Harshit Rana
-
హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేస్తా: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు.. రెండో రోజు ఆట సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. భారత యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చాడు. అయితే, ఇందుకు హర్షిత్ స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్- భారత్ మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైంది. ఇక ఈ మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాల దృష్ట్యా రోహిత్ శర్మ దూరం కాగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.ఇక పెర్త్‌లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆతిథ్య ఆసీస్ సైతం తొలి రోజే బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆది నుంచే ఆసీస్ బ్యాటర్లను టార్గెట్ చేస్తూ పేస్ దళ నాయకుడు బుమ్రా వికెట్ల వేట మొదలుపెట్టగా.. మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా అతడికి సహకారం అందించారు.రాణా తొలి వికెట్ అతడేఫలితంగా శుక్రవారం నాటి ఆటలో టీమిండియా పైచేయి సాధించగలిగింది. బుమ్రా నాలుగు వికెట్లతో రాణించగా.. సిరాజ్ రెండు వికెట్లు కూల్చాడు. ఇక అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్(11) రూపంలో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 67 రన్స్ మాత్రమే చేసింది.అంతేకాదు.. శనివారం నాటి రెండో రోజు ఆరంభంలోనే వికెట్ తీసి మరోసారి దూకుడు ప్రదర్శించింది. ప్రమాదకారిగా మారుతున్న అలెక్స్ క్యారీ(21)ని బుమ్రా అవుట్ చేయగా.. నాథన్ లియాన్(5)ను హర్షిత్ పెవిలియన్‌కు పంపాడు.అయితే, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మాత్రం క్రీజులో పాతుకుపోయి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 40వ ఓవర్లో బుమ్రా.. హర్షిత్‌ను రంగంలోకి దించాడు. ఈ క్రమంలో మూడో బంతిని హర్షిత్ బౌన్సర్‌గా సంధించగా.. స్టార్క్ హెల్మెట్‌కు తగిలింది.హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలనుదీంతో కంగారూపడిన హర్షిత్ స్టార్క్ వైపు చూస్తూ అంతే ఓకే కదా అన్నట్లు సైగలతోనే అడిగాడు. ఇందుకు బదులుగా నవ్వులు చిందించిన స్టార్క్.. ‘‘హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలను. పాత జ్ఞాపకాలు గుర్తున్నాయి’’ అంటూ ఐపీఎల్లో తాము కలిసి ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇక స్టార్క్ మాటలతో ఒక్కసారిగా హర్షిత్ చిరునవ్వులు చిందిస్తూ అలాగే అన్నట్లు తలూపాడు. మామూలుగా ఆసీస్- భారత్ మ్యాచ్ అంటే స్లెడ్జింగ్ మొదట గుర్తుకువస్తుంది. అయితే, హర్షిత్- స్టార్క్ మాత్రం ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అభిమానులను ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఐపీఎల్-2024లో హర్షిత్ రాణా, స్టార్క్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. జట్టును చాంపియన్‌గా నిలపడంలో ఈ ఇద్దరు పేసర్లు తమ వంతు పాత్రలు పోషించారు. అదీ సంగతి!!104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్ఇక క్రీజులో పాతుకుపోయి జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టిన స్టార్క్ వికెట్‌ను ఆఖరికి హర్షిత్ దక్కించుకోవడం విశేషం. మొత్తంగా 112 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసిన స్టార్క్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో ఆసీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు.Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
చెలరేగిన బుమ్రా.. రాణించిన రాణా, సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. పేసర్ల విజృంభణ కారణంగా పటిష్ట స్థితిలో నిలిచింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ టూర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్‌లో మొదటి టెస్టు ఆరంభమైంది.ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగడంతోటాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, బాల్ ఆది నుంచే బాగా స్వింగ్ కావడంతో భారత బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. తమకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగారు. మిచెల్ స్టార్క్ టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను డకౌట్ చేసి ఆసీస్‌కు శుభారంభం అందించాడు.అదే విధంగా.. క్రీజులో నిలదొక్కున్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26)ను సైతం స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు.. జోష్ హాజిల్‌వుడ్ వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0)ను అవుట్ చేసి తన ఖాతా తెరిచాడు. అంతేకాదు కీలకమైన విరాట్ కోహ్లి(5) వికెట్‌ను కూడా తానే దక్కించుకున్నాడు.పంత్, నితీశ్ రాణించగా..అయితే, రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) పట్టుదలగా నిలబడి.. ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ .. టీమిండియాను మెరుగైన స్కోరు దిశగా నడిపించారు. వీరిద్దరు రాణించడం వల్ల.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. మిగతా వాళ్లలో ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4), హర్షిత్ రాణా(7), కెప్టెన్ బుమ్రా(8) నిరాశపరిచారు.వికెట్ల వేట మొదలు పెట్టిన బుమ్రా ఆసీస్ పేసర్లలో హాజిల్‌వుడ్ ఓవరాల్‌గా నాలుగు, కమిన్స్, స్టార్క్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు.. బుమ్రా ఆది నుంచే చుక్కలు చూపించాడు. ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(10)ని అవుట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టాడు.ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసిఆ తర్వాత ఒకే ఓవర్లో స్టీవ్ స్మిత్(0), ఉస్మాన్ ఖవాజా(8)లను అవుట్ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడిన వేళ.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ పరుగులు చేయకపోయినా.. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. హర్షిత్ రాణాకు తొలి వికెట్మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసిన లబుషేన్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. అంతకు ముందు మార్ష్(6) వికెట్‌ను కూడా సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ట్రవిస్ హెడ్(11)ను బౌల్డ్ చేసి హర్షిత్ రాణా టెస్టుల్లో తన తొలి వికెట్ నమోదు చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3) వికెట్‌ను భారత సారథి బుమ్రా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 27 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 67 మాత్రమే పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే 83 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా అలెక్స్ క్యారీ(19*), స్టార్క్(6*) మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఓవరాల్‌గా నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు, రాణా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. ఆరంభంలోనే ఆసీస్‌కు షాకులు -
IND VS AUS 1st Test: హర్షిత్ రాణానా.. ఆకాశ్దీపా..?
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి (నవంబర్ 22) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంబానికి ముందు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. టాస్ ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే మ్యాచ్ మిగతా రోజుల్లో మాత్రం వర్షం పడే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఈ సిరీస్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో టీమిండియాకు తుది జట్టు కూర్పు పెద్ద సమస్యగా మారింది. ఫైనల్ ఎలెవెన్‌లో ఎవరిని ఉంచాలో అర్దం కాక భారత మేనేజ్మెంట్ తలలు పట్టుకుని కూర్చుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానాన్ని కేఎల్ రాహుల్‌తో భర్తీ చేయాలని ఆలోచిస్తున్నా, అది కాస్త మిస్ ఫైర్ అవుతుందేమోనని ఆందోళన చెందుతుంది. అభిమన్యు ఈశ్వరన్ వైపు మొగ్గు చూపుదామా అంటే అతనికి అనుభవం లేదు. మరోవైపు వన్‌డౌన్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ సైతం గాయపడిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు అతని విషయంలో ఏమీ చెప్పలేమని మేనేజ్మెంట్ గోప్యత మెయిన్టైన్ చేస్తుంది. అతనికి ప్రత్యామ్నాయంగా దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడిస్తే బాగుంటుందా అని పరిశీలిస్తుంది.టీమిండియాకు ఉన్న మరో సమస్య మూడో స్పెషలిస్ట్ పేసర్. ఈ స్థానానికి ఆకాశ్‌దీప్‌ను ఎంపిక చేయాలా లేక యువ పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం ఇవ్వాలా అనే విషయంలో యాజమాన్యం తీవ్రమైన కసరత్తు చేస్తుంది. కెప్టెన్ బుమ్రా, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ హర్షిత్ రాణావైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. చివరి నిమిషంలో ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. పేస్ విభాగంలో తొలి రెండు స్థానాలకు బుమ్రా, సిరాజ్ సెట్ కాగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అశ్విన్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. ఆసీస్ జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు చాలామంది ఉండటంతో మేనేజ్మెంట్ రైట్ ఆర్మ ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్‌కుమార్ రెడ్డి పేరు కూడా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్, బుమ్రా, హర్షిత్ రాణా, సిరాజ్ -
సిక్సర్ల వర్షం కురిపించిన రుతురాజ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్, భారత్-ఏ మధ్య వాకా వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏకు ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రెండు.. మానవ్ సుతార్, హర్షిత్ రాణా బౌలింగ్‌లో తలో సిక్సర్ బాదాడు. ఈ మ్యాచ్‌లో గంటకు పైగా బ్యాటింగ్ చేసిన రుతురాజ్ ఆతర్వాత సర్ఫరాజ్ ఖాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. రుతురాజ్ ఇటీవలే ఆస్ట్రేలియా-ఏతో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్-ఏ జట్టుకు సారథ్యం వహించాడు. ఈ సిరీస్‌లో రుతురాజ్ ఆశించిన మేరకు రాణించకపోయినప్పటికీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో మాత్రం ఇరగదీశాడు. తాజా ఇన్నింగ్స్‌తో రుతురాజ్ టీమిండియా మేనేజ్మెంట్ను మెప్పించి తుది జట్టులో (ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు) చోటు దక్కించుకుంటాడేమో వేచి చూడాలి.🚨 Updates from Perth 4 Sixes from Ruturaj Gaikwad - 2 Vs Ashwin 1 Vs Sutar and one vs Rana - After playing for more than an hour made his way to Sarfaraz Khan.#AUSvsIND pic.twitter.com/yGMIjk4Wzp— RevSportz Global (@RevSportzGlobal) November 16, 2024చెమటోడ్చిన విరాట్, యశస్వి, గిల్రుతురాజ్ విషయాన్ని పక్కన పెడితే, టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లో చెమటోడ్చారు. ఈ ముగ్గురు ఈ మ్యాచ్‌లో తలో రెండుసార్లు బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆశాజనకమైన ప్రదర్శన చేశాడు. యశస్వి జైస్వాల్ షార్ట్ బాల్స్‌ను మంచి టెక్నిక్‌తో ఎదుర్కొన్నాడు. శుభ్‌మన్ గిల్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో తడబడినప్పటికీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్థాయి మేరకు రాణించాడు. బౌలర్లలో ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముకేశ్ ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. అయితే అతను భారత మెయిన్ జట్టులో లేని విషయం తెలిసిందే. భారత సెలెక్టర్లు ముకేశ్‌ను ట్రావెలింగ్ రిజర్వగా ఎంపిక చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
అతడిని జట్టులోకి తీసుకున్నారా?.. టీమిండియా కోచ్ క్లారిటీ
న్యూజిలాండ్‌తో మూడో టెస్టుకు భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్పష్టం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ గురించి తాము ఆలోచించడం లేదని.. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం ముంబై మ్యాచ్‌పైనే ఉందని తెలిపాడు. అదే విధంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల విషయంలో ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని సూచించాడు. రోహిత్ సేనకు ఊహించని షాకులుగొప్ప ఆటగాళ్లందరూ ఏదో ఒక సందర్భంలో ఫామ్‌లేమితో సతమతమయ్యారన్న అభిషేక్ నాయర్.. రోహిత్- కోహ్లి తిరిగి పుంజుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి రెండు టెస్టుల్లో రోహిత్ సేనకు ఊహించని షాక్ తగిలింది.బెంగళూరులో కివీస్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిన భారత్.. పుణెలో 113 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 0-2తో సిరీస్ కోల్పోయింది. ఫలితంగా స్వదేశంలో టీమిండియా పన్నెండేళ్ల టెస్టు సిరీస్ జైత్రయాత్రకు తెరపడింది. ఈ క్రమంలో నవంబరు 1 నుంచి ముంబై వేదికగా జరుగనున్న మూడో టెస్టు భారత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలంటే గెలిచి తీరాలి లేదంటే కనీసం డ్రా అయినా చేసుకోవాలి.జట్టులో మార్పులేమీ లేవుఈ నేపథ్యంలో యువ పేసర్ హర్షిత్ రాణాను మూడో టెస్టులో బరిలోకి దించనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వీటిని ఖండించాడు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జట్టులో మార్పులేమీ లేవు. ఎవరినీ కొత్తగా చేర్చడం లేదు. ప్రతీ వారం.. ప్రతీ రోజు మాకు కీలకమే. డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ప్రస్తుతానికి ఆలోచన లేదు. ఇప్పుడు మా దృష్టి మొత్తం ఈ మ్యాచ్ మీదే ఉంది’’ అని అభిషేక్ నాయర్ తెలిపాడు.ఫామ్‌లోకి వస్తారనే నమ్మకం ఉందిఅదే విధంగా.. కివీస్‌తో తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రోహిత్- కోహ్లి గురించి ప్రస్తావన రాగా.. ‘‘ప్రస్తుతం వాళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే, కొన్నిసార్లు మనం కాస్త సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఓపికపట్టాలి కూడా! గొప్ప గొప్ప ఆటగాళ్ల కెరీర్లో ఇలా జరిగింది. ఇప్పుడు వాళ్ల టైమ్ బాగా లేకపోవచ్చు. అయితే, త్వరలోనే తిరిగి పుంజుకుంటారనే నమ్మకం ఉంది’’ అని అభిషేక్ నాయర్ విరాహిత్ ద్వయాన్ని సమర్థించాడు. కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతుంది. ఇందుకు సంబంధించిన జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కింది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?
హర్షిత్ రాణా త్వరలోనే టీమిండియా అరంగేట్రం చేయనున్నాడా? ఆస్ట్రేలియాతో సిరీస్ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో తనవంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైనా ఇంత వరకు అరంగేట్రం చేయలేదు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లనున్న టెస్టు జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు హర్షిత్ రాణా. భారత-ఎ జట్టులో భాగమైన యువ క్రికెట్లరు ఇప్పటికే ఆస్ట్రేలియాకు వెళ్లగా హర్షిత్ మాత్రం రంజీ మ్యాచ్ కోసం భారత్‌లోనే ఉన్నాడు. అసోంతో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన హర్షిత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. మొత్తంగా ఏడు వికెట్లు తీయడంతో పాటు ధనాధన్ హాఫ్ సెంచరీ(4 ఫోర్లు, 3 సిక్స్‌లు- 59 రన్స్)తో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణాను కివీస్‌తో మూడో టెస్టులో బరిలోకి దించాలని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం.ఆకాశ్ దీప్‌పై వేటు?ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం సహా ఫామ్‌లేమితో సతమతమవుతున్న మహ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టాలనే యోచనలో కోచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్‌ను తప్పించి హర్షిత్ రాణాను ఆడించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రత్యర్థి బ్యాటర్ ఎంతటి ఘనుడైనా తనదైన శైలిలో బంతులు విసురుతూ వికెట్లు పడగొట్టగల సత్తా ఈ స్పీడ్‌స్టర్ సొంతం.అప్పుడు వాషీ.. ఇప్పుడు రాణాఇక కేకేఆర్ మెంటార్‌గా హర్షిత్‌ను దగ్గరగా గమనించిన గంభీర్.. ఈ ఢిల్లీ పేసర్‌కు కివీస్‌తో మూడో టెస్టులో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో రోహిత్ సేన ఇప్పటికే రెండు ఓడిపోయింది. సిరీస్ కోల్పోయినా పరువు నిలబెట్టుకోవాలంటే నవంబరు 1 నుంచి ముంబైలో జరిగే ఆఖరి టెస్టులో గెలుపు తప్పనిసరి!ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత రెండో టెస్టుకు వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసిన చేసిన విషయం తెలిసిందే. పుణె టెస్టులో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పదకొండు వికెట్లతో సత్తా చాటాడు. ఇప్పుడిక హర్షిత్ రాణా వంతు వచ్చిందేమో?!చదవండి: గంభీర్ సర్ వల్లే ఆరోజు అలా.. టెస్టుల్లోనూ రాణిస్తా: నితీశ్ రెడ్డి -
హర్షిత్ రాణా ఆల్‌రౌండ్ షో.. 7 వికెట్లు, హాఫ్ సెంచరీ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపికైన టీమిండియా పేసర్ హర్షిత్ రాణా రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు. దేశవాలీ టోర్నీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్.. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో హర్షిత్ తొలుత ఐదు వికెట్ల ప్రదర్శన (5/80) నమోదు చేసి, ఆతర్వాత మెరుపు హాఫ్ సెంచరీ (59; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ హర్షిత్ రెండు వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. సుమిత్ (162) భారీ సెంచరీతో సత్తా చాటగా.. శివ్‌శంకర్ రాయ్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షిత్ రాణా ఐదు వికెట్లు పడగొట్టగా.. హిమాన్షు చౌహాన్ 2, సిద్దాంత్ శర్మ, మోనీ గ్రేవల్, సుమిత్ మాథుర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సుమిత్ మాథుర్ సెంచరీతో (112) కదంతొక్కగా.. హిమ్మద్ సింగ్ (55), హర్షిత్ రాణా (59), సిద్దాంత్ శర్మ (89) అర్ద సెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో రాహుల్ సింగ్ నాలుగు, పుర్కాయస్తా మూడు, ముక్తర్ హుసేన్ రెండు, మ్రిన్మోయ్ దత్తా ఓ వికెట్ పడగొట్టారు.124 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం.. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు అస్సాం ఇంకా 31 పరుగులు వెనుకపడి ఉంది. సుమిత్ (17), ముక్తర్ హుసేన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో హర్షిత్ రాణా, మోనీ గ్రేవల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జాంటీ సిద్దూ, సిద్దాంత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: శతక్కొట్టిన మయాంక్ అగర్వాల్.. రాణించిన మనీశ్ పాండే -
17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన భారత పేసర్
క్రికెటర్లలో తరచూ గాయాలబారిన పడే వారి జాబితాలో ఫాస్ట్‌బౌలర్లే ఎక్కువగా ఉంటారు. పేసర్లు సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించాలంటే తగినంత విశ్రాంతి తీసుకుంటూనే ఫిట్నెస్ కూడా కాపాడుకోవాలి. అందుకోసం వారు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. తాను కూడా ఆ కోవకే చెందిన వాడిని అంటున్నాడు హర్షిత్ రాణా. న్యూఢిల్లీకి చెందిన ఈ 22 ఏళ్ల రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సత్తా చాటి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన హర్షిత్ రాణా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుకు ఎంపికయ్యాడు. కంగారూ జట్టుతో ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో పాల్గొనే సువర్ణావకాశం ముంగిట నిలిచాడు. మా నాన్న కలఈ నేపథ్యంలో హర్షిత్ రాణా ఇప్పటిదాకా క్రికెటర్‌గా తన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి పంచుకున్నాడు. ‘‘నేను తరచూ గాయాల బారిన పడేవాడిని. అప్పుడు మా నాన్న కొండంత అండగా నిలబడ్డారు. ప్రతి అడుగులోనూ నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపారు. ఇంగ్లండ్ గడ్డపై నేను టీమిండియాకు ఆడితే చూడాలనేది మా నాన్న కల. నాకైతే ఎల్లప్పుడూ ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో పోటీ పడటం అంటేనే ఇష్టం.ఏదేమైనా ఈరోజు నేను ఈ స్థాయికి చేరానంటే దానికి కారణం మా నాన్నే. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా ఉంటారు. వారికి అన్నిరకాలుగా పోటీ ఇచ్చేందుకు నేను కూడా సిద్ధంగానే ఉన్నాను’’ అని హర్షిత్ రాణా పేర్కొన్నాడు. కాగా టీనేజ్‌లో హర్షిత్ ఎదుర్కొన్న ఫిట్నెస్ సమస్యల గురించి అతడి తండ్రి ప్రదీప్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు వెల్లడించారు.తరచూ గాయాలు‘‘ముందు వెన్ను నొప్పి, తర్వాత తొడ కండరాల గాయం.. ఆ తర్వాత మోకాలి గాయం.. అనంతరం భుజం నొప్పి.. శరీరంలోని దాదాపు ప్రతీ అవయవానికి ఏదో ఒక సందర్భంలో గాయమైంది. గాయపడ్డ ప్రతిసారీ నేను తనను ఆస్పత్రికి తీసుకువెళ్లేవాడిని. ఆయుర్వేద వైద్యులను కూడా సంప్రదించాను. ఎవరు ఏ సలహా ఇచ్చినా పాటించేవాడిని. హర్షిత్ ఫిట్‌గా మారేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాము’’ అని ప్రదీప్ పేర్కొన్నారు.17 కిలోల బరువు తగ్గి.. లక్కీ ఛాన్స్కాగా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించేందుకు హర్షిత్ రాణా 17 కిలోల మేర బరువు తగ్గాడు. కఠిన సవాళ్లను అధిగమిస్తూ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే దాకా చేరుకున్నాడు. ఇక జింబాబ్వే పర్యటన సందర్భంగా హర్షిత్ తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత కూడా జట్టుతో ప్రయాణించాడు. కానీ.. తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. అయితే, మహ్మద్ షమీ ఫిట్నెస్ కారణాల దృష్ట్యా జట్టుకు దూరమైన కారణంగా.. ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపికయ్యే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. రిజర్వు ప్లేయర్లు: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్. చదవండి: Ind vs NZ 3rd Test: బుమ్రా వద్దు.. సిరాజ్‌ను ఆడించండి: దినేశ్ కార్తిక్ -
టీమిండియాలో చోటు కొట్టేశాడు.. కట్ చేస్తే! అక్కడ 4 వికెట్లతో
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఢిల్లీ యువ పేసర్ హర్షిత్ రానాకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఫస్ట్క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నందుకు అతడిని కీలకమైన ఆసీస్ టూర్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే టీమిండియాకు సెలక్ట్ అయిన జోష్‌లో ఉన్న హర్షిత్ రానా.. రంజీ ట్రోఫీలో నిప్పులు చెరుగుతున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అస్సాం జరుగుతున్న మ్యాచ్‌లో రానా అదరగొడుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 15 ఓవర్లు బౌలింగ్ చేసిన రానా.. 62 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.రిశావ్ దాస్, శుభమ్ మండల్, అభిషేక్ ఠాకూర్ వంటి కీలక వికెట్లు పడగొట్టి అదిలోనే అస్సాంను హర్షిత్ దెబ్బతీశాడు. దీంతో 15 పరుగులకే అస్సాం 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ సుమిత్ ఘడిగాంకర్(120) అస్సాం ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి అస్సాం 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.గంభీర్ వల్లే..కాగా ఆసీస్ టూర్‌కు హర్షిత్ రానా ఎంపిక కావడం వెనుక హెడ్ కోచ్ గౌతం గంభీర్ హస్తం ఉంది. ఐపీఎల్-2024 సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్‌ను రానా తన అద్బుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. మొత్తం ఈ ఏడాది సీజన్లో 19 వికెట్లు పడగొట్టిన హర్షిత్ రానా.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతడిని భారత జట్టులోకి తీసుకురావాలని గంభీర్ ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు రానాకు భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ వైరల్ ఫీవర్ కారణంగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ కొట్టేశాడు.చదవండి: చాలా బాధగా ఉంది.. కానీ అతిగా పోస్టుమార్టం చేయనక్కర్లేదు: రోహిత్ శర్మ -
మయాంక్ యాదవ్, నితీశ్ రెడ్డికి బంపరాఫర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో సత్తా చాటిన యువ క్రికెటర్లు మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డిల రాత మారిపోయింది. ఇటీవలే వీరిద్దరు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన మయాంక్, నితీశ్ సెలక్టర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.కివీస్‌తో సిరీస్‌కు...ఈ సిరీస్‌లో స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. రెండో టీ20లో నితీశ్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్(34 బంతుల్లో 74)తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు వీరిద్దరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికచేశారు సెలక్టర్లు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ వీరికి మరో శుభవార్త అందించాడు. కివీస్‌తో సిరీస్‌లో వీరిని టెస్టుల్లో ఆడించే ఉద్దేశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారో? లేదో?‘‘యువ ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను మేము గుర్తించాం. అయితే, వాళ్లు ఎక్కువగా రెడ్‌బాల్ క్రికెట్ ఆడలేదు. అయినప్పటికీ వారిలోని నైపుణ్యాలకు మరింత పదునుపెట్టేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. అందుకే మరింత నిశితంగా పరిశీలించేందుకు వీలుగా రిజ్వర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాం.తమకు దొరికిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు. టెస్టు క్రికెట్ ఆడేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. మా బెంచ్ స్ట్రెంత్‌ను పెంచుకునే క్రమంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.గాయాల బెడద నుంచి తప్పించుకోవాలంటే ఎక్కువ బ్యాకప్ ఆప్షన్లు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సిరీస్‌లో వారు మాతో పాటే ప్రయాణిస్తారు కాబట్టి.. దగ్గరగా గమనిస్తాం. వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయగలరా? జట్టుకు ఎంతమేర ఉపయోగపడతారు? అన్న అంశాలు పరిశీలిస్తాం.ముఖ్యంగా ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. మా దగ్గర ఇప్పుడు 8- 9 ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలోనూ వీలైనంత మంది అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉందివీరిలో చాలా మంది దులిప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ ఆడారు. ఇప్పుడు ఈ యువ ఆటగాళ్లను కివీస్‌తో టెస్టులకు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేయడానికి కారణం.. వాళ్లను దగ్గరగా గమనించి ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉండటమే’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.కాగా ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌తో పాటు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా న్యూజిలాండ్ టెస్టులకు ట్రావెలింగ్ రిజర్వులుగా ఉన్నారు. కాగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున వికెట్లు పడగొట్టిన మయాంక్ గాయం కారణంగా ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనంతరం, జాతీయ క్రికెట్ అకాడమీలో చేరి పునరావాసం పొందాడు. తర్వాత నేరుగా టీమిండియాలో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరడంలో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వగలిగాడు.చదవండి: షమీ ఫిట్‌గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం: రోహిత్ శర్మ 💬💬 Our focus is to improve and better our performance.#TeamIndia Captain Rohit Sharma ahead of the #INDvNZ Test series 👌👌@IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/mJMOvVgVDw— BCCI (@BCCI) October 15, 2024 -
బంగ్లాతో మూడో టీ20 ఆడే భారత జట్టు ఇదే..! అతడి అరంగేట్రం?
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత జట్టు 2-0 తేడాతో సొంతం చేసుకుంది. బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. మరో పొట్టి క్రికెట్ సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.అయితే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు నామమాత్రపు మూడో టీ20లో పర్యాటక జట్టుతో తలపడనుంది. శనివారం హైదరాబాద్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రయోగాలకు సిద్దమైనట్లు భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమచారం. తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌తో ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా తొలి రెండు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన తిలక్ వర్మ, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లు ఆఖరి టీ20లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడో టీ20కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ మయాంక్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.బంగ్లాదేశ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత జట్టు (అంచనా)సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా -
బంగ్లాతో రెండో టీ20.. తెలుగోడికి నో ఛాన్స్! అతడి అరంగేట్రం
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. ఆక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టీ20లో బంగ్లాతో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సూర్య సేనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.నితీష్ కుమార్‌కు నో ఛాన్స్..ఇక రెండో టీ20లో అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన నితీష్ కుమార్ రెడ్డికి రెండో మ్యాచ్‌కు పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది.అతడి స్ధానంలో పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇదొక్కటి మినహా భారత జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోకపోవచ్చు. కాగా అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఒకవేళ టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ నమోదు కావడం ఖాయం.రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్.చదవండి: అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్ అదే: మంధాన -
Duleep Trophy: ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే అందరి దృష్టి!
శ్రీలంక పర్యటన తర్వాత.. సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా క్రికెటర్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్‌బాల్ టోర్నీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. సుమారుగా యాభై మందికి పైగా ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో భాగం కానున్నారు.ఈ టోర్నీకి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే నాలుగు జట్ల వివరాలను వెల్లడించింది. ఆటగాళ్లను టీమ్-ఏ, టీమ్-బి, టీమ్-సి, టీమ్-డిగా విభజించింది. టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తదితరులు పాల్గొననున్న ఈ టోర్నీలో.. ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా హైలైట్‌గా నిలవనున్నారు.అభిమన్యు ఈశ్వరన్బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ దులిప్ ట్రోఫీ-2024లో టీమ్-బి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 94 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఏడు వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇప్పుడు ఈ టోర్నీలో గనుక ఈశ్వరన్ సత్తా చాటితే.. బంగ్లాతో సిరీస్‌లో టీమిండియా బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.యశ్ దయాల్దులిప్ ట్రోఫీ-2024లో లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ టీమ్-బికి ఆడనున్నాడు. 26 ఏళ్ల ఈ యూపీ బౌలర్ ఇప్పటి వరకు 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరఫున కూడా సత్తా చాటాడు. దులిప్ టోర్నీలో యశ్ దయాల్ ఆకట్టుకుంటే బంగ్లాతో సిరీస్ నేపథ్యంలో అతడి పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంటుంది.హర్షిత్ రాణాఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు హర్షిత్ రాణా. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ ఢిల్లీ బౌలర్ జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అదే విధంగా.. శ్రీలంక పర్యటనలో వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే, ఈ 22 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్‌కు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు.ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. దులిప్ ట్రోఫీలో టీమ్-డికి ఆడనున్నాడు. మెరుగైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాలని పట్టుదలగా ఉన్నాడు.నితీశ్‌కుమార్ రెడ్డిఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి. ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ.. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దురదృష్టవశాత్తూ గాయపడి.. జింబాబ్వే టూర్‌కు వెళ్లలేకపోయాడు. అయితే, దులిప్ ట్రోఫీ(టీమ్-బి)లో సత్తా చాటితే మాత్రం.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.ముషీర్ ఖాన్టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్. దేశవాళీ క్రికెట్లో ముంబైకివ ఆడుతున్న ముషీర్.. గత రంజీ సీజన్లో ఓవరాల్‌గా 529 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. కేవలం ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే ఈ మేర స్కోరు చేశాడు. పందొమిదేళ్ల ముషీర్ ఖాన్ దులిప్ ట్రోఫీలో టీమ్-బికి ఆడనున్నాడు. అన్నకు పోటీగా బ్యాట్‌తో రంగంలోకి దిగనున్నాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
IND vs SL: శ్రీలంకతో తొలి వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం! పంత్‌కు నో ఛాన్స్
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డేలకు సిద్దమైంది. భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ రేపటి(ఆగస్టు 2) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే కొలంబో వేదికగా శుక్రవారం జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కేవలం ఆరు వన్డేల్లో మాత్రమే పాల్గోనుంది. దీంతో ఈ సిరీస్‌ను ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలని హెడ్‌కోచ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు భావిస్తోంది.హర్షిత్ రానా అరంగేట్రం.. ఇక తొలి వన్డే విషయానికి వస్తే భారత తరపున యువ పేసర్ హర్షిత్ రానా అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. లంకతో జరిగే తొలి వన్డేకు భారత తుది జట్టులో రానాకు చోటు ఇవ్వాలని టీమిండియా మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.ఐపీఎల్-2024 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు తొలి సారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. మరోవైపు అతడితో పాటు రియాన్ పరాగ్ సైతం వన్డేల్లో డెబ్యూ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్‌రౌండ్ స్కిల్స్‌ను పరిగణలోకి తీసుకుని పరాగ్‌కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వినికిడి. మరోవైపు గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. మరోవైపు తొలి మ్యాచ్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.శ్రీలంకతో తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్. -
IND vs SL: 'గంభీర్ భయ్యా వల్లే ఇదంతా.. నేను అతడికి రుణపడి ఉంటా'
ఐపీఎల్ స్టార్, యువ పేసర్ హర్షిత్ రాణా బంపరాఫర్ తగిలింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత సెలక్టర్లు హర్షిత్ రాణాకు పిలుపునిచ్చారు. లంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో రాణాకు చోటు దక్కింది. భారత వన్డే జట్టులో రాణాకు చోటు దక్కడం ఇదే తొలిసారి.జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రాణా ఎంపికైనప్పటికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలోనైనా భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయాలని ఈ ఢిల్లీ యువ పేసర్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే తను స్దాయికి చేరుకోవడంలో ప్రస్తుత భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ది కీలక పాత్ర అని హర్షిత్ తెలిపాడు. కాగా గంభీర్, రాణా ఇద్దరూ ఢిల్లీ క్రికెట్‌కు ఆడి వచ్చిన వారే కావడం గమనార్హం. అంతేకాకుండా ఐపీఎల్లో గంభీర్ మెంటార్‌గా పనిచేసిన కేకేఆర్ జట్టులో రాణా సభ్యునిగా ఉన్నాడు."నేను ఎప్పుడూ నా కష్టాన్నే నమ్ముకుంటాను. కానీ కొన్ని సార్లు సీనియర్ జట్లలో చోటుదక్కినప్పడు ఒక్కడినే రూమ్‌లోని కూర్చోని బాధపడేవాడిని. నా ఈ అద్భుత ప్రయాణంలో నేను ముగ్గురికి కృతజ్ఝతలు తెలపాలనకుంటున్నాను. అందులో ఒకరు మా నాన్న. నేను ఈ స్ధాయికి చేరుకోవడానికి ఆయన ఎంతగానే కృషి చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత కోచ్ అమిత్ భండారీ ( ఢిల్లీ మాజీ పేసర్). భండారీ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇక అందరికంటే గంభీర్ భయ్యాకు నేను రుణపడి ఉంటాను. ఆట పట్ల నా ఆలోచన విధానం గంభీర్ భయ్యా వల్లే మారింది. ఆయనలాంటి వ్యక్తితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. మనకు ఎంత టాలెంట్ ఉన్నప్పటకి ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉండాలి. అప్పుడే మనం విజయం సాధించలగము. గంభీర్‌ను చూసి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేను నేర్చుకున్నాను. గౌతీ భయ్యా నాతో ఎప్పుడూ చెప్పేది ఒక్కటే విషయం. నేను నిన్ను నమ్ముతున్నాను, కచ్చితంగా నీవు విజయం సాధిస్తావని నాతో చెప్పేవారు" న్యూస్ 18తో మాట్లాడుతూ రాణా పేర్కొన్నాడు.ఐపీఎల్లో అదుర్స్..ఐపీఎల్-2024లో హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధిలను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలవడంలో రానా కీలక పాత్ర పోషించాడు.ఓవరాల్‌గా ఈ ఏడాది ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన రానా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా 7 మ్యాచ్‌లు ఆడిన రానా.. 28 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇక శ్రీలంక పర్యటన జూలై 27 నుంచి ప్రారంభం కానుంది. -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. భారత జట్టులో చోటు కొట్టేశాడు
కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ హర్షిత్ రానాకు జాక్ పాట్ తగిలింది. హర్షిత్ రానాకు భారత సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపువచ్చింది. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు రానాను సెలక్టర్లు ఎంపిక చేశారు. జింబాబ్వే సిరీస్‌కు తొలుత ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బీసీసీఐ తాజాగా స్వల్ప మార్పులు చేసింది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగమైన సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌లను జింబాబ్వే సిరీస్‌కు ముందు భారత జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే రానాకు చోటు దక్కింది. రానాతో పాటు సాయిసుదర్శన్, జితేష్ శర్మలకు కూడా అవకాశం లభించింది.ఇప్పటికే భారత జట్టు జింబాబ్వేకు పయనం కాగా.. వీరు ముగ్గురు కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. కాగా జితేష్ శర్మ ఇప్పటికే భారత్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేయగా.. సాయిసుదర్శన్, రానాలకు భారత టీ20 జట్టులో చోటు దక్కడం ఇదే మొదటి సారి. అయితే సాయి మాత్రం భారత తరపున వన్డేల్లో మాత్రం డెబ్యూ చేశాడు.ఐపీఎల్లో అదుర్స్..ఐపీఎల్-2024లో హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధిలను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలవడంలో రానా కీలక పాత్ర పోషించాడు.ఓవరాల్‌గా ఈ ఏడాది ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన రానా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా 7 మ్యాచ్‌లు ఆడిన రానా.. 28 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అదేవిధంగా భారత-ఎ జట్టు తరపున కూడా రానా ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. కాగా ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా -
కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? కేకేఆర్ స్టార్ రిప్లై వైరల్
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ మెగా టోర్నీలో హర్షిత్ మొత్తంగా 13 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా సీజన్లో కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా.. వరుణ్ చక్రవర్తి(21 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఆటతోనే కాకుండా.. తనదైన వైల్డ్ సెలబ్రేషన్స్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు హర్షిత్ రాణా. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా మయాంక్ అగర్వాల్ వికెట్ తీసిన తర్వాత ఫ్లైయింగ్ కిస్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ 22 ఏళ్ల రైటార్మ్ పేసర్.మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోతఈ నేపథ్యంలో బీసీసీఐ హర్షిత్‌ను మందలించింది. మరోసారి ఇలాగే అతి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ.. మ్యాచ్ ఫీజులో 60 శాతం మేర కోత విధించింది.ఇక ఆ తర్వాత హర్షిత్ రాణా మరోసారి ఇలా ఏ బ్యాటర్‌కు సెండాఫ్ ఇవ్వలేదు. అయితే, అతడి ప్రవర్తనపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.భయ్యాతో మాట్లాడానుతాజాగా శుభాంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ హర్షిత్ రాణా ఈ విషయంపై స్పందించాడు. ‘‘నేను ఉద్దేశపూర్వకంగా ఆరోజు మయాంక్ భయ్యాకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వలేదు. మయాంక్ భయ్యా బంతిని గాల్లోకి లేపగానే తన దగ్గరగా వెళ్లాను.ఆ సమయంలో వికెట్ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో సరదాగా అలా చేశాను. కెమెరామెన్ కూడా నా వైపే ఫోకస్ చేశాడు. ఆ తర్వాత నేను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మయాంక్ భయ్యాను కలిశాను.తనను అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదని చెప్పాను. ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. మా ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది’’ అని హర్షిత్ రాణా పేర్కొన్నాడు.విరాట్ కోహ్లికి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తావా? ఈ క్రమంలో విరాట్ కోహ్లి విషయంలో కూడా ఇలాగే చేస్తావా అంటూ హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘నేను ముందు చెప్పినట్లుగా.. కావాలని ఏదీ చేయను. ఆర్సీబీ మ్యాచ్‌లో కూడా నేను ఫ్లైయింగ్ కిస్ ఇస్తే చూడాలని చాలా మంది అనుకున్నారు.నన్ను చాలెంజ్ చేశారు. కానీ కోహ్లిని నేను ఎన్నటికీ టీజ్ చేయను. ఆయన పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. కోహ్లి భయ్యా ఒక్కడే కాదు.. ప్రతి ఒక్క ఆటగాడిని నేను గౌరవిస్తాను.ఏదేమైనా కోహ్లి ముందు మాత్రం ఇలా అస్సలు చేయను’’ అని హర్షిత్ రాణా బదులిచ్చాడు. కాగా లీగ్ దశలో దుమ్ములేపిన కేకేఆర్.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను ఓడించి 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా మూడో ట్రోఫీని అందుకుంది. ఇక విజయానంతరం కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ సైతం ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే! -
IPL 2024: కేకేఆర్ స్టార్ ప్లేయర్‌కు భారీ షాక్.. జరిమానాతో పాటు నిషేధం
కేకేఆర్ స్టార్ బౌలర్ హర్షిత్ రాణాకు భారీ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అతని మ్యాచ్ ఫీజ్‌లో 100 శాతం కోత విధించబడింది. ప్రస్తుత సీజన్లో రాణా రెండోసారి కోడ్ ఉల్లంఘనకు పాల్పడటంతో అతనిపై ఓ మ్యాచ్ నిషేధం కూడా పడింది. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ అభిషేక్ పోరెల్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు రాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. అభిషేక్ ఔటైన తర్వాత రాణా శృతిమించిన సంబురాలు (అభిషేక్‌ను డగౌట్ వైపు వెళ్లాలని కోపంగా ఆదేశించాడు) చేసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నాడు. రాణా కొద్ది రోజుల కిందట కూడా ఇలాగే ప్రవర్తించి జరిమానాను ఎదుర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేశాక ఓవరాక్షన్ (ఫ్లయింగ్ కిస్ ఇస్తూ కోపంగా చూశాడు) చేశాడు. అందుకు మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం జరిమానాను ఎదుర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో రాణా అతి చేసినా బౌలింగ్‌లో ఆట్టున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగా.. కేకేఆర్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఫిలిప్ సాల్ట్ (68) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కుల్దీప్ యాదవ్ (35 నాటౌట్) ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా తలో 2 వికెట్లు, స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. -
IPL 2024: కోట్లు పెట్టినా పేలని పేస్ గన్.. 20 లక్షలకే పేట్రేగిపోతున్న యువ సంచలనం
ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధర (24.75 కోట్లతో కేకేఆర్ సొంతం చేసుకుంది) పలికి, లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ఆసీస్ పేస్ గన్ మిచెల్ స్టార్క్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనలతో నిరాశపరుస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సీజన్ బరిలోకి దిగిన స్టార్క్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 53 పరుగులిచ్చిన స్టార్క్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌల్ చేసి 47 పరుగులు సమర్పించుకున్నాడు. జట్టులోని కుర్ర బౌలర్లు సత్తా చాటుతుంటే కోట్లు కుమ్మరించి కొనుక్కున స్టార్క్ తేలిపోతుండటంతో కేకేఆర్ యాజమాన్యం అసంతృప్తిగా ఉంది. స్టార్క్‌తో పాటు కేకేఆర్ బౌలింగ్ అటాక్‌ను ప్రారంభిస్తున్న 22 ఏళ్ల యువ పేసర్ హర్షిత్ రాణా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి ఔరా అనిపిస్తే.. స్టార్క్ మాత్రం తనపై పెట్టిన డబ్బుకు కనీస న్యాయం కూడా చేయలేక ఉసూరుమనిపిస్తున్నాడు. స్టార్క్‌పై పెట్టిన పెట్టుబడిలో కనీసం ఒకటో వంతు (20 లక్షలు) కూడా లభించని రాణా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే.. స్టార్క్ మాత్రం కోట్లు జేబులో వేసుకుని దిక్కులు చూస్తున్నాడు. మరో పక్క తన సహచరుడు, సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేస్తుంటే స్టార్క్ మాత్రం కేకేఆర్ అభిమానులకు, యాజమాన్యానికి గుండు సున్నా చూపిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఎలాగోలా గెలిచింది కాబట్టి సరిపోయింది. లేకుంటే స్టార్క్‌పై విమర్శల పర్వం మొదలయ్యేది. ఇప్పటికైనా స్టార్క్ మొద్దు నిద్రను వీడి రాణించాలని కేకేఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్.. ఏప్రిల్ 3న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. నేటి మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ను ఎదుర్కోనుండగా.. విశాఖలో జరిగే రాత్రి మ్యాచ్‌లో ఢిల్లీ, సీఎస్కే జట్లు తలడనున్నాయి. -
IPL 2024 ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్న హర్షిత్ రాణా
కేకేఆర్ పేస్ సంచలనం హర్షిత్ రాణా తాను చేసిన ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రాణా.. మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం కోపంగా ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెండాఫ్ ఇచ్చాడు. A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ అతి చేష్ఠలను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ మను నయ్యర్ రాణా మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత విధించాడు. ఇదే మ్యాచ్‌లో రాణా హెన్రిచ్ క్లాసెన్ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్న రిఫరీ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.5 నిబంధన ఉల్లంఘన కింద జరిమానా విధించాడు. Harshit Rana fined 60% of his match fees for giving Mayank Agarwal a send off. pic.twitter.com/kTXDBOXUtB — Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2024 కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షాబాజ్ అహ్మద్‌తో పాటు అప్పటికే శివాలెత్తిపోయిన ఉన్న క్లాసెన్‌ను ఔట్ చేసి కేకేఆర్‌ను గెలిపించాడు. ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రాణా 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. HARSHIT RANA, THE HERO OF KKR. SRH needed 13 in 6 balls - 6 on the first ball then 1,W,1,W,0 to win it for KKR. 🤯 pic.twitter.com/oXlzpAEJLV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్ (64; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) చెలరేగినప్పటికీ సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు.