లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో నిన్న (మార్చి 13) జరిగిన మ్యాచ్‌లో ఆసియా సింహాలు రెచ్చిపోయాయి. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత లయన్స్ బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు విజృంభించారు. ఫలితంగా ఆ జట్టు 35 పరుగుల తేడాతో వరల్డ్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.
Roaring with pride after a victorious night! 🦁🔥@VisitQatar#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/0kzmqdGPzn
— Legends League Cricket (@llct20) March 13, 2023
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. తిలకరత్నే దిల్షన్ (24 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), మిస్బా ఉల్ హాక్ (19 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) జెయింట్స్ బౌలర్లను చీల్చిచెండాడారు. తరంగ (1), తిసార పెరీరా (10), షాహిద్ అఫ్రిది (2) విఫలంకాగా.. రికార్డో పావెల్, క్రిస్ గేల్, పాల్ కాలింగ్‌వుడ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Job done! 💪🦁 pic.twitter.com/vSdDOClUae
— Legends League Cricket (@llct20) March 13, 2023
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్.. 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 64 పరుగులకు మాత్రమే పరిమితమై లీగ్‌లో తొలి ఓటమిని నమోదు చేసింది. లెండిల్ సిమన్స్ (14), షేన్ వాట్సన్ (3), ఆరోన్ ఫించ్ (2), రికార్డో పావెల్ (0) విఫలం కాగా.. క్రిస్ గేల్ (16 బంతుల్లో 23; 3 సిక్సర్లు) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు.
Lions Roared Tonight! 🦁🔥 pic.twitter.com/6hy266Swph
— Legends League Cricket (@llct20) March 13, 2023
ఆసియా లయన్స్ బౌలర్లలో షాహిద్ అఫ్రిది (2-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-9-1) రాణించగా.. అబ్దుర్ రజాక్ (2-1-2-2) అదరగొట్టాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 14) ఆసియా లయన్స్, ఇండియా మహరాజాస్‌లో తలపడనుంది.
కాగా, లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఆసియా లయన్స్, ఒక మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ విజయం సాధించగా.. ఇండియా మహరాజాస్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. లీగ్ తొలి మ్యాచ్‌లో ఆసియా లయన్స్ చేతిలో ఖంగుతిన్న (9 పరుగుల తేడాతో ఓటమి) మహరాజాస్.. రెండో మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ చేతిలో (2 పరుగుల తేడాతో ఓటమి) ఓటమిపాలయ్యారు. మహరాజాస్ ఓడిన రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment