ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఐపీఎల్‌లో పాల్గొంటున్న తమ ఆటగాళ్లకు అల్టిమేటం జారీ చేసింది. మే 22లోగా స్వదేశానికి చేరుకోవాలని ఆజ్ఞాపించింది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లండ్ స్వదేశంలో పాక్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టే ఈ సిరీస్‌లో కూడా పాల్గొంటుంది. ఈ సిరీస్ కోసమే ఈసీబీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
పాక్‌తో ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి (మే 22) ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లే ఆఫ్స్ జరుగుతుంటాయి. ఇలాంటి కీలక దశలో ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే సంబంధిత జట్లపై భారీ ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా పాక్‌తో సిరీస్ కోసమని ఐపీఎల్‌కు డుమ్మా కొడితే ఫ్రాంచైజీలకు భారీ షాక్ తగిలినట్లే.
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్
ఐపీఎల్ 2024లో వివిధ జట్లకు ఆడుతున్న ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టు సభ్యులు..
జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్)
మొయిన్ అలీ (సీఎస్‌కే)
బెయిర్‌స్టో (పంజాబ్)
సామ్ కర్రన్ (పంజాబ్)
లివింగ్‌స్టోన్ (పంజాబ్)
విల్ జాక్స్ (ఆర్సీబీ)
ఫిల్ సాల్ట్ (కేకేఆర్)
రీస్ టాప్లే (ఆర్సీబీ)
ఐపీఎల్ ప్లే ఆఫ్స్..
మే 21: క్వాలిఫయర్-1
మే 22: ఎలిమినేటర్
మే 24: క్వాలిఫయర్-2
మే 26: ఫైనల్
Comments
Please login to add a commentAdd a comment