
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పాలైంది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు.
ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో జీషన్ అన్సారీ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి తేలిపోయాడు. తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. వికెట్ ఏమీ తీయకుండా 31 పరుగులు సమర్పించుకున్నాడు.
ఐదేసిన స్టార్క్..
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ ఎస్ఆర్‌హెచ్ తేలిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు.
చదవండి: IPL 2025: వైజాగ్‌లో అనికేత్ వర్మ విధ్వంసం.. వీడియో వైరల్