కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ హర్షిత్ రానాకు జాక్ పాట్ తగిలింది. హర్షిత్ రానాకు భారత సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపువచ్చింది. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు రానాను సెలక్టర్లు ఎంపిక చేశారు. జింబాబ్వే సిరీస్‌కు తొలుత ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బీసీసీఐ తాజాగా స్వల్ప మార్పులు చేసింది.
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగమైన సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌లను జింబాబ్వే సిరీస్‌కు ముందు భారత జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే రానాకు చోటు దక్కింది. రానాతో పాటు సాయిసుదర్శన్, జితేష్ శర్మలకు కూడా అవకాశం లభించింది.
ఇప్పటికే భారత జట్టు జింబాబ్వేకు పయనం కాగా.. వీరు ముగ్గురు కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. కాగా జితేష్ శర్మ ఇప్పటికే భారత్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేయగా.. సాయిసుదర్శన్, రానాలకు భారత టీ20 జట్టులో చోటు దక్కడం ఇదే మొదటి సారి. అయితే సాయి మాత్రం భారత తరపున వన్డేల్లో మాత్రం డెబ్యూ చేశాడు.
ఐపీఎల్‌లో అదుర్స్..
ఐపీఎల్-2024లో హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధిలను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలవడంలో రానా కీలక పాత్ర పోషించాడు.
ఓవరాల్‌గా ఈ ఏడాది ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన రానా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కూడా 7 మ్యాచ్‌లు ఆడిన రానా.. 28 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.
అదేవిధంగా భారత-ఎ జట్టు తరపున కూడా రానా ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. కాగా ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టు
శుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా
Comments
Please login to add a commentAdd a comment