చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. షాహిద్‌ అఫ్రిది రికార్డు సమం | Rohit Sharma joins Shahid Afridi at top for most sixes record in Asia Cup history | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. షాహిద్‌ అఫ్రిది రికార్డు సమం

Published Mon, Sep 11 2023 11:45 AM | Last Updated on Mon, Sep 11 2023 4:25 PM

Rohit Sharma joins Shahid Afridi at top for most sixes record in Asia Cup history - Sakshi

ఆసియాకప్‌ 2023 సూపర్‌-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్బుతమైన హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 56 పరుగులు చేశాడు. శుబ్‌మన్‌ గిల్‌తో కలసి తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కాగా 24.1 ఓవర్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను అంపైర్‌లు వాయిదా వేశారు. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి భారత్‌ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది. క్రీజులో విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ ఉన్నారు.

రోహిత్‌ శర్మ అరుదైన ఘనతలు.. 
ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్‌ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియా కప్‌ వన్డే చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన షాహిద్‌ అఫ్రిది రికార్డును రోహిత్‌ సమం చేశాడు. ఇప్పటివరకు రోహిత్‌ 24 ఇన్నింగ్స్‌లలో 26 సిక్స్‌లు కొట్టాడు. అదేవిధంగా అఫ్రిది కూడా 21 ఇన్నింగ్స్‌లలో 26 సిక్స్‌లు కొట్టాడు.

అదే విధంగా ఆసియాకప్‌ వన్డే ఫార్మాట్‌లో భారత తరపున అత్యధిక హఫ్‌​ సెంచరీల చేసిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కూడా హిట్‌మ్యాన్‌ సమం చేశాడు.  ఆసియా కప్‌లో సచిన్‌  మొత్తం 9 హాఫ్‌ సెంచరీలు చేయగా.. తాజాగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫిఫ్టి కొట్టడం ద్వారా రోహిత్‌  మాస్టర్‌బ్లాస్టర్‌ సరసన చేరాడు.
చదవండి: Asia Cup 2023: రిజర్వ్‌డే రోజు కూడా వర్షం పడితే.. ఏంటి పరిస్థితి? అలా జరిగితే భారత్‌కు కష్టమే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement