
ఆఫ్రిది, మిస్బా వన్డేలకు గుడ్‌బై
అడిలైడ్: పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్, ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది వన్డేలకు గుడ్‌బై చెప్పారు. ఆసీస్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందే వీడ్కోలు విషయాన్ని ప్రకటించిన మిస్బా... టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నాడు. ఆఫ్రిది కేవలం టి20లకే పరిమితం కానున్నాడు. సుదీర్ఘకాలం పాటు పాక్ క్రికెట్‌కు సేవలందించిన మిస్బా... 2002లో లాహోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
అయితే 162 వన్డేలు ఆడిన మిస్బా ఒక్క శతకం కూడా చేయలేదు. మరోవైపు 1996లో నైరోబీలో కెన్యాతో తొలి వన్డే ఆడిన ఆఫ్రిది పాక్ తరఫున 398 మ్యాచ్‌లు ఆడాడు. అదే ఏడాది లంకపై 37 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. కెరీర్‌లో లెగ్ స్పిన్నర్‌గా 395 వికెట్లు పడగొట్టాడు. 2011 ప్రపంచకప్‌లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
మ్యాచ్‌లు పరుగులు సెంచరీలు సగటు
మిస్బా 162 5122 0 43.40
ఆఫ్రిది 398 8064 6 23.57