అర్ద శతకంతో మెరిసిన రోహిత్ శర్మ (PC: BCCI)
Asia Cup, 2023 India vs Sri Lanka, Super 4- Rohit Sharma: శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో మెరిశాడు. 44 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. బౌండరీ బాది యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా ఫిఫ్టీ పూర్తి చేసుకునేసరికి రోహిత్ ఖాతాలో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
హిట్‌మ్యాన్ రికార్డు
ఈ క్రమంలో హిట్‌మ్యాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు.
దెబ్బకొట్టిన వెల్లలగే
కాగా ఆసియా కప్-2023 సూపర్ 4 దశలో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంకతో టీమిండియా మంగళవారం నాటి మ్యాచ్‌లో తలపడుతోంది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.
ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ 53, గిల్ 19 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(3) పూర్తిగా నిరాశపరిచాడు. కాగా టీమిండియా ఇన్నింగ్స్‌లో తొలి మూడు వికెట్లను లంక యువ బౌలర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలగే తన ఖాతాలో వేసుకోవడం విశేషం.
ఆసియా వన్డే కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే!
►రోహిత్ శర్మ-28
►షాహిద్ ఆఫ్రిది- 26
►సనత్ జయసూర్య- 23
►సురేశ్ రైనా- 18 .
చదవండి: Ind vs SL: నా 15 ఏళ్ల కెరీర్‌లో ఇదే మొదటిసారి.. అప్పటికి నాకు 35: కోహ్లి
SENSATIONAL SHOT! 😍
— Star Sports (@StarSportsIndia) September 12, 2023
A touch of finesse from @ImRo45 marks #TeamIndia's first boundary through covers! 👏🏻💪🏻
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/WaQGt3x2GV
Comments
Please login to add a commentAdd a comment