టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ తన తొలి పరీక్షకు సిద్దమయ్యాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జూలై 27న పల్లెకెలె వేదికగా జరగనుంది.
తొలి టీ20కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశం పాల్గోన్నాడు. ఈ సందర్భంగా భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ తనకు ఎంతో ఆదర్శమని సూర్య తెలిపాడు. కాగా రోహిత్ పొట్టి ఫార్మాట్ విడ్కోలు పలకడంతో భారత టీ20 జట్టు పగ్గాలు సూర్య చేపట్టాడు. హార్దిక్ పాండ్యాను కాదని సూర్యను కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.
"2014 నుంచి రోహిత్ శర్మతో కలిసి ఆడుతున్నాను. అతడితో నా జర్నీ దాదాపుగా పదేళ్లు పూర్తయింది. నేను అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా కెప్టెన్ అంటే ఎలా ఉండాలో రోహిత్‌ను చూసే నేర్చుకున్నాను.
రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు. రోహిత్‌లాంటి కెప్టెన్‌ను నేను ఇప్పటివరకు చూడలేదు. అతడి కెప్టెన్సీ నాలాంటి ఎంతో మందికి ఆదర్శం. ప్రస్తుత జట్టులో పెద్దగా ఏ మార్పు లేదు. కెప్టెన్సీలో మాత్రమే మార్పు వచ్చింది.
రోహిత్ అడుగుజాడల్లోనే నడిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తానని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి సారథ్యంలో కూడా సూర్య ఆడినప్పటకి అతడి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment