Ind Vs SL: అతడు అద్భుతం.. బ్యాటింగ్‌ సూపర్‌! కానీ.. క్రెడిట్‌ మొత్తం తనకే: రోహిత్‌ | Asia Cup 2023 Winner India: Rohit Sharma Lauds Siraj Credit To Him | Sakshi
Sakshi News home page

Rohit Sharma: అతడు అద్భుతం.. బ్యాటింగ్‌ సూపర్‌! కానీ.. క్రెడిట్‌ మొత్తం తనకే: రోహిత్‌

Published Sun, Sep 17 2023 7:46 PM | Last Updated on Mon, Sep 18 2023 10:52 AM

Asia Cup Winner India Rohit Sharma Lauds Siraj Credit To Him - Sakshi

Asia Cup 2023 Final- Rohit Sharma Comments: ‘‘అవును.. అత్యద్భుత ప్రదర్శన.. ఫైనల్లో ఇలా ఆడటం మానసికంగా మనం ఎంత సంసిద్ధంగా ఉన్నామో తెలియజేస్తుంది. గెలవాలన్న పట్టుదల.. బంతితో శుభారంభం.. బ్యాట్‌తో అద్భుతమైన ముగింపు.. స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నపుడు.. మన సీమర్లను చూసి నాకు గర్వంగా అనిపించింది.

గొప్పగా అనిపించింది 
ఎంతో కఠిన శ్రమకోర్చి ప్రణాళికలను పక్కాగా అమలు చేసిన తీరు అమోఘం. ఇలాంటి ప్రదర్శనలు చూసినపుడు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఇలా జరగుతుందని నేను కూడా ఊహించలేదు. ప్రతి ఒక్క ఆటగాడు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. అయితే, క్రెడిట్‌ మాత్రం సిరాజ్‌కే దక్కుతుంది.

ఇలాంటి పిచ్‌ మీద సీమర్లు ఇంత గొప్పగా రాణించడం అత్యంత అరుదు. నిజంగా సిరాజ్‌ అద్భుతం చేశాడు’’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్‌-2023 ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే.

ఆది నుంచే చుక్కలు
కొలంబోలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంకకు ఆది నుంచే చుక్కలు చూపించారు భారత పేసర్లు. ముందుగా జస్‌ప్రీత్‌ బుమ్రా వికెట్‌ పడగొట్టి శుభారంభం అందించగా.. సిరాజ్‌ సంచలన స్పెల్‌(6/21)తో మెరిశాడు. హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లతో రాణించాడు.

ఈ క్రమంలో 50 పరుగులకే ఆలౌట్‌ అయింది ఆతిథ్య జట్టు. ఇక స్వల్ప టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 6.1 ఓవర్లలోనే ఖేల్‌ ఖతం చేసింది. ఇషాన్‌ కిషన్‌ 23, శుబ్‌మన్‌ గిల్‌ 27 పరుగులు రాబట్టగా 10 వికెట్ల తేడాతో రోహిత్‌ సేన విజయం సాధించింది.

రోహిత్‌ ఖాతాలో రెండో ఆసియా కప్‌
తద్వారా చాంపియన్‌గా నిలిచి ఎనిమిదోసారి ఆసియా కప్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఖాతాలోనూ రెండో ఆసియా కప్‌ ట్రోఫీ చేరింది. అదే విధంగా.. అంతర్జాతీయ టైటిల్‌ కోసం ఐదేళ్లుగా నిరీక్షిస్తున్న అభిమానుల కల నెరవేరింది.

ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన రోహిత్‌.. సిరాజ్‌తో పాటు భారత ఆటగాళ్లను కొనియాడాడు. కాగా సిరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు పొందగా.. కుల్దీప్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌గా నిలిచాడు. ఇక సిరాజ్‌ మియా సంచలన ప్రదర్శన నేపథ్యంలో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చదవండి: ఏంటా బౌలింగ్‌ సామి! సిరాజ్‌ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్‌ మనదే
అస్సలు ఊహించలేదు.. కలలా ఉంది! పెద్ద మనసు చాటుకున్న సిరాజ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement