యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో వెటరన్ స్టార్ క్రికెటర్లు పోటాపోటీగా రెచ్చిపోతున్నారు. న్యూయార్క్ వారియర్స్-న్యూజెర్సీ లెజెండ్స్ మధ్య నిన్న (ఆగస్ట్ 20) జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్.. 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. నూయార్క్ ఇన్నింగ్స్‌లో కమ్రాన్ అక్మల్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రిచర్డ్ లెవి (5 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు), అఫ్రిది (12 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. న్యూజెర్సీ బౌలర్ ప్లంకెట్ 2 వికెట్లు పడగొట్టాడు.
85 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజెర్సీ.. 4.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జెస్సీ రైడర్ (12 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు), క్రిస్ బార్న్‌వెల్ (10 బంతుల్లో 28 నాటౌట్; 4 సిక్సర్లు) సిక్సర్ల మోత మోగించి న్యూజెర్సీని గెలిపించారు. లెజెండ్స్ కోల్పోయిన ఏకైక వికెట్ జెరోమ్ టేలర్‌కు దక్కింది. కాగా, టీమిండిమా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూజెర్సీ జట్టుకు.. పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ న్యూయార్క్ జట్టుకు నాయకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment