ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రంపంచకప్ డ్రాప్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకు సమర్పించిన సంగతి తెలిసిందే. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం.. ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్‌లో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిరాకరించింది.
వన్డే ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో కాకుండా వేరే వేదికలో నిర్వహించాలని పట్టు పట్టుకు కూర్చోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును ఆదేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించాడు.
"పాకిస్తాన్ జట్టు అహ్మదాబాద్‌లో ఆడేందుకు పీసీబీ ఎందుకు నిరాకరిస్తుందో నాకు అర్ధం కావడం లేదు. అక్కడ ఏమైనా నిప్పులు వర్షం కురుస్తుందా లేదా దెయ్యం ఎమైనా ఉందా? అక్కడికి వెళ్లి గెలిచి రండి. భారత్ తమకు ఎక్కడ సౌకర్యవంతంగా ఉంటే అక్కడే మ్యాచ్‌లు నిర్వహిస్తుంది. అది మనకు అనవసరం.
వాళ్లు కోరుకున్న పిచ్ పై ఆడి.. భారత అభిమానుల ముందు మ్యాచ్ గెలవాలి. అలా సాధించిన గెలుపే అసలైన విజయం" అని సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు. ఇక ఈడాది ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా ఈ ఏడాది ఆసియాకప్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment