Aaron Finch
-
Indv s Aus: రెండోసారి తండ్రి కాబోతున్న రోహిత్!.. కెప్టెన్‌గా అతడే ఉండాలి!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కానున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అందుకు గల కారణమేమిటన్నది ఇంత వరకు స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. పితృత్వ సెలవుల కారణంగానే హిట్‌మ్యాన్ ఆసీస్‌తో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.రెండోసారి తండ్రి కాబోతున్న రోహిత్!అవును.. రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడట. అతడి భార్య రితికా సజ్దే త్వరలోనే తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ జియో సినిమాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. పెటర్నిటీ లీవ్‌లో ఉన్నందు వల్లే రోహిత్ కాస్త ఆలస్యంగా ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు వెల్లడించాడు.స్వదేశంలో చెత్త రికార్డుఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సైతం రోహిత్ త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇటీవల సారథిగా చెత్త రికార్డును రికార్డును మూటగట్టుకున్నాడు. స్వదేశంలో తొలిసారి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు కెప్టెన్‌గా నిలిచాడు.న్యూజిలాండ్‌తో ఇటీవల బెంగళూరు, పుణె, ముంబై టెస్టుల్లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఓడిపోయింది. ఇక తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు భారత్ చేరుకుంటుంది.ఇంతటి కీలకమైన సిరీస్‌లో రోహిత్ శర్మ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడన్న వార్తల నడుమ.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతినివ్వాలనుకుంటే ఆసీస్‌తో టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్‌గా నియమించాలని సూచించాడు.ఒకవేళ భార్య ప్రసవం కోసమే అయితే..ఈ నేపథ్యంలో ఆరోన్ ఫించ్ స్పందిస్తూ.. గావస్కర్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు తెలిపాడు. ‘‘భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్. ఒకవేళ భార్య ప్రసవం కోసం.. అతడు ఇంటిదగ్గరే ఉండాలనుకుంటే.. అంతకంటే అందమైన క్షణాలు ఉండవు.కాబట్టి అతడు సెలవు తీసుకున్నా మరేం పర్లేదు. అతడికి ఆ హక్కు ఉంది’’ అని పేర్కొన్నాడు. ఒకటీ రెండు మ్యాచ్‌లకు దూరమైనంత మాత్రాన సిరీస్ మొత్తానికి కేవలం ఆటగాడిగానే పరిగణించాలనడం సరికాదని గావస్కర్ వ్యాఖ్యలను ఫించ్ ఖండించాడు.సమైరాకు చెల్లి లేదంటే తమ్ముడు!ఇక కివీస్‌తో ముంబై టెస్టు తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘నేను ఆస్ట్రేలియాకు ఇప్పుడే వెళ్తానో లేనో చెప్పలేను’’ అని పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సమైరాకు చెల్లి లేదంటే తమ్ముడు రావడం కన్ఫామ్ అంటూ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. కాగా 2015లో స్పోర్ట్స్ మేనేజర్ రితికా సజ్దేను రోహిత్ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు తొలి సంతానంగా 2018లో కుమార్తె సమైరా జన్మించింది.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
రూ. 17.5 కోట్లు ఇస్తే సరిపోతుందా?.. పాపం అతడు!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఫాఫ్ డుప్లెసిస్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, గతంలో ఆర్సీబీకి ఆడిన ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ వైఫల్యాలకు కారణాలు ఇవేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘వేలం సమయంలోనే వారు తప్పటడుగు వేసినట్లు కనిపించింది. బ్యాటర్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చుపెట్టారు గానీ బౌలింగ్ విభాగంపై పెద్దగా దృష్టి సారించలేదు.ముఖ్యంగా ఈ జట్టులో ఒక్క వరల్డ్‌క్లాస్ స్పిన్నర్ కూడా లేడు. ఈ విషయంలో కేకేఆర్ పూర్తిగా విజయవంతమైంది. వాళ్లకు సునిల్ నరైన్ రూపంలో ప్రపంచస్థాయి స్పిన్ బౌలర్ దొరికాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పేయగలడు.ఆర్సీబీకి మాత్రం ఇలాంటి స్పిన్నర్ లేడు. మరో విషయం ఏమిటంటే.. వాళ్లు పెద్ద మొత్తం వెచ్చించి ఎంతో మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. వారిలో కామెరాన్ గ్రీన్ కూడా ఒకడు.అతడికి చెల్లించే జీతం భారీ మొత్తంలో ఉంటుంది. అలాంటపుడు సేవలను ఉపయోగించుకోవడంలోనూ తెలివిగా వ్యవహరించాలి కదా! నిజానికి మిడిలార్డర్లో కంటే టాపార్డర్‌లోనే గ్రీన్ మెరుగ్గా రాణించగలడు.కానీ అతడిని మిడిలార్డర్లోనే పంపిస్తున్నారు. తనకు సౌకర్యంగా లేని స్థానంలో వెళ్లి బ్యాటింగ్ చేయమని చెప్తే ఏ ఆటగాడైనా ఏం చేయగలడు. కచ్చితంగా ఇబ్బంది పడతాడు కదా’’ అని ఆరోన్ ఫించ్ ఆర్సీబీ నిరాశజనక ప్రదర్శనకు ఈ రెండూ కారణం కావొచ్చని స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ కోసం ఆర్సీబీ రూ. 17.50 కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అయితే, టాపార్డర్‌లో పవర్ఫుల్ స్ట్రైకర్ అయిన గ్రీన్‌ను మిడిలార్డర్లో ఆడిస్తోంది. విరాట్ కోహ్లితో కలిసి ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనింగ్ చేస్తుండగా.. గత మ్యాచ్‌లో విల్‌జాక్స్ వన్‌డౌన్‌లో రాగా..పేస్ఆల్రౌండర్ గ్రీన్ ఐదో స్థానంలో బరిలోకి దిగాడు.చదవండి: MS Dhoni Angry Video: ‘నన్నెందుకు చూపిస్తున్నావు?’.. ధోని సీరియస్.. వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్..?
ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ టీ20 జట్టుకు సారధిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. మార్ష్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జార్జ్ బెయిలీ అధ్యక్షుడిగా ఉన్న సెలెక్షన్ కమిటీలో మెంబర్ కూడా అయిన మెక్ డొనాల్డ్ మార్ష్ ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ పగ్గాలు చేపట్టాలని బలంగా కోరుకుంటున్నాడు. టీ20 బాధ్యతలు వదులుకునేందుకు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆసీస్ టీ20 జట్టు సారధిగా మార్ష్‌కు ఘనమైన రికార్డే ఉంది. మెక్ డొనాల్డ్ మార్ష్ వైపు మొగ్గు చూపేందుకు ఇది కూడా ఓ కారణంగా తెలుస్తుంది. 32 ఏళ్ల మార్ష్ ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జరిగిన తొలి సిరీస్‌లోనే ఆస్ట్రేలియాను విజయపథాన నడిపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2021-23 అనంతరం సౌతాఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మార్ష్ నేతృత్వంలోని ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ సిరీస్‌లో మార్ష్ బ్యాటర్‌గా కూడా రాణించి (92 నాటౌట్, 79 నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో విండీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించిన మార్ష్.. ఈ సిరీస్‌లోనూ ఆసీస్‌ను విజయపథాన నడిపించాడు. ఈ సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై జరిగిన సిరీస్‌లోనూ మార్ష్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించాడు. ఈ సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మార్ష్‌కు ఉన్న ఈ ట్రాక్ రికార్డే ప్రస్తుతం అతన్ని ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ రేసులో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మార్ష్.. తన కెరీర్లో 54 టీ20లు ఆడి తొమ్మిది హాఫ్ సెంచరీల సాయంతో 1432 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6న ఆడనుంది. దీనికి ముందు ఆసీస్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడటం లేదు. టీ20 వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. -
టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్!?
టీ20 వరల్డ్‌కప్-2024కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే ఈ క్రికెట్ మహా సంగ్రామానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికి మాజీ క్రికెటర్లు అంచనాలు, అభిప్రాయాలు ఇప్పటి నుంచే మొదలెట్టేశారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీ20 వరల్డ్‌కప్‌కు తమ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేశాడు. తాజాగా ఈఎస్పీఎన్ అరౌండ్ ది వికెట్ షోలో ఫించ్ పాల్గోనున్నాడు. ఈ క్రమంలో పొట్టి వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఫించ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లగా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌ను ఎంపిక చేసిన ఫించ్.. స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు తన తుది జట్టులో చోటు ఇవ్వలేదు. వరుసగా ఫస్ట్, సెకెండ్ డౌన్లో మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్‌కు చోటు కల్పించారు. అదే విధంగా పిచ్ పరిస్ధితులను బట్టి మార్కస్ స్టోయినిస్ లేదా మాథ్యూ షార్ట్‌లో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని ఫించ్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా వికెట్ కీపర్‌గా జోష్ ఇంగ్లీష్‌ను ఆరోన్ ఎంపిక చేశాడు. పినిషర్గా యువ ఆటగాడు టిమ్ డేవిడ్‌కు చోటు ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ చోటు దక్కింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో ఆడమ్ జంపా ఒక్కడికే చోటు దక్కింది. ఫించ్ ఎంపిక చేసిన ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్ లేదా మాథ్యూ షార్ట్ (పరిస్థితులపై బట్టి), టిమ్ డేవిడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ -
టీమిండియాతో తొలి మ్యాచ్.. ఆసీస్ తుది జట్టు ఇదే! స్టార్ ఆల్‌రౌండర్‌కు నో ఛాన్స్
వన్డే ప్రపంచకప్-2023 సమరానికి మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరగనున్న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఈ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోసం ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తీవ్రంగా శ్రమించాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. భారత్‌తో తొలి పోరు.. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీలో ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్ కోసం ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఆ జట్టు మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎంపిక చేశాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో తమ స్ధానాలను సుస్ధిరం చేసుకున్నారని ఫించ్ వెల్లడించాడు. అదే విధంగా ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఫించ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియాకు చెందిన కోడ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. భారత్‌తో తొలి మ్యాచ్‌కు స్టోయినిష్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. స్టోయినిష్ ప్రస్తుతం చేతివేలి గాయంతో బాధపడుతున్నాడు. ఫించ్ కోడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. "మొదటి మ్యాచ్‌కు ఎవరో ఒక ఆల్‌రౌండర్ కచ్చితంగా దూరం అవుతారు. ఎందుకంటే ఆసీస్ దగ్గర మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ రూపంలో ఇద్దరూ ఫాస్ట్‌బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. నా వరకు అయితే తుది జట్టులో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్,స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, అలెక్స్ క్యారీ, గ్రీన్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, హాజిల్ వుడ్, జంపా తుది జట్టులో ఉండవచ్చు అని అన్నాడు. కాగా ఫించ్ కూడా స్టోయినిష్కు తన ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వలేదు. ఆసీస్ వరల్డ్‌కప్ ప్రిపేరేషన్ గురించి మాట్లాడుతూ.. ఈ మెగా టోర్నీకి ఆస్ట్రేలియా సిద్దంగా ఉందని నేను భావిస్తున్నాను. ఈ ఈవెంట్ కోసం గత ఆరు ఏడు వారాల నుంచి మా బాయ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే జట్టులో కొంతమంది ఆటగాళ్లు గత కొంత కాలంగా తక్కువ క్రికెట్ మాత్రమే ఆడారు. అది కాస్త ఆందోళన కలిగించే ఆంశంమని ఫించ్ చెప్పుకొచ్చాడు. భారత్‌తో మ్యాచ్‌కు ఫించ్ ఎంచుకున్న ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్,స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, అలెక్స్ క్యారీ, గ్రీన్, ప్యాట్ కమ్మిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, హాజిల్ వుడ్, జంపా చదవండి: Gautam Gambhir: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్ టోర్నీ? ఆ బద్దకస్తులంతే! సిరాజ్, బుమ్రా సూపర్.. -
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించిన ఫించ్.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో..!
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023లో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (కాలిఫోర్నియా నైట్స్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు. న్యూజెర్సీ లెజెండ్స్‌తో నిన్న (ఆగస్ట్ 21) జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో అజేయమైన 75 పరుగులు చేసిన ఫించ్.. ఇవాళ (ఆగస్ట్ 22) మోరిస్విల్లే యూనిటీపై 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 63 పరుగులు చేసి, తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. ఫించ్ ఒక్కడే ఒంటరిపోరాటం చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఫించ్ వరుసగా రెండో మ్యాచ్‌లో అజేయమైన అర్ధశతకం సాధించగా.. జాక్ కలిస్ (9), మిలింద్ కుమార్ (6), సురేశ్ రైనా (6), ఇర్ఫాన్ పఠాన్ (9) విఫలమయ్యారు. మోరిస్విల్లే బౌలర్లలో పియనార్ 3 వికెట్లు పడగొట్టగా.. సావేజ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సరిపోని ఫించ్ మెరుపులు.. కోరె ఆండర్సన్ ఊచకోత 101 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మోరిస్విల్లే.. మరో 7 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మోరిస్విల్లే బ్యాటర్ కోరె ఆండర్సన్ సుడిగాలి ఇన్నింగ్స్ (5 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ముందు ఫించ్ మెరుపులు సరిపోలేదు. ఛేదనలో ఆరంభంలో నిదానంగా ఆడిన మోరిస్విల్లే.. ఆఖర్లో ఆండర్సన్‌తో పాటు పియనార్ (12 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్), షెహన్ జయసూర్య (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో విజయతీరాలకు చేరింది. మోరిస్విల్లే ఇన్నింగ్స్‌లో పార్థివ్ పటేల్్ (9 బంతుల్లో 14; 2 ఫోర్లు), క్రిస్ గేల్ (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. కాలిఫోర్నియా బౌలర్లు పవన్ సుయాల్, ఆష్లే నర్స్, రికార్డో పావెల్ తలో వికెట్ పడగొట్టారు. -
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ విధ్వంసం... ఓకే ఓవర్లో 5 సిక్స్‌లు! వీడియో వైరల్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అడితో ఏ మాత్రం పవర్ తగ్గలేదు. ఫించ్ ప్రస్తుతం యూఎస్ మాస్టర్ లీగ్‌లో కాలిఫోర్నియా నైట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం న్యూజెర్సీ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 31 బంతుల్లో 8 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫించ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తన జట్టు మాత్రం 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. కాలిఫోర్నియా బ్యాటర్లలో ఫించ్‌తో పాటు మిలాంద్ కుమార్(27) పరుగులతో రాణించాడు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజెర్సీ లెజెండ్స్ 4 వికెట్లు కోల్పోయి 9.4 ఓవర్లలో ఛేదించింది. న్యూజెర్సీ బ్యాటర్లలో టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులు చేసి న్యూజెర్సీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు నమాన్ ఓజా(25) పరుగులతో రాణించాడు. చదవండి: MS Dhoni- Rohit: ఆరోజు రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు.. వెంటనే కోచ్ కూడా! మేమేం చేయలేకపోయాం.. Why we call him the Aaronator 👊 Take a bow @AaronFinch5 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣#USMastersT10 #NJTvCK #SunshineStarsSixes#CricketsFastestFormat #T10League pic.twitter.com/NUdccQxuKq — US Masters T10 (@USMastersT10) August 21, 2023 -
ఆరు వికెట్లతో అదరగొట్టాడు.. ఎవరీ సౌరబ్ నేత్రావల్కర్?
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో వాషింగ్టన్ ఫ్రీడమ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్.. భారత సంతతికి చెందిన సౌరబ్ నేత్రావల్కర్ ఆరు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థిని శాసించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. మొయిసిస్ హెన్రిక్స్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పియనార్ 29, అండ్రీస్ గౌస్ 23 పరుగులు చేశారు. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో హారిస్ రవూఫ్ మూడు వికెట్లు తీయగా.. ప్లంకెట్ రెండు, స్టోయినిస్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. సౌరబ్ నేత్రావల్కర్ బౌలింగ్ దాటికి టాపార్డర్ కకావికలమైంది. మధ్యలో కోరే అండర్సన్ (34 పరుగులు), ఆరోన్ ఫించ్ (14 పరుగులు) ప్రతిఘటించినప్పటికి లాభం లేకపోయింది. ఆ తర్వాత నేత్రావల్కర్ టెయిలెండర్ల పని పట్టడంతో శాన్ఫ్రాన్సిస్కో ఓటమి పాలైంది. ఎవరీ నేత్రావల్కర్? భారత్ సంతతికి చెందిన సౌరబ్ నేత్రావల్కర్ ముంబై ప్రాంతంలో జన్మించాడు. అండర్-19 క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇక్కడ అవకాశాల్లేక అమెరికాకు వెళ్లిపోయాడు. మంచి లెఫ్టార్మ్ పేసర్‌గా ఎదిగిన నేత్రావల్కర్ ప్రస్తుతం అమెరికా జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. యూఎస్ఏ తరపున 2019లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నేత్రావల్కర్ 48 వన్డేల్లో 73 వికెట్లు, 9 టి20ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అమెరికా జట్టుకు నేత్రావల్కర్ కెప్టెన్‌గానూ వ్యవహరించడం విశేషం. "KING OF SWING"😎 Saurabh Netravalkar takes a BRILLIANT😍 SIX-FOR to set his team up for success! pic.twitter.com/oY6o1cMqrK — Major League Cricket (@MLCricket) July 23, 2023 చదవండి: #LinDan: సినిమాల్లో 'డాన్'లు చాలా మందే.. బ్యాడ్మింటన్‌లో మాత్రం ఒక్కడే 'డాన్' -
మాథ్యూ వేడ్ వీరవిహారం.. రసెల్, నరైన్ మెరుపులు వృధా
మేజర్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 2 సిక్సర్లు, బౌండరీతో 20 పరుగులు, స్టోయినిస్ 37 (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోరె ఆండర్సన్ 39 పరుగులు (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. కెప్టెన్ ఫించ్ 12 పరుగులతో (10 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో జేసన్ రాయ్ (21 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ కుమార్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (26 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్సర్లు) రాణించినప్పటికీ నైట్‌రైడర్స్ విజయతీరాలకు చేరలేకపోయింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో రిలీ రొస్సో (8) నిరాశపరిచాడు. యునికార్న్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, బిష్ణోయ్, ఆండర్సన్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ లీగ్‌లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. -
అతడు అత్యుత్తమ బౌలర్.. డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలిచేది వాళ్లే: ఆసీస్ మాజీ కెప్టెన్
World Test Championship 2023 FInal Ind Vs Aus: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోటీపడనుంది. ఇంగ్లండ్ వేదికగా ఇరు జట్ల మధ్య జూన్ 7- 11 వరకు మ్యాచ్ జరుగనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో రోహిత్ సేన.. కమిన్స్ బృందాన్ని ఢీకొట్టనుంది. కాగా మొట్టమొదటి డబ్ల్యూటీసీ 2019-21 సీజన్లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఫైనల్ చేరగా.. కంగారూలు తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించారు. ఇక ఇందుకు సన్నాహకంగా అన్నట్లు ఇరు జట్ల మధ్య భారత్ వేదికగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఫేవరెట్ టీమిండియా ఇందులో ఆఖరి టెస్టు ఫలితం తేలకముందే న్యూజిలాండ్- శ్రీలంక మధ్య తొలి టెస్టు.. ఫైనల్లో ఆసీస్‌కు ప్రత్యర్థిగా టీమిండియాను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ సారథి ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోందని వ్యాఖ్యానించాడు. ట్రోఫీ గెలిచే అవకాశాలు రోహిత్ సేనకే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. సిరాజ్ ఉన్నాడు కదా! ఇందుకు గల కారణాలు విశ్లేషిస్తూ.. ‘‘హార్దిక్ పాండ్యా టెస్టు మ్యాచ్‌లు ఆడే విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు. అయితే.. షమీ, ఉమేశ్, సిరాజ్.. ఈ ముగ్గురు మంచి ఫాస్ట్ బౌలర్లు. ముఖ్యంగా సిరాజ్.. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. బంతిని స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పు తిప్పలుపెట్టగలడు. గతంలో టీమిండియా ఇంగ్లండ్‌ను ఇంగ్లండ్‌లోనే ఓడించి సత్తా చాటింది. కాబట్టి ఈసారి ఫైనల్లో వాళ్లకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు’’ అని ఫించ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్‌తో బిజీగా ఉన్న అతడు హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. ఇక ప్రధాన పేసర్ బుమ్రా లేకుండానే ఈసారి భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఫించ్ సిరాజ్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం విశేషం. చదవండి: Ind Vs Aus: గిల్‌కు జోడీగా టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించేది అతడే: హార్దిక్‌పాండ్యా Ind Vs Aus: నేనెలా అర్హుడిని అవుతాను?! అసలు జట్టులోకి వచ్చే ఆలోచనే ఇప్పట్లో లేదు! నంబర్ 1 బౌలర్ అశూ.. నంబర్ 1 ఆల్‌రౌండర్ జడ్డూ.. ఫైనల్లో ఆడేది ఎవరో ఒక్కరే! -
చెలరేగిన మిస్బా, అఫ్రిది.. వరల్డ్ జెయింట్స్‌ను చిత్తు చేసిన ఆసియా సింహాలు
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో నిన్న (మార్చి 13) జరిగిన మ్యాచ్‌లో ఆసియా సింహాలు రెచ్చిపోయాయి. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత లయన్స్ బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు విజృంభించారు. ఫలితంగా ఆ జట్టు 35 పరుగుల తేడాతో వరల్డ్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. Roaring with pride after a victorious night! 🦁🔥@VisitQatar#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/0kzmqdGPzn — Legends League Cricket (@llct20) March 13, 2023 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. తిలకరత్నే దిల్షన్ (24 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), మిస్బా ఉల్ హాక్ (19 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) జెయింట్స్ బౌలర్లను చీల్చిచెండాడారు. తరంగ (1), తిసార పెరీరా (10), షాహిద్ అఫ్రిది (2) విఫలంకాగా.. రికార్డో పావెల్, క్రిస్ గేల్, పాల్ కాలింగ్‌వుడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. Job done! 💪🦁 pic.twitter.com/vSdDOClUae — Legends League Cricket (@llct20) March 13, 2023 అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్.. 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 64 పరుగులకు మాత్రమే పరిమితమై లీగ్‌లో తొలి ఓటమిని నమోదు చేసింది. లెండిల్ సిమన్స్ (14), షేన్ వాట్సన్ (3), ఆరోన్ ఫించ్ (2), రికార్డో పావెల్ (0) విఫలం కాగా.. క్రిస్ గేల్ (16 బంతుల్లో 23; 3 సిక్సర్లు) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. Lions Roared Tonight! 🦁🔥 pic.twitter.com/6hy266Swph — Legends League Cricket (@llct20) March 13, 2023 ఆసియా లయన్స్ బౌలర్లలో షాహిద్ అఫ్రిది (2-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-9-1) రాణించగా.. అబ్దుర్ రజాక్ (2-1-2-2) అదరగొట్టాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 14) ఆసియా లయన్స్, ఇండియా మహరాజాస్లో తలపడనుంది. కాగా, లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఆసియా లయన్స్, ఒక మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ విజయం సాధించగా.. ఇండియా మహరాజాస్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. లీగ్ తొలి మ్యాచ్‌లో ఆసియా లయన్స్ చేతిలో ఖంగుతిన్న (9 పరుగుల తేడాతో ఓటమి) మహరాజాస్.. రెండో మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ చేతిలో (2 పరుగుల తేడాతో ఓటమి) ఓటమిపాలయ్యారు. మహరాజాస్ ఓడిన రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. -
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023.. ఇండియా, ఆసియా కెప్టెన్లుగా బద్ద శత్రువులు
మార్చి 10 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్‌లో పాల్గొనబోయే ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్, ఇండియా మహారాజాస్ జట్లు తమ కెప్టెన్ల పేర్లను నిన్న (మార్చి 1) ప్రకటించాయి. ఆసియా లయన్స్‌కు షాహిద్ అఫ్రిది, వరల్డ్ జెయింట్స్‌కు ఆరోన్ ఫించ్, ఇండియా మహారాజాస్‌కు గౌతమ్ గంభీర్‌ను కెప్టెన్లుగా ఎంపిక చేసినట్లు ఆయా జట్లు అనౌన్స్ చేశాయి. ఈ లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఉతప్ప, శ్రీశాంత్, ఆరోన్ ఫించ్, షాహిద్ అఫ్రిది, మహ్మద్ హఫీజ్, తిలకరత్నే దిల్షాన్, క్రిస్ గేల్, బ్రెట్ లీ తదితర లెజెండ్స్ ఆడనున్నారు. ఆసియా లయన్స్‌కు సారధ్యం వహించనున్న షాహిద్ అఫ్రిది.. ఎల్ఎల్సీలో తొలిసారి ఆడుతుండగా.. ఇండియా మహారాజాస్ సారధి గౌతమ్ గంభీర్ 2022 ఎల్ఎల్సీ సీజన్లో ఇండియా క్యాపిటల్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అఫ్రిది-గంభీర్.. వారు క్రికెట్ ఆడుతున్న జమానా నుంచి ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ బద్ద శత్రువులుగా ఉన్నారు. కాగా, ఎల్ఎల్సీ 2023 సీజన్ మ్యాచ్‌లు మార్చి 10 నుంచి 20 వరకు ఖతార్‌లోని దోహాలో ఉన్న ఏషియన్ టౌన్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఎల్ఎల్సీ 2022 సీజన్ విజేతగా ఇండియా క్యాపిటల్స్ నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో క్యాపిటల్స్.. బిల్వారా కింగ్స్‌పై 104 పరుగుల తేడాతో విజయం సాధంచి, టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఇండియా క్యాపిటల్స్ ఆటగాడు రాస్ టేలర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. టేలర్‌కు జతగా.. మిచెల్ జాన్సన్ (35 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే నర్స్ (19 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) కూడా రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరంలో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ జట్టు.. 18.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయంపాలైంది. -
అంతర్జాతీయ క్రికెట్‌కు ఫించ్ గుడ్‌బై (ఫొటోలు)
-
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్
Aaron Finch Retirement: కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు తొలి టీ20 వరల్డ్‌కప్ అందించిన స్టార్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇదివరకే టెస్ట్, వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఫించ్.. పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు కెరీర్‌ను కొనసాగించలేనని తెలిసే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు ఫించ్ వెల్లడించాడు. కెరీర్ ఆసాంతం తనకు మద్దతుగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులకు, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్ ఎత్తుపల్లాల్లో తనకు అండగా నిలిచిన కుటుంబానికి, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. 2015 వన్డే ప్రపంచకప్, 2021లో టీ20 ప్రపంచకప్ గెలవడం తనకు చిరకాలం గుర్తుండిపోతుందని రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా, ఫించ్ సారధ్యంలో ఆసీస్ 2021 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా తరఫున 5 టెస్ట్‌లు, 146 వన్డేలు, 103 టీ20లు ఆడిన ఫించ్.. 17 వన్డే సెంచరీలు, 2 టీ20 సెంచరీలు, 2 టెస్ట్ ఫిఫ్టీలు, 30 వన్డే ఫిఫ్టీలు, 19 టీ20 ఫిఫ్టీల సాయంతో 278 టెస్ట్ పరుగులు, 5406 వన్డే పరుగులు, 3120 టీ20 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (172) ఫించ్ పేరిటే ఉంది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సమయంలో ఫించ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ దేశవాలీ, క్లబ్, ఇతరత్రా లీగ్‌లకు అందుబాటులో ఉంటాడు. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
ఫించ్ 'దంచి కొట్టుడు'.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో..!
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (జనవరి 22) పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ విధ్వంసకర ఇన్నింగ్స్ (35 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. స్కార్చర్స్ నిర్ధేశించిన 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఫించ్ వీరోచితంగా పోరాడినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫించ్‌కు జతగా షాన్ మార్ష్ (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్స్), విల్ సదర్లాండ్ (18 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) పోరాడినప్పటికీ మెల్బోర్న్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. Run fest at Perth, over 400 plus runs scored. Melbourne Renegades fell 10 runs short, great win for Perth Scorchers as they hold on as table toppers in BBL 12.#BBL12 #CricTracker pic.twitter.com/2ss6uBZcYh — CricTracker (@Cricketracker) January 22, 2023 ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఫించ్ చాలా రోజుల తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని ఇష్టం వచ్చినట్లు బాదుతూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా ఆండ్రూ టై వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 31 పరుగులు పిండుకుని ప్రత్యర్ధిని గడగడలాడించాడు. Aaron Finch smashed 31 runs against Andrew Tye in the 18th over. Sensational stuff!#MelbourneRenegades #AaronFInch #AndrewTye pic.twitter.com/Ks6asNijvM — CricTracker (@Cricketracker) January 22, 2023 అయితే 19వ ఓవర్లో కేవలం 8 పరుగులే రావడంతో మెల్బోర్న్ ఓటమి ఖరారైంది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని ఫించ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఎడాపెడా ఫోర్, సిక్సర్ బాది 18 పరుగులు రాబట్టాడు. అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్ నిర్ణీత ఓవర్లలో 202/5 స్కోర్ వద్ద ఆగిపోయింది. పెర్త్ బౌలర్లలో టర్నర్ 2, డేవిడ్ పెయిన్, ఆండ్రూ టై, ఆరోన్ హర్డీ తలో వికెట్ పడగొట్టారు. .@AaronFinch5 with a huge six🔥pic.twitter.com/HiqnPl1d7u — CricTracker (@Cricketracker) January 22, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్.. ఓపెనర్లు స్టీవీ ఎస్కినాజీ (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), బాన్‌క్రాఫ్ట్ (50 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ గెలుపుతో పెర్త్ పాయింట్ల పట్టికతో అగ్రస్థానాన్ని (14 మ్యాచ్‌ల్లో 11 విజయాలతో 22 పాయింట్లు) మరింత పటిష్టం చేసుకుంది. మెల్బోర్న్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 7 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని నాలుగో స్థానంలో ఉంది. సిడ్నీ సిక్సర్స్ (19 పాయింట్లు), బ్రిస్బేన్ హీట్ (13), సిడ్నీ థండర్ (12), అడిలైడ్ స్ట్రయికర్స్ (10), హోబర్ట్ హరికేన్స్ (10), మెల్బోర్న్ స్టార్స్ (6) వరుసగా 2, 3, 5, 6, 7, 8 స్థానాల్లో ఉన్నాయి. -
హ్యాట్రిక్ వృధా.. అర డజన్ సిక్సర్లు కొట్టి గెలిపించిన రసెల్
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా మెల్బోర్న్ రెనగేడ్స్, బ్రిస్బేన్ హీట్ జట్లు ఇవాళ (డిసెంబర్ 21) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. టామ్ రోజర్స్ (4/23), అకీల్ హొసేన్ (3/26) ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1/18) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్షా (29), సామ్ బిల్లింగ్స్ (25), పీయర్సన్ (45) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం 139 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ టీమ్‌ను ఫాస్ట్ బౌలర్ మైఖేల్ నెసర్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి (4/32) భయపెట్టాడు. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ పడగొట్టిన నెసర్.. అదే ఓవర్ ఆఖరి బంతికి మరో వికెట్‌ను, ఆతర్వాత మూడో ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. నెసర్ ధాటికి మెల్బోర్న్ 2.2 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. Just admiring this shot 😍 pic.twitter.com/G6ljSi7q2J — Melbourne Renegades (@RenegadesBBL) December 21, 2022 అయితే ఆరో స్థానంలో బరిలోకి దిగిన విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ (42 బంతుల్లో 57; 2 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఆరోన్ ఫించ్ (43 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), అకీల్ హొసేన్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అర డజన్ సిక్సర్లతో విరుచుకుపడిన రసెల్ ప్రత్యర్ధి చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని మెల్బోర్న్ రెనెగేడ్స్‌ను 4 వికెట్ల తేడాతో గెలిపించాడు. రసెల్ మెరుపు ఇన్నింగ్స్ హవాలో నెసర్ హ్యాట్రిక్ వృధా అయిపోయింది. బ్రిస్బేన్ బౌలర్లలో నెసర్తో పాటు మార్క్ స్టీకీట్ (2/23) వికెట్లు దక్కించుకున్నాడు. జేమ్స్ బాజ్లే బౌలింగ్‌లో రసెల్ కొట్టిన 103 మీటర్ల సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కాగా, బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనగేడ్స్ జట్టు 1400 రోజుల తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. -
ఐపీఎల్ 2023కు ముగ్గురు ఆసీస్ స్టార్లు డుమ్మా.. దేశ విధులే ముఖ్యమంటూ..!
వచ్చే ఏడాది (2023) జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి విదేశీ స్టార్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఓ పక్క ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం), రిలీజ్ (విడుదల), ట్రేడింగ్ (కొనుగోలు), మినీ వేలం కోసం సన్నాహకాల్లో బిజీగా ఉంటే, విదేశీ స్టార్లు ఒక్కొక్కరుగా లీగ్ నుంచి జారుకుంటున్నారు. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) హిట్టర్, ఇంగ్లండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్.. టెస్ట్ క్రికెట్‌కే తన మొదటి ప్రాధాన్యత అంటూ లీగ్ నుంచి వైదొలగగా, తాజాగా ఆసీస్ స్టార్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ (కేకేఆర్), ఆరోన్ ఫించ్ (కేకేఆర్), మిచెల్ స్టార్క్ (2015 వరకు ఆర్సీబీకి ఆడాడు) దేశ విధులే తమకు ముఖ్యమంటూ లీగ్‌కు డుమ్మా కొట్టనున్నారని సమాచారం. వచ్చే ఏడాది జరిగే యాషెస్ సిరీస్ కోసం ఫిట్‌గా ఉండేందుకు వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో స్టార్క్ గతేడాదే ఐపీఎల్‌పై తన అయిష్టతను వ్యక్త పరిచాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 16వ ఎడిషన్ (2023) ట్రేడింగ్‌లో భాగంగా కేకేఆర్ జట్టు.. రహ్మానుల్లా గుర్భాజ్ (ఆఫ్ఘనిస్తాన్), లోకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్)లను డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ నుంచి, అలాగే టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తెచ్చుకున్న విషయం తెలిసిందే. కమిన్స్, ఫించ్, సామ్ బిల్లింగ్స్ స్థానాలను వీరు భర్తీ చేసే అవకాశం ఉంది. కాగా, కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితా పాటు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్ 15ను డెడ్‌లైన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ముంబై, చెన్నై జట్లు మాత్రమే తమ రిలీజ్డ్, రీటెయిన్డ్ ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలుస్తోంది. చదవండి: స్టార్ ఆల్‌రౌండర్‌ను వదులుకున్న ముంబై, జడేజాను అట్టిపెట్టుకున్న చెన్నై..! చదవండి: T20 WC 2022: ఓటమి బాధలో ఉన్న కేన్ మామకు మరో భారీ షాక్..! -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ లక్ష్యంగా!
Australia Vs England ODI Series 2022: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో చేదు అనుభవం ఎదుర్కొన్న ఆతిథ్య ఆస్ట్రేలియా.. వన్డే వరల్డ్‌కప్ సన్నాహకాలు షురూ చేసింది. ఇందులో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. నవంబరు 17 నుంచి ఆరంభం కానున్న ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం తమ జట్టును ప్రకటించింది. కొత్త సారథిగా ప్యాట్ కమిన్స్ ప్రస్థానం మొదలు ఆరోన్ ఫించ్ వన్డేలకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడి స్థానంలో టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలిసారిగా వన్డే సారథిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఫించ్ గైర్హాజరీలో ఓపెనర్ స్థానానికి ట్రవిస్ హెడ్‌ను ఎంపిక చేసింది యాజమాన్యం. వరల్డ్‌కప్ టోర్నీ కోసం సుదీర్ఘకాలం తర్వాత అతడు జట్టులో పునరాగమనం చేయడం గమనార్హం. అదే విధంగా పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లకు 14 మంది సభ్యులు గల ఈ జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘వన్డే కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో వరల్డ్‌కప్ నాటికి జట్టును బలోపేతం చేయడమే లక్ష్యం. మాకిది ముఖ్యమైన సిరీస్. ఫించ్ స్థానంలో ట్రవిస్ హెడ్ జట్టులోకి వచ్చాడు. ఇండియాలో వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచకప్ టోర్నీకి సిద్ధం కావడంపైనే ప్రస్తుతం మేము దృష్టి సారించాం’’ అని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ వన్డే సిరీస్- షెడ్యూల్ నవంబరు 17, గురువారం- అడిలైడ్ నంబరు 19, శనివారం, సిడ్నీ నవంబరు 22, మంగళవారం, మెల్బోర్న్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్- ఆస్ట్రేలియా జట్టు ఇదే ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆష్టన్ అగర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడం జంపా. చదవండి: T20 WC 2022: ఇంగ్లండ్‌తో సెమీస్ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..? T20 WC 2022: టీమిండియా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న 1992 సెంటిమెంట్..! SQUAD: Presenting a stacked national men's team for the upcoming three-match series against our oldest rivals #AUSvENG 🎟 https://t.co/Zh2kdufP5Q pic.twitter.com/Uj9ptY0HdV — Cricket Australia (@CricketAus) November 8, 2022 -
Aus Vs Afg:ఆస్ట్రేలియా విజయం.. పోరాడి ఓడిన అఫ్గానిస్తాన్
టి20 ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు జరిగింది. సూపర్-12 గ్రూఫ్-1లో అఫ్గానిస్తాన్ ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పని చేసింది. ఆఖర్లో రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరవడంతో విజయానికి దగ్గరగా వచ్చిన ఆఫ్గన్ కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ 23 బంతుల్లో 48 పరుగులతో మెరవగా.. గుల్బదిన్ నయీబ్ 39, ఇబ్రహీం జర్దన్ 26, రహమనుల్లా గుర్బాజ్ 30 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. కేన్ రిచర్డ్సన్ ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ రేసులో ఉన్నప్పటికి నెట్రనరేట్ మాత్రం మైనస్‌లోనే ఉంది. దీంతో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ మాములు విజయం సాధించినా ఆసీస్ ఇంటిదారి పట్టాల్సిందే. ఒకవేళ ఇంగ్లండ్ ఓడిపోతే మాత్రం ఆసీస్ సెమీస్‌కు చేరుతుంది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన అఫ్గానిస్తాన్ ► 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌ను ఇబ్రహీం జర్దన్(26), గుల్బదిన్ నయిబ్(39) నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో మాక్స్వెల్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు గుల్బదిన్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఆడమ్ జంపా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికే ఇబ్రహీం జర్దన్ కూడా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అదే ఓవర్ మూడో బంతికి నజీబుల్లా జర్దన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధాటిగా ఆడుతున్న అఫ్గానిస్తాన్.. 13 ఓవర్లలో 102/2 ► 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ ధాటిగా ఆడుతుంది. 13 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసంది. ఇబ్రహీ జర్దన్ 24, గుల్బదిన్ నయీబ్ 39 పరుగులతో ఆడుతున్నారు. 10 ఓవర్లలో ఆఫ్గన్ స్కోరు ఎంతంటే? ► 10 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. గుల్బదిన్ నయీబ్ 24, ఇబ్రహీం జర్దన్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఫ్గన్ విజయానికి 60 బంతుల్లో 97 పరుగులు కావాలి వార్నర్ స్టన్నింగ్ క్యాచ్.. రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్గన్ ► డేవిడ్ వార్నర్ స్టన్నింగ్ క్యాచ్‌తో 30 పరుగులు చేసిన రహమనుల్లా గుర్బాజ్ వెనుదిరగడంతో ఆఫ్గన్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. గుల్బదిన్ నయీబ్ 7, ఇబ్రహీం జర్దన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్ ► 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఘనీ(2) కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అఫ్గానిస్తాన్ టార్గెట్ 169.. ►అఫ్గనిస్తాన్‌తో కీలక పోరులో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 32 బంతుల్లో 54 పరుగులతో అజేయంగా నిలిచిన గ్లెన్ మాక్స్వెల్ ఆసీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మార్ష్ 45, వార్నర్ 25, స్టొయినిస్ 25 పరుగులు చేయగలిగారు. ఇక అఫ్గన్ బౌలర్లలో ఫరూకీ రెండు, ముజీబ్ ఒకటి, నవీన్ ఉల్ హక్ అత్యధికంగా మూడు, రషీద్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. రిచర్డ్సన్ రనౌట్ నవీన్ బౌలింగ్‌లో మాక్స్వెల్ షాట్ బాదగా పరుగు పూర్తి చేసే క్రమంలో కేన్ రిచర్డ్సన్ రనౌట్ అయ్యాడు. 19 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు: 159/8 కమిన్స్ డకౌట్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ప్యాట్ కమిన్స్ డకౌట్ అయ్యాడు. నవీన్ బౌలింగ్‌లో రషీద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కమిన్స్ రూపంలో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. వేడ్ అవుట్ 18వ ఓవర్ ఐదో బంతికి ఫరూకీ.. ఆసీస్ కెప్టెన్ వేడ్(6)ను బౌల్డ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. ఐదో వికెట్ డౌన్ 16వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో స్టొయినిస్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. మాక్స్వెల్, వేడ్ క్రీజులో ఉన్నారు. 17 ఓవర్లలో ఆసీస్ స్కోరు- 146/5. మార్ష్ అవుట్ జోరు మీదున్న మార్ష్‌ను ముజీబ్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లలో స్కోరు 88/4. స్టొయినిస్, మాక్స్వెల్ క్రీజులో ఉన్నారు. అర్ధ శతకానికి చేరువలో మార్ష్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 45 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. 10 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 83/3 8 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 64-3 మిచెల్ మార్ష్ 28, మార్కస్ స్టొయినిస్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. పవర్ ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు ఎంతంటే! ఫజల్హక్ ఫారూకీ అఫ్గనిస్తాన్‌కు శుభారంభం అందించాడు. మూడో ఓవర్ తొలి బంతికే గ్రీన్‌ను పెవిలియన్‌కు పంపి తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆరో ఓవర్ తొలి బంతికే వార్నర్‌ను అవుట్ చేశాడు నవీన్ ఉల్ హక్. అంతేకాదు ఆఖరి బంతికి స్మిత్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 54 పరుగులు చేసింది. ప్రపంచకప్-2022లో భాగంగా టీ20 ఫార్మాట్లో ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ జట్లు తొలిసారి ముఖాముఖి పోటీపడుతున్నాయి. సూపర్-12లో భాగంగా గ్రూప్-1లో ఉన్న ఇరు జట్లు శుక్రవారం మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుక సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక భారీ విజయం సాధించి తీరాలి. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచినా అఫ్గన్‌కు పెద్దగా లాభం లేకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ ఆశలకు గండికొట్టే అవకాశం ఉంది. ఇక అఫ్గన్‌తో మ్యాచ్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయం కారణంగా దూరం కాగా.. మాథ్యూ వేడ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. మూడు మార్పులు టాస్ సందర్భంగా తాము మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు వికెట్ కీపర్ బ్యాటర్ వేడ్ వెల్లడించాడు. ఫించ్, టిమ్ డేవిడ్, మిచెల్ స్టార్క్.. స్థానాల్లో కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, కేన్ రిచర్డ్సన్ తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. మరోవైపు.. అఫ్గనిస్తాన్ రెండు మార్పులతో మైదానంలో దిగింది. అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ స్థానాల్లో డార్విష్ రసౌలీ, నవీన్ ఉల్ హక్లకు తుది జట్టులో చోటు దక్కింది. కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు ఇవే: అఫ్గనిస్తాన్: రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఉస్మాన్ ఘనీ, ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, డారిష్ రసౌలీ, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూఖీ. ఆస్ట్రేలియా: కామెరూన్ గ్రీన్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(కెప్టెన్/వికెట్ కీపర్), పాట్ కమిన్స్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్. చదవండి: T20 WC 2022 Final: టీమిండియాతో ఫైనల్ ఆడే జట్టు ఇదేనన్న ఆసీస్ దిగ్గజం.. అయితే! T20 WC 2022 NZ Vs IRE: ఐర్లాండ్‌పై ఘన విజయం.. సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్! -
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ దూరం!
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో కీలక మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయం కారణంగా ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా సోమవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న ఫించ్.. 5 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 63 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ అఖరిలో ఫించ్ తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ బాధను భరిస్తూనే ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫించ్ ఫీల్డ్‌లోకి రాలేదు. అతడి స్థానంలో వైస్-కెప్టెన్ మాథ్యూ వేడ్ బాధ్యతలు స్వీకరించాడు. ఇక తన గాయంకు సంబంధించిన అప్డేట్ను మ్యాచ్ అనంతరం ఫించ్ వెల్లడించాడు. "ప్రస్తుతం చాలా నొప్పిగా ఉంది. నేను రేపు(మంగళవారం) స్కానింగ్ కోసం వెళ్తాను. గతంలో కూడా ఇదే గాయంతో బాధపడ్డాను. స్కాన్ రిపోర్ట్స్ బట్టి విశ్రాంతి తీసుకోవాలా వద్ద అన్నది ఆలోచిస్తాను" అని ఫించ్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 42 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇక నవంబర్ 4న ఆడిలైడ్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. In a positive update, it was just precautionary for Tim David, who was kept out from fielding with hamstring tightness 🤞 https://t.co/SpUaVotkhk — Fox Cricket (@FoxCricket) October 31, 2022 చదవండి: T20 WC 2022: 'బాబర్ అజం స్వార్దపరుడు.. కేవలం రికార్డుల కోసం మాత్రమే' -
చెలరేగిన బౌలర్లు.. పసికూనపై ప్రతాపం చూపించిన ఆస్ట్రేలియా
బ్రిస్బేన్: కెప్టెన్ ఆరోన్ ఫించ్ (44 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చాలా కాలం తర్వాత ఆస్ట్రేలియాను గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టి20 ప్రపంచకప్‌లో సోమవారం జరిగిన ‘సూపర్–12’ మ్యాచ్‌లో ఆతిథ్య ఆసీస్ 42 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్–1లో ఫించ్ సేన న్యూజిలాండ్‌తో పాటు 5 పాయింట్లతో సమ ఉజ్జీగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. స్టొయినిస్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. ఐర్లాండ్ బౌలర్ బారి మెకార్తీ (3/29) టాపార్డర్‌ను కూల్చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. లోర్కన్ టకర్ (48 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా, మ్యాక్స్‌వెల్ (2/14), స్టార్క్ (2/43) కీలక వికెట్లతో ఐర్లాండ్‌ను పడగొట్టారు. ఫించ్ ఫిఫ్టీ గత వరల్డ్ కప్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ డేవిడ్ వార్నర్ (3) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. లిటిల్, మెకార్తీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆరంభంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు కష్ట పడ్డారు. బౌండరీ కొట్టేందుకు మూడో ఓవర్‌దాకా వేచి చూడక తప్పలేదు. పవర్ ప్లే (6 ఓవర్లు)లో ఆసీస్ స్కోరు 38/1 మాత్రమే. అనంతరం ఫియోన్ హ్యాండ్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన మిచెల్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగం పెంచాడు. కాసేపటికే అతన్ని అవుట్‌చేసి ఈ వేగానికి మెకార్తీ కళ్లెం వేశాడు. మ్యాక్స్‌వెల్ (13) త్వరగానే పెవిలియన్ చేరగా... స్టొయినిస్‌తో కలిసి ఫించ్ జట్టును నడిపించాడు. ఆసీస్ సారథి 38 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 70 పరుగులు జోడించాక ఫించ్ కూడా మెకార్తీ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు), వేడ్ (7 నాటౌట్) ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేశారు. టకర్ నాటౌట్ పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను వారి సొంతగడ్డపై ఎదుర్కొనే సత్తా ఐర్లాండ్ బ్యాటర్స్‌కు లేకపోయినా... ఒకే ఒక్కడు టకర్ మాత్రం అదరగొట్టాడు. 25 పరుగులకే ఐర్లాండ్ సగం వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు స్టిర్లింగ్ (11), బాల్బిర్నీ (6) సహా ఆఖరి వరుస దాకా టెక్టర్ (6), కాంఫెర్ (0), డాక్రెల్ (0), డెలానీ (14), అడయిర్ (11), హ్యాండ్ (6), మెకార్తీ (3), లిటిల్ (1)... ఇలా ఏ ఒక్కరు కనీస ప్రదర్శన చేయలేకపోయినా వన్‌డౌన్‌లో వచ్చిన టకర్ అసాధారణ పోరాటం చేశాడు. అండగా నిలిచే సహచరులు కరువైన చోట అతను 40 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు మినహా అంతా సింగిల్ డిజిట్‌కే నిష్క్రమించినా... తను మాత్రం ఆఖరి దాకా క్రీజులో నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్, స్టార్క్‌లతో పాటు కమిన్స్, జంపా తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఆసీస్ గ్రూప్-1లో రెండో స్థానానికి ఎగబాకింది. ఆసీస్ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, మరో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో -0.304 రన్‌రేట్‌తో 5 పాయింట్లు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో నిలిచాయి. -
IRE Vs AUS: రెచ్చిపోయిన ఫించ్..
టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-1లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 31) ఆస్ట్రేలియా-ఐర్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆసీస్.. ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (44 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా.. ఆఖర్లో మార్కస్ స్టొయినిస్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) బ్యాట్ ఝులిపించారు. మిచెల్ మార్ష్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్ కార్తీ మూడు వికెట్లు పడగొట్టగా.. జాషువ లిటిల్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మ్యాక్స్‌వెల్ 2, స్టార్క్, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో తమ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో గెలుపొందింది. -
ఆస్ట్రేలియా వర్సెస్ ఐర్లాండ్.. తుది జట్టులో ఎవరెవరంటే!
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఐర్లాండ్‌తో కీలక పోరుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. బ్రేస్బేన్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. సెమీస్ రేసులో ఆసీస్ నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా విజయం సాధించాలి. పాయింట్ల పట్టికలో గ్రూపు-1 నంచి ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఘోర ఓటమి చవి చూసిన ఫించ్ సేన.. అనంతరం శ్రీలంకపై విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్‌తో కీలకమైన మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా ఖాతాలో కేవలం ఒక్క పాయింట్ చేరింది. మరోవైపు ఐర్లాండ్‌కు కూడా ఇది డూ ఆర్‌డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తానే ఐర్లాండ్ తమ సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంటుంది. తుది జట్లు: ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ ఐర్లాండ్ పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, ఫియోన్ హ్యాండ్, జాషువా లిటిల్ చదవండి: Virat Kohli: కోహ్లికి చేదు అనుభవం! వీడియో వైరల్.. విరాట్ సీరియస్ -
ఆసీస్ వర్సెస్ శ్రీలంక.. మ్యాక్స్‌వెల్ మెరుస్తాడా? హసరంగా మ్యాజిక్ చేస్తాడా?
టీ20 ప్రపంచకప్-2022లో డిఫిండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరో కీలక పోరుకు సిద్దమైంది. పెర్త్ వేదికగా మంగళవారం(ఆక్టోబర్25) శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడనుంది. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్-12 తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కాన్వే(92) చేలరేగడంతో 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. మ్యాక్స్‌వెల్ మెరుస్తాడా ఇక శ్రీలంకతో జరగనున్న ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు చాలా కీలకం. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా ఇప్పటికే అఖరి స్థానంలో కొనసాగుతుంది. కాబట్టి వరుస మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించకపోతే గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టక తప్పదు. అయితే శ్రీలంకపై మాత్రం ఆసీస్ విజయం సాధించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్, మార్ష్, డేవిడ్ చెలరేగితే శ్రీలంకకు కష్టాలు తప్పవు. అదే విధంగా బౌలింగ్‌లో హాజిల్ వుడ్, కమ్మిన్స్, స్టార్క్ ఈ ముగ్గురు పేసర్లు నిప్పులు చేరిగితే లంక బ్యాటర్లకు ముప్పు తిప్పలు తప్పవు. ఇక ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్‌వెల్ ఫామ్ లేమి ఆస్ట్రేలియాను కాస్త కలవరపెడుతోంది. అయితే న్యూజిలాండ్‌పై మ్యాక్స్‌వెల్ కాస్త పర్వాలేదనపించాడు. మ్యాక్స్‌వెల్ తన మునపటి ఫామ్‌ను తిరిగి పొందితే ఆస్ట్రేలియాకు ఇక తిరుగుండదు. మెండిస్, హాసరంగా మళ్లీ మ్యాజిక్ చేస్తారా రౌండ్-1లో నమీబియా చేతిలో ఆనూహ్యంగా ఓటమి చెందిన శ్రీలంక.. అనంతరం యూఏఈ, నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి సూపర్-12లో అడుగుపెట్టింది. అదే విధంగా సూపర్-12 తొలి మ్యాచ్‌లోనే ఐర్లాండ్‌ను చిత్తు చేసి తమ జోరును కొనసాగించింది. శ్రీలంక బ్యాటింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం అంత అనుభవం ఉన్న బౌలర్ ఒక్కరూ కనిపించడం లేదు. ఆ జట్టు స్టార్ పేసర్ చమీరా, యువ బౌలర్ మధుషాన్ గాయం కారణంగా దూరం కావడంతో లంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ కుశాల్ మెండిస్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదే విధంగా సూపర్-12 తొలి మ్యాచ్‌కు దూరమైన మరో ఓపెనర్ నిస్సాంక.. ఆసీస్‌తో పోరుకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్‌లో మాత్రం లంక పూర్తి స్థాయిలో హాసరంగా, థీక్షణపైనే అధారపడుతోంది. ఈ మ్యాచ్‌లో హాసరంగా తన స్పిన్ మ్యాజిక్‌ను మరోసారి రిపేట్ చేస్తే ఆస్ట్రేలియా కష్టాలు తప్పవు. హెడ్ టూ హెడ్ రికార్డులు ఇక ఇరు జట్లు ఇప్పటి వరకు 25 టీ20ల్లో ముఖాముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 15 మ్యాచ్‌ల్లో, లంక 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో అయితే ఇరు జట్లు ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 3 సార్లు, శ్రీలంక 2 సార్లు గెలుపొందాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 World Cup 2022: భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా -
కోలుకోలేని దెబ్బ కొట్టారు.. నెట్ రన్‌రేటు దారుణం.. అదృష్టం కలిసొస్తేనే: ఫించ్
T20 World Cup 2022- NZ Vs Aus- Aaron Finch: ‘‘మొదటి నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్ ఓపెనర్లు అద్బుతంగా ఆడారు. మమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొట్టారు. లక్ష్య ఛేదనలో శుభారంభం చేయాలని భావించినా.. మేము ఆ పని చేయలేకపోయాం’’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. తొలి మ్యాచ్‌లో భారీ ఓటమి కారణంగా.. టోర్నీలో తమకు మిగిలి ఉన్న మ్యాచ్‌లలో మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడ్డ ఆతిథ్య ఆసీస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కంగారూలకు కివీస్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా పవర్ ప్లేలో ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరి విజృంభణతో ఆరు ఓవర్లు ముగిసే సరికి కివీస్ ఒక వికెట్ నష్టపోయి 65 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా న్యూజిలాండ్ బ్యాటర్లను ఆపడం ఆసీస్ బౌలర్ల తరం కాలేదు. దీంతో కివీస్ 200 పరుగుల మార్కు అందుకుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడంతో 17.1 ఓవర్లకే ఆతిథ్య జట్టు కథ ముగిసింది. 89 పరుగులతో ఓటమి పాలైంది. దీంతో భవిష్యత్తులో గనుక భారీ విజయాలు సాధించకపోతే రన్‌రేటుపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అదృష్టం కూడా కలిసిరావాలి ఈ నేపథ్యంలో ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఓటమికి సమిష్టి వైఫల్యం కారణమని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ప్రత్యర్థి జట్టు ఓపెనర్లను కట్టడి చేయలేకపోయాం. లక్ష్య ఛేదనలోనూ ఆదిలోనే వికెట్లు కోల్పోయాం. నెట్ రన్‌రేటు కూడా దారుణంగా ఉంది. తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడబోతున్నాం. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో మేము బాగా కష్టపడాల్సి ఉంటుంది. అదృష్టం కూడా కలిసిరావాలి’’ అని ఫించ్ వ్యాఖ్యానించాడు. చదవండి: వరల్డ్‌కప్ గురించి ప్రశ్న.. అదిరిపోయే సమాధానం చెప్పిన ధోని View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });