రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్‌ ఆఫ్రిది.. ఆరోజే బరాత్‌! | Shaheen Afridi To Marry Shahid Afridi's Daughter Ansha Afridi For The Second Time After Asia Cup 2023, Here's Why - Sakshi
Sakshi News home page

Shaheen Afridi To Marry Ansha Again: వైభవంగా మరోసారి షాహిన్‌ ఆఫ్రిది పెళ్లి.. హనీమూన్‌ మాత్రం!

Published Sat, Sep 9 2023 1:48 PM | Last Updated on Sat, Sep 9 2023 3:09 PM

Shaheen Afridi Set To Marry Ansha Again After Asia Cup 2023 Why - Sakshi

Shaheen Afridi Marriage: పాకిస్తాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడు. తన భార్య అన్షాను రెండోసారి వైభవంగా నిఖా చేసుకోనున్నాడు. ఆసియా కప్‌-2023 ఫైనల్‌ ముగిసిన తర్వాత ఈ వేడుక జరుగనుంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో షాహిన్‌- అన్షా పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.

ఈసారి అంగరంగ వైభవంగా!
పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది తమ కుమార్తె అన్షా వివాహాన్ని షాహిన్‌తో జరిపించాడు. అయితే, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సహా ఇరు కుటుంబాలకు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ఈ క్రమంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని కొత్త జంట భావించినట్లు సమాచారం .

ఆరోజు రిసెప్షన్‌
ఈ నేపథ్యంలో సెప్టెంబరు 19న షాహిన్‌- అన్షా నిఖా చేసుకోనున్నట్లు పాకిస్తాన్‌ స్పోర్ట్స్‌ జర్నలిస్టు ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఈ సమాచారం ప్రకారం.. కరాచిలో పెళ్లి జరిగిన తర్వాత.. బరాత్‌ జరుగనుంది. ఇక సెప్టెంబరు 21న ఇస్లామాబాద్‌లోని ప్రైవేట్‌ హోటళ్లో వలిమా(రిసెప్షన్‌) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఆసియా కప్‌ తర్వాత రోజుల వ్యవధిలోనే భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో కొత్త జంట హనీమూన్‌ రద్దు చేసుకున్నట్లు సమాచారం.

టీనేజ్‌లోనే సంచలనంగా మారి
కైబర్‌ ఏజెన్సీలో 2000 సంవత్సరంలో జన్మించిన షాహిన్‌ ఆఫ్రిది.. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. స్వల్ప కాలంలోనే పాక్‌ ప్రధాన పేసర్‌గా ఎదిగిన లెఫ్టార్మ్‌ మీడియం ఫాస్ట్‌బౌలర్‌.. ఇప్పటి వరకు 27 టెస్టులు, 42 వన్డేలు, 52 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

ఆయా ఫార్మాట్లలో.. వరుసగా 105, 83, 64 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆసియా కప్‌-2023తో బిజీగా ఉన్న షాహిన్‌ ఆఫ్రిది టీమిండియాతో మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే.

పల్లెకెలె మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలను బౌల్డ్‌ చేసిన షాహిన్‌.. టాప్‌ స్కోరర్‌ హార్దిక్‌ పాండ్యా(87)తో పాటు జడేజా వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 17న ఆసియా కప్‌ ఫైనల్‌ ముగియనుండగా.. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుంది.

చదవండి: అవసరం లేదు! సంజూ శాంసన్‌ను స్వదేశానికి పంపిన బీసీసీఐ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement