భారత్‌పై 5 వికెట్లు తీసిన తర్వాతే సెల్ఫీలు: షాహీన్ అఫ్రిది | Ill take selfies after claiming fifer against India: Shaheen Afridi | Sakshi
Sakshi News home page

భారత్‌పై 5 వికెట్లు తీసిన తర్వాతే సెల్ఫీలు: షాహీన్ అఫ్రిది

Published Fri, Oct 13 2023 2:01 PM | Last Updated on Fri, Oct 13 2023 3:01 PM

Ill take selfies after claiming fifer against India: Shaheen Afridi - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతున్నాయి. 

వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై తమ జైత్రయాత్రను కొనసాగించాలని భారత జట్టు భావిస్తుంటే.. కనీసం ఒక్కసారైనా టీమిండియాపై విజయం సాధించాలని పాక్‌ వ్యూహాలు రచిస్తోంది.

ఐదు వికెట్లు తీసిన తర్వాతే?
కాగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ డ్రిల్స్‌లో ఎక్కువ సమయం గడుపుతోంది. ఈ క్రమంలో పాక్‌ స్పీడ్‌ స్టార్‌ షాహీన్‌ షా అఫ్రిది తన ఫీల్డింగ్‌ డ్రిల్‌ను ముగించుకుని బయటకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఈ సమయంలో బౌండరీ లైన్ వద్ద  అభిమానులు అతడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.

దీంతో షాహీన్‌ నవ్వుతూ.. "కచ్చితంగా మీకు సెల్ఫీ ఇస్తా.. కానీ ఇప్పుడు కాదు, భారత్‌పై 5 వికెట్ల హాల్‌ సాధించిన తర్వాత అంటూ" అభిమానులతో అన్నాడు.
చదవండి: Steve Smith Dismissal Video AUS Vs SA: స్మిత్‌ది ఔటా? నాటౌటా? టెక్నాలజీ లోపానికి..! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement