Misbah ul Haq
-
రాణించిన యూనిస్ ఖాన్, మిస్బా.. ఆసీస్‌పై పాక్ విజయం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ 2024లో భాగంగా నిన్న (జులై 3) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రాణించిన ఫించ్టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఆరోన్ ఫించ్ (40 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కౌల్టర్ నైల్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. బెన్ డంక్ (27), ఫెర్గూసన్ (26 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సోహైల్ తన్వీర్, వాహబ్ రియాజ్, సయీద్ అజ్మల్ తలో వికెట్ దక్కించుకున్నారు.సత్తా చాటిన మిస్బా, యూనిస్190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. కెప్టెన్ యూనిస్ ఖాన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిస్బా ఉల్ హక్ (30 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. పాక్ ఇన్నింగ్స్‌లో షోయబ్ మక్సూద్ (21), షోయబ్ మాలిక్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో బ్రెట్ లీ, కౌల్టర్ నైల్ చెరో 2 వికెట్లు.. జేవియర్ దోహర్తి ఓ వికెట్ పడగొట్టారు. -
పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్
పాకిస్తాన్ సెలక్టర్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ మండిపడ్డాడు. మిడిలార్డర్లో ఆడే బ్యాటర్లు కనీసం ఒక్కరైనా జట్టులో ఉన్నారా అని ప్రశ్నించాడు.నాణ్యమైన ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేసే అలవాటే లేదా అంటూ మిస్బా సెలక్టర్లను తీవ్రస్థాయిలో విమర్శించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ అదే చెత్త ప్రదర్శన కనబరిచింది.గ్రూప్-ఏలో తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన బాబర్ ఆజం బృందం సూపర్-8 అవకాశలను సంక్లిష్టం చేసుకుంది. తాజాగా అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సూపర్-8 రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించింది.ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు బాబర్ బృందం, సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు. ప్రపంచకప్ టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే భారీ మూల్యం చెల్లించారని విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో మిస్బా ఉల్ హక్ పాక్ మిడిలార్డర్ బ్యాటర్ల తీరును తూర్పారబట్టాడు. ‘‘మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లే లేరు.గత మూడు ప్రపంచకప్ టోర్నీల్లో.. 4, 5, 6 స్థానాల్లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే ప్రశ్న తలెత్తింది. అయినా ఆ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారు.అందరూ టాపార్డర్‌లోనే బ్యాటింగ్ చేస్తామంటే.. 4, 5, 6 స్థానాల్లో ఆడేది ఎవరు? బాబర్ ఆజం, ఇఫ్తికార్ అహ్మద్ వంటి అత్యుత్తమ ప్లేయర్లు జట్టులో ఉన్నా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నారు.జట్టు ఇలా పతనమవడానికి ఎవరిని బాధ్యులను చేయాలి? ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?’’ అంటూ మిస్బా ఉల్ హక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్లు సాధించిన పరుగులు👉ఫఖర్ జమాన్- అమెరికా మీద- 11 (7) ఇండియా మీద- 13 (8), కెనడా మీద 4 (6).👉ఇఫ్తికార్ అహ్మద్- అమెరికా మీద 18 (14), ఇండియా మీద 5 (9).👉ఆజం ఖాన్- అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డక్👉ఇమాద్ వసీం- ఇండియా మీద 15 (23).👉షాదాబ్ ఖాన్- అమెరికా మీద 40 (25), ఇండియా మీద 4 (7).చదవండి: T20 WC 2024- SA Vs Nepal: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి! -
విరాట్ కోహ్లిని తక్కువ అంచనా వేస్తే.. పాక్‌కు చుక్కలే: మిస్బా
వరల్డ్‌క్రికెట్‌లో బిగ్గెస్ట్ రైవలరీ అంటే టక్కున గుర్తు వచ్చేది భారత్-పాకిస్తాన్ మ్యాచే. ఈ దాయదుల పోరును వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరదించే సమయం అసన్నమవుతోంది. ఈ చిరకాల ప్రత్యర్ధిలు మరోసారి అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నారు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ తమ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో చాలా జాగ్రత్తగా ఉండాలని పాక్ జట్టును మిస్బా హెచ్చరించాడు."భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఎక్స్ ఫ్యాక్టర్. అతడు ఇప్పటికే చాలాసార్లు పాకిస్తాన్‌కు ఓటమిరూచిను చూపించాడు. పాకిస్తాన్‌పైన అతనికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలో చెలరేగిపోతాడు. విరాట్ ఎప్పుడూ ఒత్తడితో ఆడినట్లు నేను చూడలేదు. విరాట్ ఒక టాప్-క్లాస్ క్రికెటర్. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉంది. విరాట్‌ను ఆపాలంటే ప్రత్యేక వ్యూహాలను రచించాలి. అతని స్ట్రైయిక్ రేటు పెద్ద విషయమే కాదు. అతడు తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోడు. కోహ్లి విమర్శలను పొగడ్తలగా భావించి మరింత రాటుదేలుతాడని" స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్బా పేర్కొన్నాడు. -
నిప్పులు చెరిగిన పాక్ పేసర్.. మ్యాచ్ టై.. సూపర్ ఓవర్‌తో ఫలితం
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023 ఎడిషన్ విజేతగా టెక్సస్ ఛార్జర్స్ అవతరించింది. న్యూయార్క్ వారియర్స్‌తో నిన్న (ఆగస్ట్ 27) జరిగిన ఫైనల్లో ఛార్జర్స్ సూపర్ ఓవర్ ద్వారా విజేతగా నిలిచింది. నిర్ణీత ఓవర్ల అనంతరం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేల్చాల్సి వచ్చింది. రాణించిన కార్టర్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ వారియర్స్.. టెయిలెండర్ జోనాథన్ కార్టర్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో కార్టర్ మినహా అందరూ తేలిపోయారు. దిల్షన్ (18), రిచర్డ్ లెవి (17) రెండంకెల స్కోర్లు చేయగా.. మిస్బా ఉల్ హాక్ (5), షాహిద్ అఫ్రిది (1), కమ్రాన్ అక్మల్ (0), అబ్దుల్ రజాక్ (3) తస్సుమన్నారు. టెక్సస్ బౌలర్లలో ఎహసాన్ ఆదిల్ 3, ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇమ్రాన్ ఖాన్, తిసార పెరీరా తలో వికెట్ పడగొట్టారు. నిప్పులు చెరిగిన సోహైల్ ఖాన్.. 93 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టెక్సస్ ఛార్జర్స్.. సోహైల్ ఖాన్ (2-0-15-5), షాహిద్ అఫ్రిది (1-0-8-2), ఉమైద్ ఆసిఫ్ (2-0-14-2), జెరోమ్ టేలర్ (2-0-24-1) ధాటికి 10 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హఫీజ్ (46), బెన్ డంక్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. స్కోర్లు సమం కావడంతో ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు. స్కోర్లు సమం.. సూపర్ ఓవర్లో ఫలితం సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛార్జర్స్.. వికెట్ నష్టపోయి 15 పరుగులు చేసింది. డంక్, ముక్తర్ చెరో సిక్సర్ బాది, ఈ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు. ఛేదనలో వారియర్స్ 13 పరుగులకే పరిమతం కావడంతో టెక్సస్ ఛార్జర్స్ విజేతగా ఆవిర్భవించింది. కార్టర్ సిక్సర్, బౌండరీ బాదినా ప్రయోజనం లేకుండాపోయింది. సోహైల్ తన్వీర్ వారియర్స్‌ను కట్టడి చేశాడు. -
అఫ్రిది మెరుపులు వృధా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన జెస్సీ రైడర్
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో వెటరన్ స్టార్ క్రికెటర్లు పోటాపోటీగా రెచ్చిపోతున్నారు. న్యూయార్క్ వారియర్స్-న్యూజెర్సీ లెజెండ్స్ మధ్య నిన్న (ఆగస్ట్ 20) జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్.. 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. నూయార్క్ ఇన్నింగ్స్‌లో కమ్రాన్ అక్మల్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రిచర్డ్ లెవి (5 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు), అఫ్రిది (12 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. న్యూజెర్సీ బౌలర్ ప్లంకెట్ 2 వికెట్లు పడగొట్టాడు. 85 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజెర్సీ.. 4.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జెస్సీ రైడర్ (12 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు), క్రిస్ బార్న్‌వెల్ (10 బంతుల్లో 28 నాటౌట్; 4 సిక్సర్లు) సిక్సర్ల మోత మోగించి న్యూజెర్సీని గెలిపించారు. లెజెండ్స్ కోల్పోయిన ఏకైక వికెట్ జెరోమ్ టేలర్‌కు దక్కింది. కాగా, టీమిండిమా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూజెర్సీ జట్టుకు.. పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ న్యూయార్క్ జట్టుకు నాయకత్వం వహించారు. -
ఉతప్ప ఊచకోత.. గంభీర్ గర్జన
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో ఇండియా మహారాజాస్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన మహారాజాస్.. నిన్న (మార్చి 14) ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన మహారాజాస్.. లయన్స్‌ను 157 పరుగులకు కట్టడి చేసింది. A great feeling to get the first win under the belt 💪🏾 Always a pleasure to bat along with my brother @GautamGambhir !! pic.twitter.com/uUSU54NMfN — Robin Aiyuda Uthappa (@robbieuthappa) March 14, 2023 ఉపుల్ తరంగ (48 బంతుల్లో 69; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలకరత్నే దిల్షన్ (27 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్), అబ్దుర్ రజాక్ (17 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లయన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హఫీజ్ (2), కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ (0), అస్ఘర్ అఫ్ఘాన్ (15) విఫలం కాగా.. మహారాజాస్ బౌలర్లలో సురేశ్ రైనా 2, స్టువర్ట్ బిన్నీ, హర్భజన్ సింగ్, ప్రవీణ్ తాంబే తలో వికెట్ పడగొట్టారు. .@GautamGambhir is still on the top for @rariohq Boss Cap Holder for the highest runs. @VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/95wb1UmUn2 — Legends League Cricket (@llct20) March 14, 2023 అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మహారాజస్.. వికెట్ కూడా నష్టపోకుండానే విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (39 బంతుల్లో 88 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (36 బంతుల్లో 61 నాటౌట్; 12 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 12.3 ఓవర్లలోనే ఇండియా మహారాజాస్ విజయం సాధించారు. .@harbhajan_singh bounce back to his top spot for @rariohq Boss Cap Holder for the most wickets after tonight’s game!@VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/f3JVRL10VR — Legends League Cricket (@llct20) March 14, 2023 లయన్స్ బౌలర్లను ఉతప్ప ఊచకోత కోయగా, గంభీర్ ప్రత్యర్ధి బౌలర్లపై సింహగర్జన చేశాడు. గంభీర్‌కు ఈ సీజన్లో ఇది వరుసగా 3వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 15) వరల్డ్ జెయింట్స్ జట్టు.. ఇండియా మహారాజాస్‌తో తలపడనుంది. Match Day 5: A duel reloaded! ⚡ Will the Maharajas win back-to-back and cease the top spot? Or will the Giants topple the Maharajas back to bottom? Tune in tonight at 8 PM IST to find out! @VisitQatar#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/jRB3xzdu88 — Legends League Cricket (@llct20) March 15, 2023 కాగా, లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఆసియా లయన్స్, ఒక మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ విజయం సాధించగా.. ఇండియా మహారాజాస్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓ విజయం సాధించింది. లీగ్ తొలి మ్యాచ్‌లో ఆసియా లయన్స్ చేతిలో ఖంగుతిన్న (9 పరుగుల తేడాతో ఓటమి) మహారాజాస్.. రెండో మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ చేతిలో (2 పరుగుల తేడాతో ఓటమి) ఓటమిపాలయ్యారు. నిన్న ఆసియా లయన్స్‌పై గెలుపొందడంతో మహారాజాస్ టీమ్ బోణీ విజయం సాధించింది. Points Table Update after Match Day 4. The table has changed on the lower half! Maharajas make a majestic leap to second place while Asia Lions hold their ground at the top.@VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/XSHt2svlBK — Legends League Cricket (@llct20) March 14, 2023 -
చెలరేగిన మిస్బా, అఫ్రిది.. వరల్డ్ జెయింట్స్‌ను చిత్తు చేసిన ఆసియా సింహాలు
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో నిన్న (మార్చి 13) జరిగిన మ్యాచ్‌లో ఆసియా సింహాలు రెచ్చిపోయాయి. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత లయన్స్ బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు విజృంభించారు. ఫలితంగా ఆ జట్టు 35 పరుగుల తేడాతో వరల్డ్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. Roaring with pride after a victorious night! 🦁🔥@VisitQatar#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/0kzmqdGPzn — Legends League Cricket (@llct20) March 13, 2023 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. తిలకరత్నే దిల్షన్ (24 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), మిస్బా ఉల్ హాక్ (19 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) జెయింట్స్ బౌలర్లను చీల్చిచెండాడారు. తరంగ (1), తిసార పెరీరా (10), షాహిద్ అఫ్రిది (2) విఫలంకాగా.. రికార్డో పావెల్, క్రిస్ గేల్, పాల్ కాలింగ్‌వుడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. Job done! 💪🦁 pic.twitter.com/vSdDOClUae — Legends League Cricket (@llct20) March 13, 2023 అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్.. 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 64 పరుగులకు మాత్రమే పరిమితమై లీగ్‌లో తొలి ఓటమిని నమోదు చేసింది. లెండిల్ సిమన్స్ (14), షేన్ వాట్సన్ (3), ఆరోన్ ఫించ్ (2), రికార్డో పావెల్ (0) విఫలం కాగా.. క్రిస్ గేల్ (16 బంతుల్లో 23; 3 సిక్సర్లు) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. Lions Roared Tonight! 🦁🔥 pic.twitter.com/6hy266Swph — Legends League Cricket (@llct20) March 13, 2023 ఆసియా లయన్స్ బౌలర్లలో షాహిద్ అఫ్రిది (2-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-9-1) రాణించగా.. అబ్దుర్ రజాక్ (2-1-2-2) అదరగొట్టాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 14) ఆసియా లయన్స్, ఇండియా మహరాజాస్లో తలపడనుంది. కాగా, లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఆసియా లయన్స్, ఒక మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ విజయం సాధించగా.. ఇండియా మహరాజాస్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. లీగ్ తొలి మ్యాచ్‌లో ఆసియా లయన్స్ చేతిలో ఖంగుతిన్న (9 పరుగుల తేడాతో ఓటమి) మహరాజాస్.. రెండో మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ చేతిలో (2 పరుగుల తేడాతో ఓటమి) ఓటమిపాలయ్యారు. మహరాజాస్ ఓడిన రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. -
మిస్బాకు ఉద్వాసన.. రేసులో అక్తర్?
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో రెండు పదవుల్లో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్కు చీఫ్ సెలక్టర్ పదవికి ఉద్వానస పలకడానికి దాదాపు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అటు ప్రధాన కోచ్‌గా, ఇటు చీఫ్ సెలక్టర్‌గా కొనసాగుతున్న మిస్బావుల్‌కు రెండు పదవులు అనవసరం అని ఆలోచనలో పీసీబీ ఉంది. పాకిస్తాన్ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తప్పించి హెడ్ కోచ్‌గా మాత్రమే కొనసాగించాలని పీసీబీ చూస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధం కాగా, పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ రేసులోకి షోయబ్ అక్తర్ వచ్చేశాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిగిన విషయాన్ని అక్తర్ ధృవీకరించాడు. కాకపోతే తనకు ఏ పదవి ఇస్తారో వేచి చూడాలన్నాడు. (చదవండి: ఆసీస్‌కు అంతుచిక్కని బ్యాట్స్‌మన్) ‘పీసీబీతో చర్చలు జరిగిన మాట వాస్తవమే. నేను పీసీబీలో కీలక పాత్ర పోషించడానికి బోర్డుతో సంప్రదింపులు జరిపా. పీసీబీ ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లా. ఇంకా ఏమీ నిర్ణయం కాలేదు. నేను ప్రస్తుతం చాలా మంచి జీవితాన్నే గడుపుతున్నా. నేను నా క్రికెట్ కాలంలో ఆడా. ఇప్పుడు సెటిల్ అయిపోయా. ఇక పీసీబీకి సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఇతరులకు సలహా ఇవ్వడానికి భయపడను. నాకు అవకాశం వస్తే పాకిస్తాన్ క్రికెట్‌ను ప్రక్షాళన చేస్తా’ అని క్రికెట్ బాజ్ నిర్వహించిన యూట్యూబ్ కార్యక్రమంలో అక్తర్ తన మనసులోని మాటను వెల్లడించాడు. (చదవండి: సెరెనాకు ఊహించని షాక్) తమ మధ్య జరిగిన చర్చల్లో అటు బోర్డు కానీ, ఇటు తాను కానీ ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్నాడు. ఇంకా చర్చల దశలోనే ఉన్నందను త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నాడు. క్రికెట్లో దూకుడైన మైండ్ సెట్‌తో కొత్త తరం క్రికెట్లో ఉండాలని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ సక్సెస్, ఫెయిల్యూర్ అనేది పక్కన పెట్టి దూకుడైన క్రికెట్‌ను ఆడాల్సి అవసరం ఉందన్నాడు. పాకిస్తాన్‌కు గత క్రికెట్ వైభవం తీసుకురావాలంటే తమ క్రికెటర్ల మైండ్ సెట్ మారాలన్నాడు. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లు జావేద్ మియాందాద్, వసీం అక్రమ్, ముస్తాక్ అహ్మద్ వంటి క్రికెటర్లు ఇలా దూకుడైన స్వభావంతోనే పాక్‌కు ఘనమైన విజయాలను అందించారన్నాడు. -
పాక్ క్రికెటర్లకు... బిర్యానీ, స్వీట్స్ బంద్
లాహోర్: ఇకపై పాకిస్తాన్ క్రికెటర్ల ఆహార నియమావళి పూర్తిగా మారిపోనుంది. ఫిట్నెస్ ప్రమాణాలు పెంచి ఆటగాళ్లు మైదానంలో మరింత చురుగ్గా ఉండేలా చేసేందుకు బిర్యానీతో పాటు నూనె ఎక్కువగా వాడి వండే రెడ్ మీట్, మిఠాయిలకు దూరంగా ఉంచాలని హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బా ఉల్ హక్ యోచిస్తున్నాడు. జాతీయ శిబిరంతో పాటు దేశవాళీ టోరీ్నల్లో ఈ మేరకు డైట్ అమలు చేయాలని అతడు కోరాడు. వన్డే ప్రపంచ కప్‌లో జూన్ 16న టీమిండియాతో కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెటర్లు పిజ్జాలు–బర్గర్లు తింటున్న వీడియోను అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జంక్ ఫుడ్ నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనికితోడు కప్‌లో పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్ పైనా జోకులు పేలాయి. వీటన్నిటి కారణంగా మిస్బా... డైట్‌పై దృష్టి పెట్టాడు. పాక్ ఈ నెల 27 నుంచి స్వదేశంలో శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్ ఆడనుంది. -
ప్రపంచకప్ ఎఫెక్ట్.. సీనియర్లపై వేటు
కరాచీ: ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో సెమీస్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్‌లో పాక్ సారథి, సీనియర్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై అన్ని వైపులా విమర్శలు వచ్చాయి. దీంతో సారథి సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిపై వేటు వేయాలని ఫ్యాన్స్‌తో పాటు పాక్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పాక్ క్రికెట్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని వారు పాక్ క్రికెట్ బోర్డుకు సూచించారు. దీనిలో భాగంగా కోచ్‌పై వేటు వేసి మిస్బావుల్ హక్‌ను ప్రధాన కోచ్‌గా, చీఫ్ సెలక్టర్‌గా నియమించింది. చీఫ్ సెలక్టర్‌గా నియమించాకపడ్డాక మిస్బావుల్ తన మార్క్‌ను చూపించాడు. శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పీసీబీ ఓ ట్రైనింగ్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైనింగ్ క్యాంప్ కోసం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ జాబితాలో సీనియర్ ఆటగాళ్లు మహ్మద్ హఫీజ్, షోయాబ్ మాలిక్‌లను ఎంపిక చేయలేదు. అయితే సర్ఫరాజ్ అహ్మద్‌ను సారథిగా కొనసాగించారు. బాబర్ అజమ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్ అనంతరం మాలిక్ వన్డేలకు గుడ్ బై చెప్పినప్పటికీ టీ20ల్లో కొనసాగుతున్నాడు. అయితే శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కు మాలిక్‌ను ఎంపిక చేయకపోవడంతో అతడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. శ్రీలంకతో 27 నుంచి స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు
-
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు
మాంగ్ కాక్: హాంకాంగ్‌లో జరుగుతున్న ట్వంటీ-20 బ్లిట్జ్ టోర్నీలో పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ వీరవిహారం చేశాడు. తాను ఎదుర్కొన్న ఆరు వరుస బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మిస్బా ఉల్ హక్ కెప్టెన్సీ వహించిన హాంకాంగ్ కింగ్ ఐలాంట్ (హెచ్‌కేఐ) యునైటెడ్ జట్టు ప్రత్యర్థి హాంగ్ హోమ్ జాగ్వార్స్ పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం నాడు ఈ టోర్నీలో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో హెచ్‌కేఐ యునైటెడ్ కెప్టెన్ మిస్బా.. హాంగ్ హోమ్ జాగ్వార్స్ బౌలర్ వేసిన 19వ ఓవర్లో చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మరో బౌలర్ క్యాడీ వేసిన 20వ ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి నాలుగు బంతులను సిక్సర్లు బాదాడు. దీంతో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్‌ను నమోదు చేశాడు. అసలే స్డేడియంలో గ్యాలరీ చిన్నది కావడంతో తొలి రెండు బంతులను మిస్బా స్డేడియం అవతలికి పంపించాడు. అదే ఓవర్లో ఆఖరి బంతిని మిస్బా ఫోర్ కొట్టాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన మిస్బా కేవలం 37 బంతుల్లోనే 82 పరుగులు చేయగా ఇందులో నాలుగు పోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మిస్బా జట్టు హెచ్‌కేఐ యునైటెడ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ హమ్ జాగ్వార్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులకే పరిమితమైంది. దీంతో మిస్బా సేన 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ జట్టులో జోనాథన్ ఫూ ఒక్కడే హాఫ్ సెంచరీ (47 బంతుల్లో 77: 4 ఫోర్లు, 6 సిక్సర్లు)తో రాణించడంతో ఓటమి తప్పలేదు. -
ఆ ఫేక్ షాట్‌తో బిత్తరపోయిన కీపర్, ఫీల్డర్
బ్యాట్స్‌మన్ ఏ షాట్ ఆడుతాడో.. కొంత ముందుగానే పసిగట్టి అందుకు తగ్గట్టు కీపర్, ఫీల్డర్ తమ దిశను మార్చుకుంటున్నారు. బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి తమను దాటి తప్పించుకోకుండా ఈ జాగ్రత్త తీసుకుంటారు. కానీ ఓ అనూహ్య ఫేక్ షాట్‌తో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మిస్బావుల్ హక్ ఇంగ్లండ్ వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్‌ను బోల్తా కొట్టించాడు. 2015లో యూఏఈలో పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఓ టెస్టు మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మిస్బా అనూహ్యరీతిలో వికెట్ కీపర్‌ను, స్లిప్ ఫీల్డర్‌ను బురిడీ కొట్టించాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో బంతి గింగిరాలు తిరుగుతూ మిస్బాపైకి వచ్చింది. దీంతో స్వీప్ షాట్ కొట్టేందుకు సిద్ధమైనట్టు మిస్బా పోజు ఇచ్చాడు. బ్యాట్స్‌మన్ మూవ్‌మెంట్‌ను బట్టి అతను స్వీప్ షాట్ కొడతాడని భావించిన స్లిప్ ఫీల్డర్ జేమ్స్ అండర్సన్ లేగ్సైడ్కు మారాడు. కీపర్ జాస్ బట్లర్ కూడా ముందుజాగ్రత్తగా కొద్దిగా లెగ్‌సైడ్‌కు జరిగాడు. ఇంతలో మిస్బా బంతి గమనాన్ని పసిగట్టి.. మెరుపువేగంతో దానిని లేట్ కట్ చేశాడు. దాంతో స్లిప్‌లో క్యాచ్ అవ్వాల్సిన బంతి.. అక్కడ ఎవరూ లేకపోవడంతో బౌండరీ దిశగా దూసుకుపోయింది. బౌండరీ లైన్ వద్ద బంతిని ఫీల్డర్ ఆపాడు. లేకుంటే ఫోర్ అయ్యేదే. ఈ సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
కెప్టెన్సీ ఇవ్వకపోతే టోర్నీకి గుడ్ బై!
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త్వరలో ప్రారంభించనున్న పాకిస్థాన్ టీ20 సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తమకు ప్రాధాన్యం కల్పించకపోవడంపై ఇద్దరు పాక్ సీనియర్ క్రికెటర్లు అసంతృప్తిగా ఉన్నారు. దిగ్గజ హోదా ఇవ్వకపోవడంపై యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్ వ్యతిరేఖ ధోరణిని అవలంభించేలా కనిపిస్తోంది. పాక్ జట్టుకు 2009లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను అందించిన తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై యూనిస్ నిరాశ చెందినట్లు కనిపిస్తోంది. విదేశీ ఆటగాళ్లకు ఇచ్చే ప్రాధాన్యం వారికి ఇవ్వకపోవడంతో టోర్నీకి గుడ్ బై చెప్పాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ బోర్డు టీ20 లీగ్ ఫ్రాంచైజీ జట్లలో ఏదైనా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించకపోతే వారు టోర్నీ నుంచి వైదొలుగుతారని వారి సన్నిహితులు తెలిపారు. కెప్టెన్సీ, జట్టు మెంటర్ లాంటి ప్రధాన బాధ్యతలు ఇవ్వకపోతే టీ20 టోర్నీ ఆడే ప్రసక్తేలేదని యూనిస్ ఇటీవలే స్పష్టం చేసిన విషయం అందరికీ విదితమే. పాక్ టెస్ట్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్, మహ్మద్ హఫీజ్ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. కెవిన్ పీటర్సన్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ లాంటి విదేశీ క్రికెటర్లకు ఐకాస్ స్టేటస్ ఇచ్చి తనను పక్కనపెట్టడంపై మిస్బా నిరాశ చెందినట్లు చెప్పాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టులోనే చోటు దక్కించుకోలేని పీటర్సన్‌కు పాక్ చేపట్టనున్న పీఎస్ఎల్లో జట్టు బాధ్యతలు అప్పగించడంపై యూనిస్, మిస్బా కాస్త సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ నుంచి కేవలం షాహిద్ ఆఫ్రిది, షోయబ్ మాలిక్ ఐకాన్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న దోహా (ఖతార్) వేదికగా పీఎస్ఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. 20 రోజులపాటు అంటే.. 24వ తేదీ వరకు జరిగే మొదటి సీజన్ లో మొత్తం ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. -
పాకిస్థాన్ 234 ఆలౌట్
* అండర్సన్‌కు నాలుగు వికెట్లు * ఇంగ్లండ్‌తో మూడో టెస్టు షార్జా: ఇంగ్లండ్‌తో ఆదివారం ప్రారంభమైన మూడో టెస్టులో పాకిస్తాన్ జట్టు తడబడింది. పేసర్ అండర్సన్ (4/17) బౌలింగ్‌ను ఎదుర్కోలేక తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (160 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 85.1 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. కుక్ (0 బ్యాటింగ్), మొయిన్ అలీ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో అజహర్ అలీ (0) నిరాశపర్చగా, మహ్మద్ హఫీజ్ (27), షోయబ్ మాలిక్ (38), యూనిస్ ఖాన్ (31) ఓ మాదిరిగా ఆడారు. ఇంగ్లిష్ పేసర్ల ధాటికి ఓ దశలో 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పాక్‌ను మిస్బా, సర్ఫరాజ్ (39)లు ఆరో వికెట్‌కు 80 పరుగులు జోడించి ఆదుకున్నారు. తర్వాత మిస్బా నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో లోయర్ ఆర్డర్ ఒత్తిడికి లోనైంది. దీంతో 118 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు చేజారాయి. బ్రాడ్, సమిత్ పటేల్, అలీ తలా రెండు వికెట్లు తీశారు. -
ఆఫ్రిది, మిస్బా వన్డేలకు గుడ్‌బై
అడిలైడ్: పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్, ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది వన్డేలకు గుడ్‌బై చెప్పారు. ఆసీస్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందే వీడ్కోలు విషయాన్ని ప్రకటించిన మిస్బా... టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నాడు. ఆఫ్రిది కేవలం టి20లకే పరిమితం కానున్నాడు. సుదీర్ఘకాలం పాటు పాక్ క్రికెట్‌కు సేవలందించిన మిస్బా... 2002లో లాహోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే 162 వన్డేలు ఆడిన మిస్బా ఒక్క శతకం కూడా చేయలేదు. మరోవైపు 1996లో నైరోబీలో కెన్యాతో తొలి వన్డే ఆడిన ఆఫ్రిది పాక్ తరఫున 398 మ్యాచ్‌లు ఆడాడు. అదే ఏడాది లంకపై 37 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. కెరీర్లో లెగ్ స్పిన్నర్‌గా 395 వికెట్లు పడగొట్టాడు. 2011 ప్రపంచకప్‌లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మ్యాచ్‌లు పరుగులు సెంచరీలు సగటు మిస్బా 162 5122 0 43.40 ఆఫ్రిది 398 8064 6 23.57