్ 11: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (బెంగళూరు) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వబోయే మ్యాచ్‌లు ఇవే.. అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-1 అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్-1 అక్టోబర్ 12 (గురువారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-2 -
Shahid Afridi-Shaheen Afridi: ఒకే రోజు ఇరగదీసిన మామ అల్లుళ్లు
పాకిస్తాన్ ఆటగాళ్లు, మామ అల్లుళ్లు షాహిద్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలు వేర్వేరు క్రికెట్ లీగ్‌ల్లో ఒకే రోజు (ఆగస్ట్ 2) బంతితో రాణించారు. మామ షాహిద్ అఫ్రిది గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో సత్తా చాటితే.. ఆల్లుడు షాహీన్ అఫ్రిది ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌లో ఇరగదీశాడు. మెన్స్ హండ్రెడ్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది 10 బంతులు వేసి 2 వికెట్లు పడగొట్టగా.. గ్లోబల్ టీ20 లీగ్‌లో వాంకోవర్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది 4 ఓవర్లు వేసి కేవలం 16 మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరు అఫ్రిదిలు వికెట్లు పడగొట్టాక ఒకే తరహాలో చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. షాహిద్, షాహీన్‌లు వికెట్ పడగొట్టాక రెండు చేతులు పైకి లేపి అచ్చు గుద్దినట్లు సంబురాలు చేసుకున్నారు. కాగా, మామ అల్లుళ్లు ఒకే రోజు ఒకే తరహాలో సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ.. ఒక్కరు మాత్రమే జట్టు విజయంలో భాగమయ్యారు. షాహీన్ జట్టు వెల్ష్‌ఫైర్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై 9 పరుగుల తేడాతో గెలుపొందగా.. షాహిద్ జట్టు టొరొంటో నేషనల్స్.. వాంకోవర్ నైట్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లతో రాణించిన షాహీన్.. ఆతర్వాత తాను వేసిన 5, 6, 7, 8, 10 బంతులకు బౌండరీలు సమర్పించుకోవడం విశేషం. -
చెలరేగిన పాక్ బ్యాటర్లు.. డబుల్ సెంచరీ, సెంచరీతో పాటు రెండు ఫిఫ్టీలు
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 132 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 563 పరుగులు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 178/2తో ఆట కొనసాగించిన పాకిస్తాన్ మూడు వికెట్లు చేజార్చుకొని 385 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (201; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేయగా... ఆఘా సల్మాన్ (132 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో షఫీక్,సల్మాన్‌తో పాటు షాన్ మసూద్ (51), సౌద్ షకీల్ (57) కూడా రాణించారు. ప్రస్తుతం పాక్ 397 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. రికార్డు డబుల్ సెంచరీ బాదిన అబ్దుల్లా షఫీక్.. లంకతో రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్.. ఈ ఘనత సాధించిన మూడో పాక్ యంగెస్ట్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు జావెద్ మియాందాద్, హనీఫ్ మొహమ్మద్‌లు అతి పిన్న వయసులో డబుల్ సాధించారు. అలాగే షఫీక్.. లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి పాక్ ఓపెనర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. -
Asia Cup 2023: రేపే భారత్-పాక్ సమరం
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు కత్తులు దూసుకోనున్నాయి. గ్రూప్-బిలోని ఆఖరి మ్యాచ్‌లో ఈ ఇరు జట్లు ఎదురెదురుపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాక్‌లు గ్రూప్ దశలో చెరి రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పరంగా సమంగా ఉన్నాయి. అయితే పాక్ (2.875)తో పోలిస్తే భారత్ (3.792)కు మెరుగైన రన్‌రేట్ ఉండటంతో ప్రస్తుతానికి యంగ్ ఇండియా గ్రూప్ టాపర్‌గా ఉంది. గ్రూప్ దశలో భారత్, పాక్‌లు.. యూఏఈ, నేపాల్ జట్లపై విజయాలు సాధించాయి. మరోవైపు గ్రూప్-ఏలో రసవత్తర పోరు సాగుతుంది. ఆప్ఘనిస్తాన్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలతో గ్రూప్ టాపర్‌గా ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు 2 మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెలిచి గ్రూప్‌లో రెండో బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఒమన్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో టాపర్లుగా ఉన్న రెండు జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ (జులై 18) బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు.. శ్రీలంక- ఒమన్ జట్లు తలపడనున్నాయి. రేపు భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు నేపాల్-యూఏఈ మ్యాచ్ కూడా జరుగనుంది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. యూఏఈపై 8 వికెట్ల తేడాతో, నేపాల్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూఏఈపై బౌలర్లలో హర్షిత్ రాణా (4), నితీష్ రెడ్డి (2), మానవ్ సుతార్ (2), అకాశ్ సింగ్ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్ యశ్ ధుల్ అజేయ శతకంతో (108) మెరిశాడు. నికిన్ జోస్ (41 నాటౌట్) పర్వాలేదనిపించాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో నిషాంత్ సింధు (4), హంగార్గేకర్ (3), హర్షిత్ రాణా (2), మానవ్ సుతార్ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ (58 నాటౌట్), అభిషేక్ శర్మ (87) దృవ్ జురెల్ (21 నాటౌట్) మెరిశారు. -
SL VS PAK 1st Test: ధనంజయ డిసిల్వ సూపర్ సెంచరీ
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక జట్టు ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. గాలే వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వ (122) సూపర్ సెంచరీతో మెరవగా.. ఏంజెలో మాథ్యూస్ (64) అర్ధసెంచరీతో రాణించాడు. వీరు మినహా మిగతా వారెవ్వరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు లంచ్ సమయానికి లంక ఇన్నింగ్స్ ముగిసింది. 10వ సెంచరీ పూర్తి చేసిన ధనంజయ.. కష్ట సమయంలో (54/4) క్రీజ్‌లోకి వచ్చిన ధనంజయ బాధ్యతాయుతంగా ఆడి, జట్టు స్కోర్ 300 దాటించడంతో పాటు కెరీర్లో 10వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఏంజెలో మాథ్యూస్‌తో కలిసి 131 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ధనంజయ, టెయిలెండర్లతో కలిసి మరిన్ని పరుగులు జోడించాడు. 31 ఏళ్ల ధనంజయకు పాక్‌పై ఇది మూడో సెంచరీ కాగా.. తన 50వ టెస్ట్ మ్యాచ్‌లో అతను సెంచరీ చేయడం విశేషం. కెరీర్‌తో 88 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడిన ధనంజయ.. 10 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 3152 పరుగులు చేశాడు. -
Viral Video: కళ్లు చెదిరే క్యాచ్..!
పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య ఇవాళ (జులై 16) మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ ఒకటి నమోదైంది. పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్ ఈ క్యాచ్ పట్టాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇమామ్.. గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. అఘా సల్మాన్ బౌలింగ్‌లో ఈ ఫీట్ నమోదైంది. ఇమామ్ సూపర్ క్యాచ్ పట్టడంతో సమరవిక్రమ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. Imam ul Haq with a superb catch@ImamUlHaq12#PakistanCricket #PAKvSL #CricketTwitter pic.twitter.com/gXtjHezRF4 — Hamza Siddiqui (@HamzaSiddiqui56) July 16, 2023 ఇమామ్ విన్యాసానికి ఫిదా అయిపోయిన క్రికెట్ అభిమానులు, సోషల్‌మీడియా వేదికగా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాటే క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇమామ్ క్యాచ్ పట్టిన వెంటనే అంపైర్లు తొలి రోజు ఆటకు ముగించారు. పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు కేవలం 65.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వ (94) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డిసిల్వతో పాటు ఏంజెలో మాథ్యూస్ (64) అర్ధసెంచరీలతో రాణించారు. నిషాన్ మధుష్క (4), కుశాల్ మెండిస్ (12), దినేశ్ చండీమాల్ (1) విఫలం కాగా.. దిముత్ కరుణరత్నే (29), సదీర సమరవిక్రమ (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఇండియా-పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ఎప్పుడు... ఎక్కడంటే?
-
బాబర్ ఆజమ్‌కు షాక్.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అనామక ప్లేయర్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు షాక్ తగిలింది. బాబర్‌ను కాదని ఓ అనామక జట్టు ప్లేయర్ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలుచుకున్నాడు. ఐర్లాండ్‌కు చెందిన హ్యారీ టెక్టార్ 2023 మే నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యాడు. మే నెలలో టెక్టార్‌తో పోలిస్తే బాబర్ ప్రదర్శనలే మెరుగ్గా ఉన్నప్పటికీ, అవార్డు టెక్టార్నే వరించింది. టెక్టార్, బాబర్‌తో పాటు బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ షాంటో ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో ఉండగా.. స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు టెక్టార్కే అధిక ఓట్లు వేసి గెలిపించారు. పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుతో పాటు మహిళల విభాగంలోనూ ఈ అవార్డు విజేతను ప్రకటించారు. అవార్డు రేసులో శ్రీలంక ప్లేయర్స్ చమారి ఆటపట్టు, హర్షిత మాధవి, థాయ్‌లాండ్ క్రికెటర్ థిపోట్చా పుత్తవాంగ్ ఉండగా.. 19 ఏళ్ల థాయ్ క్రికెటర్ థిపోట్చా పుత్తవాంగ్‌ను ఈ అవార్డు వరించింది. కాగా, ప్రతి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే. మే నెలలో నామినీస్ ప్రదర్శనలు.. బాబర్ ఆజమ్: న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 3, 4, 5 వన్డేల్లో 54, 107, 117 పరుగులు నజ్ముల్ షాంటో: ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో 44, 117, 35 పరుగులు హ్యారీ టెక్టార్: బంగ్లాదేశ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 21, 140, 45 పరుగులు చదవండి: WTC Final 2023: ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్‌గా ఈ ఐదుగురు క్రికెటర్లు -
World Cup 2023: భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోదు..!
ఆసియా కప్-2023 వేదిక వివాదం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ తక్ చానల్‌తో ఆయన మాట్లాడుతూ.. వన్డే వరల్డ్‌కప్-2023 కోసం తమ జట్టు భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోదని అన్నాడు. పాక్ ఆడాల్సిన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై నిర్వహిస్తేనే తాము వరల్డ్‌కప్ ఆడతామని, లేదంటే లేదని తెగేసి చెప్పాడు. భారత్-పాక్ జట్ల మధ్య వరల్డ్‌కప్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనుందన్న ప్రచారం నేపథ్యంలో పీసీబీ ఈ రకంగా స్పందించింది. కాగా, భారత్-పాక్‌ల మధ్య ఈ క్రికెట్ వివాదం ఆసియా కప్ వేదిక మార్పు నేపథ్యంలో మొదలైంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో ఆసియా కప్-2023 జరిగితే తాము ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనేది లేదని బీసీసీఐ తెగేసి చెప్పింది. దీంతో పీసీబీ వెనక్కు తగ్గింది. తటస్థ వేదికపై (యూఏఈ) భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు నిర్వహించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనికి బీసీసీఐ సైతం అంగీకారం తెలిపింది. దీంతో మెగా టోర్నీ సజావుగా సాగుతుందని అంతా అనుకున్నారు. అయితే ఆసియా కప్ జరిగే సెప్టెంబర్ మాసంలో యూఏఈలో ఎండలు అధికంగా ఉంటాయన్న విషయాన్ని సాకుగా చూపుతూ, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు యూఏఈ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నాయి. దీంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీసీ.. యూఏఈ, పాక్‌లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటుంది. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు తాము అంగీకరించినప్పుడు.. కొత్తగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అనవసర లొల్లి చేయడం సరికాదని అంటుంది. గతంలో ఐపీఎల్, ఆసియా కప్ టీ20 టోర్నీలు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో యూఏఈలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒకవేళ కాదు కూడదని టోర్నీని శ్రీలంకలోనే నిర్వహిస్తామంటే తాము వైదొలుగుతామని బెదిరింపులకు దిగుతుంది. ఆసియా కప్ వేదికను పాక్ నుంచి శ్రీలంక మార్చాలని ఏసీసీ యోచిస్తున్న తరుణంలో పాక్ అవకాశవాద రాజకీయానికి తెర లేపింది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహిస్తేనే టోర్నీలో పాల్గొంటామని, లేదంటే లేదని అంటుంది. బీసీసీఐ కోరినట్లు టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహించేందుకు తాము ఒప్పుకున్నప్పుడు.. బీసీసీఐ కూడా తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలని, లేదంటే తాము వరల్డ్‌కప్‌లో పాల్గొనేదే లేదని తెగేసి చెప్పింది. చదవండి: టీమిండియా క్రికెటర్లేమైనా ఏలియన్సా..? నోరు పారేసుకున్న పాక్ ఫాస్ట్ బౌలర్ -
చరిత్ర సృష్టించిన శ్రీలంక
బౌలర్లు రమేశ్ మెండిస్ (5/64), ప్రభాత్ జయసూర్య (2/88), అసిథా ఫెర్నాండో (3/30) రాణించడంతో... ఐర్లాండ్‌తో గాలెలో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 10 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో కరుణరత్నే కెప్టెన్సీలోని శ్రీలంక రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. 1982లో టెస్ట్ హోదా పొందిన శ్రీలంక జట్టుకిది 100వ టెస్టు విజయం కావడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 54/2తో ఆట చివరిరోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ 77.3 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. భారత్, పాకిస్తాన్ల తర్వాత.. 1982లో టెస్ట్ హోదా పొందిన శ్రీలంక.. ఐర్లాండ్‌పై రెండో టెస్ట్‌లో విజయంతో 100వ విక్టరీ సాధించింది. 311 టెస్ట్‌ల్లో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఆసియా దేశాల్లో భారత్ (569 టెస్ట్‌ల్లో 172 విజయాలు), పాక్ (451 టెస్ట్‌ల్లో 146 విజయాలు) ల తర్వాత శ్రీలంక ఈ అరుదైన జాబితాలో చేరింది. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఆసీస్.. 853 టెస్ట్‌ల్లో 405 విజయాలు సాధించింది. ఇక, అత్యధిక టెస్ట్‌లు ఆడిన రికార్డు ఇంగ్లండ్ (1060) పేరిట ఉంది. -
న్యూజిలాండ్ బ్యాటర్ ఊచకోత.. పాక్‌కు పరాభవం
న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌కు పరాభవం ఎదురైంది. స్వదేశంలో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి కూడా ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. నిన్న (ఏప్రిల్ 24) జరిగిన ఐదో టీ20లో పర్యాటక జట్టు గెలవడం ద్వారా 2-2తో సిరీస్ సమమైంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు పాక్ గెలువగా.. మూడు, ఐదు మ్యాచ్‌లలో కివీస్ నెగ్గింది. నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. చాప్మన్ ఊచకోత.. రిజ్వాన్ మెరుపులు వృధా రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మహ్మద్ రిజ్వాన్ (62 బంతుల్లో 98 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (22 బంతుల్లో 36), ఇమాద్ వసీం (14 బంతుల్లో 31) ఓ మోస్తరుగా రాణించారు. కివీస్ బౌలర్లలో టిక్నర్ 3, సోధి ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో మార్క్ చాప్మన్ (57 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురవేసింది. చాప్‌మన్‌కు జతగా నీషమ్ (45 నాటౌట్) రాణించాడు. పాక్ బౌలర్లలోషాహీన్ అఫ్రిది, ఇమాద్ వసీం చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన చాప్‌మన్‌కు (34, 65*, 16*, 71*, 104*) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 27 నుంచి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. -
పాకిస్తాన్ క్రికెట్లో సమూల మార్పులు.. తొలుత కెప్టెన్, తాజాగా కోచ్‌లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జాతీయ జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. రమీజ్ రాజా నుంచి పీసీబీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక, తొలిసారి జట్టు మొత్తం ప్రక్షాళణ చేపట్టిన నజమ్ సేథీ.. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను, హెడ్ కోచ్‌గా అబ్దుల్ రెహ్మాన్‌ను, బ్యాటింగ్ కోచ్‌గా మహ్మద్ యూసఫ్‌ను, బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్‌ను నియమించింది. సెలెక్షన్ కమిటీ నూతన చీఫ్ హరూన్ రషీద్ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్ లోడ్ పాలసీని బూచిగా చూపుతూ తొలుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను పక్కకు పెట్టిన పీసీబీ.. తాజాగా హెడ్ కోచ్, కోచింగ్ సిబ్బంది, నాన్ కోచింగ్ సిబ్బందిపై వేటు వేసి వారి స్థానాల్లో కొత్త వారిని నియమించింది. ఈ మార్పులన్నీ తాత్కాలికమేనని పీసీబీ చెబుతున్నప్పటికీ.. ఈ స్థాయిలో ప్రక్షాళణ జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. గత కొంతకాలంగా బాబర్ ఆజమ్‌పై గుర్రుగా ఉన్న పీసీబీ పలు మార్లు అతన్ని తప్పించి సారధ్య బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేసింది. అయితే బాబర్‌కు ఉన్న బలమైన కోఠరి కారణంగా అది సాధ్యపడలేదు. తాజాగా పీసీబీ చీఫ్ ఏదైతే అదైందని తెగించి ప్రక్షాళణకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. @TheRealPCB announces Support Personnel for Sharjah T20Is. Abdul Rehman, Head Coach; Umar Gul, Bowling Coach; M Yousuf, Batting Coach; A Majeed, Fielding Coach; Drikus Simon, Trainer; Cliffe Deacon, Physio; Talha Ijaz, Analyst; Mansoor Rana, Manager; Ahsan Nagi, Media. #PAKvAFG — Najam Sethi (@najamsethi) March 14, 2023 కాగా, షార్జా వేదికగా మార్చి 24, 26, 27 తేదీల్లో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు మాత్రమే తాజాగా జరిగిన మార్పులన్నీ (కెప్టెన్, కోచింగ్, నాన్ కోచింగ్ స్టాఫ్) వర్తిసాయని పీసీబీ ప్రకటిన విడుదల చేసినప్పటికీ, ఎక్కడో ఏదో జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బాబర్ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సైమ్ అయూబ్, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) స్టార్లకు జట్టులో తొలిసారి అవకాశం కల్పించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు.. షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్ -
పాక్ క్రికెట్ స్టేడియం వద్ద పేలుళ్లు.. ఇండియన్స్‌పై నోరు పారేసుకున్న పాకిస్తానీలు
పాకిస్తాన్లో ఏ మూలన ఏం జరిగినా ఇండియాపై, ఇండియన్స్‌పై నోరు పారేసుకోవడం పాకిస్తానీలకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జరిగిన ఓ సంఘటనను సంబంధించి కూడా పాకీలు ఇలాగే భారతీయులపై అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2023 సీజన్ సన్నాహకాల్లో భాగంగా క్వెట్టా స్టేడియం (భుగ్తీ) వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 5) పెషావర్ జల్మీ - క్వెట్టా గ్లాడియేటర్స్ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంకు అతి సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. There is no bomb blast in bughti cricket stadium quetta this is the reason please see this carefully especially for indians #bugticricketstadiu #quettavspz #psl pic.twitter.com/IqHTTOYVzR — Sardar Hamid Ghaffar Thaheem (@SardarHamidGha1) February 5, 2023 ఈ పేలుళ్లలో పదలు సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. పేలుళ్లకు కారణాలు తెలియరానప్పటికీ.. అక్కడికి అతి సమీపంతో పాక్ అంతర్జాతీయ క్రికెటర్లు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నందున అధికారులు మ్యాచ్‌ను రద్దు చేసి హుటాహుటిన ఆటగాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మ్యాచ్ జరుగుతుండగా స్డేడియం మొత్తాన్ని పొగ ఆవహించడంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. జనాలు స్డేడియం నుంచి బయటకు వెళ్లే క్రమంలో తొక్కసలాట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. Just a clarification No bomb blast near bugti stadium The match is stopped because some persons from outside threw stones and put something on fire They are being identified. Endians are making propaganda, don't give them importance.#PZvsQG #Quetta pic.twitter.com/jmgbU9ODHj — Ali Asghar Wattoo (@Ali1Wattoo) February 5, 2023 అయితే, పేలుళ్లను ఆతర్వాత స్టేడియంలో నెలకొన్న పరిణామాలను పాక్ నెటిజన్లు వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. పేలుళ్ల కారణంగా ఎక్కడ ఆసియా కప్-2023 నిర్వహణ తమ దేశం నుంచి తరలిపోతుందోనని సీన్‌ను వేరేలా క్రియేట్ చేశారు. అసలు విషయాన్ని దాచే క్రమంలో పాక్ అభిమానులు భారతీయులపై బురదజల్లుతున్నారు. పాక్‌లో ఆసియా కప్ నిర్వహించడం బీసీసీఐకు భారతీయులకు ఇష్టం లేదని, అందుకే పేలుళ్లను బూచిగా చూపి సోషల్‌మీడియాలో విషప్రచారం చేస్తున్నారని అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. Iftikhar Ahmed smashed 6 sixes in a single over in the PSL exhibition match.pic.twitter.com/s3NRRmrcZl — Johns. (@CricCrazyJohns) February 5, 2023 పేలుళ్లకు మ్యాచ్ రద్దు చేయడానికి అస్సలు సంబంధం లేదని, మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియం వద్దకు చేరారని, వారిలో చాలామందికి లోనికి ప్రవేశం లభించలేదని, అలాంటి వారు బయట నుంచి స్టేడియంలోకి రాళ్లు విసరడంతో ఆందోళన జరిగిందని లేని విషయాన్ని కథగా అల్లారు. కొందరు పాకీలు అయితే ఏదో ఫేక్ వీడియోను ట్రోల్ చేస్తూ.. స్టేడియం వద్ద జరిగింది ఇది, అసత్యాలను ప్రచారం చేస్తున్న భారతీయుల కోసమే ఇది అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు భారతీయులు సైతం ధీటుగా జవాబిస్తున్నారు. విషప్రచారాలు చేయడం పాకీలకే చెల్లుతుంది.. పేలుళ్లు జరిగినా, జరగకపోయినా ఆసియాకప్ ఆడేందుకు పాక్‌లో అడుగుపెట్టేది లేదంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే, క్వెట్టా స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్లో మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్.. అదే దేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన స్పోర్ట్స్ మినిస్టర్ వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో 6 వరుస బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. -
పాకిస్తాన్ క్రికెట్లో వినూత్న ప్రయోగం.. చరిత్రలో తొలిసారి..!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆన్లైన్లో కోచింగ్ తీసుకోనున్న జట్టుగా పాక్ క్రికెట్ జట్టు రికార్డుల్లోకెక్కనుంది. ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ (ఆస్ట్రేలియా).. నాలుగేళ్ల తర్వాత తిరిగి పాక్ హెడ్ కోచ్‌గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని పాక్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పీసీబీ బాస్ నజమ్ సేథీ గతవారం ఓ క్లూ వదిలాడు. ఆర్థర్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, 90 శాతం సమస్యకు పరిష్కారం దొరికిందని, పీసీబీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతుందని సేథీ గతవారం ఓ ప్రెస్మీట్లో వెల్లడించాడు. ప్రస్తుత పాక్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో నూతన హెడ్ కోచ్‌ను నియమించుకునేందుకు పీసీబీ వేగంగా పావులు కదుపుతోంది. ఆర్థర్.. పీసీబీ తొలి దశ ప్రయత్నాల్లో పాక్ కోచ్‌గా వ్యవహరించేందుకు ససేమిరా అన్నప్పటికీ.. ఆన్లైన్ కోచింగ్ ప్రతిపాదన నచ్చి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం డెర్బీషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆర్థర్.. మెజార్టీ శాతం పాక్ పాల్గొనబోయే టోర్నీలకు ఆన్లైన్ కోచింగ్ అందించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు మాత్రం ప్రత్యక్షంగా అందుబాటులో ఉండేందుకు అంగీకరించాడని సమాచారం. కాగా, మిక్కీ ఆర్థర్ ఆథ్వర్యంలో పాకిస్తాన్ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించడంతో ఆర్థర్ తన పదవికి రాజీనామా చేసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే, పీసీబీ ఆన్లైన్ కోచ్ ప్రతిపాదనపై వారి సొంత దేశంలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. స్వదేశంలో నాణ్యమైన కోచ్‌లు లేకనా అంటూ పాక్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. -
బాబర్ ఆజమ్‌కు డబుల్ ధమాకా.. వన్డే క్రికెటర్ అవార్డుతో పాటు ఐసీసీ అత్యున్నత ట్రోఫీ
Sir Garfield Sobers Trophy 2022: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఈ ఏడాది ఐసీసీ అవార్డుల పంట పండింది. ఇప్పటికే ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు దక్కించుకున్న బాబర్.. తాజాగా ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఇందుకు గానూ ఐసీసీ బాబర్‌ను సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ-2022తో సత్కరించింది. ఈ అవార్డు రేసులో బాబర్‌తో పాటు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలు పోటీ పడినప్పటికీ, ఐసీసీ వరల్డ్ గవర్నింగ్ బాడీ బాబర్ వైపే మొగ్గుచూపింది. బాబర్ 2022లో అన్ని ఫార్మాట్లలో కలిపి 44 మ్యాచ్‌ల్లో 54.12 సగటున 2598 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఐసీసీ బాబర్‌ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. Double delight for Babar Azam 🤩After being named the ICC Men's ODI Cricketer of the Year, the Pakistan star bags the Sir Garfield Sobers Trophy for the ICC Men's Cricketer of the Year 👏#ICCAwards— ICC (@ICC) January 26, 2023 2021లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న బాబర్.. వరుసగా రెండో ఏడాది కూడా అవార్డు దక్కించుకున్నాడు. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి తర్వాత వరుసగా రెండో ఏడాది ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న ఆటగాడిగా బాబర్ రికార్డులకెక్కాడు. 2022లో బాబర్ 9 వన్డేల్లో 84.87 సగటున మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 679 పరుగులు చేశాడు. ప్రస్తుతం బాబర్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. 2021 జూలైలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్న బాబర్.. దాదాపు ఏడాదిన్నరగా ఐసీసీ టాప్ వన్డే బ్యాటర్‌గా చలామణి అవుతున్నాడు. మరోవైపు, ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ అఫ్ ద ఇయర్ 2022 అవార్డును ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నతాలీ సీవర్ గెలుచుకుంది. సీవర్ గతేడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 33 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు, 1346 పరుగులు చేసింది. ఈ అవార్డుకు ముందు సీవర్ 2022 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకుంది. England's talismanic all-rounder caps off a phenomenal 2022 with the Rachael Heyhoe Flint Trophy for ICC Women’s Cricketer of the Year 👌#ICCAwards— ICC (@ICC) January 26, 2023 ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ అఫ్ ద ఇయర్ 2022 అవార్డు గెలుచుకున్నందుకు గానూ ఐసీసీ సీవర్‌ను రేచల్ హేహోయ్ ఫ్లింట్ ట్రోఫీతో (Rachael Heyhoe Flint Trophy) సత్కరించింది. కాగా, మెన్స్, వుమెన్స్ విభాగంలో వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు (2022) గెలిచిన ప్లేయర్లు (బాబర్, సీవర్) ఐసీసీ క్రికెటర్ అఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకోవడం విశేషం. -
నేనే నంబర్ వన్, నా తర్వాతే కోహ్లి.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లితో పోల్చుకుంటూ పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఖుర్రమ్ మన్సూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 36 ఏళ్ల ఈ పాకిస్తానీ ఔట్ డేటెడ్ బ్యాటర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ.. 50 ఓవర్ల ఫార్మాట్లో (లిస్ట్-ఏ) విరాట్ కోహ్లి కంటే నేనే బెటర్, ఈ ఫార్మాట్లో కోహ్లి రికార్డులు నా రికార్డుల ముందు బలాదూర్, ప్రపంచంలో నేనే నంబర్ వన్ బ్యాటర్ అంటూ తన డప్పు తాను కొట్టుకున్నాడు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఖుర్రమ్ తన అవివేకాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. విరాట్‌తో పోల్చుకోవడం తన ఉద్దేశం కాదని, వాస్తవానికి 50 ఓవర్ల క్రికెట్లో టాప్-10 బ్యాటర్స్‌లో నేనే ప్రపంచ నంబర్ వన్ అని, రికార్డుల ప్రకారం కోహ్లి నా తర్వాతే ఉంటాడని ఇష్టమొచ్చినట్లు వాగాడు. లిస్ట్-ఏ క్రికెట్లో నా కన్వర్జన్ రేట్ బెటర్‌గా ఉందని, ఇందుకు గణాంకాలే సాక్షమని అన్నాడు. 50 ఓవర్ల క్రికెట్లో కోహ్లి ప్రతి 6 ఇన్నింగ్స్‌లకు సెంచరీ చేస్తే, నేను ప్రతి 5.68 ఇన్నింగ్స్‌లకే సెంచరీ బాదాను అని చెప్పుకొచ్చాడు. గత 10 ఏళ్లుగా ఈ ఫార్మాట్లో తన సగటు 53గా ఉందని, ప్రపంచ లిస్ట్-ఏ క్రికెట్ గణాంకాల్లో తాను ఐదో స్థానంలో ఉన్నానని తెలిపాడు. కాగా, ఖుర్రమ్ లిస్ట్-ఏ క్రికెట్లో 166 మ్యాచ్‌ల్లో 53 సగటున 27 శతకాల సాయంతో 7992 పరుగులు చేశాడని తెలుస్తోంది. 2008లో పాక్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఖుర్రం.. తన కెరీర్ మొత్తంలో 16 టెస్ట్‌లు, 7 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2016లో చివరిసారిగా పాక్‌కు ఓ టీ20 మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించిన ఖుర్రమ్ ఆతర్వాత అత్తాపత్తా లేడు. ఖుర్రమ్ టెస్ట్‌ల్లో సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 3 హాఫ్ సెంచరీలు చేశాడు. కోహ్లి-ఖుర్రమ్ ఇద్దరూ ఓ మ్యాచ్‌లో ఎదురెదురు పడ్డారు. ఆ మ్యాచ్‌లో కోహ్లినే ఖుర్రమ్ను రనౌట్ చేయడం కొసమెరుపు. -
పాక్‌తో రెండో వన్డే.. సూపర్ సెంచరీతో విరుచుకుపడిన కివీస్ ఓపెనర్
PAK VS NZ 2nd ODI: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే సూపర్ సెంచరీతో (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్) విరుచుకుపడ్డాడు. అతనికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) తోడవ్వడంతో న్యూజిలాండ్ 261 పరుగులు చేసి ఆలౌటైంది (49.5 ఓవర్లలో). వీరిద్దరూ రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 181 పరుగులు జోడించడంతో ఓ దశలో పర్యాటక జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడం, సాంట్నర్ (37) మినహా జట్టులో మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో న్యూజిలాండ్ నామమాత్రపు స్కోర్‌కే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. నసీం షా 3, హరీస్ రౌఫ్, ఉసామా మిర్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ డ్రాగా ముగిసింది. రెండు మ్యాచ్‌ల్లో పాక్ ఓటమి అంచుల దాకా వచ్చి డ్రాతో గట్టెక్కింది. అంతకుముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను పాక్ 0-3 తేడాతో కోల్పోయింది. -
పట్టు బిగించిన కివీస్.. మరో పరాభవం దిశగా పాక్
కరాచీ: పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ విజయంపై న్యూజిలాండ్ గురి పెట్టింది. మూడున్నర రోజుల పాటు చప్పగా సాగిన రెండో టెస్టు గురువారం చివర్లో ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. 319 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పాక్ ఆట ముగిసే సమయానికి 2.5 ఓవర్లలో ఒక్క పరుగు కూడా చేయకుండా 2 వికెట్లు కోల్పోయింది. అబ్దుల్లా షఫీక్ (0), నైట్‌వాచ్‌మన్ మీర్ హమ్జా (0) బౌల్డ్ కాగా, ఇమామ్ ఉల్ హక్ (0 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. బంతి ఇప్పటికే అనూహ్యంగా స్పందిస్తుండగా చివరి రోజు పాక్ విజయాన్ని అందుకోవడం అంత సులువు కాదు! అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటై పాక్ 41 పరుగుల ఆధిక్యం కోల్పోగా, రెండో ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్ 5 వికెట్లకు 277 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్రేస్‌వెల్ (74 నాటౌట్), బ్లన్‌డెల్ (74), లాథమ్ (62) అర్ధ సెంచరీలు చేశారు. కాగా, ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను పాకిస్తాన్ 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఒకవేళ న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లోనూ పాక్ ఓటమిపాలైతే స్వదేశంలో పాక్‌కు ఇది వరుసగా రెండో పరాభవం అవుతుంది. -
షాదాబ్ ఖాన్ సూపర్ త్రో.. కాన్వే మొహం మాడిపోయింది
టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ సూపర్ రనౌట్‌తో మెరిశాడు. హారిస్ రౌఫ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ చివరి బంతిని కాన్వే మిడాఫ్ దిశగా ఆడాడు. డెవన్ కాన్వే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కేన్ విలియమ్సన్కు కాల్ ఇచ్చాడు. విలియమ్సన్ పరిగెత్తగా.. కాన్వే మాత్రం సకాలంలో క్రీజులోకి చేరుకోలేకపోయాడు. అప్పటికే మిడాఫ్‌లో ఉన్న షాదాబ్ ఖాన్ విసిరిన డైరెక్ట్ త్రోకు కాన్వే రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ సూపర్ త్రోకు కాన్వే మొహం మాడిపోయింది. అలా పవర్ ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్ 36 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #ShadabKhan #NZvsPAK pic.twitter.com/3rNG3pYjUX — Raj (@Raj54060705) November 9, 2022 -
‘పాక్ పని అయిపోయింది! వచ్చే వారం టీమిండియా కూడా!’ అంత లేదులే
ICC Mens T20 World Cup 2022 - Shoaib Akhtar: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ‘‘మీ జట్టు విషయంలో మాత్రమే నీ అంచనాలు నిజమవుతాయిలే!’’ అంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు భారత అభిమానులు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి దంచికొట్టిన విషయం తెలిసిందే. 82 పరుగులతో అజేయంగా నిలిచిన కింగ్ జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్ తర్వాత షోయబ్ అక్తర్ స్పందిస్తూ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసిస్తూనే.. ఇక టీ20లకు అతడు గుడ్ బై చెప్పాలంటూ సలహా ఇచ్చాడు. దీంతో కింగ్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. టీమిండియాను ఉద్దేశించి ఇక ఇప్పుడు అక్తర్ టీమిండియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారత అభిమానులకు అతడు టార్గెట్ అయ్యేలా చేశాయి. కాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఒక్క పరుగు తేడాతో ఓడి సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కెప్టెన్ బాబర్ ఆజంను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన అక్తర్.. టీమిండియా సెమీస్ అవకాశాలపై కూడా స్పందించాడు. వచ్చే వారం వాళ్లు కూడా అవుట్! ఈ మేరకు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ మొదటి వారంలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడుతుందని నేను ముందే చెప్పాను. ఇక వచ్చే వారం ఇండియా వంతు! వాళ్లు కూడా టోర్నీ నుంచి అవుట్ అవుతారు. వాళ్లు సెమీస్ ఆడతారేమో గానీ.. తీస్ మార్ ఖాన్ మాత్రం కాలేరు’’ అని పేర్కొన్నాడు. ఇప్పటికే రెండు విజయాలతో 4 పాయింట్లతో గ్రూప్-2 టాపర్‌గా ఉన్న రోహిత్ సేన సెమీస్ చేరడం లాంఛనమే అని చెప్పొచ్చు. అంతేకాదు కోహ్లి, సూర్య సూపర్ ఫామ్‌లో ఉండటం సహా భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ మెరుగ్గా రాణిస్తున్నారు. ఇలాంటి సానుకూల అంశాల నేపథ్యంలో ఈసారి టీమిండియా ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎక్కువేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో అక్తర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో నీకంత సీన్ లేదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Pak Vs Zim: పాక్ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్ బీన్ గోలేంటి? T20 WC 2022 Paul Van Meekeren: క్రికెట్ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు Ind Vs Ned: నాటి వరల్డ్‌కప్‌లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Shoaib Akhtar predicts that India will also return home after the semis since they are also not that good (or as he says 'Tees Maar Khan'). pic.twitter.com/zj5BFnjXYI — Kanav Bali🏏 (@Concussion__Sub) October 28, 2022 -
పాకిస్థాన్ మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విదేశీ నిధుల కేసులో ఆయనను అదుపులోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పీటీఐ నాయకులు తారిఖ్ షమి, హమీద్ జమాన్, సైఫ్ నియాజీని శుక్రవారం అరెస్టు చేశారు అధికారులు. ఇమ్రాన్‌పై కేసు పెట్టాలని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనావుల్లా సంబంధిత అధికారులను ఆదేశించారని ఆ దేశ మీడియా తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీకి ఇమ్రాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధికారులు చూస్తున్నారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియా పేర్కొంది. అనధికారికంగా వెబ్సైట్ నిర్వహిస్తూ విదేశాల నుంచి నిధుల సమకూర్చుకున్నారనే ఆరోపణలతో మొదట పీటీఐ నేత సైఫుల్లా నియాజిని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైబర్ క్రైం విభాగం శుక్రవారం అరెస్టు చేసింది. ఆ తర్వాత కాసేపటికే మరికొంతమంది నేతలను అరెస్టు చేసింది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. చదవండి: షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు! -
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలే అవకాశం కన్పిస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో పాటు, టీ20 ప్రపంచకప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా వెల్లడించాడు. కాగా ఆసియా కప్-2022లో పాకిస్తాన్జట్టులో భాగంగా ఉన్న జమాన్ అంతగా అకట్టుకోలేపోయాడు. ఈ మెగా టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన జమాన్ కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన ఫైనల్లో ఫఖర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. "ఫఖర్ జమాన్ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. అతడు ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతోంది. అతడు త్వరగా కోలుకోని జట్టులో చేరాలని ఆశిస్తున్నాను. మరోవైపు షాహీన్ అఫ్రిది కూడా ఇదే గాయంతో బాధపడుతున్నాడు" అని రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్‌కు పాక్ జట్టును పీసీబి గురువారం ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: Babar Azam: అతడి కెరీర్ నాశనం చేస్తున్నారు! బాబర్ ఆజం, రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాక్ ఏ టోర్నీ గెలవలేదు! -
'నేను మూడేళ్ల క్రితమే చెప్పాను.. పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి వస్తుందని'
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆ దేశ క్రికెట్ బోర్డుపై మండిపడ్డాడు. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదని బట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఆదివారం (సెప్టెంబర్ 11) దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 23 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బట్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "పాక్ సరైన యువ ఆటగాళ్లను తాయారు చేయాల్సిన అవసరముందని నేను మూడేళ్ల క్రితమే చెప్పాను. ప్రస్తుతం జట్టు కూర్పు అస్సలు బాగోలేదు. పాక్ మిడాలర్డర్‌లో సరైన ఆటగాళ్లు లేరు. జట్టు మేనేజ్మెంట్ సీనియర్ ఆటగాళ్లకు ఇచ్చిన అవకాశాలు యువ క్రికెటర్లకు ఇవ్వడం లేదు. అసలు పాకిస్తాన్ ప్రణాళికలు ఎంటో నాకు ఆర్ధం కావడం లేదు. అదే విధంగా ఆసియాకప్‌లో ఓటమి అనంతరం రిపోర్టర్లు హెడ్‌కోచ్‌ను ఎందుకు సరైన ప్రశ్నలు అడగలేదో నాకు తెలియదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నవాజ్ అద్భుమైన బ్యాటింగ్ చేశాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో అతడిని ఎందుకు ఆ స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు రాలేదు? నసీమ్ షా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అటువంటి అప్పడు అతడితో ముందు తన నాలుగు ఓవర్ల కోటాను ఎందుకు పూర్తి చేయంచరు..? ఇటువంటి ఎన్నో తప్పులు ఆసియాకప్‌లో పాక్ చేసింది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Shahid Afridi: 'కోహ్లి రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం'.. మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
'రోహిత్ శర్మను పాక్ ఆటగాళ్లతో పోల్చడం సరికాదు'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ బట్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ విధ్వంసకర ఆటగాడని, అతడికి ఎవరూ సాటి రారు అని బట్ కొనియాడాడు. రోహిత్‌ను పాక్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజాం, రిజ్వాలన్తో పోల్చడం సరికాదని బట్ అభిప్రాయపడ్డాడు. "రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. అటువంటి ఆటగాడిని బాబర్, రిజ్వాన్‌లతో పోల్చడం సరికాదు. కోహ్లిలో ఉన్న సగం ఫిట్నెస్ రోహిత్‌కు ఉంటే అతడికి ఎవరూ సాటి రారు. కేవలం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ మాత్రమే రోహిత్ శర్మ వంటి ఆట తీరును కలిగి ఉన్నాడు" అని యూట్యూబ్ ఛానల్లో బట్ పేర్కొన్నాడు. కాగా ఆసియాకప్-2022లో రోహిత్ శర్మ అంతగా రాణించలేకపోయాడు. ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో 6 మ్యాచ్‌లు ఆడిన బాబర్ కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రిజ్వాన్ మాత్రం ఈ టోర్నీలో అదరగొట్టాడు. 281 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా రిజ్వాన్ నిలిచాడు. చదవండి: Virat Kohli-Anushka Sharma: లండన్ వీధుల్లో విరుష్క దంపతుల చక్కర్లు -
ODI Rankings: క్లీన్‌స్వీప్‌లు.. టీమిండియా, పాకిస్తాన్ ఏ స్థానాల్లో ఉన్నాయంటే!
ODI Men's Team Rankings: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు 111 రేటింగ్ పాయింట్లు సాధించింది. ఇక నెదర్లాండ్స్‌తో సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా దాయాది పాకిస్తాన్ నాలుగో ర్యాంకును పదిలం చేసుకుంది. కివీస్ మొదటి స్థానమే అయినా! ఇక వెస్టిండీస్‌ను 2-1తో ఓడించిన న్యూజిలాండ్ జట్టు 124 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. అయితే, విండీస్‌కు ఒక మ్యాచ్ కోల్పోయిన నేపథ్యంలో ఐదు పాయింట్లు కివీస్ చేజారాయి. మరోవైపు.. ఇంగ్లండ్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆసియా కప్ టోర్నీకి సన్నద్ధం! కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో కేఎల్ రాహుల్ జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు సారథ్యం వహించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వరుసగా 10 వికెట్లు, 5 వికెట్లు, 13 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ మూడు మ్యాచ్‌లలో అద్బుతంగా రాణించిన బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. మరోవైపు.. పాకిస్తాన్ నెదర్లాండ్స్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసినా.. ఆతిథ్య డచ్ జట్టు నుంచి మొదటి, ఆఖరి వన్డేల్లో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది. ఇదిలా ఉంటే.. జింబాబ్వే, నెదర్లాండ్స్ పర్యటన ముగించుకున్న టీమిండియా, పాకిస్తాన్ ఆసియా కప్-2022 టోర్నీకి సన్నద్ధమవుతున్నాయి. ఆగష్టు 28న దుబాయ్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో యూఏఈకి పయనమయ్యాయి. ఐసీసీ మెన్స్ వన్డే జట్టు తాజా ర్యాంకింగ్స్ టాప్-5 1. న్యూజిలాండ్- రేటింగ్- 124 2. ఇంగ్లండ్- రేటింగ్- 119 3. ఇండియా- రేటింగ్- 111 4. పాకిస్తాన్- రేటింగ్- 107 5. ఆస్ట్రేలియా- రేటింగ్- 101 చదవండి: Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ! ద్రవిడ్ దూరం?! Asia Cup 2022: యూఏఈ చేరుకున్న టీమిండియా.. కోహ్లి ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ -
పాక్‌తో సిరీస్‌కు ముందు విండీస్‌కు ఎదురుదెబ్బ..!
వెస్టిండీస్ మాజీ బ్యాటర్ రామ్‌నరేశ్ శర్వాన్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు. జాతీయ సెలక్టర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ఈ మేరకు.. ‘‘పురుషుల సీనియర్, యువ విభాగానికి క్రికెట్ సెలక్టర్‌గా ఉన్న రామ్‌నరేశ్ శర్వాన్ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదొలిగారు. జనవరి 6, 2022లో ఆయన నియామకం జరిగింది. అయితే, ఇకపై ఆయన ఈ పదవిలో కొనసాగరని క్రికెట్ వెస్టిండీస్ తెలియజేస్తోంది’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా రామ్‌నరేశ్ స్థానంలో మెన్స్ యూత్ సెలక్షన్ మెంబర్ రాబర్ట్ హెయిన్స్ జాతీయ సెలక్టర్‌గా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న విండీస్ జట్టు.. అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మే 31న ఇది ఆరంభం కానుంది. ఆ తర్వాత వెస్టిండీస్ జూన్ 9 నుంచి పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. పాక్‌లోని ముల్తాన్ వేదికగా ఈ సిరీస్ జరుగనుంది. చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..! -
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ షాక్.. 26 మంది స్టార్ ఆటగాళ్లు దూరం!
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. ఇక పుణే,లక్నో రూపంలో కొత్త జట్లు రావడంతో ఈ సీజన్‌కు సరికొత్త ప్రాధన్యత సంతరించుకొంది. అయితే ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు 26 మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏఏ ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారో పరిశీలిద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీంట్లో చాలా మంది విదేశీ ఆటగాళ్లే. వారిలో ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లు ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఇక దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ సిరీస్ కారణంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్,లుంగి ఎంగిడి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. అదే విధంగా ప్రోటీస్ స్టార్ పేసర్ నార్ట్జే గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్లో కొత్త జట్టుగా అవతరించింది. ఈ జట్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. లక్నో కూడా వేలంలో విదేశీ స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్,క్వింటన్ డి కాక్ వంటి విదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో గాయపడిన మార్క్ వుడ్ అందుబాటులో ఉండటం కూడా ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్థాన్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల తర్వాతే మార్కస్ స్టోయినిస్ లక్నో జట్టులోకి రానున్నాడు. పంజాబ్ కింగ్స్ అంతర్జాతీయ సిరీస్‌ల కారణంగా జానీ బెయిర్‌స్టో, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్ ఐపీఎల్- 2022లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ముఖ్యంగా స్టార్ పేసర్ రబడా ఒకటి నుంచి ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్- 2022 ఆరంభ మ్యాచ్‌ల్లో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్ల సేవలను ఆర్సీబీ కోల్పోతుంది. గ్లెన్ మాక్స్వెల్,హాజిల్‌వుడ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ దూరం కానున్నారు. గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో అరంగేట్రం చేసింది. గుజరాత్‌కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్, వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ దూరం కానున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌లో డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికా జట్టులో భాగమై ఉండగా, అల్జారీ జోసెఫ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ తరపున ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్కో జాన్సెన్, ఐడెన్ మార్క్రామ్ సేవలను కోల్పోనుంది. అదే విధంగా ఆస్ట్రేలియా పేసర్ సీన్ అబాట్ కూడా దూరం కానున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆరంభ మ్యాచ్‌లకు ప్రోటీస్ స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ దూరం కానున్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో డస్సెన్ భాగమై ఉన్నాడు. ఒక వేళ టెస్ట్ సిరీస్‌కు ఎంపికైతే అతడు ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ గత ఏడాది ఫైనలిస్ట్ కోల్‌కతా నైట్ రైడర్స్ పాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్ లేకుండానే ఆరంభ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనుంది. పాకిస్థాన్‌తో జరిగే టెస్ట్ సిరీస్ తర్వాత కమ్మిన్స్ జట్టులో చేరే అవకాశం ఉన్నప్పటికీ, ఫించ్ మాత్రం వైట్ బాల్ సిరీస్‌లో భాగమై ఉన్నాడు. ముంబై ఇండియన్స్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరం కానున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ మాత్రం తొలి మ్యాచ్‌లో ఆడేందుకు పూర్తి స్థాయి జట్టును కలిగి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ దూరం కానున్నాడు.బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో అతడు ప్రోటీస్ జట్టులో భాగమై ఉన్నాడు. చదవండి: IPL 2022- Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! అయితే.. -
5 వికెట్లతో చెలరేగాడు.. జట్టును గెలిపించాడు
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ఓపెనర్లు హెల్స్, స్టిర్లింగ్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెల్స్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మున్రో సిక్సర్ల వర్షం కురిపించాడు. అదే విధంగా స్టిర్లింగ్ కూడా ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక 58 పరుగులు చేసిన స్టిర్లింగ్ నవాజ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత ఆజామ్ ఖాన్, మున్రో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మున్రో కేవలం 39 బంతుల్లో 72 పరుగులు చేయగా, ఆజామ్ ఖాన్ 35 బంతుల్లో 65 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇస్లామాబాద్ యునైటెడ్ 229 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ 185 పరుగులకే ఆలౌటైంది. ఇస్లామాబాద్ బౌలర్లలో కెప్టెన్ షాదాబ్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టి గ్లాడియేటర్స్‌ను దెబ్బతీయగా, హసన్ అలీ,మహ్మద్ వసీం చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక గ్లాడియేటర్స్ బ్యాటర్లలో అసన్ అలీ(50),నవాజ్ (47) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: నాపై ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు.. నేను బాగానే ఉన్నా: శిఖర్ ధావన్ -
Shoaib Akhtar: మాంసం తింటాం, సింహాల్లా వేటాడతాం.. అదే మాకు భారత బౌలర్లకి తేడా..!
Shoaib Akhtar Highlights X Factor Lacked By Indian Pacers: టీమిండియా పేసర్లను ఉద్ధేశించి పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో పాక్ పేసర్ల ఆధిపత్యం గురించి ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీతో మాట్లాడుతూ భారతీయుల ఆహారపు అలవాట్లను కించపరిచేలా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో భారత పేస్ దళం బాగా పుంజుకున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో పాక్ పేసర్లతో పోలిస్తే బాగా వెనకపడి ఉందని అన్నాడు. భారత పేసర్లు తమ ఆహారపు అలవాట్ల కారణంగా బలహీనంగా కనిపిస్తారని, ఇదే వారికి పాక్ పేసర్లకు తేడా అని పేలాడు. పాక్ పేసర్ల ముఖాల్లో కనిపించే కసి, యాటిట్యూడ్ భారత పేస్ బౌలర్ల ముఖాల్లో కనిపించవని, ఈ వ్యత్యాసం క్రికెట్ తొలినాళ్ల నుంచే ఉందని, అందుకు కారణం మా తిండి, వాతావరణం అని తెలిపాడు. పాక్ బౌలర్లు బౌలింగ్ వేసే సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించరని.. వికెట్ తీయడమే వారి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ యాటిట్యూడే వేగంగా బంతులు వేసేందుకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుందని వివరించాడు. దీనికి తోడు మేము ఎక్కువగా మాంసాహారం తింటామని, అందుకే దృడంగా ఉంటామని, ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే సింహాల్లా పరుగెడతామని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తరం పాక్ పేసర్లలో షాహీన్ ఆఫ్రిదీ, హసన్ ఆలీల్లో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయని ఈ సందర్భంగా ఉదహరించాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియా పేస్ యూనిట్‌కు మించిన ఫాస్ట్ బౌలింగ్ దళం ఏ జట్టుకు లేదనడం అతిశయోక్తి కాదు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, టి నటరాజన్ వంటి పేసర్లతో భారత పేస్ విభాగం కలకలలాడుతోంది. ఈ విషయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్ల పేసర్ల కంటే భారత పేస్ దళం దృడంగా కనిపిస్తుంది. చదవండి: ధోని నా భార్య కాదు.. బీసీసీఐలో నాకు గాడ్ ఫాదర్లు ఎవ్వరూ లేరు..! -
అతనో చేత కాని బౌలర్.. నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడు..!
తాను లంచం ఆఫర్ చేశానంటూ ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వార్న్ చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ స్పందించాడు. వార్న్.. ఓ చేత కాని బౌలర్ అని, అప్పట్లో నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడని, ఆ కసితోనే నాపై ఫిక్సింగ్ ఆరోపణలకు పాల్పడ్డాడని కౌంటరిచ్చాడు. ఈ మధ్య కాలంలో చాలా మందికి తమ పుస్తకావిష్కరణల సందర్భంగా వివాదాలు క్రికెట్ చేయడం అలవాటుగా మారిందని, ఈ వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీని వారు క్యాష్ చేసుకుంటున్నారని, వార్న్ కూడా అలాంటి చీప్ స్టంట్‌నే ప్లే చేశాడని ధ్వజమెత్తాడు. వార్న్‌కు తాను లంచం ఆఫర్ చేసిన విషయం 26 ఏళ్ల తర్వాత గుర్తుకు వచ్చిందా, ఒక వేళ అదే నిజమైతే అతను ఇన్నాళ్లు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించాడు. తన డ్యాక్యుమెంటరీని మార్కెట్ చేసుకోవడం కోసమే వార్న్ ఇదంతా చేస్తున్నాడని, అతని ఆరోపణల్లో ఇది తప్ప, మరో ఉద్దేశం కనిపించ లేదని, 26 ఏళ్లు గడిచినా వార్న్ నన్ను గుర్తుపెట్టుకోవడం సంతోషమేనని మాలిక్ చెప్పుకొచ్చాడు. కాగా, తన డాక్యుమెంటరీ "షేన్" కోసం ఇచ్చిన ఇంటర్వూ సందర్భంగా షేన్ వార్న్.. సలీం మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 1994 పాక్ పర్యటనలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు సలీం మాలిక్.. తనకు 2,76,000 అమెరికన్ డాలర్ల లంచం ఆఫర్ చేశాడని వార్న్ ఆరోపించాడు. తనతో పాటు సహచర ఆటగాడు టిమ్ మేకు కూడా సలీం లంచం ఆఫర్ చేశాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు -
'పాకిస్తాన్లో పర్యటించనున్న న్యూజిలాండ్.. ఇప్పుడు భయం పోయిందా'
భద్రతా కారణాల దృష్ట్యా ఆర్ధంతరంగా పాకిస్తాన్ పర్యటను రద్దు చేసుకున్న న్యూజిలాండ్ మళ్లీ పాకిస్తాన్లో పర్యటించనుంది. వచ్చే ఏడాదిలో పాకిస్తాన్లో తమ జట్టు పర్యటించనుందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటన చేసింది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20లతో పాటు రెండు టెస్ట్‌లు కూడా కివీస్ ఆడనుంది. నవంబర్‌లో దుబాయ్‌లో ఇరు జట్ల క్రికెట్ బోర్డులు సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన రెండు క్రికెట్ బోర్డుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని న్యూజిలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ అన్నారు. "మా బోర్డు చైర్మన్ మార్టిన్ స్నెడెన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఇద్దరూ దుబాయ్‌లో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో మా జట్టు వచ్చే ఏడాది ఆ దేశ పర్యటనకు వెళ్లనుంది. దీంతో రెండు దేశాల బంధం మరింత బలపడతుంది" అని డేవిడ్ వైట్ పేర్నొన్నారు. ఇక ఈ విషయంపై రమీజ్ రాజా మాట్లడూతూ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో పర్యటించడానికి ఒప్పుకున్నందుకు చైర్మన్ మార్టిన్ స్నెడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. 2022-23 ఏడాదికి గాను రెండు సార్లు పాక్ పర్యటనకు కివీస్ రానుందని అతను చెప్పారు. ఈ పర్యటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రమీజ్ రాజా పేర్కొన్నారు. చదవండి: SA Vs IND: భారత పర్యటన.. ఆ మ్యాచ్‌లను వాయిదా వేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు! -
T20 WC: స్కాట్లాండ్పై ఘన విజయం.. ఐదుకు ఐదు గెలిచిన పాకిస్తాన్
T20 World Cup 2021: Pakistan Beat Scotland By 72 Runs : టి20 ప్రపంచకప్ సూపర్–12 లీగ్ దశను మాజీ చాంపియన్ పాకిస్తాన్ అజేయంగా ముగించింది. గ్రూప్–2లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 72 పరుగుల తేడాతో స్కాట్లాండ్పై ఘనవిజయం సాధించింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన పాక్ 10 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (47 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ టోర్నీలో నాలుగో అర్ధ సెంచరీ చేశాడు. చివర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షోయబ్ మాలిక్ (18 బంతుల్లో 54 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్‌లు) సూపర్ ఫినిష్ ఇచ్చాడు. ఛేదనలో స్కాట్లాండ్ 20 ఓవర్లో 6 వికెట్లకు 117 పరుగులు చేసి ఓడింది. రిచీ బెరింగ్టన్ (37 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కగా... షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, హసన్ అలీ ఒక్కో వికెట్ తీశారు. ఈనెల 11న జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో పాక్ ఆడుతుంది. ఇక ఈ మెగా టోర్నీలో స్కాట్లాండ్ ఐదింటికి ఐదు మ్యాచ్‌లు ఓడి అట్టడుగున ఉంది. నెమ్మదిగా ఆరంభం టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. రిజ్వాన్ (15), ఫఖర్ జమాన్ (8) విఫలమయ్యారు. దాంతో పాకిస్తాన్ 10 ఓవర్ల తర్వాత 60/2గా నిలిచింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మొహమ్మద్ హఫీజ్ (19 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆజమ్ పాక్‌ను ఆదుకున్నాడు. వీరు మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. హఫీజ్ అవుటయ్యాక ఆజమ్ 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. సూపర్ మాలిక్ షోయబ్ మాలిక్ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి పాక్ స్కోరు 15 ఓవర్లలో 112/3. క్రీజులోకి వచ్చిన షోయబ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్‌లోకి పంపి విధ్వంసం సృష్టించాడు. 18 బంతులు ఎదుర్కొన్న షోయబ్... ఒక ఫోర్‌తో పాటు ఆరు సిక్స్‌లు బాదాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచిన అతడు అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. షోయబ్ దూకుడుతో పాక్ చివరి 5 ఓవర్లలో 77 పరుగులు రాబట్టింది. చదవండి: T20 World Cup 2021: కివీస్ సెమీస్‌కు.. ప్రాక్టీసు రద్దు చేసుకుని హోటల్లోనే ఉండిపోయిన భారత ఆటగాళ్లు! Abu Dhabi Chief Curator: అబుదాబిలో భారత క్యూరేటర్ ఆత్మహత్య Ruthless Babar and Shoaib confirm Pakistan's seventh showdown with Australia in T20 World Cup More details: https://t.co/eqZ0Bxo5Fq#WeHaveWeWill | #T20WorldCup | #PAKvSCO — PCB Media (@TheRealPCBMedia) November 7, 2021 -
Kevin Pietersen: ఇంగ్లండ్‌పై గెలవగల సత్తా ఆ రెండింటికే.. కప్ మాత్రం మాదే!
Kevin Pietersen- Only These Teams can beat England : టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు... సమిష్టిగా ముందుకు సాగుతూ శ్రీలంకపై 26 పరుగుల తేడాతో విజయం సాధించింది ఇంగ్లండ్ జట్టు. ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబరిచి అధికారికంగా సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. బలమైన జట్టుగా మారి ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. గ్రూపు-1 టాపర్ అయిన మోర్గాన్ బృందం సెమీస్‌లో తమతో తలపడే గ్రూపు-2లోని జట్టు కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు.. గ్రూపు -2లో పాకిస్తాన్.. టీమిండియా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్‌లపై విజయాలతో ముందంజలో ఉండగా.. అఫ్గన్ సైతం స్కాట్లాండ్, నమీబియాపై విజయాలతో జోరు మీద ఉంది. న్యూజిలాండ్ సైతం భారత్‌పై గెలుపొంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌ను ఓడించగల సత్తా పాకిస్తాన్ లేదంటే అఫ్గనిస్తాన్‌కే ఉందన్నాడు. అయితే, పిచ్ ప్రభావం పైనే జట్ల జయాపజయాలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నాడు. ఈ మేరకు... ‘‘కేవలం పాకిస్తాన్.. లేదంటే అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్‌ను ఓడించగలవు. కానీ... కా.... నీ... షార్జాలో ఇది వరకు ఉపయోగించిన పిచ్‌పై మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది’’ అని పీటర్సన్ ట్వీట్ చేశాడు. అదే విధంగా.. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లోని చెల్సీ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఇంగ్లండ్ జట్టుకు పోలిక తెచ్చిన పీటర్సన్... కప్ గెలవాలని ఆకాంక్షించాడు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో విభేదాలు.. కోహ్లి అనుకూల, వ్యతిరేక గ్రూపులు: అక్తర్ KL Rahul: కోహ్లి, రోహిత్ శర్మకు విశ్రాంతి.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్! Only Pakistan or Afghanistan can beat England in this T20 World Cup. BUT and it’s a BIG BUT, the game would have to be played on a used wicket in Sharjah. Anywhere else, just hand England the trophy like Chelsea should be handed the EPL trophy RIGHT NOW! 🏆🏆 — Kevin Pietersen🦏 (@KP24) November 2, 2021 -
Shoaib Malik: ఆఫ్రిదికి సెల్యూట్ చేసిన మాలిక్.. ఎందుకో తెలుసా..!
Shoaib Malik salutes Shahid Afridi: టీ20 ప్రపంచకప్2021లో భాగంగా శుక్రవారం ఆప్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో సెమిఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తమ జట్టును సపోర్ట్ చేయడానికి వచ్చిన పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదినూ చూస్తూ.. షోయబ్ మాలిక్ సెల్యూట్ చేశాడు. దీంతో స్టేడియంలో ఉన్న అభిమానులందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన ఆఫ్రిది.. ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే రిజ్వాన్ (8) వికెట్‌ను కోల్పోయింది. అయితే బాబర్, ఫఖర్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే తక్కువ వ్యవధిలో ఫఖర్‌తో పాటు హఫీజ్ (10) కూడా నిష్క్రమించాడు. బాబర్‌ను రషీద్ అవుట్ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో నవీన్ ఉల్ హఖ్ 2 పరుగులే ఇచ్చి మాలిక్ (19) వికెట్ తీయడంతో అఫ్గాన్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే ఆసిఫ్ తన మెరుపు బ్యాటింగ్‌తో పాక్‌ను గెలిపించాడు. చదవండి: Sarah Taylor: క్రికెట్ చరిత్రలో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Moment of the Day Shoaib Malik comes and Salute to Superstar Shahid Afridi Malik: mere murshad #PakvsAfg #T20WorldCup21 pic.twitter.com/PNOYw10eXW — Malik A Haseeb🇵🇰 (@MalikAHaseeb) October 29, 2021 -
T20 WC Final: ఆ పేరు గుర్తుపెట్టుకోండి.. ఫైనల్లో ఆ రెండు జట్లే: స్టోక్స్
Ben Stokes big prediction ‘World Cup 2021 finals: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్ ఆసిఫ్ అలీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 19వ ఓవర్లో ఏకంగా 4 సిక్సర్ల(6, 0, 6, 0, 6, 6 )తో చెలరేగి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 7 బంతులు ఎదుర్కొన్న ఆసిఫ్ అలీ... 25 పరుగులతో అజేయంగా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో... ఆసిఫ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌పై గెలుపొంది... టోర్నీలో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. తద్వారా సెమీస్ బెర్తు దాదాపుగా ఖాయం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆసిఫ్ అలీ.. ఈ పేరును గుర్తుపెట్టుకోండి’’ అంటూ అలీ ప్రదర్శనను కొనియాడాడు. అంతేగాక... ఫైనల్ చేరే జట్లను కూడా అంచనా వేశాడు. ‘‘ ఫైనల్లో ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ చూడబోతున్నామా???’’అని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు బెన్ స్టోక్స్ ట్వీట్ చేశాడు. కాగా గత కొంతకాలంగా మానసిక సమస్యలు, చేతి వేలి గాయం కారణంగా సతమతమవుతున్న స్టోక్స్.. ఈ మెగా ఈవెంట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూపు-1లో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా శనివారం తలపడనున్నాయి. ఇక ఇప్పటికే రెండేసి విజయాలతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గ్రూపులో ముందంజలో ఉండగా... రన్‌రేటు పరంగా మోర్గాన్ బృందం మెరుగ్గా ఉంది. మరోవైపు... గ్రూపు-2లో పాకిస్తాన్ 3 విజయాలతో టాప్‌లో ఉంది. చదవండి: T20 World Cup 2021 Ind Vs Nz: బీచ్ వాలీబాల్ ఆడుతున్న టీమిండియా క్రికెటర్లు.. వీడియో వైరల్ Remember the name @AasifAli2018 — Ben Stokes (@benstokes38) October 29, 2021 England vs Pakistan Final ??? — Ben Stokes (@benstokes38) October 29, 2021 -
పాక్ జట్టులో కరోనా కలకలం..ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ
Three Pakistan Women Cricketers Tested For Covid Positive: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. స్వదేశంలో విండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో జట్టు సభ్యులుండగా రొటీన్ చెకప్‌లో భాగంగా జరిపిన పరీక్షల్లో విషయం వెలుగు చూసినట్లు పేర్కొంది. అయితే, కోవిడ్ బారిన పడిన ఆటగాళ్ల వివరాలను మాత్రం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించలేదు. బాధితులను 10 రోజుల క్వారంటైన్‌కు తరలించామని.. మిగతా జట్టు సభ్యులను వారి నుంచి వేరుగా ఉంచామని తెలిపింది. కాగా, పాక్ మహిళా జట్టు కరాచీ వేదికగా నవంబర్ 8, 11, 14 తేదీల్లో విండీస్‌తో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాక్ జట్టులో కరోనా కలకలం రేగడంతో ఈ సిరీస్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. చదవండి: బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా -
IND VS PAK: రిజ్వాన్, బాబర్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు.. అయితే..
Ashish Nehra Comments on Pakistan 10 Wickets Win Against India: టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌పై అద్భుత విజయం సాధించి యావత్ క్రికెట్ ప్రపంచం ముందు పాకిస్తాన్ సత్తా చాటిందని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. "సెమీ ఫైనల్‌కు చేరుకోవడానికి ఆర్హతలేని జట్టుగా పాకిస్తాన్‌ను అందరూ తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వారి గ్రూప్‌లో న్యూజిలాండ్, ఇండియా వంటి బలమైన జట్లు వున్నాయి. కానీ టీ 20ల్లో ఎవరైనా ఎవరినైనా ఓడించవచ్చు. ఆదేమి పెద్ద విశేషం కాదు. అయితే పాకిస్తాన్ గెలిచిన తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఆటలో మంచు ప్రభావం గురించి నెహ్రా మాట్లాడుతూ, "మంచు కారణంగా బంతి కూడా కొద్దిగా తడిసిపోయింది. పిచ్ బ్యాటింగ్ చేయడానికి మెరుగ్గా ఉండటంతో, వారు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆడిన విధానాన్ని అందరూ ప్రశంసించవలసి ఉంటుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రిజ్వాన్, బాబర్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో వారిద్దరూ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఆడారు" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెహ్రా పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం చెలరేగడంతో అలవోకగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లయింది. చదవండి: Ind Vs Pak: ‘చెత్త అంపైరింగ్.. అసలు రాహుల్ అవుట్ కాలేదు.. అది నో బాల్.. కావాలంటే చూడండి’ -
భారత్-పాక్ మ్యాచ్.. మొదలైన సందడి.. మీమ్స్ హోరు
సాక్షి, న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2021 లో దాయాదుల పోరుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దాదాపు 28 నెలల విరామం తర్వాత రెండు జట్లు తలపడబోతున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం జరగబోయే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్నారు. అయితే ఈ ఆసక్తికర పోరుపై భారత అభిమానులు సోషల్ మీడియాలో పాకిస్తాన్‌పై మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రపంచకప్ టోర్నీల్లో ఒక్కసారి కూడా పాక్ చేతిలో భారత్ ఓటమి ఎరగకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పాక్ జట్టు కసిగా ఉంది. ఎప్పటిమాదిరిగానే పాక్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. తద్వారా దాయాదిపై విజయం, మెగా టోర్నమెంట్లో శుభారంభం చేయాలని వ్యూహాలను రచిస్తోంది. చదవండి: T20 WC 2021 ENG Vs WI: కూప్పకూలిన వెస్టిండీస్.. 55 పరుగులకే ఆలౌట్ -
భారత్‌తో తలపడే జట్టును ప్రకటించిన పాక్..
Pakistan 12 Member Squad for ICC World T20 match against India: టీ20 ప్రపంచకప్2021లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసున్న దాయాదుల పోరుకు రంగం సిద్దంమైంది. టీమిండియా, పాకిస్తాన్ మధ్య సమరానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం పాకిస్తాన్ 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా పాక్ ప్రకటించిన జట్టులో షోయబ్ మాలిక్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. మాలిక్ స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్‌కు చోటు దక్కుతుందని అంతా భావించినప్పటికీ ఆజట్టు యాజమాన్యం మాత్రం మాలిక్ వైపే మొగ్గు చూపింది. హైదర్ ఆలీను రిజర్డ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. భారత్ మాత్రం జట్టు ఎంపిక గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించలేకపోయింది. ఈ సరైన భారత్‌పై గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. భారత్‌తో తలపడబోయే పాక్ జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ షా అఫ్రిది, హైదర్ ఆలీ(రిజ్వర్డ్) చదవండి: T20 World Cup 2021: కోహ్లి సేన బలబలాలు ఏంటి.. ఏ ఆటగాడి రికార్డు ఎలా ఉంది? Pakistan's 12 for their #T20WorldCup opener against India.#WeHaveWeWill pic.twitter.com/vC0czmlGNO — Pakistan Cricket (@TheRealPCB) October 23, 2021 -
T20 World Cup 2021: ఈ సారి భారత్‌పై విజయం మాదే
Babar Azam fully confident of defeating India: టి20 ప్రపంచ్‌కప్ 2021లో దాయాదుల సమరానికి సమయం దగ్గర పడింది. ఆక్టోబర్ 24న పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌లో భారత్‌తో తలపడనుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ కీలక వాఖ్యలు చేశాడు. టీమిండియాపై విజయం సాధించి టి20 ప్రపంచ్ కప్‌లో శుభారంభం చేయనున్నట్లు అజమ్ తెలిపాడు. ఇటీవల కాలంలో యుఏఈలో అనేక మ్యాచ్‌లు ఆడిన అనుభవం తమకు కావలసిన ప్రయోజనాన్ని అందిస్తుందని బాబర్ అజమ్ అభిప్రాయపడ్డాడు. "ప్రతి మ్యాచ్ ఒత్తిడి మాకు తెలుసు. ముఖ్యంగా మొదటి మ్యాచ్ ఇది. మేము మ్యాచ్ గెలిచి ముందుకు వెళ్తాము. మేము గత 3-4 సంవత్సరాలుగా యుఏఈలో క్రికెట్ ఆడుతున్నాం. మాకు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. వికెట్ ఎలా ఉంటుందో.. దానికి తగ్గట్టు ఏ బ్యాటర్‌ని ఏ స్ధానంలో పంపాలనేదానిపై ఒక అంచనా ఉంది. ఎవరైతే బాగా ఆడుతారో, వారే మ్యాచ్‌లో గెలుస్తారు. మీరు నన్ను అడిగారు.. కచ్చితంగా మేమే గెలుస్తాము ”అని బాబర్ ఓ పాక్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. "ఒక జట్టుగా మా విశ్వాసం, ధైర్యం చాలా ఎక్కువ. మేము గతం గురించి కాదు.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాము. మేము భారత్‌పై విజయం కోసం సిద్ధమవుతున్నాము. భారత్‌తో బాగా ఆడతామని నాకు పూర్తి నమ్మకం ఉంది ”అని బాబర్ తెలిపాడు. కాగా పాకిస్తాన్ ఇప్పటి వరకు వన్డే, టి20 ప్రపంచకప్‌లలో భారత్‌పై ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. చదవండి: ఒక్కరు కాదు ముగ్గురు క్యాచ్ పట్టారు.. ఊహించని ట్విస్ట్ -
మరోసారి వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే...
Pakistan write UAE 2021 instead of India 2021 on their jersey: రాబోయే టీ 20 ప్రపంచకప్ టోర్నీపైన రోజు రోజుకు అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. అయితే భారత్ నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ కోసం ఆయా దేశాలు ప్రత్యేక జెర్సీలు రూపొందించుకుంటున్నాయి. అయితే ఈ టోర్నీలో పాల్గొనే జట్లు అన్నీ ‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇండియా 2021’ అనే లోగో ఉన్న జెర్సీలను మాత్రమే ధరించాల్సి ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తన వక్ర బుద్దిని మరోసారి చూపించుకుంది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ జెర్సీపై 'ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ యుఏఈ 2021' అని రాసింది. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. దీనికి సంబంధించి నెట్టింట తెగ చర్చలు జరగుతున్నాయి. పాకిస్తాన్ జెర్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే పిసీబి ఇంకా అధికారికంగా జెర్సీని ఆవిష్కరించాల్సి ఉంది. క్వాలిఫైయింగ్ రౌండ్లో పాల్గొనున్న జట్లు ఇప్పటికే టోర్నమెంట్ కోసం తమ జెర్సీని అధికారికంగా ఆవిష్కరించాయి. కొన్ని రోజుల క్రితం తమ జెర్సీని విడుదల చేసిన స్కాట్లాండ్ కూడా తమ జెర్సీపై ‘ఇండియా 2021’ అని రాసింది. కాగా భారత్‌లో కరోనా కారణంగా యూఏఈ, ఒమన్ వేదికల్లో టీ 20 ప్రపంచ కప్‌ను బీసీసీఐ నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే. చదవండి: IPL 2021 CSK Vs PBSK: లైవ్‌లో లవ్ ప్రపోజ్ చేసిన చెన్నై ఆటగాడు.. అమ్మాయికి కూడా ఓకే -
అత్యంత విలువైన వ్యక్తివి నువ్వు.. చాలా మిస్ అవుతున్నా: క్రికెటర్ భావోద్వేగం
Shan Masood Gets Emotional: పాకిస్తాన్ క్రికెటర్ షాన్ మసూద్ నివాసంలో విషాదం నెలకొంది. అతడి సోదరి మీషూ మరణించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించిన మసూద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘మీషూ.. నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తివి నువ్వు. నీకు నేను గుడ్‌బై చెప్పలేను. ఆ దేవుడు నిన్ను ఇంతకంటే మంచి చోటుకు తీసుకువెళ్లాడని నాకు తెలుసు. అయినా.. నిన్ను చాలా మిస్ అవుతున్నా’’ అని ట్వీట్ చేశాడు. తన సోదరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించమని అభిమానులను కోరాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, అన్వర్ అలీ, అబిద్ అలీ, పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా తదితరులు మసూద్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. కాగా తన సోదరి మీషూ(30) అరుదైన క్రోమోజోమ్ డిజార్డర్‌తో బాధపడుతోందని మసూద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘తను దివ్యాంగురాలు. నవజాత శిశువుతో సమానం. శారీరక ఎదుగుదల ఉంది కానీ.. మానసికంగా పరిపక్వత చెందలేదు. తనకు డిపెండెంట్ వీసా కూడా లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆదివారం తమను విడిచి శాశ్వతంగా దూరం కావడంతో శోక సంద్రంలో మునిగిపోయాడు. ఇక కెరీర్ విషయానికొస్తే... 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో పాకిస్తాన్ తరఫున మసూద్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. చివరగా న్యూజిలాండ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతడు ఆడాడు. ఇక 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం నేషనల్ టీ20 కప్‌లో భాగంగా సింధ్ తరఫున ఆడుతున్నాడు. Meeshu you were the most precious thing in my life and I did not even get to say goodbye, I will miss you so much but I know God has taken you to a better place. Please pray for my sister’s departed soul 🙏🏽 pic.twitter.com/1AFHad7red — Shan Masood (@shani_official) October 3, 2021 -
పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్షమాపణలు
ECB Chief issues apology To Pakistan: భద్రతా సమస్యల కారణంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్ల మానసిక, శారీరక క్షేమం ముఖ్యమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పాక్ పర్యటను రద్దు చేసుకుంది. ఈ అయితే పాక్ పర్యటనను ఇంగ్లండ్ రద్దు చేసుకోవడంపై ఆ జట్టు క్రికెట్ బోర్డుపై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో ద్వజం ఎత్తారు. ఈ క్రమంలో స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛీప్ ఇయాన్ వాట్మోర్ క్షమాపణలు తెలిపారు. కాగా వచ్చే ఏడాది తమ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుందని ఆయన మాటిచ్చారు. "ముఖ్యంగా మా నిర్ణయంతో పాకిస్తాన్ బాధపడినందకు నేను చింతిస్తున్నాను. బోర్డు తీసుకున్న నిర్ణయం చాలా క్లిష్టమైనది. మా ఆటగాళ్లు, సిబ్బంది సంక్షేమం, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటన కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎదురుచూస్తోంది ”అని వాట్మోర్ డైలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు. అయితే ఈసీబీ ఛీప్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ సమాచార ప్రసార మంత్రి ఫవాద్ చౌదరి ముక్తకంఠంతో స్వాగతించారు. "వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్ రాబోతుందని ప్రకటించడం చాలా సంతోషకరం. పాకిస్థాన్ క్రికెట్‌కు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని మాజీ క్రికెటర్లకు, మీడియా, క్రికెట్ అభిమానులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా''. అని ఆయన ట్వీట్ చేశారు చదవండి: కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది ఆ ముగ్గురేనా..? -
అరే.. రోహిత్ శర్మ పాకిస్తాన్లో ఉన్నాడేంటి?
Spot Rohit Sharma’s Doppelganger on Pakistan: ప్రపంచంలో ఒకే పోలికతో ఏడుగురు ఉన్నారన్నది నిజమని చాలా మంది నమ్ముతుంటారు. అయితే, మనిషిని పోలిన మనిషి కనిపించడం అరుదుగా జరగుతుంది. కాగా టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను పోలి ఉన్న ఓ వ్యక్తి పాకిస్తాన్‌లోని అభిమానులకు దర్శనమిచ్చాడు. ఓ షాప్ దగ్గర జ్యూస్ తాగుతూ కనిపించాడు. ఆ వ్యక్తి చూడడానికి అచ్చం రోహిత్ శర్మలానే ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై నెటిజన్లు మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటో పై ఓ పాకిస్తానీ అభిమాని స్పందిస్తూ.. "అంతర్జాతీయ క్రికెటర్లు పర్యటించడానికి పాకిస్తాన్ సురక్షితం కాదని కాదని ఎవరు చెప్పారు? ఇప్పుడే స్టార్ ఇండియన్ ప్లేయర్ రోహిత్ శర్మ, రావల్పిండి సద్దర్ వద్ద జ్యూస్ తాగాడం చూశాను" అని ట్వీట్ చేశాడు. మరో అభిమాని ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ లో ముంబై పరాజయాల ఒత్తిడిని తట్టుకోవడానికి రోహిత్‌కు ఈ జ్యూస్ చాలా అవసరమని ట్వీట్ చేశాడు. కాగా భద్రతా కారణాల దృష్ట్యా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాక్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో వరుస అపజయాలతో ముంబై పాయింట్ల పట్టికలో 7వ స్ధానంలో ఉంది. చదవండి: Virat Kohli: టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు రావాలి -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం..
No More Neutral Venues For Us Says PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ అతిధ్యం ఇచ్చే హోమ్ సిరీస్‌లను తటస్థ వేదికలలో ఇప్పటినుంచి నిర్హహించబోమని ఆ దేశ క్రికెట్ బోర్డు సృష్టం చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించడానికి తమ దేశం చాలా సురక్షితం అని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2005 తర్వాత మొదటిసారి పాక్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ భద్రతా కారణాల దృష్ట్యా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా సీరిస్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదే విధంగా ఇంగ్లండ్ జట్టు కూడా న్యూజిలాండ్ బాటలోనే పయనించింది. పాక్‌తో సీరీస్‌ను రద్దు చేసుకున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా 2009లో శ్రీలంక జట్టు బస్సుపై జరిగిన ఉగ్రదాడి తర్వాత అన్ని దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్లో పర్యటించడనికి విముఖత చూపాయి. దీంతో పాక్‌తో జరగాల్సిన సీరీస్‌లను తటస్థ వేదికగా యూఏఈలో పీసీబీ నిర్వహించేది. చదవండి: T20 World Cup 2021: శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం -
భరించాం.. సహించాం.. ఇదొక మంచి గుణపాఠం.. కానీ: రమీజ్ రాజా
Ramiz Raja Comments On England and New Zealand Boards: ‘‘ఇంగ్లండ్ పాకిస్తాన్ టూర్‌ను రద్దు చేసుకోవడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే.. ఇది ముందే ఊహించాం. పాశ్చాత్య దేశాలు ఒకరికొకరు మద్దతుగా నిలిచే క్రమంలో ఇలా చేశాయి’’ అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా అన్నాడు. నిజంగా ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా పర్యటన రద్దు చేసుకుంటే పర్లేదన్న అతడు.. అయితే, అసలు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నారో చెప్పకుండా కివీస్ నిర్ణయం తీసుకోవడం తమ ఆగ్రహానికి కారణమని పేర్కొన్నాడు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత పాక్ పర్యటనకు అంగీకరించిన న్యూజిలాండ్.. తొలి వన్డే(సెప్టెంబరు 17) ప్రారంభానికి కొద్ది గంటల ముందు టూర్ రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరులో పాకిస్తాన్ పర్యటనకు రావాల్సిన తమ పురుష, మహిళా క్రికెట్ జట్లను పంపబోమని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. ఈ విషయంపై స్పందించిన రమీజ్ రాజా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా అనుకున్నట్లుగానే జరిగింది. వాళ్లు పర్యటనకు వస్తామని చెప్పినపుడు అన్ని ఏర్పాట్లు చేశాం. వాళ్ల విజ్ఞప్తి మేరకు అన్ని సౌకర్యాలు అమర్చాం. నిజానికి మేం అక్కడికి వెళ్లినపుడు వాళ్లు పెట్టిన కఠినమైన నిబంధనలు పాటించాం. తక్కువ చేసే విధంగా మాట్లాడినా భరించాం.. సహించాం. అయితే, ఇప్పుడు మాకు మంచి గుణపాఠం చెప్పారు. ఇకపై మేం కూడా మాకు ఆసక్తి ఉంటేనే టూర్లకు వెళ్తాం’’ అని కివీస్, ఇంగ్లండ్ తీరును విమర్శించాడు. కాగా గతేడాది పాకిస్తాన్ కివీస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కడ పర్యటించిన పాక్ ఆటగాళ్లు క్వారంటైన్ రూల్స్ అతిక్రమించడం వల్ల కోవిడ్ బారిన పడ్డారు. దీంతో.. న్యూజిలాండ్ గట్టిగానే పీసీబీని హెచ్చరించింది. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన రమీజ్ రాజా కివీస్ వ్యవహారశైలి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందని విమర్శలు చేశాడు. అన్నీ అంతే.. ఎవరికి ఫిర్యాదు చేయాలి? ‘‘మొన్న న్యూజిలాండ్.. ఇప్పుడు ఇంగ్లండ్.. ఆ తర్వాత వెస్టిండీస్, ఆస్ట్రేలియా కూడా ఇదే బాటలో నడుస్తాయేమో.. ఇవన్నీ ఒకే బ్లాక్‌కు చెందినవి. ఎవరికని మేం ఫిర్యాదు చేయగలం? వాళ్లను మా వాళ్లుగా మేం అంగీకరించాం. కానీ వాళ్లు అలా చేయడం లేదు’’ అని రమీజ్ అన్నాడు. అక్కడే చూసుకుంటాం.. ‘‘మా క్రికెట్ బోర్డు ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలని మేం పలు సిరీస్‌లు ఆడాం. కానీ మా ఆటగాళ్ల గౌరవానికి భంగం కలగనివ్వం కదా. ఇతర దేశాలు మా పట్ల ఎందుకో విచిత్ర వైఖరి ప్రదర్శిస్తున్నాయి. ఏదేమైనా ఇదో గుణపాఠం. టీ20 వరల్డ్‌కప్‌లో మా టార్గెట్ ఒక్కటే.. ముందు మా పొరుగుదేశం(టీమిండియా), ఈ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్.. గెలుపు మాదే. మీరు మాకు చేసిన నష్టానికి మైదానంలో బదులు తీర్చుకుంటాం’’ అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. చదవండి: PBKS Vs RR: వారిద్దరు ఓపెనర్స్‌గా వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ -
మరికాసేపట్లో వన్డే మొదలు.. పాక్ సిరీస్‌ను రద్దు చేసుకున్న న్యూజిలాండ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా పాక్ సిరీస్‌ను పూర్తిగా రద్దు చేసుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రావల్పిండి వేదికగా నేటినుంచి తొలి వన్డే ఆడాల్సి ఉండగా.. చివరి నిమిషంలో టూర్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వం పాక్‌లో తమ ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా తీవ్ర స్ధాయిలో ఆందోళన చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ తెలిపారు. కాగా… పాక్ –న్యూజిలాండ్ మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉందన్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల తరువాత న్యూజిలాండ్ తొలిసారిగా పాక్ పర్యటనకు వచ్చింది. చదవండి: IPL 2021 Phase 2: ఈ సారి ఆ జట్టే ఐపీఎల్ విజేత! -
T20 World Cup: భారత్xపాక్ మ్యాచ్‌పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దాయాదుల పోరుకు ముహుర్తం ఖారారైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచులోనే పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 24న జరగనుంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ ,ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్ లో మాట్లడూతూ.. తొలి మ్యాచులోనే పాకిస్థాన్‌తో తలపడటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘2007 లో కూడా, మేము ప్రపంచ కప్ గెలిచినప్పుడు, మా మొదటి మ్యాచ్ స్కాట్లాండ్తో జరగాల్సింది. కానీ అది వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మా మొదటి మ్యాచ్ పాకిస్తాన్‌తో జరిగింది. నేను ఇప్పుడు చెబుతోందీ అదే. టోర్నమెంట్ ప్రారంభ దశలో పాక్‌తో తలపడితే టీమిండియాకు మేలు. అదే పనిగా పాక్ మ్యాచ్ గురించి ఆలోచించకుండా మిగతా టోర్నీపై దృష్టి పెట్టొచ్చు. దేశ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంటుందనుకోండి. ఫలితం ఎలా ఉన్నా, రెండు దేశాలు ఆరంభంలోనే ఆడబోతున్నందుకు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను' అని గంభీర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2021 తొలి రౌండ్ అక్టోబరు 17న ఒమన్‌లో ఆరంభమవుతుంది. గ్రూప్-ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ ఉన్నాయి. గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో సూపర్ 12 అక్టోబరు 23న మొదలవుతుంది. మెదటి రోజు గ్రూప్ 1 జట్లు.. ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్ తలపడతాయి. చదవండి: ICC Test Rankings: లార్డ్స్ టెస్ట్‌లో విఫలమైనా కోహ్లీ ర్యాంక్ పదిలం -
1971 వార్ విజయానికి గుర్తుగా జావా స్పెషల్ ఎడిషన్ బైక్స్
ప్రముఖ వాహన తయారీ కంపెనీ జావా మోటార్ సైకిల్స్ 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్దంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా జావా బ్రాండ్‌లో ఖాకీ, మిడ్నైట్ గ్రే రంగులను పరిచయం చేసింది. భారత్‌లో సైనిక చిహ్నంతో మోటార్ సైకిల్స్ అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. "50 సంవత్సరాల క్రితం భారత సాయుధ దళాలు దురాక్రమణకు అడ్డుగా నిలిచాయి. చరిత్రలో జరిగిన అతి తక్కువ గొప్ప యుద్ధాలలో అద్భుతమైన విజయాన్ని సాధించాయి. 1971 వార్ విక్టరీ 50 సంవత్సరాలను పురస్కరించుకొని #SwarnimVijayVarsh జరుపుకోవడం మాకు గర్వంగా ఉంది" అని జావా మోటార్ సైకిల్స్ ట్విట్టర్ లో తెలిపింది. మాతృ భూమిని రక్షించడానికి సైనికులు చూపిన ధైర్యం, త్యాగాలను ఈ బైక్ పై ఉన్న భారత సైనిక చిహ్నం గుర్తు చేస్తుందని వివరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా జావా బృందాన్ని అభినందించారు ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ధర హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో రూ.1.96 లక్షలుగా ఉంది. కస్టమర్లు కంపెనీ వెబ్ సైట్ ద్వారా స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిల్ ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. -
వైరల్ వీడియో: బర్త్ డే పార్టీ లో సింహాం చీఫ్ గెస్ట్
ఇస్లామాబాద్: ఎక్కడైనా బర్త్ డే పార్టీ అంటే సాధారణంగా మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను ను ఆహ్వనిస్తాము. కానీ పాకిస్థాన్ చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా సింహాన్ని ముఖ్య అతిధి గా తీసుకు వచ్చింది. ఈ మృగరాజుని కుర్చీలో కూర్చోబెట్టి చైన్లతో కట్టేసింది. సుసాన్ ఖాన్ అనే మహిళ లాహోర్ లోని ఓ హోటల్ లో జన్మదిన వేడుక జరుపుకుంది. అయితే బర్త్ డే పార్టీ కు సంభందిచిన ఓ వీడియో ను సుసాన్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఓ సింహాన్ని గొలుసులతో కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. కొందరు ఆటలు ఆడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె చిక్కుల్లో పడింది. సుసాన్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేసిన వీడియో ప్రొటెక్ట్ సేవ్ యానిమల్స్ ప్రతినిధుల కంటపడింది. దీంతో వారు ఈ వీడియోను తమ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసి సుసాన్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము బర్త్ డే పార్టీలకు వ్యతిరేకం కాదు..కానీ ఇలా మీరు మూగజీవాలను పార్టీలకు తీసుకొచ్చి కట్టేసి ఇలా ఆనందం పొందడం తప్పు. మిమ్మల్ని కూడా పార్టీకి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి ఇలానే ఓ కూర్చీ కి కట్టిపడేస్తే మీకు కూడా తెలుస్తుందని వీడియోకు కామెంట్ ట్యాగ్ చేశారు. అయితే ఈ వేడుకలో సింహానికి మత్తుమందు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక వీడియోపై విమర్శలు రావడంతో పోస్ట్ చేసిన 24 గంటల్లో దానిని సుసాన్ ఖాన్ డిలీట్ చేసింది. అయితే ఆ మహిళతోపాటు ఆ పార్టీలో ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.క ఇదే విషయంపై వన్యప్రాణుల సంరక్షణ సంఘం ప్రతినిధులు ఓ ఆన్లైన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. వేడుకల్లో వన్యప్రాణులను ఉపయోగించకూడదని ఆన్లైన్ వేదికగా 1500 సంతకాలు సేకరించారు. View this post on Instagram A post shared by Project Save Animals (@projectsaveanimals) చదవండి: సరిహద్దులు దాటిన ప్రేమ..చివరికి ఏమైందంటే? -
35 ఏళ్ల తర్వాత ఆ ఏనుగుకు విముక్తి!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో 35 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్న కావన్ అనే ఏనుగుకు ఎట్టకేలకు గుంపుతో తిరిగే అవకాశం దొరికింది. అమెరికన్ సింగర్ చేర్ ఆదివారం కావన్‌ను పాకిస్థాన్ నుంచి కాంబోడియాకు తీసుకెళ్లనున్నారు. ఇంతకాలం ఒంటరిగా జీవిస్తూ వచ్చిన ప్రపంచంలోనే అతి పెద్ద ఏనుగైన కావన్ ఇకపై ఏనుగులతో జూలో ఉండనుంది. కావన్‌ను విమానంలో తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కావన్ మొత్తం 10 గంటల పాటు విమానంలో ప్రయాణం చేయనుంది. చదవండి: (అతి భారీ వర్షాలు: 2న రెడ్ అలర్ట్) శుక్రవారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో చేర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరువురూ కావన్‌ను తరలించడానికి అంగీకరించారు. అనంతరం కావన్‌ను కాంబోడియాకు పంపేందుకు సహాయపడిన ఇమ్రాన్‌కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు చేర్. మరోపక్క కావన్‌ను కాంబోడియాకు తరలించేందుకు ముందుకొచ్చినందుకు చేర్‌కు ఇమ్రాన్ ఖాన్ అభినందనలు తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తులో పాకిస్థాన్‌లో జరిగే పర్యావరణ కార్యక్రమాల్లో చేర్ పాల్గొనాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్ కోరినట్టు పీఎంఓ ఆఫీసు ఓ ప్రకటన విడుదల చేసింది. కావన్‌ను పాకిస్థాన్ నుంచి కాంబోడియాలోని సియెమ్ రీప్ ప్రావిన్స్‌కు తరలించనున్నారు. -
సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాకిస్తాన్
-
ఆసియా స్నూకర్ రన్నరప్ భారత్
దోహా: ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ, మల్కీత్ సింగ్‌లతో కూడిన భారత్–1 జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్–1 జట్టు 2–3 (2–110, 81–47, 70–72, 107–5, 18–98) ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్ ఆసిఫ్, బాబర్ మసీలతో కూడిన పాకిస్తాన్–1 జట్టు చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్స్‌లో భారత్–1 జట్టు 3–2 ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్ మాజిద్ అలీ, మొహమ్మద్ బిలాల్‌లతో కూడిన పాకిస్తాన్–2 జట్టుపై... పాకిస్తాన్–1 జట్టు 3–1 ఫ్రేమ్‌ల తేడాతో వు యిజి, పాంగ్‌జున్‌జులతో కూడిన చైనా జట్టుపై విజయం సాధించాయి. -
పాకిస్తాన్లో ‘భగత్ సింగ్’ మంటలు
లాహోర్: స్వతంత్రం కోసం పోరాడిన సర్దార్ భగత్ సింగ్‌కు పాకిస్తాన్‌లోని అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అయిన ‘నిషాన్ ఏ హైదర్’తో సత్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆయనను 86 ఏళ్ల కింద ఉరి తీసిన లాహోర్‌లోని షాదమన్ చౌక్‌లో భగత్‌సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది. ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఖురేషీ మాట్లాడుతూ.. భగత్ సింగ్ ఒక యూత్ ఐకాన్ అని, నేటి యువతకు ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. స్వతంత్రం కోసం భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని, ఆత్మత్యాగాన్ని అందరం గుర్తించాలని ఖురేషి తాజాగా మరోసారి పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వానికి లేఖ రాశారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా సైతం భగత్ సింగ్ త్యాగానికి నివాళి అర్పించాలన్న వ్యాఖ్యలను లేఖలో పొందుపరిచారు. సర్దార్ భగత్ సింగ్.. నిజమైన స్వతంత్ర యోధుడు. అతనికి పాకిస్తాన్ అత్యుతన్న గాలంటరీ మెడల్‌తో సత్కరించాలని ఖురేషీ స్పష్టం చేశారు. స్వతంత్రం కోసం చిన్నతనంలోనే బ్రిటీష్‌తో భగత్ చేసిన పోరాటం అసామాన్యం అని కొనియాడారు. నాటి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న భగత్ సింగ్‌ను, ఆన మిత్రులు అయిన సుఖ్‌దేవ్, రాజ్ గురులను 1931 మార్చి 23న లాహోర్ ఉరితీశారు. నిషాన్ ఏ హైదర్ అంటే: పాకిస్తాన్ సైన్యంలో అత్యంత ధైర్యసాహసాలు, ప్రతిభ కనబర్చిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే నిషాన్ ఏ హైదర్. ఈ పదానికి సింహబలుడు అని అర్థం. హఫీజ్ సయీద్ వ్యతిరేకత: సర్దార్ భగత్ సింగ్‌కు అత్యున్న సైనిక పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్‌పై ముంబై దాడుల సూత్రధారి, జమాతే ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాక షాదమన్ చౌక్ పేరు మార్పుపైనా వ్యతిరేకత ప్రకటించారు. ఇటువంటి చర్యలు పాకిస్తాన్ పైర సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాయని హఫీజ్ సయీద్ పేర్కొన్నారు. -
పాక్ త్రయం.. కోహ్లి రాగం!
కరాచీ: ఇటీవల కాలంలో తన ఆట తీరుతో ప్రపంచ దిగ్గజాల ప్రశంసల్ని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అందుకుంటున్నా.. పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం కోహ్లిని అభినందించిన ఘటనలు చాలా అరుదు. అయితే ఇప్పుడు ఒకేసారి ముగ్గురు పాక్ దిగ్గజ క్రికెటర్లు కోహ్లిపై ప్రశంసలు వర్షం కురిపించారు. అసలు కోహ్లిని అభినందించడానికి పదాలే లేవంటూ మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్, సక్లయిన్ ముస్తాక్, షోయబ్ అక్తర్‌లు ఒకేసారి గళం విప్పారు. విరాట్ కోహ్లి ఆటను పాకిస్తాన్ యువ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలంటూ ఈ దిగ్గజ త్రయం స్పష్టం చేసింది. 'ఒక మంచి ఉత్సాహభరితమైన క్రికెటర్ కోహ్లి. అటు జిమ్‌లోనూ, ఇటు బయట కూడా విరాట్ కు అతనే సాటి. కఠినమైన శారీరక వ్యాయామం చేస్తూ ఆహార నియమాల్లో అత్యంత నియమంగా ఉండటం విరాట్ కే చెల్లింది. విరాట్ ఫామ్ వెనుక విపరీతమైన కృషి ఉంది'అని సక్లయిన్ పేర్కొన్నాడు. 'విరాట్ కోహ్లితో పాటు భారత యువ ఆటగాళ్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉండటానికి వారు సీనియర్లు సలహాల్ని బాగా వంటబట్టించుకుంటారు. ప్రతీరోజు సునీల్ గవాస్కర్ యువ క్రికెటర్లకు అమూల్యమైన సలహాలు ఇస్తూ ఉంటాడు. పాక్ క్రికెట్ జట్టులో అది లేదు. ఏ క్రికెటర్ కూడా సీనియర్ సలహాల్ని తీసుకోడు. దాంతో పాటు మా ఆటగాళ్లు ఫిట్ నెస్‌పై పెద్దగా శ్రద్ధ పెట్టరు' అని అక్రమ్ పేర్కొన్నాడు. 'ప్రపంచక్రికెట్ లో తనదైన ముద్రతో చెలరేగిపోతున్నవిరాట్ కోహ్లిని పాక్ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలని అక్తర్ పేర్కొన్నాడు. కోహ్లి ఆటను వర్ణంచడానికి పదాలే సరిపోవడం లేదని అక్తర్ తెలిపాడు.