బౌలింగ్ వేస్తుండగా పవర్ కట్.. భ‌య‌ప‌డిన పాక్ బ్యాట‌ర్‌! వీడియో వైర‌ల్‌ | Power Outage Halts Play During 3rd ODI Between Pakistan and New Zealand | Sakshi
Sakshi News home page

NZ vs PAK: బౌలింగ్ వేస్తుండగా పవర్ కట్.. భ‌య‌ప‌డిన పాక్ బ్యాట‌ర్‌! వీడియో వైర‌ల్‌

Published Sat, Apr 5 2025 9:36 PM | Last Updated on Sat, Apr 5 2025 9:36 PM

Power Outage Halts Play During 3rd ODI Between Pakistan and New Zealand

మౌంట్ మౌంగనుయ్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో 43 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 3-0 తేడాతో కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ ఆఖ‌రి మ్యాచ్‌లో ఓ అనూహ్య సంఘ‌ట‌న చోటు చేసుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో జాకబ్ డఫీ బౌలింగ్ వేస్తుండగా ఒక్క‌సారిగా ఫ్లడ్ లైట్స్ ఆఫ్ అయ్యాయి.

జాకబ్ డఫీ బంతిని వేయడానికి పరిగెత్తుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో మైదానం మొత్తం చీక‌టిగా మారిపోయింది. అప్ప‌టికే  డఫీ బంతిని డెలివ‌రీ చేశాడు. అయితే స్ట్రయికింగ్‌లో ఉన్న తయ్యబ్ తాహీర్ వెంట‌నే ప‌క్క‌కు త‌ప్పుకున్నాడు.

అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. ఒకవేళ వికెట్ల వద్దే తాహీర్‌ నిల్చుంటే బంతి అతడికి తాకే అవకాశం ఉండేది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌ను వ‌ర్షం కార‌ణంగా 42 ఓవ‌ర్ల‌కు కుదించారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో రైస్ మారియు(58), బ్రెస్‌వెల్‌(59) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించ‌గా.. మిచెల్‌(49) ప‌రుగుల‌తో రాణించాడు. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో పాక్ 40 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది.
చ‌ద‌వండి: IPL 2025: ధోని ఐపీఎల్‌కు గుడ్ బై చెప్ప‌నున్నాడా? ఫ్యామిలీ ఫోటోలు వైర‌ల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement