
పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ గెలిచి జోరు మీద ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. గతంలో గాయపడిన స్టీవ్ స్మిత్.. తన మోచేయికి శస్త్ర చికిత్స చేయుంచుకోబోతున్నాడు. దీంతో పాక్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరం కానున్నాడు.
ఇక అతడి స్థానంలో స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. కాగా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో స్టీవ్ స్మిత్ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 8000 పరుగులు చేసిన ఆటగాడిగా కూడా స్మిత్ రికార్డు సృష్టించాడు. మరోవైపు గాయం కారణంగా ఆ జట్టు పేసర్ కేన్ రిచర్డ్‌సన్ కూడా పాక్ సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక మార్చి 29న లాహోర్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది.
ఆస్ట్రేలియా వన్డే/టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, అలెక్స్ కారీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషాగ్నే, మిచెల్ మార్ష్, బెన్ మెక్‌డెర్మోట్, బెన్ మెక్‌డెర్మోట్ , మిచెల్ స్వెప్సన్, ఆడమ్ జంపా
Comments
Please login to add a commentAdd a comment