టీమిండియా ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ టూర్ ముగిసిన వెంటనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా ఆతిథ్య శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.
జూలై 27న జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శ్రీలంక టూర్‌కు రెండు వేర్వేరు జట్లను వచ్చే వారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లంకతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
లంకతో టీ20ల్లో హార్దిక్ పాండ్యాకు, వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్‌కు జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 వరల్డ్‌కప్-2024కు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తిరిగి ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమన్పిస్తోంది.
"శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించకున్నాం. రాబోయే షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని వీరికి రెస్ట్ ఇచ్చాము. వీరిముగ్గురూ తిరిగి సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌లకు జట్టులో చేరతారని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు.
కాగా టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత పొట్టి క్రికెట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఈ పర్యటనతోనే భారత జట్టుకు కూడా కొత్త హెడ్‌కోచ్ వచ్చే ఛాన్స్ ఉంది.
చదవండి: WCL 2024: యువరాజ్ ఫెయిల్..బెంగాల్ ఎంపీ తుపాన్ ఇన్నింగ్స్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment