లండన్: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ముందు ఇంగ్లండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మోచేతికి శస్త్రచికిత్స కారణంగా ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నాలుగు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. సర్జరీ కారణంగా జూలై వరకు అతడు జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడే అవకాశం లేదు. గత జనవరి నుంచి గాయాల బారీన పడుతూ వస్తున్న ఆర్చర్ టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మరోసారి గాయపడడంతో టోర్నీ మధ్యలోనే లండన్‌కు వెళ్లిపోయాడు. వైద్యులు అతన్ని పరీక్షించి శస్త్ర చికిత్స నిర్వహించారు. దీంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు ఆర్చర్ దూరమవ్వాల్సి వచ్చింది.
ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్నట్లే కనిపించిన ఆర్చర్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్‌కు గతవారం మోచేతి గాయం మళ్లీ తిరగబెట్టింది. స్పెషలిస్ట్ వైద్యుల సలహా మేరకు ఆర్చర్ శుక్రవారం శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఈసీబీ బుధవారం వెల్లడించింది. కాగా తాజాగా మరోసారి ఆర్చర్ గాయంతో దూరం కానుండడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బగా పరిగణించవచ్చు. కాగా ఆర్చర్ ఇంగ్లండ్ తరపున 13 టెస్టుల్లో 42 వికెట్లు.. 17 వన్డేల్లో 30 వికెట్లు.. 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు.
చదవండి: ఆర్చర్‌కు తిరగబెట్టిన గాయం... కోచ్ అసహనం
Comments
Please login to add a commentAdd a comment