‘హారతి’ ఇస్తుందని టీవీ పగలగొట్టిన పాక్‌ క్రికెటర్‌ | Shahid Afridi Smashed TV After Daughter Imitated Aarti Scene | Sakshi
Sakshi News home page

‘హారతి’ ఇస్తుందని టీవీ పగలగొట్టిన పాక్‌ క్రికెటర్‌

Published Mon, Dec 30 2019 4:14 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది చిక్కుల్లో పడ్డాడు. హిందూ సాంప్రదాయాలపై ఆయన స్పందించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. గతంలో ఆయన ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో మీడియా ప్రతినిధి అఫ్రిదిని ఎప్పుడైనా టీవీ పగలగొట్టారా అని ప్రశ్నించింది. దీనికి అఫ్రిది అవునని సమాధానమిచ్చాడు. స్టార్‌ ప్లస్‌ డ్రామా షోలు నచ్చవని, కానీ అతని భార్యకు ఆ షోలపై ఆసక్తి ఉండటంతో ఒంటరిగా చూడటానికి అంగీకరించానని తెలిపాడు. అయితే ఓరోజు తన పిల్లలు టీవీ ముందు నిలబడి షోలో వస్తున్న ‘హారతి’ విధానాన్ని యథాతథంగా అనుకరించడం చూశానన్నాడు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన అఫ్రిది భార్యవైపు విసురుగా చూసి ఆవేశంతో టీవీ పగలగొట్టాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement