Shahid Afridi
-
బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై దుమారం రేగుతోంది. కొత్త సెలక్షన్ కమిటీ వచ్చీ రాగానే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేయడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాబర్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తుండగా.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం భిన్నంగా స్పందించాడు.బలిపశువు అతడేపీసీబీ కొత్త సెలక్టర్ల టార్గెట్ బాబర్ కాదన్న బసిత్ అలీ.. షాహిన్ ఆఫ్రిదిని బలిపశువును చేయాలని వాళ్లు ఫిక్సయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. షాహిన్.. షాహిద్ ఆఫ్రిదికి అల్లుడు కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాక్ జట్టు.. స్వదేశంలో తాజా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే పునరావృతం చేస్తోంది.మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన షాన్ మసూద్ బృందం.. మంగళవారం నుంచి రెండో టెస్టు మొదలుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో ఓటమి అనంతరం పీసీబీ తమ మాజీ క్రికెటర్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో నూతన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.అది అతడి దురదృష్టంఈ నేపథ్యంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘స్వప్రయోజనాల కోసం బ్యాటింగ్ పిచ్‌ను తయారు చేయించుకున్నారు. అలాంటి పిచ్‌పై బాబర్ ఆడలేకపోవడం, ఫామ్‌లేమిని కొనసాగించడం అతడి దురదృష్టం. అయితే, సెలక్టర్ల టార్గెట్ ఎల్లప్పుడూ షాహిన్ ఆఫ్రిది మాత్రమే. ఇందుకు కారణం షాహిద్ ఆఫ్రిది.షాహిన్ ఆఫ్రిది ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎవరు తన స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించగలగాలి. చిరునవ్వుతో నీతో మాట్లాడినంత మాత్రాన వాళ్లు నీ ఫ్రెండ్స్ అయిపోతారనుకుంటే పొరపాటు పడినట్లే. తమ మనసులోని భావాలు బయటపడకుండా వీళ్లు(సెలక్టర్లు) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎవరు ఏమిటన్నది తెలుసుకుని మసలుకో షాహిన్’’ అని సందేశం ఇచ్చాడు.అదే విధంగా.. బాబర్ ఆజం విషయంలో అతడి అభిమానులు రచ్చ చేస్తారని.. ఈసారి వాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్లు వేశాడు. ఏదేమైనా.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు బాబర్, షాహిన్, నసీం షాలను కొనసాగించాల్సిందని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో రెండు, మూడో టెస్టులకు బాబర్ ఆజంతో పాటు పేస్ బౌలర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షాలను కూడా సెలక్టర్లు తప్పించారు.ముగ్గురు కొత్త ఆటగాళ్లుతొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా వీరిపై మాత్రమే వేటు వేయడం అంటే సెలక్టర్లు ప్రదర్శనకంటే కూడా ఒక హెచ్చరిక జారీ చేసేందుకే అనిపిస్తోంది. వీరి స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లు కమ్రాన్ గులామ్, హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్‌లను సెలక్ట్ చేశారు. వీరితో పాటు ఇద్దరు సీనియర్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమాన్ అలీలకు కూడా పాక్ జట్టులో చోటు దక్కింది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
IND VS SL 3rd ODI: హిట్‌మ్యాన్ మరో రెండు సిక్సర్లు కొడితే..!
శ్రీలంకతో మూడో వన్డేకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో రెండు సిక్సర్లు కొడితే.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్‌ను (294 ఇన్నింగ్స్‌ల్లో 331 సిక్సర్లు) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 330 సిక్సర్లు (256 ఇన్నింగ్స్‌ల్లో) ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాక్ మాజీ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 369 ఇన్నింగ్స్‌ల్లో 351 సిక్సర్లు బాదాడు.కాగా, లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్.. గేల్ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్.. ఛేదనలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గేల్ 177 సిక్సర్లు కొడితే.. రోహిత్ 179 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ రెండు మ్యాచ్‌ల్లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలు చేశాడు.తొలి వన్డేలో 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసిన రోహిత్.. రెండో వన్డేలో 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. రోహిత్ రెండు వన్డేల్లో మెరిసినా భారత్ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో భారత్ రోహిత్ అందించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమిపాలైంది. సిరీస్‌లో మూడో వన్డే ఆగస్ట్ 7న జరుగనుంది. -
‘పాకిస్తాన్‌కు టీమిండియా రావాల్సిందే.. మేమైతే’
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్‌ను విజయంతంగా నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేస్తుంది.ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్‌ను సైతం పీసీబీ.. ఐసీసీకి పంపింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాక్‌కు పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని డిమాండ్ చేస్తోంది. కానీ పీసీబీ మాత్రం ఈ మెగా టోర్నీని తమ దేశంలో నిర్వహించాలని మొండి పట్టు పట్టింది.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ దేశానికి రావడానికి భారత్‌కు ఇష్టం లేదని, భద్రతను సాకుగా ఉపయోగించుకుంటుందని అఫ్రిది ఆరోపించాడు. ఇప్పటికే చాలా మంది పాక్ మాజీ క్రికెటర్లు భారత జట్టు తమ దేశానికి రావాలని వాదిస్తున్నారు."మేము క్లిష్లమైన పరిస్ధితుల్లో కూడా ఆడేందుకు భారత్‌కు చాలాసార్లు వెళ్లాం. మాకు బెదిరింపులు వచ్చిన సందర్భాల్లో కూడా మేము భారత్‌కు వెళ్లి క్రికెట్ ఆడాము. మమ్మల్ని భారత్‌కు పంపేందుకు మా దేశ ప్రభుత్వం గానీ, పీసీబీ గానీ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.గతేడాది కూడా మా జట్టు వరల్డ్‌కప్‌లో తలపడేందుకు భారత్‌కు వెళ్లింది. మేము ఎప్పుడూ భారత్‌కు సపోర్ట్‌గా ఉంటాము. కాబట్టి వారు కూడా ఇక్కడకు వచ్చి ఆడాలని నేను కోరుకుంటున్నానని" అఫ్రిది ఓ పాక్ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు. -
విరాట్ పాకిస్తాన్‌కు వస్తే ఆ ప్రేమను మర్చిపోతాడు: ఆఫ్రిది
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదంటే హైబ్రిడ్ విధానంలో ఈ టోర్నీ నిర్వహిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు.భారత క్రికెట్ జట్టు తప్పకుండా తమ దేశంలో పర్యటించాలని విజ్ఞప్తి చేశాడు. టీమిండియా పాక్ గడ్డ మీద ఆడితే చూడాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం టీమిండియాను అక్కడికి పంపేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఆసియా వన్డే కప్-2023 మాదిరిగానే హైబ్రిడ్ విధానం(టీమిండియా మ్యాచ్‌లకు వేరే వేదిక)లో ముందుకు వెళ్లాలని ఐసీసీని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.టీమిండియా ఇక్కడకు రావాలిఈ నేపథ్యంలో షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ.. రోహిత్ సేన పాకిస్తాన్ పర్యటనకు వస్తే చూడాలని ఉందన్నాడు. రాజకీయాలతో ఆటను ముడిపెట్టకుండా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.ముఖ్యంగా విరాట్ కోహ్లికి తమ దేశంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని.. అతడిని చూడాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని ఆఫ్రిది తెలిపాడు. భారత్‌లోని అభిమానుల ప్రేమను మరిపించేలా అతడిని తమ ప్రేమలో ముంచెత్తుత్తామని పేర్కొన్నాడు.‘‘భారత క్రికెట్ జట్టు తప్పకుండా ఇక్కడికి రావాలి. మేము ఇండియాలో పర్యటించినపుడు మాకెంతో ఘనంగా స్వాగతం పలకడం పాటు గౌరవమర్యాదలు ఇచ్చారు.ఆ ప్రేమను మరచిపోతాడుఅదే విధంగా మా దేశంలో టీమిండియాను 2005లో ఇలాగే సాదరంగా ఆహ్వానించాం. రాజకీయాలకు అతీతంగా క్రికెట్‌ను చూడాలి. ఒక్కసారి విరాట్ ఇక్కడికి వచ్చాడంటే భారత్‌లో తనకు దొరికే ప్రేమను కూడా మరిచిపోతాడు.పాకిస్తాన్లో అతడికి అంతటి క్రేజ్ఉంది. ఇక్కడి ప్రజలకు అతడంటే ఎంతో ఇష్టం’’ అని షాహిద్ ఆఫ్రిది ఓ యూట్యూబ్ చానెల్‌తో పేర్కొన్నాడు. కాగా వన్డే, టీ20లలో కోహ్లికి పాక్‌పై మెరుగైన రికార్డు ఉంది. వన్డే, టీ20లలో పాక్‌పై అతడి పరుగుల సగటు 52.15, 70.29. చదవండి: మిస్టరీ గర్ల్‌తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్ -
నేటి నుంచి (జులై 3) మరో క్రికెట్ పండుగ.. జులై 6న భారత్-పాక్ మ్యాచ్
టీ20 వరల్డ్‌కప్ ముగిసి వారం రోజులు కూడా గడవక ముందే మరో క్రికెట్ పండుగ మొదలైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 3) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు (ఇండియా ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటున్నాయి. లెజెండ్స్ క్రికెట్‌కు సంబంధించి ఈ టోర్నీని వరల్డ్‌కప్‌గా పరిగణించవచ్చు. ఈ టోర్నీలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, కెవిన్ పీటర్సన్, డేల్ స్టెయిన్, హెర్షల్ గిబ్స్, షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్, బ్రెట్ లీ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. సింగిల్ రౌండ్ ఫార్మాట్లో జరిగే (ప్రతి జట్టు మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది) ఈ టోర్నీ జులై 13న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. సింగిల్ రౌండ్ తర్వాత టాప్-4లో ఉండే జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జులై 6న జరుగనుంది.జట్ల వివరాలు..భారత్ ఛాంపియన్స్: యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, పవన్ నేగిఆస్ట్రేలియా ఛాంపియన్స్: బ్రెట్ లీ, టిమ్ పైన్, షాన్ మార్ష్, బెన్ కట్టింగ్, బెన్ డంక్, డిర్క్ నాన్స్, డాన్ క్రిస్టియన్, బెన్ లాఫ్లిన్, ఆరోన్ ఫించ్, బ్రాడ్ హాడిన్, కల్లమ్ ఫెర్గూసన్, పీటర్ సిడిల్, జేవియర్ డోహెర్టీ, నాథన్ కౌల్టర్ నైల్, జాన్ హేస్టింగ్స్ఇంగ్లండ్ ఛాంపియన్స్: కెవిన్ పీటర్సన్, రవి బొపారా, ఇయాన్ బెల్, సమిత్ పటేల్, ఒవైస్ షా, ఫిలిప్ మస్టర్డ్, క్రిస్ స్కోఫీల్డ్, సాజిద్ మహమూద్, అజ్మల్ షాజాద్, ఉస్మాన్ అఫ్జల్, ర్యాన్ సైడ్‌బాటమ్, స్టీఫెన్ ప్యారీ, స్టువర్ట్ మీకర్, కెవిన్ ఓ'బ్రియన్వెస్టిండీస్ ఛాంపియన్స్: డారెన్ సామీ, క్రిస్ గేల్, శామ్యూల్ బద్రీ, రవి రాంపాల్, కేస్రిక్ విలియమ్స్, జాసన్ మహమ్మద్, నవిన్ స్టీవర్ట్, డ్వేన్ స్మిత్, యాష్లే నర్స్, సులీమాన్ బెన్, చాడ్విక్ వాల్టన్, జెరోమ్ టేలర్, ఫిడేల్ ఎడ్వర్డ్స్, కిర్క్ ఎడ్వర్డ్స్, జోనాథన్ కార్టర్దక్షిణాఫ్రికా ఛాంపియన్స్: జాక్వెస్ కల్లిస్, హెర్షెల్ గిబ్స్, ఇమ్రాన్ తాహిర్, మఖాయా ంటిని, డేల్ స్టెయిన్, అష్వెల్ ప్రిన్స్, నీల్ మెక్కెంజీ, ర్యాన్ మెక్లారెన్, జస్టిన్ ఒంటాంగ్, రోరీ క్లీన్‌వెల్ట్, జెపి డుమిని, రిచర్డ్ లెవి, డేన్ విలాస్, వెర్నాన్ ఫిలాండర్,పాకిస్తాన్ ఛాంపియన్స్: యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, అబ్దుల్ రజాక్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సోహైల్ తన్వీర్, సోహైల్ ఖాన్, తన్వీర్ అహ్మద్, ముహమ్మద్ హఫీజ్, అమీర్ యామిన్, షోయబ్ మాలిక్, సోహైబ్ మక్సూద్, ఉమర్జెల్ ఖాన్ అక్మల్,షెడ్యూల్..బుధవారం, జూలై 03ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్గురువారం, జూలై 04సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్శుక్రవారం, జూలై 05ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇండియా వర్సెస్ వెస్టిండీస్శనివారం, జూలై 06ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియాఇండియా వర్సెస్ పాకిస్థాన్ఆదివారం, జూలై 07సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్సోమవారం, జూలై 08ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియామంగళవారం, జూలై 09వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్బుధవారం, జూలై 10వెస్టిండీస్ వర్సెస్ఆస్ట్రేలియా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాబుధవారం, జూలై 12మొదటి సెమీ ఫైనల్- TBA vs TBAరెండవ సెమీ ఫైనల్- TBA vs TBAశనివారం, జూలై 13ఫైనల్ మ్యాచ్ - TBA vs TBA -
పాక్ పరాభవంపై బంగ్లాదేశ్ ఓపెనర్ ట్వీట్.. షాకివ్వనున్న పీసీబీ
గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన బాబర్ ఆజం బృందం.. టీ20 ప్రపంచకప్-2024లోనూ ఘోర పరాభవం చవిచూసింది.గ్రూప్-ఏలో టీమిండియా, కెనడా, ఐర్లాండ్, అమెరికాలతో కలిసి ఉన్న పాక్.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి టీమిండియాతో పాటు పసికూన, ఆతిథ్య అమెరికా సూపర్-8కు అర్హత సాధించింది.ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్, కోచ్‌లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంలో తరచూ మార్పుల కారణంగానే తీరూ తెన్నూ లేకుండా పోయిందని.. అందుకు నిదర్శనమే ఈ వరుస వైఫల్యాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అఫ్గన్, బంగ్లాదేశ్ కూడా ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024లో పాక్ గ్రూప్ స్టేజీలోనే ఇంటిబాట పట్టగా.. ఆసియా నుంచి టీమిండియాతో పాటు అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ సూపర్-8కు చేరుకున్న విషయం తెలిసిందే. నాలుగింట మూడు విజయాలతో గ్రూప్-సి నుంచి అఫ్గన్.. గ్రూప్-డి నుంచి నాలుగింట మూడు గెలిచి బంగ్లా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదే వెటరన్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పాక్ వైఫల్యాలపై సానుభూతి వ్యక్తం చేసిన ఈ బంగ్లా బ్యాటర్.. మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వంటి వాళ్లు ప్రస్తుత జట్టుకు మార్గదర్శనం చేస్తే బాగుంటుందని హితవు పలికాడు.‘‘టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ కావడం విచారకరం. వచ్చేసారి వాళ్లు గొప్పగా రాణించాలని ఆశిస్తున్నా. షాహిద్ ఆఫ్రిది వంటి సీనియర్లే వారికి సరైన మార్గం చూపాలి’’ అని తమీమ్ ఇక్బాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇక్బాల్ ట్వీట్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా.. ఇలా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.కఠిన చర్యలకు సిద్ధంవన్డే వరల్డ్‌కప్‌లో అవమానం తర్వాత పాకిస్తాన్ వరుసగా విఫలమైంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లో పరాజయాలు చవిచూసింది.తాజాగా ప్రపంచకప్ రేసు నుంచి లీగ్ దశలోనే వైదొలిగింది. అంతేగాక సీనియర్లు సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్లపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.సెంట్రల్ కాంట్రాక్టులు, జీతాల విషయంలో సమీక్ష నిర్వహించి.. కోతలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆటగాళ్ల తీరుపై గుర్రుగా ఉన్న పీసీబీ కొత్త చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. -
అతడినే కెప్టెన్‌గా ఉండనివ్వాల్సింది: బాబర్‌పై ఆఫ్రిది ఆగ్రహం
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తీరును మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది విమర్శించాడు. షాహిన్ ఆఫ్రిది స్థానంలో బాబర్ పగ్గాలు చేపట్టడం సరికాదని పేర్కొన్నాడు. ఒకవేళ బోర్డు ఆఫర్ చేసినా.. షాహిన్నే కెప్టెన్‌గా కొనసాగించాలని బాబర్.. కోరి ఉంటే బాగుండేదంటూ తన అల్లుడికి మద్దతు పలికాడు.వన్డే ప్రపంచకప్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజం తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి పాక్ క్రికెట్ బోర్డు టెస్టులకు షాన్ మసూద్, టీ20 ఫార్మాట్‌కు ప్రధాన పేసర్, షాహిద్ ఆఫ్రిది అల్లుడు షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్లుగా ప్రకటించింది.షాహిన్‌పై వేటుఅయితే, మసూద్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన పాకిస్తాన్.. షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను 4-1తో ఓడిపోయింది.ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ షాహిన్ ఆఫ్రిది వైఫల్యం కొనసాగింది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు కొత్త యాజమాన్యం అతడిపై వేటు వేసింది. వన్డే, టీ20లకు బాబర్ ఆజంనే తిరిగి కెప్టెన్‌గా నియమించింది.అయితే, బాబర్ సారథ్యంలోనూ పాకిస్తాన్‌కు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తొలుత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయిన పాక్.. తాజాగా టీ20 ప్రపంచకప్-2024లో గ్రూప్ దశ దాటకుండానే ఎలిమినేట్ అయింది.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. షాహిద్ ఆఫ్రిది తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్‌కప్ వరకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్‌గా ఉంటాడని ఒకవేళ పీసీబీ చెబితే.. బాబర్ ఆజం అతడికి మద్దతుగా నిలవాల్సింది.‘లేదు. నాకు కెప్టెన్సీ వద్దు. మేమంతా షాహిన్ సారథ్యంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. అతడు నాతో పాటు ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నాడు. అందుకే అతడికే కెప్టెన్సీ అప్పగించండి. నేను అతడికి మద్దతుగా ఉంటూ.. అతడి నాయకత్వంలో ఆడతాను’’ అని బాబర్ ఆజం చెప్పాల్సింది.బాబర్ ఆజంకు కెప్టెన్సీ చేయడమే రాదుఇలా చేసి ఉంటే అతడిపై గౌరవం పెరిగేది. అయినా.. ఇందులో బాబర్ ఒక్కడినే తప్పుబట్టడానికి లేదు. సెలక్షన్ కమిటీకి కూడా ఇందులో భాగం ఉంది.సెలక్షన్ కమిటీలోని కొందరకు వ్యక్తులు.. బాబర్ ఆజంకు కెప్టెన్సీ చేయడమే రాదని డైరెక్ట్‌గానే చెప్పారు. అయినా మళ్లీ అతడి చేతికే పగ్గాలు వచ్చాయి’’ అని షాహిద్ ఆఫ్రిది ఘాటు విమర్శలు చేశాడు.ఏదేమైనా బాబర్ ఆజం.. తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదినే కెప్టెన్‌గా కొనసాగించాలని బోర్డును కోరి ఉండాల్సిందని షాహిద్ ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. కాగా బాబర్ నాయకత్వంలో 2021 వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన పాకిస్తాన్.. 2022లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం గ్రూప్ స్టేజిలోనే ఇంటిబాట పట్టింది. చదవండి: WC: ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నాం: ఇంగ్లండ్ పేసర్ -
Ind vs Pak: పాక్ గెలుస్తుందని చెప్పాను.. కానీ: యువీ
టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోటీ చూడటానికి ఇరు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందనడం అతిశయోక్తి కాదు.అయితే, ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్‌పై టీమిండియాదే పైచేయి. తాజాగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతమైంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో జరిగిన దాయాదుల పోరులో భారత్ పాక్‌పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.ఛేదించదగ్గ లక్ష్యానికి పాకిస్తాన్ చేరువవుతున్న వేళ టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. దాయాది ఆశలను ఆవిరి చేశాడు. అద్భుత స్పెల్(3/14)తో భారత జట్టుకు విజయం అందించాడు.ఇక భారత్- పాక్ మ్యాచ్ అంటే కేవలం గణాంకాలే కాదు భావోద్వేగాల సమాహారం అన్న విషయం తెలిసిందే. ఇక గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో పాక్ ఓడిపోవడాన్ని ఆ దేశ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోయారు.ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది- టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ తెరమీదకు వచ్చింది. పాక్ ఓటమి నేపథ్యంలో ఆఫ్రిది ఉద్వేగానికి లోనుకాగా.. యువీ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.యువీ- ఆఫ్రిది మధ్య సంభాషణ ఇలా..యువీ: లాలా.. ఏమైంది? ఎందుకంత బాధగా ఉన్నావు?ఆఫ్రిది: నేనిలా ఉండటం తప్పా? ఒప్పా? నువ్వే చెప్పు. అసలు ఈ మ్యాచ్ మేము ఓడిపోవాల్సిన మ్యాచ్కానే కాదు కదా!విజయానికి మేము 40 పరుగుల దూరంలో ఉన్నపుడు.. యువరాజ్ నా దగ్గరకు వచ్చి ‘లాలా.. కంగ్రాట్స్! ఇక నేను మ్యాచ్ చూడను. వెళ్లిపోతున్నా’ అని చెప్పాడు.వెంటనే నేను అతడికి బదులిస్తూ.. ‘‘ఈ పిచ్‌పై 40 పరుగుల అంటే అంత తేలికేమీ కాదు. ఇంత ముందుగానే కంగ్రాట్స్ చెప్పకు’’ అని యువీతో అన్నాను.యువీ: పాకిస్తాన్ గెలుస్తుందని నేను చెప్పినప్పటికీ.. టీమిండియా విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే ఉన్నాను. అయినా ఆటలో గెలుపోటములు సహజం. ఏదేమైనా మన మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుంది కదా!కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి యువరాజ్ సింగ్‌తో పాటు షాహిద్ ఆఫ్రిది అంబాసిడర్లుగా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: అనుకున్నది సాధించలేకపోయాం.. కారణం అదే: బాబర్ ఆజంChit Chat of Shahid Afridi with Yuvraj Singh Regarding #PakvsInd Match pic.twitter.com/tMCfZdCt0Z— TEAM AFRIDI (@TEAM_AFRIDI) June 11, 2024 View this post on Instagram A post shared by ICC (@icc) -
జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్‌పై విమర్శల పర్వం కొనసాగుతోంది. మెగా టోర్నీకి జట్టు ఎంపిక మొదలు.. బాబర్ ఆజం కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శన వరకు ఏ ఒక్కటి సరిగ్గా లేదంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా సహా వసీం అక్రం, కమ్రన్ అక్మల్, సలీం మాలిక్ తదితరులు భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఆట తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కూడా ఈ జాబితాలో చేరాడు. ప్రపంచకప్ టోర్నీకి ముందు పాకిస్తాన్ కెప్టెన్‌గా తిరిగి నియమితుడైన బాబర్ ఆజంపై అతడు విమర్శలు ఎక్కుపెట్టాడు.‘‘కెప్టెన్ అనే వాడు జట్టును ఒకే తాటి మీదకు తెస్తాడు. జట్టును నాశనం చేయగల.. లేదంటే నిర్మించగల శక్తి అతడికి ఉంటుంది. ఈ వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత నేను ఈ విషయంపై ఇంకాస్త స్పష్టంగా మాట్లాడతాను’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు.అదే విధంగా తన అల్లుడు షాహిన్ ఆఫ్రిది కెరీర్‌లోని ఎత్తుపళ్లాల గురించి ప్రస్తావన రాగా.. ‘‘అతడితో నాకున్న బంధుత్వం కారణంగా.. నేను నా కూతురికి, అతడికి అనుకూలంగా మాట్లాడుతున్నానని చాలా మంది అనుకుంటారు.నిజానికి నేను ఎప్పుడూ అలా మాట్లాడను. ఒకవేళ నా కూతురైనా.. అల్లుడైనా తప్పు చేస్తే తప్పు చేశారనే చెప్తాను. అంతేతప్ప వెనకేసుకురాను’’ అంటూ షాహిద్ ఆఫ్రిది ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ కనీసం సెమీస్ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు.ఫలితంగా పాకిస్తాన్ టీ20 కెప్టెన్సీ పదవి ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిదిని వరించింది. అయితే, అతడి సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో కోల్పోయింది.ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంలో పలు మార్పుల అనంతరం బాబర్ ఆజం తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడి నాయకత్వంలో వరల్డ్‌కప్‌నకు ముందు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడిన పాకిస్తాన్ 0-2తో ఓడిపోయింది.ఇక వరల్డ్‌కప్-2024లోనూ బాబర్ బృందం పరాజయాల పరంపర కొనసాగుతోంది. తమ తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ చేతిలో ఓడిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలోనూ పరాజయం పాలైంది. గ్రూపు దశలో మిలిగిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే ఈ టోర్నీలో పాక్ ముందడుగు వేయగలుగుతుంది. ఈ నేపథ్యంలో జట్టులో ఐక్యత లేనందువల్లే ఈ పరిస్థితి అంటూ షాహిద్ ఆఫ్రిది బాబర్ ఆజంను టార్గెట్ చేయడం గమనార్హం.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సురేశ్ రైనా ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో తనదైన శైలిలో మ్యాచ్‌లు, ప్లేయర్ల ఆట తీరును విశ్లేషిస్తూ వ్యాఖ్యాతగా ఆకట్టుకుంటున్నాడు.ఇక ఇటీవల ఐపీఎల్-2024 క్వాలిఫయర్-1 మ్యాచ్ సందర్భంగా సురేశ్ రైనా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై సెటైర్లు వేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదారబాద్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో కలిసి హిందీలో కామెంట్రీ చేశాడు రైనా.ఈ సందర్భంగా ఆకాశ్ చోప్రా.. రైనాను ఉద్దేశించి.. ‘‘రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంటావా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనేమీ షాహిద్ ఆఫ్రిదిని కాదు’’ అని రైనా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి షాహిద్ ఆఫ్రిదిని అంబాసిడర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటన విడుదల చేసింది. టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్, జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌లతో పాటు ఆఫ్రిది కూడా ఈ మెగా ఈవెంట్‌కు రాయబారిగా ఉంటాడని పేర్కొంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన స్పోర్ట్స్ కంటెంట్ రైటర్ రైనాను ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ‘‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా షాహిద్ ఆఫ్రిది పేరును ఐసీసీ ప్రకటించింది. హలో సురేశ్ రైనా’’ అని ట్రోల్ చేశాడు.I’m not an ICC ambassador, but I have the 2011 World Cup at my house. Remember the game at Mohali? Hope it brings back some unforgettable memories for you. https://t.co/5H3zIGmS33— Suresh Raina🇮🇳 (@ImRaina) May 24, 2024 ఇందుకు రైనా కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. ‘‘నేను ఐసీసీ అంబాసిడర్‌ను కాదు గానీ.. 2011 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిని. మొహాలీలో గేమ్ గుర్తుందా?నాకు తెలిసి ఆ మ్యాచ్ నీకు కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తుందనుకుంటా’’ అని కౌంటర్ ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2011లో మొహాలీ వేదికగా టీమిండియా- పాకిస్తాన్ సెమీ ఫైనల్లో తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. నాటి మ్యాచ్‌లో సురేశ్ రైనా జట్టుకు అవసరమైన సమయంలో పట్టుదలగా నిలబడి 36 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధోని సేన షాహిద్ ఆఫ్రిది బృందాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ తనను ట్రోల్ చేసిన వ్యక్తికి రివర్స్ సెటైర్ వేశాడు.💥Suresh Raina played one of the most important knocks of his career "OTD in 2011" - India were 205/6 against Pakistan in Semi-Final & he scored 36* runs from 39 balls in tough situation.pic.twitter.com/gGzL5wUm0p— मैं हूँ Sanatani 🇮🇳 🚩🚩 (@DesiSanatani) May 24, 2024 -
'నేనేమి షాహిది అఫ్రిదిని కాను'.. రిటైర్మెంట్ యూటర్న్‌పై రైనా
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండరీ ఆటగాడు సురేష్ రైనా తన రిటైర్మెంట్ యూ టర్న్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న రైనా.. ప్రస్తుతం ఐపీఎల్-2024లో కామెంటేటర్‌గా బీజీబీజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు రైనా భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రాతో కలిసి హిందీ వ్యాఖ్యతగా వ్యవహరించాడు.కోల్‌కతా బ్యాటింగ్ సందర్భంగా ఎనిమిదో ఓవర్లో ఆకాష్ చోప్రా నుంచి రైనాకు తన రిటైర్మెంట్ యూ టర్న్‌కు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. రిటైర్మెంట్ను ఏమైనా వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నవా అంటూ రైనాను చోప్రా ప్రశ్నించాడు. అందుకు బదులుగా రైనా "నేనేమి షాహిద్ అఫ్రిదిని" కాదు అంటూ నవ్వుతూ సమాధనమిచ్చాడు. కాగా పాకిస్తాన్ మాజీ ఆల్-రౌండర్ షాహిద్ అఫ్రిది తన రిటైర్మెంట్ను మూడు సార్లు వెనక్కి తీసుకున్నాడు.చదవండి: Virat Kohli: కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి తలనొప్పి! ఒక రకంగా.. -
Viral Video: బ్యాట్ విరగొట్టుకుని, అదే బంతికి ఔటైన అఫ్రిది
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వినూత్న రీతిలో ఔటైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. లండన్‌లో జరిగిన ఓ టీ10 మ్యాచ్ సందర్భంగా అఫ్రిది బ్యాట్ విరగొట్టుకుని, అదే బంతికి ఔటయ్యాడు. వివరాల్లోకి వెళితే.. టీమ్ యూరప్, బ్రిటిష్ అండ్ ఐరిష్ నైట్స్ జట్ల మధ్య జరిగిన ఓ టీ10 మ్యాచ్‌లో అఫ్రిది పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ యూరప్‌కు ప్రాతినిథ్యం వహించిన అఫ్రిది.. ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి ఔటయ్యాడు. A 𝘽𝘼𝙏𝘵𝘭𝘦 lost 😄 Have you seen anything like this before? 👀 #EuropeanCricket #StrongerTogether #WestonShield pic.twitter.com/K25AWxN9Qo — European Cricket (@EuropeanCricket) April 7, 2024 ఒలివర్ రిలే బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అఫ్రిది పెవిలియన్‌కు చేరాడు. ఒలివర్ సంధించిన బంతిని అఫ్రిది లెగ్ సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లో లేచింది. బంతి బలంగా తాకడంతో బ్యాట్ రెండు ముక్కలైంది. హ్యాండిల్ అఫ్రిది చేతిలోనే ఉండిపోగా.. మరో ముక్క లెగ్ సైడ్ దిశలో వెళ్లి పడింది. గాల్లోకి లేచిన బంతిని ఒలివర్ క్యాచ్ పట్టుకోవడంతో అఫ్రిది వినూత్న రీతిలో ఔటయ్యాడు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కాగా, 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షాహిద్ అఫ్రిది.. నాటి నుంచి విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో అఫ్రిది కనిపిస్తూ ఉంటాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలోనూ అఫ్రిది దర్శనమిచ్చాడు. క్రికెట్‌తో అనునిత్యం టచ్‌లో ఉండే అఫ్రిది టీవీ డిబేట్లలో పాల్గొంటుంటాడు. 47 ఏళ్ల అఫ్రిది ప్రస్తుత పాక్ క్రికెటర్‌కు పిల్లనిచ్చిన మామ. అఫ్రిది కుమార్తెను షాహీన్ అఫ్రిది పెళ్లి చేసుకున్నాడు. విధ్వంసకర బ్యాటర్ అయిన అఫ్రిది పేరిట అప్పట్లో వన్డే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉండేది. కెన్యాలోని నైరోబీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. చాలాకాలం వరకు ఇది వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది. ప్రస్తుతం వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 2015లో వెస్టిండీస్‌పై 31 బంతుల్లోనే శతక్కొట్టాడు. -
పాక్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్!.. అల్లుడికి అండగా షాహిద్ ఆఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది విమర్శించాడు. బోర్డు పెద్దలు మారినప్పుడల్లా వారికి అనుగుణంగా నిర్ణయాలు మారిపోతూ ఉంటాయని.. తమ క్రికెట్ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొన్నాడు. కాగా పీసీబీ యాజమాన్యం తరచూ మారుతున్న విషయం తెలిసిందే. ప్రధాని షాబాజ్ జోక్యం నేపథ్యంలో రమీజ్ రాజాను అధ్యక్షుడిగా తప్పించి.. నజమ్ సేథీని తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు. అనంతరం నజమ్ సేథీ కూడా వైదొలగడంతో.. అతడి స్థానంలో జకా అష్రాఫ్ బాధ్యతలు చేపట్టాడు. అతడు కూడా రాజీనామా చేయడంతో సుప్రీం కోర్టు న్యాయవాది షా ఖవార్ నియమితులయ్యారు. తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన పీసీబీ ఎన్నికలు ముగిసే వరకు ఈ పదవిలో కొనసాగుతారని ప్రకటించారు. అనంతరం ఎలక్షన్లో గెలిచిన మొహ్సిన్ నఖ్వీ పీసీబీ బాస్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023లో కనీసం సెమీస్ కూడా చేరుకుండా పాకిస్తాన్ నిష్క్రమించడంతో కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు వేశారు. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్, టీ20 కెప్టెన్‌గా షాహిన్ ఆఫ్రిదిని నియమించారు. అయితే, వీరిద్దరి సారథ్యంలో తొలి సిరీస్‌లలోనే పాకిస్తాన్ ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. ఈ క్రమంలో కొత్త సెలక్షన్ కమిటీ బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్ చేయాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీ20లకు షాహిన్ ఆఫ్రిదిని తప్పించి బాబర్‌తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలపై స్పందించిన షాహిద్ ఆఫ్రిది.. తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదికి అండగా నిలిచాడు. ‘‘ఒకరిని కెప్టెన్‌గా నియమించినపుడు తనను తాను నిరూపించుకునేందుకు కొంత సమయం కూడా ఇవ్వాలి. అంతేగానీ కొత్త వాళ్లు రాగానే మళ్లీ మార్పులు చేస్తాం అంటే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఒక ఆటగాడిని సారథిని చేసి వెంటనే తొలగించాలనుకుంటున్నారంటే ఆ నిర్ణయం తప్పుడైది ఉండాలి. లేదంటే మళ్లీ మార్చాలనుకున్న నిర్ణయమైన సరైంది కాకపోయి ఉండాలి’’ అని పీసీబీ తీరును విమర్శించాడు. తన అల్లుడు షాహిన్‌కు మరికొంత సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. -
46 ఏళ్ల వయసులోనూ ఇరగదీసిన అఫ్రిది.. మెరుపు అర్ధశతకంతో కుర్ర బౌలర్లకు చుక్కలు
పాకిస్తాన్ మాజీ ఆటగాడు, బ్యాటింగ్ చిచ్చరపిడుగు షాహిద్ అఫ్రిది 46 ఏళ్ల వయసులోనూ రెచ్చిపోతున్నాడు. కుర్రాళ్లతో పోటీపడి మరీ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. చాలాకాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అఫ్రిది ప్రస్తుతం వారి దేశంలో జరుగుతున్న సింధ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. Shahid Afridi is showing our power-hitters how it's done even in 2024 🇵🇰🔥🔥 pic.twitter.com/vu2lVZGjPU— Farid Khan (@_FaridKhan) February 2, 2024 ఈ లీగ్‌లో బెనజీరాబాద్ లాల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్రిది.. మీర్పూర్ఖాస్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో సుడిగాలి అర్ధశతకం (50) బాదాడు. అఫ్రిది ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అఫ్రిది ఈ స్థాయిలో రెచ్చిపోయినప్పటికీ అతని జట్టు ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్రిది టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అఫ్రిదితో పాటు షోయబ్ మక్సూద్ (57) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్ధి జట్టు కేవలం 12 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ ఉమర్ ఆమిన్ 37 బంతుల్లో 88 పరుగులతో అజేయంగా నిలువగా.. వన్‌డౌన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ 20 బంతుల్లో 50 పరగులు చేశారు. వీరిద్దరూ అఫ్రిది టీమ్ బౌలర్లను ఊచకోత కోశారు. ఆమిన్ 6 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడగా.. అక్రమ్ 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అఫ్రిది బౌలింగ్ వేయలేదు. -
తప్పిదారి షాహిన్ కెప్టెన్ అయ్యాడు: అల్లుడిపై ఆఫ్రిది విమర్శలు!
పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ ఎంపిక గురించి ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదో తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథి అయ్యాడని సరదాగా వ్యాఖ్యానించాడు. అతడికి బదులు మహ్మద్ రిజ్వాన్‌కు పగ్గాలు అప్పజెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజం.. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో షాన్ మసూద్‌ను కెప్టెన్ చేసిన పాక్ క్రికెట్ బోర్డు.. టీ20 సారథ్య బాధ్యతలను పేసర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మసూద్ నాయకత్వంలో టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టు.. తదుపరి షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ ఆఫ్రిది ఈ విషయాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆటగాడిగా రిజ్వాన్‌ను నేను ఆరాధిస్తాను. కఠిన శ్రమ, ఆట పట్ల నిబద్ధత.. అతడిని అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిపాయి. కేవలం ఆట మీద మాత్రమే దృష్టి సారించి ఎక్కడ ఎంత వరకు నైపుణ్యాలను వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. తనొక గొప్ప యోధుడు’’ అని మహ్మద్ రిజ్వాన్‌ను ప్రశంసించాడు. అదే విధంగా.. ‘‘రిజ్వాన్‌ను పాక్ టీ20 కెప్టెన్‌గా చూడాలనుకున్నాను. కానీ తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథిగా ఎంపికయ్యాడు’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. ఆ సమయంలో హ్యారిస్ రవూఫ్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో పాటు అక్కడే ఉన్న షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా షాహిద్ ఆఫ్రిదికి షాహిన్ ఆఫ్రిది సొంత అల్లుడన్న సంగతి తెలిసిందే. షాహిద్ కుమార్తె అన్షాను అతడు వివాహమాడాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడిన పాకిస్తాన్.. జనవరి 3 నుంచి నామమాత్రపు మూడో టెస్టు ఆడనుంది. చదవండి: సౌతాఫ్రికా ఒక్కటే కాదు పాక్ కూడా అలాగే.. ఐసీసీ, బీసీసీఐ జోక్యం చేసుకోవాలి: స్టీవ్ వా Shahid Afridi praised Muhammad Rizwan and said that Rizwan should have been captain of T20 but Shaheen became it by mistake.#Rizwan #PakistanCricket pic.twitter.com/TSECe93ZPM — Ahtasham Riaz 🇵🇰 (@AhtashamRiaz_) December 30, 2023 -
టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్.. పీసీబీతో కూడా చెప్పాను!
Pakistan Cricket Captains: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ల మార్పుపై మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది స్పందించాడు. టీ20 కెప్టెన్‌గా షాహిన్ షా ఆఫ్రిది నియామకంలో తన ప్రమేయమేమీ లేదని స్పష్టం చేశాడు. తన అల్లుడి కోసం ఎలాంటి లాబీయింగ్ చేయలేదని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీలో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. షాహిన్ కెప్టెన్ కావాలని కోరుకోలేదు ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 కెప్టెన్‌గా నియమించిన పాక్ క్రికెట్ బోర్డు.. టెస్టు పగ్గాలను షాన్ మసూద్‌కు అప్పగించింది. ఈ క్రమంలో టీ20 సారథిగా షాహిద్ నియామకంలో మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ప్రమేయం ఉందనే వదంతులు వ్యాపించాయి. తన అల్లుడి కోసం ఆఫ్రిది పీసీబీ పెద్దల వద్ద లాబీయింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన ఆఫ్రిది.. ‘‘నేను అసలు ఇలాంటి విషయాల్లో తలదూర్చను. షాహిద్‌తో నాకున్న బంధుత్వం కారణంగా ఇలాంటి మాటలు వినిపిస్తాయని నాకు తెలుసు. ఒకవేళ నేను లాబీయింగ్ చేసే వాడినే అయితే.. పీసీబీ చైర్మన్‌ను ఎందుకు విమర్శిస్తాను? నేను ఏ రోజూ కూడా షాహిన్‌ను కెప్టెన్ చేయాలని డిమాండ్ చేయలేదు. మహ్మద్ రిజ్వాన్‌తో బాబర్ ఆజం నిజానికి అతడు సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండాలనే కోరుకున్నా. అయితే, షాహిన్‌ను సారథిగా నియమించాలన్నది పూర్తిగా పీసీబీ చైర్మన్, మహ్మద్ హఫీజ్ నిర్ణయం. ఇందులో నా ప్రమేయమేమీ లేదు. టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్ బాబర్ ఆజంనే కెప్టెన్‌గా కొనసాగించాలని పీసీబీ చైర్మన్‌తో గతంలో చెప్పాను. ఒకవేళ అతడు తప్పుకోవాలని భావిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో మహ్మద్ రిజ్వాన్‌ను కెప్టెన్‌గా చేయాలని.. టెస్టుల్లో మాత్రం బాబర్‌నే కొనసాగించాలని పీసీబీకి చెప్పాను’’ అని సామా టీవీ షోలో పేర్కొన్నాడు. కాగా షాహిద్ ఆఫ్రిది పెద్ద కుమార్తె అన్షాను షాహిన్ వివాహమాడిన విషయం తెలిసిందే. చదవండి: CWC 2023: ద్రవిడ్‌తో కలిసి పిచ్ పరిశీలించిన రోహిత్! క్యూరేటర్ చెప్పిందిదే! -
షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి సోదరి మంగళవారం తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని అఫ్రిది సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. "మా సోదరి మమ్మల్ని విడిచిపెట్టి ఆ దేవుడు వద్దకు వెళ్లిపోయింది. ఆమె మరణవార్తను మా బరువెక్కిన హృదయాలతో తెలియజేస్తున్నాము. ఆమె ఆంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి" అని అఫ్రిది ట్విటర్లో రాసుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన ప్రముఖులు, అభిమానులు అఫ్రిదికి సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే "తన చెల్లిని చూసేందుకు వెళ్తున్నాననీ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని శనివారం(ఆక్టోబర్ 16) రాత్రి ఆఫ్రిది ట్విట్ చేశాడు. కానీ అతడు ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే ఆమె మృతి చెందింది. కాగా షాహిద్ అఫ్రిది కుటుంబంలో మొత్తం 11 మంది ఉన్నారు. అందులో ఆరుగురు సోదరులు, అయిదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. షాహిద్ సోదరులు తారిక్ అఫ్రిది, అష్ఫక్ అఫ్రిది కూడా క్రికెటర్లే. ప్రస్తుత పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది.. షాహిద్ అఫ్రిదికి అల్లుడే అన్న విషయం తెలిసిందే. చదవండి: SMAT 2023: 42 బంతుల్లో శతక్కొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్ (إِنَّا ِلِلَّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ,) Surely we belong to Allah and to him we shall return. With Heavy hearts we inform you that our beloved Sister passed away and her Namaz e Janazah will be at 17.10.2023 after Zuhur prayer at Zakariya masjid main 26th street… https://t.co/Ly4sK6XVGT — Shahid Afridi (@SAfridiOfficial) October 17, 2023 -
షాహిద్ ఆఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
Asia Cup, 2023 India vs Sri Lanka, Super 4- Rohit Sharma: శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో మెరిశాడు. 44 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. బౌండరీ బాది యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా ఫిఫ్టీ పూర్తి చేసుకునేసరికి రోహిత్ ఖాతాలో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. హిట్‌మ్యాన్ రికార్డు ఈ క్రమంలో హిట్‌మ్యాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. దెబ్బకొట్టిన వెల్లలగే కాగా ఆసియా కప్-2023 సూపర్ 4 దశలో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంకతో టీమిండియా మంగళవారం నాటి మ్యాచ్‌లో తలపడుతోంది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ 53, గిల్ 19 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(3) పూర్తిగా నిరాశపరిచాడు. కాగా టీమిండియా ఇన్నింగ్స్‌లో తొలి మూడు వికెట్లను లంక యువ బౌలర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలగే తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఆసియా వన్డే కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే! ►రోహిత్ శర్మ-28 ►షాహిద్ ఆఫ్రిది- 26 ►సనత్ జయసూర్య- 23 ►సురేశ్ రైనా- 18 . చదవండి: Ind vs SL: నా 15 ఏళ్ల కెరీర్లో ఇదే మొదటిసారి.. అప్పటికి నాకు 35: కోహ్లి SENSATIONAL SHOT! 😍 A touch of finesse from @ImRo45 marks #TeamIndia's first boundary through covers! 👏🏻💪🏻 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/WaQGt3x2GV — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. షాహిద్ అఫ్రిది రికార్డు సమం
ఆసియాకప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 56 పరుగులు చేశాడు. శుబ్‌మన్ గిల్‌తో కలసి తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా 24.1 ఓవర్లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను అంపైర్లు వాయిదా వేశారు. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది. క్రీజులో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ఉన్నారు. రోహిత్ శర్మ అరుదైన ఘనతలు.. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియా కప్ వన్డే చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన షాహిద్ అఫ్రిది రికార్డును రోహిత్ సమం చేశాడు. ఇప్పటివరకు రోహిత్ 24 ఇన్నింగ్స్‌లలో 26 సిక్స్‌లు కొట్టాడు. అదేవిధంగా అఫ్రిది కూడా 21 ఇన్నింగ్స్‌లలో 26 సిక్స్‌లు కొట్టాడు. అదే విధంగా ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో భారత తరపున అత్యధిక హఫ్ సెంచరీల చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా హిట్‌మ్యాన్ సమం చేశాడు. ఆసియా కప్‌లో సచిన్ మొత్తం 9 హాఫ్ సెంచరీలు చేయగా.. తాజాగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫిఫ్టి కొట్టడం ద్వారా రోహిత్ మాస్టర్‌బ్లాస్టర్ సరసన చేరాడు. చదవండి: Asia Cup 2023: రిజర్వ్‌డే రోజు కూడా వర్షం పడితే.. ఏంటి పరిస్థితి? అలా జరిగితే భారత్‌కు కష్టమే -
రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్ ఆఫ్రిది.. ఆరోజే బరాత్!
Shaheen Afridi Marriage: పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ షాహిన్ ఆఫ్రిది మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడు. తన భార్య అన్షాను రెండోసారి వైభవంగా నిఖా చేసుకోనున్నాడు. ఆసియా కప్-2023 ఫైనల్ ముగిసిన తర్వాత ఈ వేడుక జరుగనుంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో షాహిన్- అన్షా పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈసారి అంగరంగ వైభవంగా! పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తమ కుమార్తె అన్షా వివాహాన్ని షాహిన్‌తో జరిపించాడు. అయితే, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సహా ఇరు కుటుంబాలకు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ఈ క్రమంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని కొత్త జంట భావించినట్లు సమాచారం . ఆరోజు రిసెప్షన్ ఈ నేపథ్యంలో సెప్టెంబరు 19న షాహిన్- అన్షా నిఖా చేసుకోనున్నట్లు పాకిస్తాన్ స్పోర్ట్స్ జర్నలిస్టు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సమాచారం ప్రకారం.. కరాచిలో పెళ్లి జరిగిన తర్వాత.. బరాత్ జరుగనుంది. ఇక సెప్టెంబరు 21న ఇస్లామాబాద్‌లోని ప్రైవేట్ హోటళ్లో వలిమా(రిసెప్షన్) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆసియా కప్ తర్వాత రోజుల వ్యవధిలోనే భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో కొత్త జంట హనీమూన్ రద్దు చేసుకున్నట్లు సమాచారం. టీనేజ్లోనే సంచలనంగా మారి కైబర్ ఏజెన్సీలో 2000 సంవత్సరంలో జన్మించిన షాహిన్ ఆఫ్రిది.. 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. స్వల్ప కాలంలోనే పాక్ ప్రధాన పేసర్‌గా ఎదిగిన లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్‌బౌలర్.. ఇప్పటి వరకు 27 టెస్టులు, 42 వన్డేలు, 52 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో.. వరుసగా 105, 83, 64 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆసియా కప్-2023తో బిజీగా ఉన్న షాహిన్ ఆఫ్రిది టీమిండియాతో మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. పల్లెకెలె మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను బౌల్డ్ చేసిన షాహిన్.. టాప్ స్కోరర్ హార్దిక్ పాండ్యా(87)తో పాటు జడేజా వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 17న ఆసియా కప్ ఫైనల్ ముగియనుండగా.. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: అవసరం లేదు! సంజూ శాంసన్‌ను స్వదేశానికి పంపిన బీసీసీఐ Fakhta Told me that national team's star fast bowler Shaheen Shah Afridi will tie the knot after the Asia Cup. Shaheen Afridi's barat ceremony will be held on September 19 in Karachi and Walima ceremony will be held in a private hotel of Islamabad on 21st sep Gud luck… — Qadir Khawaja (@iamqadirkhawaja) September 7, 2023 -
Asia Cup 2023: పసికూనపై ప్రతాపం.. ఐదో వేగవంతమైన సెంచరీ
ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్ 30) జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ విధ్వంసకర శతకంతో (71 బంతుల్లో 109 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇఫ్తికార్.. కేవలం 67 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి, వన్డేల్లో పాక్ తరఫున ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా బాసిత్ అలీ (67 బంతుల్లో) రికార్డును సమం చేశాడు. వన్డేల్లో పాక్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో) పేరిట ఉంది. ఆతర్వాత రెండు (45), మూడు (53) ఫాస్టెస్ట్ హండ్రెడ్స్ రికార్డులు కూడా అతని ఖాతాలోనే ఉన్నాయి. పాక్ తరఫున వన్డేల్లో నాలుగో వేగవంతమైన శతకం షర్జీల్ ఖాన్ (61) పేరిట ఉంది. ఇదిలా ఉంటే, ఇఫ్తికార్‌తో పాటు బాబర్ ఆజమ్ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా రికార్డు శతకంతో కదంతొక్కడంతో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ (342/6) చేసింది. 109 బంతుల్లో 10 బౌండరీల సాయంతో సెంచరీ పూర్తి చేసిన బాబర్.. కెరీర్లో 19వ శతకాన్ని నమోదు చేసి, వన్డేల్లో అత్యంత వేగంగా (102 ఇన్నింగ్స్‌ల్లో) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే ఆసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్‌గా (151), వన్డేల్లో డేవిడ్ వార్నర్ సెంచరీల రికార్డును (19) సమం చేసిన ఆటగాడిగా, సయీద్ అన్వర్ (20) తర్వాత పాక్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా పలు రికార్డులు నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానానికి ఎగబాకాడు. -
అఫ్రిది మెరుపులు వృధా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన జెస్సీ రైడర్
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో వెటరన్ స్టార్ క్రికెటర్లు పోటాపోటీగా రెచ్చిపోతున్నారు. న్యూయార్క్ వారియర్స్-న్యూజెర్సీ లెజెండ్స్ మధ్య నిన్న (ఆగస్ట్ 20) జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్.. 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. నూయార్క్ ఇన్నింగ్స్‌లో కమ్రాన్ అక్మల్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రిచర్డ్ లెవి (5 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు), అఫ్రిది (12 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. న్యూజెర్సీ బౌలర్ ప్లంకెట్ 2 వికెట్లు పడగొట్టాడు. 85 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజెర్సీ.. 4.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జెస్సీ రైడర్ (12 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు), క్రిస్ బార్న్‌వెల్ (10 బంతుల్లో 28 నాటౌట్; 4 సిక్సర్లు) సిక్సర్ల మోత మోగించి న్యూజెర్సీని గెలిపించారు. లెజెండ్స్ కోల్పోయిన ఏకైక వికెట్ జెరోమ్ టేలర్‌కు దక్కింది. కాగా, టీమిండిమా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూజెర్సీ జట్టుకు.. పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ న్యూయార్క్ జట్టుకు నాయకత్వం వహించారు. -
తూచ్! నిర్ణయం వెనక్కి.. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు! స్టోక్స్ ఒక్కడేనా?
Who Reversed Retirement Decision: వరల్డ్ కప్ ఫైనల్-2019 హీరో బెన్ స్టోక్స్ తమ బోర్డు విజ్ఞప్తి మేరకు మళ్లీ వన్డేలు ఆడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏడాది క్రితం వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సఫలమైంది. దాంతో న్యూజిలాండ్‌తో వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. 15 మందితో కూడిన టీమ్‌ను ఈ సిరీస్ కోసం ఈసీబీ ప్రకటించింది. వరల్డ్ కప్ కోసం టీమ్‌ను ప్రకటించేందుకు మరింత సమయం ఉన్నా... సెలక్టర్ ల్యూక్ రైట్ చెప్పిన దాని ప్రకారం మార్పుల్లేకుండా ఇదే బృందం వరల్డ్ కప్‌కూ కొనసాగే అవకాశం ఉంది. మరి దేశం కోసం.. స్టోక్స్ మాదిరే తమ రిటైర్మెంట్ నిర్ణయాలు వెనక్కి తీసుకున్న ఆటగాళ్ల గురించి తెలుసా? షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తన కెరీర్లో ఏకంగా ఐదుసార్లు రిటైర్మెంట్ ప్రకటనలు ఇచ్చాడు. 2006లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించాడు. అయితే, రెండు వారాల్లోనే తన నిర్ణయం మార్చుకున్నాడు మరోసారి సంప్రదాయ క్రికెట్లో పాక్ తరఫున బరిలోకి దిగాడు. ఎట్టకేలకు 2010లో టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అదే విధంగా.. 2011, మేలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆఫ్రిది.. నెలల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 2015 వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేల నుంచి తప్పుకొన్న ఆఫ్రిది.. 2017లో అంతర్జాతీయ టీ20 కెరీర్‌కూ స్వస్తి పలికాడు. మొయిన్ అలీ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ 2021 సెప్టెంబరులో టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సొంతగడ్డపై ఆసీస్‌తో పోరులో జట్టుకు అండగా నిలిచే క్రమంలో బోర్డు విజ్ఞప్తి మేరకు మళ్లీ మైదానంలో దిగాడు. బజ్‌బాల్ విధానంతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ డ్రాతో గట్టెక్కడంలో తన వంతు సహకారం అందించాడు. ఇక ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మరోసారి తన రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇకపై ఇంగ్లండ్ తరఫున సంప్రదాయ క్రికెట్ ఆడబోవడం లేదని స్పష్టం చేశాడు. తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆసియా వన్డే కప్, వన్డే వరల్డ్‌కప్-2023 వంటి మెగా ఈవెంట్లకు ముందు ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించి బంగ్లాను సందిగ్దంలో పడేశాడు. అయితే, ప్రధాని షేక్ హసీనా జోక్యంతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇకపై కూడా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని తమీమ్ చెప్పుకొచ్చాడు. డ్వేన్ బ్రావో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 2018, అక్టోబరులో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఆ మరుసటి ఏడాది డిసెంబరులో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. బ్రావో తాను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్వయంగా ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2021లో విండీస్ తరఫున బరిలోకి దిగిన ఈ స్టార్ ఆల్‌రౌండర్.. ఈ ఐసీసీ ఈవెంట్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. చదవండి: జట్టులో చోటు లేకున్నా పర్లేదు.. వాటి కారణంగా రిటైర్ అవ్వను: టీమిండియా స్టార్ -
Shahid Afridi-Shaheen Afridi: ఒకే రోజు ఇరగదీసిన మామ అల్లుళ్లు
పాకిస్తాన్ ఆటగాళ్లు, మామ అల్లుళ్లు షాహిద్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలు వేర్వేరు క్రికెట్ లీగ్‌ల్లో ఒకే రోజు (ఆగస్ట్ 2) బంతితో రాణించారు. మామ షాహిద్ అఫ్రిది గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో సత్తా చాటితే.. ఆల్లుడు షాహీన్ అఫ్రిది ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌లో ఇరగదీశాడు. మెన్స్ హండ్రెడ్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది 10 బంతులు వేసి 2 వికెట్లు పడగొట్టగా.. గ్లోబల్ టీ20 లీగ్‌లో వాంకోవర్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది 4 ఓవర్లు వేసి కేవలం 16 మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరు అఫ్రిదిలు వికెట్లు పడగొట్టాక ఒకే తరహాలో చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. షాహిద్, షాహీన్‌లు వికెట్ పడగొట్టాక రెండు చేతులు పైకి లేపి అచ్చు గుద్దినట్లు సంబురాలు చేసుకున్నారు. కాగా, మామ అల్లుళ్లు ఒకే రోజు ఒకే తరహాలో సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ.. ఒక్కరు మాత్రమే జట్టు విజయంలో భాగమయ్యారు. షాహీన్ జట్టు వెల్ష్‌ఫైర్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై 9 పరుగుల తేడాతో గెలుపొందగా.. షాహిద్ జట్టు టొరొంటో నేషనల్స్.. వాంకోవర్ నైట్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లతో రాణించిన షాహీన్.. ఆతర్వాత తాను వేసిన 5, 6, 7, 8, 10 బంతులకు బౌండరీలు సమర్పించుకోవడం విశేషం. -
'హర్మన్‌ప్రీత్ ప్రవర్తన మరీ ఓవర్‌గా అనిపించింది'
టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై విమర్శల వేడి తగ్గడం లేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అంపైర్‌పై దురుసు ప్రవర్తనతో ఐసీసీ ఆగ్రహానికి గురైన హర్మన్ రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్ స్థానంలో స్మృతి మంధాన జట్టను నడిపించే అవకాశముంది. కాగా హర్మన్ తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ విషయంలో హర్మన్ చేసింది ఓవర్‌గా అనిపించిందని.. అంత వైల్డ్‌గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. "భారత్ విషయంలోనే కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. అయితే వుమెన్స్ క్రికెట్ లో ఇలాంటివి అరుదుగా చూస్తుంటాం. ఇది చాలా ఎక్కువగా అనిపించింది. ఐసీసీ నిర్వహించిన ఒక టోర్నమెంట్లో ఈ సంఘటన జరిగింది. కాగా హర్మన్‌కు విధించిన శిక్షతో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఓ హెచ్చరిక పంపినట్లు అయింది. క్రికెట్లో దూకుడు సహజమే. అయితే నియంత్రిత దూకుడు మంచిది. హర్మన్‌ప్రీత్ విషయంలో ఓవర్ అనిపించింది. ఔట్ విషయంలో అంత వైల్డ్‌గా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు." అని అఫ్రిది స్పష్టం చేశాడు. కాగా హర్మన్ తీరుపై భారత మాజీలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మదన్ లాల్ లాంటి మాజీ క్రికెటర్ స్పందిస్తూ.. బీసీసీఐ కూడా హర్మన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. గత శనివారం మిర్పూర్లో భారత్, బంగ్లాదేశ్ మహిళల మధ్య మూడో వన్డే జరిగింది. ‘టై’గా ముగిసిన ఈ మ్యాచ్‌లో వేర్వేరు సందర్భాల్లో హర్మన్ దురుసుగా వ్యవహరించింది. ముందుగా తనను అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బలంగా కొట్టి పడేయడంతో పాటు వెళుతూ వెళుతూ అంపైర్‌ను చూస్తూ ఏవో వ్యాఖ్యలు చేసింది. దీనిపై మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్ ముగిసిన తర్వాతా అంపైరింగ్ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్ పాయింట్ శిక్ష పడింది. అనంతరం వేదికపై బంగ్లాదేశ్ కెప్టెన్ నిగార్ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది. దీనిపై సుల్తానా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాస్త మర్యాద నేర్చుకోమంటూ సహచరులతో కలిసి వేదిక నుంచి దిగేసింది. 4 డీమెరిట్ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్ హర్మన్ కావడం గమనార్హం. Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 చదవండి: టీమిండియా కెప్టెన్ దురుసు ప్రవర్తన.. ఐసీసీ చర్యలు Asian Games 2023: హర్మన్‌పై వేటు.. ఆసియా గేమ్స్‌లో జట్టును నడిపించేది ఎవరు? #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా!