కొలంబో వేదికగా ఆదివారం శ్రీలంకతో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో 2 పరుగులు సాధిస్తే వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలుస్తాడు.
ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో రోహిత్ 10,767 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ రికార్డు ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్(10,768) పేరిట ఉంది. ఇప్పుడు కొలంబో వన్డేలో హిట్‌మ్యాన్ కేవలం రెండు పరుగులు చేస్తే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు.
ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(18,426) అగ్రస్ధానంలో ఉండగా.. ఆ తర్వాతి స్ధానాల్లో విరాట్ కోహ్లి(13,872), సౌరవ్ గంగూలీ(11, 221) ఉన్నారు. ఇక తొలి వన్డేను టైగా ముగించిన భారత్.. రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.
చదవండి: IPL 2025: హార్దిక్ పాండ్యాకు షాక్!.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్?
Comments
Please login to add a commentAdd a comment