Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: టీమిండియా పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేశాడు. ఆసియాకప్-2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సిరాజ్ విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టి శ్రీలంకను తమ సొంతగడ్డపై చావు దెబ్బతీశాడు. ఓవరాల్‌గా 7 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. 6 వికెట్లు పడగొట్టి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
సిరాజ్ మియా మ్యాజిక్ దాటికి ఆతిథ్య జట్టు కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. అయితే సిరాజ్ 7 వికెట్ల ఘనత సాధించే అవకాశం ఉన్నప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అతడికి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. సిరాజ్ చేత 7 ఓవర్లు బౌలింగ్ చేయించి హిట్‌మ్యాన్ ఆపేశాడు.
రోహిత్ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సిరాజ్‌తో మరో ఓవర్ అదనంగా వేయించి వుంటే 7 వికెట్ల హాల్ సాధించి చరిత్రపుటలకెక్కేవాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. సపోర్ట్ స్టాప్ సూచన మేరకు సిరాజ్‌తో మరో ఓవర్ వేయించలేదని రోహిత్ తెలిపాడు.
"స్లిప్స్‌లో అంతమంది ఫీల్డర్లను చూడటం చాలా ఆనందంగా అన్పించింది. మా ముగ్గురు పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా సిరాజ్ మిగిలిన వారికంటే చాలా కష్టపడ్డాడు. అయితే అందరూ ప్రతీరోజు రాణించాలంటే సాధ్యం కాదు.
ఒక్కో రోజు ఒక్కొక్కరు హీరో అవుతారు. ఈ రోజు సిరాజ్‌ది. అప్పటికే సిరాజ్ తొలి స్పెల్‌తో కలుపుకుని వరుసుగా 7 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 7 ఓవర్లు అంటే చాలా ఎక్కువ. అయితే అతడితో మరో ఒకట్రెండు ఓవర్లు వేయించాలని నేను అనుకున్నాను.
కానీ అతడికి ఓవర్లను ఆపాలని మా మా ట్రైనర్ నుంచి నాకు సందేశం వచ్చింది. సిరాజ్ మాత్రం బౌలింగ్ కొనసాగించడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఒక రిథమ్‌లో ఉన్నప్పుడు అది ఒక బ్యాటర్‌కు అయినా, బౌలర్‌కైనా సహజం. కానీ ఫిట్‌నెస్ కూడా ముఖ్యం. ఎందుకంటే అతడి దూకుడు ఇక్కడితో ఆగకూడదు కదా" అని పోస్ట్‌మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023
— AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023
Asia Cup 2023: ఆసియా ఛాంపియన్స్‌గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment