టీ20 వరల్డ్‌కప్-2024 కప్ విజయనంతరం టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించి హెడ్‌కోచ్‌గా తన ప్రస్ధానాన్ని ద్రవిడ్ ముగించాడు.
ద్రవిడ్ కెప్టెన్‌గా ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నాడో అదే కరేబియన్ దీవుల్లో కోచ్‌గా అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పదవీకాలం కూడా టీ20 వరల్డ్‌కప్‌తో ముగిసింది.
అయితే ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌ను మాత్రం బీసీసీఐ కొనసాగించింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌పై భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసల వర్షం కురిపించాడు. ద్రవిడ్ ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి అని మాంబ్రే కొనియాడాడు. కాగా ద్రవిడ్ స్ధానంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
"రాహుల్ ద్రవిడ్‌తో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇండియా-ఏ, అండర్-19 జట్లు, ఎన్సీఎ, ఆపై భారత సీనియర్ జట్లకు అతడితో కలిసి పనిచేశాను. దాదాపు 8-9 నుంచి ద్రవిడ్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నాను. కోచ్‌గా ద్రవిడ్ ఎప్పుడూ ఆధికారం చెలాయించలేదు.
ఆటగాళ్ల వెనకే ఉండి ప్రోత్సహించేవాడు. ఇదొక్కటి చాలు రాహుల్ అంటే ఏంటో తెలియడానికి. అతడు ఆటగాళ్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడు. ఎప్పుడూ ప్లేయర్లు కోసమే ఆలోచించేవాడు. ద్రవిడ్ ఎప్పుడూ క్రెడిట్ కోసం పనిచేయలేదు.
ఏ క్రెడటైనా జట్టుకు, కెప్టెన్‌కే దక్కాలని ద్రవిడ్ ఆశించేవాడు. ద్రవిడ్, రోహిత్ ఇద్దరూ కలిసి సమన్వయంతో పనిచేసి భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించారు" అని హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాస్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment