ECB
-
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అల్టిమేటం.. ఐపీఎల్ జట్లకు షాక్
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్లో పాల్గొంటున్న తమ ఆటగాళ్లకు అల్టిమేటం జారీ చేసింది. మే 22లోగా స్వదేశానికి చేరుకోవాలని ఆజ్ఞాపించింది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లండ్ స్వదేశంలో పాక్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టే ఈ సిరీస్‌లో కూడా పాల్గొంటుంది. ఈ సిరీస్ కోసమే ఈసీబీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉండాలని ఆదేశించింది.పాక్‌తో ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి (మే 22) ఐపీఎల్ 2024 సీజన్లో ప్లే ఆఫ్స్ జరుగుతుంటాయి. ఇలాంటి కీలక దశలో ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే సంబంధిత జట్లపై భారీ ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా పాక్‌తో సిరీస్ కోసమని ఐపీఎల్‌కు డుమ్మా కొడితే ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలినట్లే.టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్ఐపీఎల్ 2024లో వివిధ జట్లకు ఆడుతున్న ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టు సభ్యులు..జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్)మొయిన్ అలీ (సీఎస్కే)బెయిర్‌స్టో (పంజాబ్)సామ్ కర్రన్ (పంజాబ్)లివింగ్‌స్టోన్ (పంజాబ్)విల్ జాక్స్ (ఆర్సీబీ)ఫిల్ సాల్ట్ (కేకేఆర్)రీస్ టాప్లే (ఆర్సీబీ)ఐపీఎల్ ప్లే ఆఫ్స్..మే 21: క్వాలిఫయర్-1మే 22: ఎలిమినేటర్మే 24: క్వాలిఫయర్-2మే 26: ఫైనల్ -
'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్ బతికుంటే సంతోషించేవాడు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుటెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆసీస్ రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇక రెండోటెస్టు ఇరుజట్ల మధ్య జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది. అయితే ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో అలీ గాయపడ్డాడు. దీంతో లార్డ్స్ టెస్టుకు మొయిన్ అలీ దూరమయ్యాడు. అయితే అతని స్థానంలో ఎవరు ఊహించని రీతిలో 18 ఏళ్ల కుర్రాడికి ఈసీబీ అవకాశం ఇచ్చింది.లెగ్ స్పిన్నర్ అయిన 18 ఏళ్ల రిహాన్ అహ్మద్‌ను మొయిన్ అలీకి రీప్లేస్‌గా తీసుకోవడం ఆసక్తి కలిగించింది. అయితే ఇదే రిహాన్ అహ్మద్‌కు గతంలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ షేక్‌హ్యాండ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రిహాన్ 13 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గ్రౌండ్లో బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. అతని బౌలింగ్‌ను నిశితంగా పరిశీలించిన షేన్ వార్న్.. కాసేపటికి అతని దగ్గరికి వచ్చి.. ''నిజంగా సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నావ్. నేను అప్పటినుంచి నిన్ను గమనిస్తున్నా. త్వరలోనే నీ గురించి కామెంట్ చేస్తానేమో. 15 ఏళ్ల వయసులోనే నువ్వు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.. అంతేకాదు చిన్న వయసులోనే ఇంగ్లండ్ జట్టులో చోటు సంపాదిస్తావు'' అని చెప్పుకొచ్చాడు. వార్న్ ఆ మాటలు ఏ శుభ ముహుర్తానా అన్నాడో తెలియదు కానీ అదే ఇప్పుడు నిజమయ్యింది. మొయిన్ అలీ స్థానంలో ఎంపికవడం.. అదీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సందర్భంగా ఇది జరగడం రిహాన్ అహ్మద్‌ది అదృష్టం అని చెప్పొచ్చు. ఒకవేళ రెండో టెస్టులో అవకాశం లభించి మంచి ప్రదర్శన ఇస్తే మాత్రం ఇంగ్లండ్ జట్టులో శాశ్వత స్పిన్నర్‌గా పాతుకుపోయే అవకాశం రావొచ్చు. ఇక రిహాన్ అహ్మద్ తన ఎంపికపై స్పందిస్తూ.. ''ఏదో ఒకరోజు ఇంగ్లండ్‌కు ఆడుతానని తెలుసు.. కానీ ఇలా ఎంపికవుతానని ఊహించలేదు. సరిగ్గా ఐదేళ్ల క్రితం దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నన్ను ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు ఇవాళ నిజమయ్యాయి. వార్న్ బతికి ఉంటే తప్పకుండా సంతోషించేవాడు'' అంటూ పేర్కొన్నాడు. The King Shane Warne knew. Rehan Ahmed. pic.twitter.com/pCl6oaXkk3 — M (@anngrypakiistan) June 23, 2023 చదవండి: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!' -
'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో బిజీగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడు మీదున్న ఇంగ్లండ్‌కు.. ఆసీస్ ఓటమి రుచి చూపించి బ్రేకులు వేసింది. అయితే 2021లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-4 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దెబ్బతో అప్పటి టెస్టు కెప్టెన్ జో రూట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా.. బ్యాటింగ్ మెంటార్‌గా ఉన్న గ్రహం థోర్ఫ్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న అష్లే గైల్స్ తమ పదవులను కోల్పోయారు. ఆ తర్వాత రాబ్ కీ అనే వ్యక్తి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి కొత్త డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. కాగా రాబ్ కీ వచ్చీ రావడంతోనే తన మార్క్‌ను చూపించే ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి మెక్కల్లమ్ కంటే ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా పాంటింగ్ తాజాగా రివీల్ చేశాడు. గురిల్లా క్రికెట్పాడ్ కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన పాంటింగ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మెక్కల్లమ్ కంటే ముందు ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి నన్ను ముందు సంప్రదించారు. ఈ విషయంలో రాబ్ కీ కీలకంగా వ్యవహరించాడు. అతనే స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా ఆఫర్ ఇచ్చాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో దానిని తిరస్కరించా. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కోచ్‌గా ఫుల్‌టైమ్ పనిచేయడానికి అప్పటికి నేను మానసికంగా సిద్దం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు కావడం.. అంతర్జాతీయ కోచ్‌గా ఉంటే జట్టుతో పాటు వివిధ దేశాలకు పర్యటించాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని అనుకోలేదు. అందుకే కోచ్ పదవి ఆఫర్‌ను తిరస్కరించాల్సి వచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవి వరించింది. రూట్ స్థానంలో బెన్ స్టోక్స్ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వీరిద్దరు కలిసిన తర్వాత ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ పూర్తిగా మారిపోయింది. బజ్‌బాల్ క్రికెట్‌ను పరిచయం చేసిన ఈ ద్వయం ఇంగ్లండ్‌కు టెస్టుల్లో వరుస విజయాలు కట్టబెట్టారు. ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకున్నాకా ఇంగ్లండ్ టెస్టుల్లో 13 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించడంతో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లపై సిరీస్ విజయాలు సాధించింది. చదవండి: హెచ్‌సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
ఇంగ్లండ్ క్రికెట్లో జేసన్ రాయ్ 'కాంట్రాక్ట్ కలకలం'
ఇంగ్లండ్ క్రికెట్లో జేసన్ రాయ్ కాంట్రాక్ట్ రద్దు వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో తాను ఈసీబీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై రాయ్ స్పందించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈసీబీ కాంట్రాక్ట్ వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపాడు. తాను ఈసీబీతో కేవలం ఇంక్రిమెంటల్ కాంట్రాక్ట్ (షెడ్యూల్ లేని సమయానికి డబ్బు వదులుకోవడం) మాత్రమే వదులుకున్నట్లు వివరణ ఇచ్చాడు. ఈసీబీతో తన కాంట్రాక్ట్ యధాతథంగా కొనసాగుతుందని, ఇంగ్లండ్ షెడ్యూల్ లేని సమయంలో తాను మేజర్ లీగ్ క్రికెట్లో ఆడేందుకు ఈసీబీ అధికారులు కూడా అనుమతిచ్చారని, ఈ కాలానికి తనకు ఈసీబీ నుంచి ఎలాంటి రెమ్యూనరేషన్ దక్కదని ఇన్‌స్టా వేదికగా క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సింగిల్ ఫార్మాట్ ప్లేయర్‌గా అసలు తనకు ఈసీబీతో సెంట్రల్ కాంట్రాక్టే లేదని వెల్లడించాడు. కాగా, అమెరికా వేదికగా జూలై 13 నుంచి జూలై 30 వరకు జరిగే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు జేసన్ రాయ్ ఈసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకుంటున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌తో రాయ్ రెండేళ్లకు గాను రూ. 36.8 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కథనాలు ప్రసారమయ్యాయి. ఇదిలా ఉంటే, 33 ఏళ్ల జేసన్ రాయ్‌ను ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ 2 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 మధ్యలో కేకేఆర్ టీమ్‌లో చేరిన రాయ్.. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 151కి పైగా స్ట్రయిక్ రేట్‌తో 285 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. చదవండి: ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే ఏం చేయలేకపోయాడు.. అక్కడికి వెళ్లగానే..? -
'కెరీర్‌ను తలకిందులు చేసింది.. మళ్లీ నడుస్తాననుకోలేదు'
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో గతేడాది ఆగస్టులో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. గోల్ఫ్ ఆడే క్రమంలో స్టిక్ కాలికి బలంగా తగలడంతో బెయిర్ స్టోకు తీవ్ర గాయాలయ్యాయి. కాలికి సర్జరీ అనంతరం ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. ఈ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ మినీ వేలంలో బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది. తాజాగా గాయం నుంచి కోలుకున్న బెయిర్ స్టోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వచ్చే నెలలో ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ఎంపికచేసింది. నిజానికి బెయిర్ స్టో గాయపడే సమయానికి కెరీర్లో పీక్ ఫామ్‌లో ఉన్నాడు. తనను మళ్లీ జట్టులోకి ఎంపిక చేయడంపై బెయిర్ స్టో స్పందించాడు. ఏదో కాలక్షేపం కోసం ఆడిన గోల్ఫ్ తన కెరీర్‌ను తలకిందులు చేసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. '' నిజానికి మళ్లీ నడుస్తాననుకోలేదు.. ఎందుకంటే కాలికి గోల్ఫ్ స్టిక్ బలంగా తగిలింది. ఇక జీవితంలో జాగ్ చేయడం, నడవడం, పరిగెత్తడం చేయలేకపోవచ్చనుకున్నా. ఈ దెబ్బతో క్రికెట్‌కు దూరమైనట్లేనని భావించా. గాయం నుంచి కోలుకునే సమయంలో నా మైండ్‌లో అన్ని ఇవే ఆలోచనలు. కానీ మన ఆలోచనలే సగం భయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్‌గా ఆలోచిస్తావో నీలోని ఆందోళన మొత్తం తొలిగిపోతుంది అని డాక్టర్లు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వారి సూచనలను సీరియస్‌గా తీసుకొని వర్కౌట్స్ చేశా. వంద శాతం ఫలితం వచ్చింది. కానీ ఇంతకముందులా మైదానంలో పరుగులు తీయగలనా.. ఫీల్డింగ్ చేయగలనా అనే సందేహం ఉండేది. కానీ ఫిట్నెస్ పరంగా తీసుకున్న జాగ్రత్త చర్యలు నాలోని భయాన్ని మొత్తం పోగొట్టాయి.'' అంటూ తెలిపాడు. చదవండి: #RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు -
17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్
పాకిస్తాన్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు ఆదివారం తెల్లవారుజామున పాక్ గడ్డపై అడుగుపెట్టింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ పాక్‌లో టెస్టు సిరీస్ ఆడేందుకు రావడం ఆసక్తిగా మారింది. చివరగా 2005లో పాకిస్తాన్లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆడింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ ట్విటర్లో ఇంగ్లండ్ టెస్టు బృందం పాకిస్తాన్లో ల్యాండ్ అయింది.. సిరీస్ ఆడడమే తరువాయి అని క్యాప్షన్ జత చేసి వీడియో రిలీజ్ చేసింది. అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడేందుకు వచ్చింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 4-3 తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత వరల్డ్‌కప్ ఉండడంతో మళ్లీ ఇరుజట్లు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. టి20 వరల్డ్‌కప్ ముగిసిన అనంరతం ముందుగా అనుకున్న ప్రకారమే బెన్ స్టోక్స్ సేన పాకిస్తాన్లో అడుగుపెట్టింది. డిసెంబర్ 1 నుంచి రావల్పిండిలో తొలి టెస్టు జరగనుంది. ఆ తర్వాత ముల్తాన్ వేదికగా(డిసెంబర్ 9 నుంచి 13 వరకు) రెండో టెస్టు, కరాచీ వేదికగా డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడో టెస్టు జరగనుంది. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ ఏడో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌లో విజేతగా నిలిచిన జట్టు టాప్-4కు చేరుకునే అవకాశం ఉంది. ఇక టి20 ప్రపంచకప్‌లో గాయంతో దూరమైన మార్క్ వుడ్ పాక్‌తో టెస్టు సిరీస్ ఆడేది అనుమానంగా ఉంది. వాస్తవానికి ఇంగ్లండ్ జట్టు గతేడాదే పాకిస్తాన్లో టెస్టు సిరీస్ ఆడాల్సింది. కానీ కివీస్ సెక్యూరిటీ కారణాలతో సిరీస్‌ను రద్దు చేసుకోవడంతో ఇంగ్లండ్ పాక్ రావడానికి సంశయించింది. అయితే ఏడాది వ్యవధిలో పాకిస్తాన్లో కొంత పరిస్థితి మెరుగవడంతో ఇంగ్లండ్ ఆడడానికి ఒప్పుకుంది. Touchdown in Pakistan for our Men’s Test squad! 🇵🇰 pic.twitter.com/2GbRr1Xcw1 — England Cricket (@englandcricket) November 26, 2022 చదవండి: మారడోనా సరసన మెస్సీ.. కళ్లు చెదిరే గోల్ చూడాల్సిందే 'కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే' -
'తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'.. దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్ చార్లీ డీన్ ను రనౌట్ (మన్కడింగ్)చేసిన విషయం తెలిసిందే. మన్కడింగ్ చట్టబద్ధం చేసినప్పటికి.. ఇంగ్లీష్ మీడియా సహా అక్కడి క్రికెటర్లు మాత్రం దీప్తి శర్మ ఏదో పెద్ద నేరం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. క్రికెట్ చట్టాల్లో ఈ నిబంధన ఉన్నా ఇలా ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ తమ వెర్రితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఒక్క ట్వీట్‌తో ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లు,విశ్లేషకులు,విమర్శకుల నోళ్లు మూయించాడు. తాజాగా షేర్ చేసిన వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియాకు సంబంధించిన ఓ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియా..తన ముందున్న వారిని దాటేయడానికి గాను సైకిల్‌ను వేగంగా తొక్కి తర్వాత తన బాడీని సీట్ మీద ఫ్లాంక్ పొజిషన్ లో ఉంచుతాడు.దీంతో సైకిల్.. తన ముందున్న సైకిళ్లను దాటేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ వీడియోను జాఫర్ రీట్వీట్ చేస్తూ.. ''ఇది (గరియా చేసిన పని) వాస్తవానికి చట్టబద్దమైనదే కావచ్చు. నిబంధనల్లో ఉండొచ్చు. కానీ ఇది సైక్లింగ్ స్ఫూర్తికి విరుద్ధం.. అని ఇ ఓ ఇంగ్లీష్ సైక్లిస్టు చెప్పాడు.తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'' అని రాసుకొచ్చాడు. పేరు చెప్పకపోయినా జాఫర్ ట్వీట్ ద్వారా ఇంగ్లీష్ మీడియా,క్రికెటర్ల వ్యాఖ్యలకు కౌంటరిచ్చినట్టేనని స్పష్టమవుతున్నది. Italian cyclist Michael Guerra uses his knowledge of physics and aerodynamics to adopt a “plank” position and overtake his competitors. pic.twitter.com/EsRt16l2PT — Ian Fraser (@Ian_Fraser) September 27, 2022 Deepti Sharma nailed id today on field 😄 what she did it was heart breaking feeling for England . Superb #DeeptiSharma . Gore ko unki line se bahar jaane ki saja 😄🤣#ENGvsIND #womenscricket #JhulanGoswami #ODI pic.twitter.com/NKnoHhfRQD — Vishoka M🇮🇳 (@Vishokha) September 24, 2022 చదవండి: ధోని కొత్త అవతారం.. వీడియో వైరల్ -
IND Vs PAK: ఈసీబీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన బీసీసీఐ!
క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఎనలేని క్రేజ్ ఉంటుదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఐసీసీ, ఆసియా కప్ లాంటి మేజర్ టోర్నీల్లో తప్ప పెద్దగా మ్యాచ్‌లు ఆడలేదు. అందుకే భారత్, పాక్ మ్యాచ్‌కు అంత క్రేజ్ ఉంటుంది. ఇక అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌లో ఈ చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడనున్నాయి. ఆ మ్యాచ్ కోసం ఇరుదేశాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా టీమిండియా, పాకిస్తాన్‌లు ఒప్పుకుంటే మా దేశంలో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు సిద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే ఈసీబీ ప్రతిపాధించింది వన్డేలు, టీ20లు కాదు. ఐదు రోజుల పాటు జరిగే టెస్టు సిరీస్ కోసం. బీసీసీఐ, పీసీబీ ఒప్పుకుంటే తమ దేశంలో ఇండియా-పాక్ లతో మూడు టెస్టులు ఆడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీబీ ప్రతిపాదించింది. కానీ ఈసీబీ ప్రతిపాదనను ఇరు దేశాల బోర్డులు తిరస్కరించినట్టు సమాచారం. తటస్థ వేదికపై ఇండియా-పాక్ టెస్టు మ్యాచ్ లు జరిపించాలన్న ఆలోచన తమకు లేదని.. ఆడితే ఇండియాలో అయినా లేదంటే పాకిస్తాన్ లో ఓకే గానీ టెస్టులను కూడా ఇతర దేశాలలో తాము ఆడబోమని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తున్నది. ఇక సుమారు 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి తర్వాత సుమారు పదేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు లేక అల్లాడిన పాకిస్తాన్ కు ఇప్పుడిప్పుడే విదేశీ జట్లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా రాగా ఇప్పుడు ఇంగ్లండ్ పాక్ పర్యటనకు వచ్చింది. టి20 సిరీస్ ముగిశాక డిసెంబర్లో ఇంగ్లండ్ టెస్టులు ఆడేందుకు మరోసారి పాక్‌కు రానుంది. ఈ సిరీస్ చర్చ సందర్బంగానే ఈసీబీ పీసీబీ ఎదుట ప్రతిపాదనను తెచ్చినట్టు సమాచారం. ఇంగ్లండ్‌లో దక్షిణాసియా వాసులు అధికంగా ఉన్నారని.. తద్వారా అక్కడ ఇండియా-పాకిస్తాన్ టెస్టు సిరీస్ సూపర్ హిట్ అవుతుందని ఈసీబీ భావిస్తున్నది. మరోవైపు బీసీసీఐ కూడా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ''ఇండియా-పాక్ సిరీస్ గురించి ఈసీబీ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు అంటే అది బీసీసీఐ పరిధిలో లేదు. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇప్పటివరకైతే ఇండో-పాక్ ద్వైపాక్షిక సిరీస్ గురించి మా వైఖరిలో మార్పు లేదు. పాకిస్తాన్‌తో ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రమే ఆడతాం'' అని కుండబద్దలు కొట్టాడు. భారత్-పాకిస్తాన్ లు చివరిసారిగా 2007లో టెస్టు సిరీస్ ఆడాయి. ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ రెండు దేశాల మధ్య దూరం నానాటికీ పెరుగుతున్నది. -
ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు..
రాబోయే టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై సుధీర్ఘ టి20 సిరీస్ ఆడనుంది. గురువారం రాత్రి పాకిస్తాన్‌కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఇది మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడనుంది. ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ బట్లర్ సహా ఇతర ఆటగాళ్లకు పాకిస్తాన్లో ఒక్క మ్యాచ్ ఆడిన అనుభవం లేదు. అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ డాసన్ లాంటి ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడడం ద్వారా పాక్ పిచ్‌లపై కాస్త అవగాహన ఉంది. అయితే గాయంతో బాధపడుతున్న కెప్టెన్ జాస్ట్ బట్లర్ సిరీస్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. పాకిస్తాన్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. పాక్‌లోని చాలా ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ క్రికెటర్లు పెద్ద మనసు చాటుకున్నారు. ఇదే విషయమై కెప్టెన్ జాస్ బట్లర్ మాట్లాడుతూ..'' పాకిస్తాన్ ప్రస్తుతం భారీ వరదలతో అతలాకుతలమైంది. ఇలాంటి క్లిష్ట సమయంలో మేము పాక్ గడ్డపై సిరీస్ ఆడేందుకు వచ్చాం. ఒక జట్టుగా గెలుపోటములు పక్కనబెడితే.. మ్యాచ్‌కు సంబంధించిన డొనేషన్స్‌ను వరద బాధితులకు అందేలా చూస్తాం. ఇందుకోసం ఈసీబీతో ఇప్పటికే మాట్లాడాము. ఈసీబీ కూడా మా వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని పెద్ద మొత్తంలో సాయం చేడయానికి ముందుకు రానుంది. క్రికెట్లో ఇలాంటి స్నేహపూరిత వాతావరణం ఉండడం చాలా మంచిది. ఇక ఇరుజట్ల మధ్య జరగనున్న టి20 సిరీస్.. వరద నష్టాల నుంచి పాక్ ప్రజలకు, అక్కడి అభిమానులకు మంచి ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో లంక చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో గెలిచి టి20 ప్రపంచకప్‌కు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ విజయం అనంతరం పాక్ గడ్డపై అడుగుపెట్టింది. చదవండి: 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా' -
చాప్టర్ క్లోజ్ అనుకున్న తరుణంలో హార్డ్ హిట్టర్‌కు జాక్‌పాట్..
ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్‌కు జాక్‌పాట్ తగిలింది. జట్టుకు దూరమై మూడేళ్లు కావొస్తుండడంతో ఇక చోటు కష్టమే అనుకుంటున్న తరుణంలో అలెక్స్ హేల్స్‌కు ఈసీబీ నుంచి పిలుపొచ్చింది. అక్టోబర్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌కు ఈసీబీ.. గాయంతో దూరమైన జానీ బెయిర్ స్టో స్థానంలో అలెక్స్ హేల్స్‌ను ఎంపిక చేసింది. టి20 ప్రపంచకప్‌తో పాటు మెగాటోర్నీకి ముందు పాకిస్తాన్‌తో ఆడనున్న ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు కూడా హేల్స్‌కు చోటు దక్కింది. కాగా పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 20, 22, 23, 25, 28, 30, అక్టోబర్ 2వ తేదీన ఇంగ్లండ్ ఏడు టి20లు ఆడనుంది. ఇక ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ఇక అలెక్స్ హేల్స్ 2019లో ఇంగ్లండ్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా హార్డ్ హిట్టర్ జానీ బెయిర్ స్టో అనూహ్యంగా గాయంతో వైదొలగడంతో అలెక్స్ హేల్స్ మూడేళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు తలుపులు తెరుచుకున్నాయి. ఇక బెయిర్ స్టో ఇటీవలే గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. గోల్ఫ్ ఆడుతున్న తరుణంలో మోకాలు కింది భాగంలో తీవ్ర గాయం కావడంతో పాకిస్తాన్ సిరీస్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు చివరి నిమిషంలో దూరమయ్యాడు. ఈ మధ్య కాలంలో అలెక్స్ హేల్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 33 ఏళ్ల హేల్స్ ఇటీవలే జరిగిన హండ్రెడ్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్‌లో ఒకడిగా ఉన్నాడు. 2020 నుంచి చూసుకుంటే అలెక్స్ హేల్స్ టి20ల్లో 111 ఇన్నింగ్స్‌లో 3376 పరుగులు సాధించాడు. అతని కంటే ముందు పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్ 3435 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక టి20 క్రికెట్లో 10వేల పరుగుల మార్క్‌ను అందుకున్న క్రికెటర్ల జాబితాలో అలెక్స్ హేల్స్ చోటు దక్కించుకోవడం విశేషం. ఇక హేల్స్ ఇంగ్లండ్ తరపున 60 టి20ల్లో 1644 పరుగులు, 70 వన్డేల్లో 2419 పరుగులు, 11 టెస్టుల్లో 573 పరుగులు సాధించాడు. Alex Hales has also been added to our squads for the #T20WorldCup and IT20 tour of Pakistan 🏏 — England Cricket (@englandcricket) September 7, 2022 చదవండి: పాక్ కెప్టెన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్ Nick Kyrgios: వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు! -
జట్టును ప్రకటించి 24 గంటలు కాలేదు.. టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ స్టార్ దూరం
అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) శుక్రవారం 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. కాగా జట్టును ప్రకటించి 24 గంటలు గడవకముందే ఇంగ్లండ్‌కు బిగ్‌షాక్ తగిలింది. విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో అనూహ్య రీతిలో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ''బెయిర్ స్టో దూరమవడం మా దురదృష్టం. శుక్రవారం లీడ్స్‌లో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో కాలి కింది భాగంలో తీవ్ర గాయమైంది.దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. బెయిర్ స్టోను పరిశీలించిన వైద్యులు సర్జరీ అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు'' అని ఈసీబీ పేర్కొంది. కాగా ఓవల్ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు బెయిర్ స్టో స్థానంలో బెన్ డకెట్‌ను ఎంపిక చేశారు. అయితే టి20 ప్రపంచకప్‌కు మాత్రం బెయిర్ స్టో స్థానంలో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. కాగా బెయిర్ స్టో తన గాయంపై స్పందించాడు. ''ఇవాళ ఉదయం గోల్ఫ్ కోర్సులో గేమ్ ఆడుతుండగా జారి పడ్డాను. దీంతో కాలి కింది భాగంలో గాయం కావడంతో వైద్యులు సర్జరీ అవసరమన్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు దూరం కావడం బాధిస్తోంది. నేను ఆడకపోయినప్పటికి మా కుర్రాళ్లకు ఆల్ ది బెస్ట్'' అని చెప్పుకొచ్చాడు. ఇక టి20 ప్రపంచకప్‌కు ఈసీబీ ప్రకటించిన జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల జట్టుకు పిలుపు రాగా.. జేసన్ రాయ్‌కు మొండిచేయి ఎదురైంది. తాజాగా గాయంతో బెయిర్ స్టో కూడా దూరమయ్యాడు. కాగా రాయ్ ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున ఆడిన 11 టీ20 మ్యాచ్‌లలో మొత్తంగా 206 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 22న అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో మెగా ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2022కు ఈసీబీ ప్రకటించిన ఇంగ్లండ్ జట్టు : జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!' KL Rahul: 'మరో రెండు మ్యాచ్‌లు చూస్తారు.. తర్వాత తీసేయడమే' -
సొంత బోర్డు షాకివ్వడంతో.. ఇబ్బందుల్లో ఇంగ్లండ్ క్రికెటర్
ఇంగ్లండ్ క్రికెటర్ ఆడమ్ లిత్‌కు ఈసీబీ షాక్ ఇచ్చింది. ఇకపై ఈసీబీ పరిధిలో జరిగే ఏ మ్యాచ్‌లోనూ ఆడమ్ లిత్ బౌలింగ్ వేయకుండా అతనిపై నిషేధం విధించింది. అతని బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. జూలై 16న విటాలీటి బ్లాస్ట్‌లో భాగంగా లంకాషైర్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడమ్ లిత్ ఒకే ఓవర్ బౌలింగ్ చేసి 15 పరుగులిచ్చాడు. ఆ మ్యాచ్‌కు ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఉన్న డేవిడ్ మిల్న్స్, నీల్ మాలెండర్లు ఆడమ్ లిత్ బౌలింగ్ యాక్షన్‌పై అభ్యంతరం చెప్పారు. లిత్ యొక్క బౌలింగ్ యాంగిల్లో చేయి 15-డిగ్రీల థ్రెషోల్డ్ మార్క్‌ను అధిగమించినట్లుగా కనిపించిదని పేర్కొన్నారు.అంపైర్ల ఫిర్యాదుతో లాఫ్‌బరో యునివర్సిటీలోని గ్రౌండ్లో ఆడమ్ లిత్ బౌలింగ్‌పై ఈసీబీ అధికారులు అసెస్మెంట్ నిర్వహించారు. బౌలింగ్ యాక్షన్ కాస్త తేడాతా అనిపించడంతో ఈసీబీ రెగ్యులేషన్ టీంకు పంపించారు. వారి నివేదిక వచ్చిన అనంతరం.. మరోసారి బౌలింగ్ రీ-అసెస్మెంట్ నిర్వహించే వరకు ఆడమ్ లిత్ బౌలింగపై నిషేధం కొనసాగుతుంది. దీంతో ప్రస్తుతం హండ్రెడ్ టోర్నమెంట్లో ఆడుతున్న ఆడమ్ లిత్ బౌలింగ్ వేయకూడదని ఉత్తర్వులు వచ్చాయి. కాగా ఆడమ్ లిత్ హండ్రెడ్ టోర్నమెంట్లో నార్తన్ సూపర్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం టోర్నీలో మూడు మ్యాచ్‌లు కలిపి 132 పరుగులు చేసిన ఆడమ్ లిత్ టాప్ స్కోరర్‌గా కొనసాగతున్నాడు. ఇక అంతకముందు యార్క్‌షైర్ తరపున కౌంటీ సీజన్లో పాల్గొన్న ఆడమ్ లిత్ 10 మ్యాచ్‌లు కలిపి 608 పరుగులు చేశాడు. అంంతేకాదు విటాలిటీ బ్లాస్ట్ 2022 టోర్నమెంట్లోనూ ఆడమ్ లిత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 16 మ్యాచ్‌లాడి 177 స్ట్రైక్‌రేట్‌తో 525 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో ఏడు టెస్టులు ఆడిన ఆడమ్ లిత్ 265 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ ఉంది. చదవండి: ఏడుసార్లు గెలిచి చరిత్రకెక్కాడు.. ఈసారి మాత్రం అవమానం! CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా.. -
భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు
టీమిండియా మాజీ పేసర్ రుద్రప్రతాప్ సింగ్ (సీనియర్) కుమారుడు హ్యారీ సింగ్ ఇంగ్లండ్ తరపున అండర్-19 క్రికెట్ ఆడనున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న ద్వైపాక్షిక అండర్-19 సిరీస్‌కు హ్యారీ సింగ్ ఎంపికయ్యాడు. కొన్నాళ్ల నుంచి హ్యారీ సింగ్తన బ్యాటింగ్‌తో అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అండర్-19లో రాణిస్తే.. సీనియర్ ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉండడంతో హారి సింగ్‌కు ఇది కీలకం కానుంది. కాగా హ్యారీ సింగ్ లంకాషైర్ జూనియర్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. కాగా అండర్-19కు ఎంపికైన తన కుమారుడిపై సీనియర్ ఆర్పీ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెక్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..'' కొద్ది రోజుల క్రితం, ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు హ్యారీని ఎంపిక చేసినట్లు ఈసీబీ నుంచి కాల్ వచ్చింది. శ్రీలంక అండర్-19 జట్టుతో స్వదేశంలోనే ఈ సిరీస్ ఆడనుంది. అయితే హారీ ఎంపిక అంత సులభంగా కాలేదు. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కొంచెం అదృష్టంతో పాటు పరుగులు చేయడం కూడా అవసరం. 90వ దశకంలో మన భారత్‌లో దేశవాళీ క్రికెట్లో బాగా రాణిస్తున్న చాలా మంది క్రికెటర్లను చూశాను. కానీ వారు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఘోరంగా విఫలమయ్యారు. హ్యారీ ఎదుగుతున్న కొద్దీ.. ప్రతి క్రికెటర్ చేసే టెక్నికల్ సర్దుబాట్లను చేయడానికి కష్టపడాల్సి వచ్చింది.'' అని పేర్కొన్నాడు. కూతురు, కుమారుడితో మాజీ క్రికెటర్ రుద్రప్రతాప్ సింగ్ సీనియర్ ఇక లక్నోకు చెందిన సీనియర్ రుద్రప్రతాప్ సింగ్(ఆర్పీ సింగ్) 1986లో టీమిండియా తరపున ఆస్ట్రేలియాతో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కేవలం రెండు వన్డే మ్యాచ్‌ల్లో మాత్రమే అతను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కపిల్‌దేవ్ కెప్టెన్సీలోనే ఆర్పీ సింగ్ ఈ రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇక దేశవాలీ క్రికెట్లో ఉత్తర్ ప్రదేశ్‌కు ఆడిన ఆర్పీ సింగ్ 59 ఫస్ట్‌క్లాస్, 21 లిస్ట్ -ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఆర్పీ సింగ్ బ్రిటన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి లండన్‌లోనే సెటిలయ్యాడు. కాగా ఆర్పీ సింగ్ కూతురు కూడా మెడిసిన్ చదవడానికి ముందు లంకాషైర్ తరపున అండర్-19 క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించింది. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. సీనియర్ ఆర్పీ సింగ్ అరంగేట్రం చేసిన 19 ఏళ్లకు.. అంటే 2005లో టీమిండియా తరపున మరో ఆర్పీ సింగ్(రుద్రప్రతాప్ సింగ్) అరంగేట్రం చేశాడు. ఇతనికి కూడా ఉత్తర్‌ప్రదేశ్ కావడంతో.. సీనియర్ ఆర్పీ సింగ్‌కు బంధువు అని చాలా మంది అనుకున్నారు. కానీ సీనియర్ ఆర్పీ సింగ్‌తో.. జూనియర్ ఆర్పీ సింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇక జూనియర్ ఆర్పీ సింగ్ టీమిండియా తరపున 2005-2011 వరకు బౌలింగ్‌లో ఆర్పీ సింగ్ కీలకపాత్ర పోషించాడు. టీమిండియా గెలిచిన 2007 టి20 వరల్డ్‌కప్ జట్టులో ఆర్పీ సింగ్ సభ్యుడు. అంతేకాదు ఆ టోర్నీలో రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. 2018లో ఆర్పీ సింగ్ అన్ని ఫార్మాట్లు సహా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: Asia Cup 2022: టీమిండియా వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి! Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాక్‌లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..! -
పంత్‌కు సపోర్టు.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు దినేశ్ కార్తీక్ కౌంటర్
భారత జట్టుపై కొందరు ఇంగ్లీష్ క్రికెటర్లు ప్రతీసారి ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్లేయర్లను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తారు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసింది. దీంతో, టీం ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, ఇంగ్లాండ్- టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 84 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక, భారత జట్టు 98 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన దశలో టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు. భారత జట్టు స్కోర్ బోర్డును జడేజాతో కలిసి ముందుకు తీసుకెళ్లాడు. కాగా, పంత్ 146 పరుగుల వద్ద జో రూట్ బౌలింగ్‌లో అవుట్ అయిన విషయం తెలిసిందే. ఇక, మొదటి రోజు మ్యాచ్ హైలెట్స్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యూట్యూబ్‌లో పెట్టింది. కానీ, దానికి టైటిల్.. మాత్రం ఇంగ్లాండ్ జట్టును పొడుగుతున్నట్టుగా రాసుకొచ్చింది. రిషబ్ పంత్‌ను ఔట్ చేసిన రూట్ అని ఇచ్చింది. ఇక ఈ టైటిల్‌ను చూసిన దినేష్ కార్తీక్.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై సెటైర్స్ వేశాడు. కార్తీక్ ట్విట్టర్ వేదికగా.. ‘‘రిషబ్ పంత్ అటువంటి ఆకట్టుకునే అద్భుతమైన బ్యాటింగ్ చేసిన తర్వాత.. ఇంగ్లాండ్ బోర్డు ఇంతకంటే మంచి టైటిల్ పెట్టవచ్చు. కానీ, రెండు జట్లు ఇంత మంచి క్రికెట్ ఆడిన తర్వాత కూడా ఇంగ్లాండ్ బోర్డుకు మంచి టైటిల్ రానట్లుంది” అని రాసుకొచ్చాడు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అనంతరం.. ఎవరు మంచి ప్రదర్శ చేస్తారో వార పేరునే టైటిల్స్ పెడతారు. కానీ, ఈసీబీ మాత్రం అలా చేయకపోవడంతో దినేశ్ కార్తీక్ ఇలా కౌంటర్ అటాక్ ఇచ్చాడు. After such an engrossing, enthralling days play, I'm sure the headline can be much better and apt than this @ECB_cricket That knock by @RishabhPant17 land the quality of test cricket played by both sides were as good as it can be and this is how you sum up a day 🤔#ENGvIND pic.twitter.com/T51tBycL6W — DK (@DineshKarthik) July 2, 2022 ఇది కూడా చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే బ్రాడ్ అత్యంత చెత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..! -
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు.. టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్
బర్మింగహమ్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్ సహా ఉపఖండం అభిమానుల కొరకు మ్యాచ్‌ను అరగంట ముందుగా ప్రారంభించనున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి జూలై 1న టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు భారత కాలామాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకి( ఇంగ్లండ్ లోకల్ టైం ఉదయం 11 గంటలు) ప్రారంభం కావాల్సి ఉంది. తాజాగా ఈసీబీ మ్యాచ్ సమయాన్ని అరగంట ముందుకు మార్చింది. దీని ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు(లోకల్ టైం ఉదయం 10:30 గంటలు) ప్రారంభమై రాత్రి 10 లేదా 10:30 గంటల వరకు జరగనుంది. ఐదు రోజుల పాటు జరగనున్న టెస్టు మ్యాచ్‌లో రోజు 90 ఓవర్లు ఆట సాధ్యమయ్యేలా ఈసీబీ ప్రణాళికలు రచించిందిఇక టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జూలై 7, 9,10 తేదీల్లో మూడు టి20లు.. ఆ తర్వాత జూలై 12,14, 17వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. కాగా రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆదివారం ఉదయం బీసీసీఐ ట్విటర్లో తెలిపింది. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన రోహిత్.. ఆర్‌టీపీసీఆర్‌లోనే పాజిటివ్ వస్తే వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి వస్తుంది. దీంతో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పంత్ లేదా కోహ్లి, రహానేలలో ఎవరో ఒకరు తుది జట్టును నడిపించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: రోహిత్ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్ కాదనుకుంటే రహానే? IND vs LEIC: షమీని ఎదుర్కోలేక జట్టు మారిన పుజారా.. -
ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం.. అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ జిమ్ పార్క్స్(90) బుధవారం కన్నుమూశాడు. అతను మృతి చెందే నాటికి ఇంగ్లండ్ తరపున అత్యంత వృద్ధ టెస్టు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. జిమ్ పార్క్స్ అనారోగ్య కారణాలతో బాధపడుతూ గత వారం ఇంగ్లండ్‌లోని వార్తింగ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కాగా ఇవాళ ఉదయం చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. జిమ్ పార్క్స్ మృతి విషయాన్ని ససెక్స్ వెల్లడించింది. 'జిమ్ పార్క్స్ మరణ వార్త మమ్మల్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. తన కెరీర్లో కౌంటీల్లో ససెక్స్ తరపున ఎక్కువకాలం ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్ క్రికెట్‌కు అతను అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆ మృతి పట్ల ప్రగాడ సానభూతి ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.' అంటూ తెలిపింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కూడా జిమ్ పార్క్స్ మృతిపై సంతాపం తెలిపింది. ''నిజంగా చాలా విషాదకరమైన వార్త. అతనో గుర్తుంచుకోదగ్గ ఆటగాడు. ససెక్స్, సోమర్సెట్, ఇంగ్లండ్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. జిమ్ పార్క్స్ కుటుంబసభ్యులకు, మిత్రులకు మా ప్రగాడ సానభూతి'' ఇక జిమ్ పార్క్స్ 1954 నుంచి 1968 మధ్య కాలంలో ఇంగ్లండ్ తరపున 46 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 2వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్ అయినప్పటికి లోయర్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే జిమ్ పార్క్ తాను చేసిన రెండు సెంచరీలు 8వ స్థానంలో రావడం విశేషం. 1959/60 ఏడాదిలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 101 నాటౌట్, అలాగే అదే ఏడాది డర్బన్ వేదికగా సౌతాఫ్రికాపై 108 పరుగులు నాటౌట్‌తో జిమ్ పార్క్స్ గుర్తింపు పొందాడు. ఇక 1931లో జన్మించిన జిమ్ పార్క్స్ 18 ఏళ్ల వయసులో ససెక్స్ తరపున కౌంటీల్లో అరంగేట్రం చేసిన పార్క్స్.. ససెక్స్, సోమర్సెట్ తరపున 739 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 132 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. బ్యాట్స్‌మన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికి అప్పటి కోచ్‌ల ప్రోత్సాహంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అవతారంలోకి మారాడు. అయితే వికెట్ కీపర్ కంటే బ్యాట్స్‌మన్‌గానే తాను ఎక్కువగా ఇష్టపడతానని జిమ్ పార్క్స్ చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం -
చారిత్రక లార్డ్స్ స్టేడియానికి అవమానం.. 'వినడానికి ఇబ్బందిగా ఉంది'
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ స్టేడియానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్‌లో లార్డ్స్ స్టేడియానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంగ్లండ్‌లో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు, మేజర్ టోర్నీలు జరిగినా ఫైనల్ మ్యాచ్ మాత్రం లార్డ్స్ స్టేడియంలోనే నిర్వహించడం ఆనవాయితీ. లార్డ్స్ బాల్కనీ నుంచి కప్‌ను అందుకోవడం ప్రతీ జట్టు కెప్టెన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. లార్డ్స్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే పూర్తి సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతుంటారు. అది టెస్టు.. వన్డే.. టి20 ఏదైనా సరే వంద శాతం ప్రేక్షకులు ఉంటారు. అలాంటి పేరున్న లార్డ్స్ స్టేడియానికి మొదటిసారి అవమానం జరిగింది. జూన్ 2న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలిసారి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టెస్టుకు మాత్రం చాలా టికెట్స్ మిగిలిపోయాయి. దీనికి కారణం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) టికెట్స్ ధరలు పెంచడమేనంట. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. లార్డ్స్ టెస్టు తొలి నాలుగు రోజులకు 20వేల టికెట్లు మిగిలిపోయినట్లు సమాచారం. బార్మీ ఆర్మీ పేర్కొన్న ప్రకారం ఒక టికెట్‌పై 100 పౌండ్ల నుంచి 160 పౌండ్ల దాకా పెంచడంతో క్రికెట్ ఫ్యాన్స్ టికెట్స్ కొనుగోలు చేయడంపై వెనక్కి తగ్గారు. ఒక టెస్టు మ్యాచ్‌కు అంత టికెట్ ధర ఉంటే ఎలా కొంటామని.. దీనికంటే ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడడం బెటర్ అని చాలామంది ఫ్యాన్స్ వాపోయారు. సోమవారం సాయంత్రం వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం.. తొలి రోజున 1800 టికెట్లు, రెండో రోజుకు 2500 టికెట్లు, మూడోరోజుకు 4600 టికెట్లు, నాలుగో రోజుకు 9600 టికెట్లు మిగిలే ఉన్నాయని తేలింది. ఇక జో రూట్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాకా.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం.. కొత్త కోచ్ రావడంతో ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ఫుల్‌క్రేజ్ వచ్చింది. కాగా లార్డ్స్ స్టేడియంలో టికెట్ల రేట్లు పెంపుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఈసీబీని ట్విటర్ వేదికగా ఎండగట్టాడు. ''చారిత్రాక లార్డ్స్ మైదానానికి ఇది పెద్ద అవమానం. లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ జరుగుతుందంటే తొలిరోజు పూర్తిస్థాయిలో స్టేడియం నిండుతుంది. కానీ తొలిసారి స్టేడియం ఫుల్ కావడం లేదు. ఇది భరించలేకుండా ఉంది. ఒక్కసారిగా టికెట్స్ ధరలు అంత పెంచడంపై ఈసీబీ మర్మమేంటో అర్థం కావడం లేదు. ఒక్క టికెట్‌పై 100 నుంచి 160 పౌండ్లు పెంచడమేంటి.. అంత ధర ఎందుకు? ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి. వారి పేరెంట్స్‌తో కలిసి మ్యాచ్ చూడాలని స్టేడియాలకు వస్తుంటారు. కాబట్టి అమ్ముడపోని టికెట్స్‌ను పిల్లల కోసం ప్రత్యేకంగా టికెట్ ధరను 40 పౌండ్లుగా నిర్ణయించి స్టేడియంను ఫుల్ చేస్తే బాగుంటుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్..! T20 Blast 2022: భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి Lords not being full this week is embarrassing for the game .. Try & blame the Jubilee if they want but I guarantee if tickets weren’t £100 - £160 it would be jam packed !!! Why are they so expensive ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 How about working out a way to get the tickets remaining at Lords to kids with a parent for £40 to make sure it is full .. it’s the school holidays and lots of kids will be around to go to the Test match ?? @HomeOfCricket ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 -
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా అతడే.. హెడ్‌కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్!
Ben Stokes: వరుస పరాజయాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో ఇంగ్లండ్ కెప్టెన్సీకి జో రూట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలు వెస్టిండీస్ పర్యటనలో ఓటమి అనంతరం అతడిపై వేటు వేయాలని డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో అతడు స్వయంగా తానే కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నూతన మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో సమావేశం అనంతరం టెస్టు కెప్టెన్సీ తీసుకునేందుకు స్టోక్స్ అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ నియామకానికి సంబంధించి పేపర్ వర్క్ పూర్తైన అనంతరం అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. రాబ్ కీ గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించనున్నాడు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‌ను లేదంటే ఆస్ట్రేలియా మాజీ కోచ్ సైమన్ కటిచ్‌ను ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా నియమించే యోచనలో రాబ్ కీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మానసిక ఆందోళనల కారణంగా కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. యాషెస్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అతడు.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో అదరగొట్టాడు. విండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా.. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. చదవండి👉🏾Sanju Samson: సంజూ బాగానే ఆడుతున్నాడు.. కానీ టీమిండియాలో చోటు దక్కడం కష్టమే! -
సగం సీజన్ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి
ఐపీఎల్ 2022 సీజన్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మధ్యలోనే వైదొలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి అంచె పోటీలకు అందుబాటులో ఉండనున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండో అంచె పోటీలకు మాత్రం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఐపీఎల్ 15వ సీజన్‌ను మార్చి 27 నుంచి మే చివరివారం వరకు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా అంతకముందు ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం నిర్వహించనున్నారు. ఈసారి మెగావేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు చాలా మందే తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ టెస్టు జట్టులో సభ్యులైన జానీ బెయిర్ స్టో, మార్క్‌వుడ్, డేవిడ్ మలన్, ఓలీ పోప్, క్రెయిగ్ ఓవర్టన్, సామ్ బిల్లింగ్స్, డాన్ లారెన్స్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా యాషెస్ సిరీస్‌లో పాల్గొన్నారు. ఇక రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న జాస్ బట్లర్ కూడా టెస్టు జట్టులో సభ్యుడే. చదవండి: మెగా వేలంలో నాకోసం లక్నో బడ్జెట్ ఎంత? బేస్ ప్రైస్ ఇక జూన్ 2 నుంచి లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే.. టెస్టు జట్టులోని ఆటగాళ్లు కనీసం 15 రోజుల ముందు నుంచే అందుబాటులో ఉండేలా ఈసీబీ ప్లాన్ చేసుకుంటుంది. అందుకోసం ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లను సీజన్ మధ్యలోనే వెనక్కి పిలిపించే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ కీలకం కావడంతో ఈసీబీ ఆటగాళ్లను రప్పించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీంతో ఐపీఎల్ సీజన్లో కీలకమైన రెండో దశ పోటీలు జరగనున్న సమయంలోనే వాళ్లు వెనక్కి రావాల్సి ఉంటుంది. అసలే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 4-0తో దారుణ పరాభవం చూసిన ఇంగ్లండ్.. మళ్లీ టెస్టుల్లో పునర్వైభవం తెచ్చుకోవాలని భావిస్తోంది. అయితే ఈసీబీ తీరుపై ఐపీఎల్ అభిమానులు మాత్రం మండిపడ్డారు. వేలంలో కోట్టు కుమ్మరించి ఆటగాళ్లను తీసుకుంటారు. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండాలని ఆయా ఫ్రాంచైజీలు కోరుకుంటాయి. ఇలా సగం సీజన్ ఆడి.. మిగతా మ్యాచ్‌లు ఆడకుండా వెళ్లిపోవడం బాగుండదు. సగం సీజన్ ఆడే బదులు అక్కడే ఉండిపోండి.. మీకు ఖర్చులు దండగా అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Australian Open 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్.. కన్నీటిపర్యంతం -
పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్షమాపణలు
ECB Chief issues apology To Pakistan: భద్రతా సమస్యల కారణంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్ల మానసిక, శారీరక క్షేమం ముఖ్యమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పాక్ పర్యటను రద్దు చేసుకుంది. ఈ అయితే పాక్ పర్యటనను ఇంగ్లండ్ రద్దు చేసుకోవడంపై ఆ జట్టు క్రికెట్ బోర్డుపై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో ద్వజం ఎత్తారు. ఈ క్రమంలో స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛీప్ ఇయాన్ వాట్మోర్ క్షమాపణలు తెలిపారు. కాగా వచ్చే ఏడాది తమ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుందని ఆయన మాటిచ్చారు. "ముఖ్యంగా మా నిర్ణయంతో పాకిస్తాన్ బాధపడినందకు నేను చింతిస్తున్నాను. బోర్డు తీసుకున్న నిర్ణయం చాలా క్లిష్టమైనది. మా ఆటగాళ్లు, సిబ్బంది సంక్షేమం, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటన కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎదురుచూస్తోంది ”అని వాట్మోర్ డైలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు. అయితే ఈసీబీ ఛీప్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ సమాచార ప్రసార మంత్రి ఫవాద్ చౌదరి ముక్తకంఠంతో స్వాగతించారు. "వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్ రాబోతుందని ప్రకటించడం చాలా సంతోషకరం. పాకిస్థాన్ క్రికెట్‌కు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని మాజీ క్రికెటర్లకు, మీడియా, క్రికెట్ అభిమానులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా''. అని ఆయన ట్వీట్ చేశారు చదవండి: కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది ఆ ముగ్గురేనా..? -
క్రికెట్లో సరికొత్త ఫార్మాట్ 'ద హండ్రెడ్'.. రూల్స్ ఇలా ఉండబోతున్నాయి
The Hundred Rules: వందేళ్లకుపైగా ఘన చరిత్ర కలిగిన క్రికెట్ క్రీడ ఎప్పటికప్పుడు కొత్తగా అభిమానుల ముందుకు వస్తూనే ఉంది. ఈ ఆటలో తొలుత సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ మాత్రమే భాగంగా కాగా, ఆతర్వాతి కాలంలో వన్డేలు, టీ20లు, టీ10 లీగ్‌లు వచ్చి చేరాయి. ఇప్పుడు తాజాగా హండ్రెడ్ పేరుతో మరో కొత్త ఫార్మాట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్నింగ్స్‌కు 100 బంతుల చొప్పున ఉండే ఈ ఫార్మాట్లో ఎనిమిది పురుషుల జట్లు, ఎనిమిది మహిళా జట్లు ఉంటాయి. తాజాగా దీనికి సంబంధించిన నియమ నిబంధనలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విడుదల చేసింది. దీంతో ఈ సరికొత్త ఫార్మాట్ ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన రూల్స్ ఎలా ఉండబోతున్నాయో ఓసారి చూద్దాం. * ఈ కొత్త ఫార్మాట్లో టాస్ గ్రౌండ్‌లోనే వేయాలన్న రూలేమీ లేదు. * ఈ ఫార్మాట్లో ఓవర్లు ఉండవు. బాల్స్ ఆధారంగానే ఇన్నింగ్స్ మారుతుంది. ఒక బౌలర్ ఒకే ఎండ్ నుంచి రెండుసార్లు ఐదేసి బంతులు వేయాల్సి ఉంటుంది. తొలి ఐదు బంతులు ముగిసిన తర్వాత అంపైర్ ఓ వైట్ కార్డు చూపిస్తాడు. ఓ సెట్ పూర్తయినట్లుగా ప్రేక్షకులు, స్కోరర్లు, కామెంటేటర్లు, బ్రాడ్కాస్టర్లకు తెలియడానికి ఇలా చేస్తారు. * ఇందులో తొలి 25 బంతులు పవర్ ప్లేగా పరిగణించబడతాయి. ఈ సమయంలో 30 గజాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. * పవర్ ప్లే ముగిసాక ఫీల్డింగ్ టీమ్ ఎప్పుడైనా రెండు నిమిషాల స్ట్రేటజిక్ టైమౌట్(బ్రేక్) తీసుకోవచ్చు. * అలాగే, బ్యాట్స్‌మెన్ క్యాచ్ అవుటైన తర్వాత అవతలి బ్యాట్స్‌మన్ క్రాస్ అయ్యాడా లేదా అన్నదానితో సంబంధం లేకుండా కొత్త బ్యాట్స్‌మన్ స్ట్రైక్ తీసుకోవాలి. * గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్ టై అయితే రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభిస్తుంది. అదే ఎలిమినేటర్, ఫైనల్లో టై అయితే.. సూపర్ ఫైవ్ ఆడాల్సి ఉంటుంది. అంటే ఒక్కో టీమ్ ఐదు బాల్స్ ఆడాల్సి ఉంటుంది. * ఒకవేళ సూపర్ ఫైవ్ కూడా టై అయితే.. మరో సూపర్ ఫైవ్ ఆడిస్తారు. అది కూడా టై అయితే.. గ్రూప్ స్టేజ్‌లో టాప్‌లో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. * వర్షం వల్ల ప్రభావితమైన మ్యాచ్‌లలో కొత్త డీఎల్ఎస్ పద్ధతిని అమలు చేస్తారు. * ఒకవేళ జట్టు నెమ్మదిగా బౌలింగ్ చేస్తుందనుకుంటే అంపైర్‌కే పెనాల్టీ విధించే హక్కు ఉంటుంది. ఇలా జరిగితే ఫీల్డింగ్ టీమ్‌కు సర్కిల్ బయట ఒక ఫీల్డర్‌ను తగ్గించాల్సి ఉంటుంది -
ఇంగ్లండ్ జట్టులో కరోనా కలకలం
లండన్: శ్రీలంకను పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఊదేసిన ఇంగ్లండ్ జట్టును కరోనా వైరస్ చుట్టుముట్టింది. ముగ్గురు ఆటగాళ్లతో పాటు నలుగురు సహాయక సిబ్బందికి కోవిడ్ సోకింది. ఇలా ఏకంగా ఏడుగురు వైరస్ బారిన పడటంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఉలిక్కి పడింది. ఇక చేసేదేమీ లేక పాకిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు జట్టును మార్చేసింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో పూర్తిగా కొత్త జట్టును ప్రకటించింది. 18 మందిలో సగం మంది కొత్త ముఖాలే! లంకతో ఆడినట్లుగానే పాక్‌తో కూడా ఇంగ్లండ్ జట్టు మూడేసి చొప్పున వన్డేలు, టి20లు ఆడనుంది. గురువారం కార్డిఫ్‌లో జరిగే తొలి వన్డేతో ఇంగ్లండ్, పాక్ సిరీస్ మొదలవుతుంది. ఇదిలావుండగా కరోనా బారిన పడిన క్రికెటర్ల పేర్లుగానీ సహాయ సిబ్బందిలో ఎవరెవరికి సోకిందనే విషయాలు ఈసీబీ బయటకు వెల్లడించలేదు. మొత్తం జట్టును ఐసోలేషన్‌లో ఉంచింది. కోవిడ్ సోకిన ఏడు మందితో టచ్‌లో ఉన్న ఇంకెంతమందికి వైరస్ సోకు తుందోనని ఈసీబీ ఆందోళన పడుతుంది. ఇంగ్లండ్ వన్డే జట్టు: స్టోక్స్ (కెప్టెన్), జేక్‌బాల్, బ్రిగ్స్, కేర్స్, క్రావ్లీ, డకెట్, గ్రేగొరి, హెల్మ్, జాక్స్, లారెన్స్, సాఖిబ్, మలాన్, ఓవర్టన్, పార్కిన్సన్, పేన్, సాల్ట్, సింప్సన్, విన్స్. -
కోహ్లీ సేనకు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఓకే చెప్పిన ఈసీబీ
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును (ఈసీబీ) ఒప్పించింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బరిలో దిగిన భారత్.. సౌతాంఫ్టన్ పరిస్థితులను అర్ధం చేసుకోలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ తప్పు మరోసారి పునరావృతం కాకుండా బీసీసీఐ జాగ్రత్త పడింది. దీంతో జులై 20-22 మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఈసీబీ షెడ్యూల్ చేసిందని తెలుస్తోంది. అయితే భారత జట్టుతో తలపడే ప్రత్యర్థి ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బయో బబుల్ నుంచి బయటకు వచ్చి.. కుటుంబంతో గడుపుతున్న కోహ్లీసేన తిరిగి రాగానే ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఆగష్టు 4 నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. -
శ్రీలంకతో చివరి వన్డే: హార్డ్ హిట్టర్ వచ్చేస్తున్నాడు
లండన్: శ్రీలంక జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్ వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. అందుకు తగ్గట్టుగానే తొలి వన్డేలో లంకపై ఇంగ్లండ్ మంచి విజయాన్ని అందుకుంది. కాగా నేడు ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఇదిలా ఉంటే శ్రీలంకతో జరగనున్న చివరి వన్డేకు ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ టామ్ బాంటన్‌ను ఈసీబీ జట్టులోకి తీసుకొచ్చింది. డేవిడ్ మలన్‌కు బ్యాకప్‌గా టామ్ బాంటన్‌ను తీసుకున్నట్లు తెలిపింది. కాగా డేవిడ్ మలన్ వ్యక్తిగత కారణాల రిత్యా వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య చివరి వన్డే బ్రిస్టల్ వేదికగా జూలై 4న జరగనుంది. టామ్ బాంటన్ ఇటీవలే టీ20 బ్లాస్ట్‌లో సోమర్సెట్ తరపున 47 బంతుల్లోనే సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్ ఆధారంగా టామ్ బాంటన్‌ను మరోసారి జట్టులోకి పిలిచినట్లు తెలుస్తుంది. ఇక టీ20 బ్లాస్ట్‌లో సోమర్సెట్ తరపున ఆడుతున్న బాంటన్ ఈరోజే జట్టుతో కలవనుండడంతో డెర్బిస్తో జరగనున్న మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఇక బాంటన్ చివరిసారిగా ఇంగ్లండ్ తరపున ఆగస్టు 2020లో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆడాడు. -
వాళ్లు నిజంగా జాత్యహంకారులే.. ఇప్పటికీ మన యాసను ఎగతాలి చేస్తారు
న్యూఢిల్లీ: ఇంగ్లీష్ క్రికెటర్ ఓలీ రాబిన్సన్ ఎపిసోడ్‌పై భారత మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజినీర్ స్పందించాడు. రాబిన్సన్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించాడు. అతని విషయంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) నిర్ణయం సరైందేనని, మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై జీవితకాల నిషేదం విధించాలని ఈసీబీని కోరాడు. ఈ సందర్భంగా రాబిన్సన్ను వెనకేసుకొచ్చిన వారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. గతంలో తాను లాంకషైర్ కౌంటీకి ప్రాతినిధ్యం వహించే రోజుల్లో జాతి వివక్షను ఎదుర్కొన్నానని, ఇంగ్లీష్ వాళ్లు భారతీయుల పట్ల అహంకారులుగా వ్యవహరించే వాళ్లని తెలిపాడు. వాళ్లు అప్పుడు ఇప్పుడు మన యాసను ఎగతాలి చేస్తున్నారని, వాళ్లలో జాత్యాంహంకారం బుసలు కొడుతుందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అయితే తరచూ బ్లడీ ఇండియన్స్ అంటూ సంబోధించేవాడని, అలాంటి వాడిని మన వాళ్లే అందలమెక్కించారని వాపోయాడు. ఈ విషయంలో ఇంగ్లీష్ క్రికెటర్ల తర్వాత ఆసీస్ ఆటగాళ్లుంటారని, వాళ్లు కూడా భారతీయుల పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. ఒకప్పుడు మనపై వివక్ష చూపిన వాళ్లంతా ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని మన బూట్లు నాకుతున్నారని దుయ్యబట్టాడు. ఇంగ్లీష్ క్రికెటర్లు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారని, వాళ్ల నిజస్వరూపమేంటో తనకు తెలుసునని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన రాబిన్సన్.. తాను టీనేజర్‌గా ఉన్న సమయంలో ఆసియా వాసులు, ముస్లింలపై జాతి వివక్ష ట్వీట్లు చేశాడన్న ఆరోపణలపై ఈసీబీ అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: క్రికెట్ చరిత్రలో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే అత్యుత్తమం