Shoaib Malik: ఆఫ్రిదికి సెల్యూట్‌ చేసిన మాలిక్‌.. ఎందుకో తెలుసా..! | T20 World Cup 2021: Shoaib Malik salutes Shahid Afridi Then Pakistan beat Afghanistan | Sakshi
Sakshi News home page

T20 World Cup Pak Vs Afg: ఆఫ్రిదికి సెల్యూట్‌ చేసిన మాలిక్‌.. ఎందుకో తెలుసా..!

Published Sat, Oct 30 2021 1:53 PM | Last Updated on Sat, Oct 30 2021 3:30 PM

T20 World Cup 2021: Shoaib Malik salutes Shahid Afridi Then Pakistan beat Afghanistan - Sakshi

Shoaib Malik salutes Shahid Afridi: టీ20 ప్రపంచకప్‌2021లో భాగంగా శుక్రవారం ఆప్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది. దీంతో సెమిఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది పాకిస్తాన్‌. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం ఓ ఆసక్తి​కర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తమ జట్టును సపోర్ట్ చేయడానికి  వచ్చిన  పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదినూ చూస్తూ.. షోయబ్ మాలిక్ సెల్యూట్‌ చేశాడు. దీంతో స్టేడియంలో ఉన్న అభిమానులందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌లో షేర్‌ చేసింది.

అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన ఆఫ్రిది.. ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్‌ ఆరంభంలోనే రిజ్వాన్‌ (8) వికెట్‌ను కోల్పోయింది.

అయితే బాబర్, ఫఖర్‌ కలిసి  ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే తక్కువ వ్యవధిలో ఫఖర్‌తో పాటు హఫీజ్‌ (10) కూడా నిష్క్రమించాడు. బాబర్‌ను రషీద్‌ అవుట్‌ చేయడంతో  ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో నవీన్‌ ఉల్‌ హఖ్‌ 2 పరుగులే ఇచ్చి మాలిక్‌ (19) వికెట్‌ తీయడంతో అఫ్గాన్‌ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే ఆసిఫ్‌ తన మెరుపు బ్యాటింగ్‌తో పాక్‌ను గెలిపించాడు.

చదవండి: Sarah Taylor: క్రికెట్‌ చరిత్రలో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement