elbows
-
మోచేతి నొప్పులా..ఇవిగో టిప్పులు!
దాదాపుగా అందరికీ జీవితంలోనూ ఏదో ఒక సమయంలో మోచేయి నొప్పి రావచ్చు. మరీ ముఖ్యంగా ఇంటి పనులు చేస్తుండే గృహిణుల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఇలా మోచేతికి సమస్య రావడం ఎందుకంటే... ఇతర దేశాల్లోని మహిళలతో పోలిస్తే మన దేశంలోని మహిళలూ, గృహిణులూ నిత్యం ఏదో ఒక ఇంటిపని చేస్తూనే ఉంటారు. ఈ కారణంతో ఏదో ఓ సమయంలో మోచేతికి వచ్చే సమస్యలు వాళ్లలోనే ఎక్కువగా బయటపడుతుంటాయి. ఇక మరో కారణమేమిటంటే... నిర్మాణపరమైన తేడాలున్నప్పుడు కూడా కొందరిలో మోచేతి సమస్యలు బయటపడుతుంటాయి. మోచేతి సమస్యలపై అవగాహన, నివారణ కోసం ఈ కింది అంశాలు తెలుసుకుందాం. సాధారణంగా మోచేతికి ఈ కింద పేర్కొన్న సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మోచేతి విషయంలో కనిపించే కొన్ని సమస్యలు... ఆటల్లో గాయాల వల్ల : క్రికెట్ లేదా టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి రాకెట్‌తో ఆడే ఆటల్లోనూ, ప్రధానంగా పురుషుల్లో మరింత ఎక్కువ బరువు వేసి వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేసినప్పుడు మోచేయి గాయపడి నొప్పి రావచ్చు. చేతిని వాడాల్సిన పద్ధతిలో ఉపయోగించకుండా అకస్మాత్తుగా కదిలించడం, ఆటలకు ముందు తగినంత వార్మప్ చేయకపోవడం వంటి కారణాలతో ఇలా జరగవచ్చు. హైపర్ ఎక్స్టెండెడ్ ఎల్బోస్ : చేతిని పూర్తిగా చాచినప్పుడు... మోచేతి దగ్గర అది 180 డిగ్రీలు ఉంటుంది. కానీ కొందరిలో అంటే... దాదాపు 30 శాతం మందిలో (అందునా ప్రధానంగా మహిళల్లో) అది 180 డిగ్రీల కంటే ఎక్కువే ఒంపు తిరుగుతుంది. ఇలా 180 డిగ్రీల కంటే కాస్తంత ఎక్కువగా మోచేయి బయటివైపునకు ఒంపు తిరగడాన్ని ‘హైపర్ ఎక్స్టెండెడ్ ఎల్బో’గా చెబుతారు. ఇలా ఎక్కువగా ఒంగుతున్నట్లు కనిపించడమన్న అంశమే మహిళలు ఎక్కువగా బరువులు మోసినప్పుడు అది మోచేతి బెణుకుకు కారణమవుతుంటుంది.ఎపీకాండలైటిస్ : చేతి భాగంలోని ఎముక (ఎపికాండైల్)కు ఒకసారి గాయమయ్యాక, మళ్లీ అదే చోట పదే పదే దెబ్బతగులుతుండటం వల్ల ఆ గాయం తిరిగి రేగుతుండవచ్చు. భుజం కండరాలు కూడా ఈ చోటే ఎముకకు అతికి ఉంటాయి. దాంతో ఏ కొద్దిపాటి శ్రమ చేసినా మళ్లీ గాయం రేగిపోయి నొప్పి వస్తుండవచ్చు. ఒక్కోసారి ఆ నొప్పి ఒకే చోట ఉండవచ్చు లేదా చేయి అంతటికి పాకవచ్చు. ఇలా జరగడాన్నే ల్యాటరల్ ఎపికాండైలైటిస్ అంటారు. చాలా ఎక్కువగా శ్రమించేవారిలో, ఈ శ్రమలో భాగంగా మోచేతిని ఎక్కువగా వాడేవారిలో కొన్ని సందర్భాల్లో మోచేతి దగ్గర కండరాన్ని ఎముకకు అంటించే ‘టెండన్’ విపరీతంగా అరిగి΄ోవచ్చు. ఇలాంటి కండిషన్‌నే ‘టెన్నిస్ ఎల్బో’గా పేర్కొంటారు. చాలా సందర్భాల్లో ‘ల్యాటరల్ ఎపీకాండైటిస్’నూ ‘టెన్నిస్ ఎల్బో’నూ దాదాపుగా ఒకే అర్థంలో వాడుతుంటారు.మోచేతి నొప్పి తగ్గాలంటే... మోచేయి విషయంలో ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవడానికి ఎవరికి వారే ఇలా చెక్ చేసుకోవచ్చు. మొదట చేతిని చాచాలి. అది 180 డిగ్రీలు చాచగలిగితే పరవాలేదు. లేదంటే ఏదైనా సమస్య ఉందని అర్థం. మోచేతి ప్రాంతంలో వేలితో నొక్కాలి. లేదంటే ఏదైనా పనిచేస్తున్నప్పుడైనా మోచేతి పరిసరాల్లో నొప్పి వస్తోందంటే ఏదో సమస్య ఉన్నట్లు భావించాలి.కొన్ని పరిష్కారాలు... సాధారణంగా మోచేతికి ఏదైనా సమస్య వచ్చినా లేదా నొప్పి మరీ ఎక్కువగా లేక΄ోయినా... ప్రతివాళ్లూ తాము రోజూ చేసినట్లే ఇంట్లోని బరువులు ఎత్తడం / ఆటలాడటం వంటివి చేయవచ్చు. మరీ నొప్పిగా ఉంటే మాత్రం చేతికి తగినంత విశ్రాంతినివ్వాలి. ఏదైనా ఆటలాడటం వల్ల నొప్పి వస్తుంటే... ఒకవేళ ఆ గాయం తాజాదైతే (1 – 3 రోజులది) దానికి ఐస్‌ప్యాక్ పెట్టవచ్చు. వేణ్ణీళ్లతోనూ కాపడం పెట్టవచ్చు. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రోథెరపీ వంటివి చేయించుకోవడం ఒక్కటే సరి΄ోదు. ఇలాంటి గాయాలైన సమయంలో మోచేతికి విశ్రాంతినివ్వడంతోపాటు ఎల్బో, రిస్ట్ స్ట్రెచ్చింగ్ వ్యాయాలు చేయాలి. ఆ సమయంలో మోచేతికి శ్రమ కలిగించడం గానీ లేదా తగిలిన చోటే మళ్లీ మళ్లీ గాయం రేగేలా దెబ్బతగలనివ్వడం గానీ చేకూడదు. అలాంటి సందర్భాల్లో గాయం రేగితే ‘టెండన్’ దెబ్బతినవచ్చు. అందుకే మోచేతి నొప్పి రెండు వారాలకుపైగా అదేపనిగా కొనసాగితే తప్పక డాక్టర్‌కు చూపించుకోవాలి. కొన్ని సందర్భాల్లో మోచేతి నొప్పి అదే పనిగా వస్తుంటే ఒకసారి డాక్టర్‌కు చూపించి అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కారణంగా వస్తుందేమోనని చూసుకొని, అక్కడ సమస్య ఏమీ లేదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండవచ్చు. (చదవండి: అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..! -
ఇంటి చిట్కాలతో బ్లాక్ సర్కిల్స్‌కు చెక్ పెట్టండి
సాధారణంగా మనలో చాలామందికి కొన్నిసార్లు మోకాళ్లు, మోచేతుల వద్ద నల్లగా మారుతుంటుంది.దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆయా భాగాలు కనబడకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంత మందికి ఎన్ని జాగ్రత్తలు పాటించినా నల్లటి వలయాలు బాధిస్తుంటాయి. ఈ సమస్యకు సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. అదెలా చూసేద్దాం. ►టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. ►రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, నలుపు ఉన్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేయాలి. ►అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును కళ్లకింద ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణం చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ► ఒక ఆలుగడ్డను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నేరుగా మోచేతులు, మోకాళ్లపై రుద్దవచ్చు. లేదా వాటి రసం తీసి ఆయా భాగాలపై రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తు తప్పక ఫలితం కనిపిస్తుంది. ► ఒక టీస్పూన్ బొప్పాయిరసం, అంతే మొత్తంలో తేనె తీసుకుని బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని రాస్తుంటే మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపుదనం పోతుంది. -
మోచేతుల నలుపు తగ్గాలంటే...
♦ రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసి, పది నిమిషాలు ఉంచాలి. ♦ టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి వేడి టవల్‌తో తుడవాలి. ♦ రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. ♦ రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి. ♦ పాల మీగడలో చిటికెడు పసుపు రాసి, నలుపుగా ఉన్న చోటరాసి, రుద్ది, శుభ్రపరచాలి. ♦ టొమాటో రసం లేదా దానిమ్మ రసం తేనె లేదా నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్ది, శుభ్రపరుచుకుంటే నలుపు సులువుగా తగ్గుతుంది. ♦ నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వారానికోసారి స్నానానికి నువ్వుల నూనె ఉపయోగించడం వల్ల చర్మానికి కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్ అంది, మృదువుగా అవుతుంది. -
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్!
పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ గెలిచి జోరు మీద ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. గతంలో గాయపడిన స్టీవ్ స్మిత్.. తన మోచేయికి శస్త్ర చికిత్స చేయుంచుకోబోతున్నాడు. దీంతో పాక్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరం కానున్నాడు. ఇక అతడి స్థానంలో స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. కాగా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో స్టీవ్ స్మిత్ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 8000 పరుగులు చేసిన ఆటగాడిగా కూడా స్మిత్ రికార్డు సృష్టించాడు. మరోవైపు గాయం కారణంగా ఆ జట్టు పేసర్ కేన్ రిచర్డ్సన్ కూడా పాక్ సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక మార్చి 29న లాహోర్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది. ఆస్ట్రేలియా వన్డే/టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, అలెక్స్ కారీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషాగ్నే, మిచెల్ మార్ష్, బెన్ మెక్‌డెర్మోట్, బెన్ మెక్‌డెర్మోట్ , మిచెల్ స్వెప్సన్, ఆడమ్ జంపా -
Science Facts: మోచేతికి ఏదైనా తగిలితే అందుకే షాక్ కొట్టినట్టు ‘జిల్’ మంటుంది..!
Cubital Tunnel Syndrome: వాస్తవంగా చెప్పాలంటే ఈ సమస్య మనందరికీ తెలిసిందే. చిన్నతనంలో మనమందరమూ అనుభవించిందే. మన తోటి సావాసగాళ్లలో ఉండే ఏ చిలిపి పిల్లలో, లేదా అనుకోకుండా ఎవరైనా ఇతరులో మన మోచేతి దగ్గర ఉండే బొడిపెలాంటి ఎముకను ఠక్కున తాకినప్పుడు క్షణకాలం పాటు మోచేతి నుంచి అరచేతివరకూ ‘జిల్లు’మంటుంది. ముంజేయంతా స్పర్శ కోల్పోయినట్లుగా అవుతుంది. కాసేపటి తర్వాత అదే సర్దుకుని మామూలవుతుంది. అలా కాసేపు మనల్ని అల్లాడించే తిమ్మిరిలాంటి ఈ నొప్పి/బాధకు ‘ఫన్నీ బోన్ పెయిన్’ అన్న పేరుందని మనలో చాలామందికి తెలియదు. ఎందుకీ సమస్య? మోచేతి దగ్గర బొడిపెలా ఉన్న ఎముక పక్కనుంచి ఓ నరం వెళ్తుంటుంది. అది మెదడు నుంచి మొదలై మోచేతి ఎముక దగ్గరనుంచి చేతి వేళ్లలోకి వెళ్లే సర్వైకల్ నరాల్లో ఒకటైన అల్నార్ నర్వ్ అనే నరం. అకస్మాత్తుగా అక్కడ దెబ్బ తగలగానే ఠక్కున మెదడు సిగ్నళ్లు మోచేతి నుంచి అరచేతిలోకి పాకడం వల్ల ఈ ‘ఫన్నీ బోన్ పెయిన్’ కనిపిస్తుంది. అందరిలోనూ క్షణకాలం పాటు ఉన్నప్పటికీ కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. అంటే వాళ్లలో ఇదే తరహా నొప్పి/తిమ్మిరి/స్పర్శ లేకపోవడం అన్న కండిషన్ అదేపనిగా కొనసాగుతుంది. ఇలా జరగడానికి కారణం క్షణకాలం పాటు కాకుండా అక్కడి నరం పూర్తిగా నొక్కుకుపోవడమే. కారణాలు... ఇలా జరగడానికి చాలా కారణాలే ఉంటాయి. ఉదాహరణకు తమ పనుల్లో భాగంగా అదేపనిగా మోచేతిని బల్లమీద ఎప్పుడూ అనించి ఉంచడమూ లేదా నిద్రపోయే సమయంలో ముంజేతిని మడతేసి, దాన్నే తలగడలా భావిస్తూ తల బరువును పూర్తిగా దానిపైనే మోపి నిద్రపోతూ ఉండటం కొందరికి అలవాటు. ఇలా చేసేవాళ్లలో ‘అల్నార్’నరం నొక్కుకుపోతుంది. దాంతో మనమంతా చిన్నప్పుడు తాత్కాలికంగా అనుభవించిన బాధ అదేపనిగా వస్తూనే ఉంటుంది. తగ్గేదెలా? మోచేతులు మడత వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే కొందరిలో ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. ఇక మరికొందరిలో బ్రేసెస్, స్ల్పింట్స్ వంటి ఉపకరణాల సహాయంతో నరంపై బరువు పడకుండా చూడటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలతో నొప్పి తగ్గుతుంది. ఇలాంటి సాధారణ పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలు పనిచేయనప్పుడు కొందరిలో శస్త్రచికిత్స చేసి ‘అల్నార్ నర్వ్’పై పడే ఒత్తిడిని తొలగించాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సర్జరీ చాలా అరుదుగా, చాలా తక్కువ మందికే అవసరమవుతుంది. చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!! -
ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు దూరం
లండన్: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ముందు ఇంగ్లండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మోచేతికి శస్త్రచికిత్స కారణంగా ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నాలుగు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. సర్జరీ కారణంగా జూలై వరకు అతడు జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడే అవకాశం లేదు. గత జనవరి నుంచి గాయాల బారీన పడుతూ వస్తున్న ఆర్చర్ టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మరోసారి గాయపడడంతో టోర్నీ మధ్యలోనే లండన్‌కు వెళ్లిపోయాడు. వైద్యులు అతన్ని పరీక్షించి శస్త్ర చికిత్స నిర్వహించారు. దీంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు ఆర్చర్ దూరమవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్నట్లే కనిపించిన ఆర్చర్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్‌కు గతవారం మోచేతి గాయం మళ్లీ తిరగబెట్టింది. స్పెషలిస్ట్ వైద్యుల సలహా మేరకు ఆర్చర్ శుక్రవారం శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఈసీబీ బుధవారం వెల్లడించింది. కాగా తాజాగా మరోసారి ఆర్చర్ గాయంతో దూరం కానుండడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బగా పరిగణించవచ్చు. కాగా ఆర్చర్ ఇంగ్లండ్ తరపున 13 టెస్టుల్లో 42 వికెట్లు.. 17 వన్డేల్లో 30 వికెట్లు.. 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. చదవండి: ఆర్చర్‌కు తిరగబెట్టిన గాయం... కోచ్ అసహనం -
మోచేతుల నలుపు తగ్గాలంటే
రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసి, పది నిమిషాలు ఉంచాలి.టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి వేడి టవల్‌తో తుడవాలి. రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి.పాల మీగడలో చిటికెడు పసుపు రాసి, నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి. టొమాటో రసం లేదా దానిమ్మ రసం తేనె లేదా నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్ది, శుభ్రపరుచుకుంటే నలుపు సులువుగా తగ్గుతుంది. నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వారానికోసారి స్నానానికి నువ్వుల నూనె ఉపయోగించడం వల్ల చర్మానికి కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్ అంది, మృదువుగా అవుతుంది. -
అందమె ఆనందం
మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖమంతా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మెంతికూరను మెత్తని పేస్టులా రుబ్బి, దాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే నొప్పి తగ్గడమే కాదు, మొటిమలూ అణిగిపోతాయి! మోచేతులు, మోకాళ్లు బిరుసుగా అయ్యి, నల్లబడిపోతాయి. వాటిని మామూలుగా చేయాలంటే... జామపండును మెత్తగా రుబ్బి, అందులో కాసింత నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని బిరుసుగా ఉన్న చోట బాగా రుద్దాలి. రోజుకోసారయినా ఇలా చేస్తే, మంచి ఫలితముంటుంది.