
స్వదేశంలో ఇంగ్లండ్‌తో (England) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (Team India) మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పూణే వేదికగా ఇవాళ (జనవరి 31) జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ గెలవడం ఇది వరుసగా ఐదుసారి. భారత్‌కు స్వదేశంలో ఇది వరుసగా 17వ సిరీస్ విజయం.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (Shivam Dube) (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది.
12 పరుగుల వద్ద ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను హార్దిక్, దూబే మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు.
వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు.
182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (39), ఫిలిప్ సాల్ట్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
బ్రూక్ క్రీజ్‌లో ఉండగా.. ఇంగ్లండ్ విజయం సాధించేలా కనిపించింది. అయితే వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్‌లో బ్రూక్‌తో పాటు బ్రైడన్ కార్స్‌ను ఔట్ చేసి తిరిగి భారత్‌ను గేమ్‌లోకి తెచ్చాడు. బ్రూక్, కార్స్ ఔటయ్యాక జేమీ ఓవర్టన్ కొద్ది సేపు భారత బౌలర్లను బయపెట్టాడు.
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన శివమ్ దూబేకు కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా (Harshit Rana) మ్యాజిక్ చేశాడు. తన కెరీర్‌లో తొలి టీ20 ఆడిన హర్షిత్.. ఏకంగా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టాడు. హర్షిత్.. ప్రమాదకరమైన లివింగ్‌స్టోన్ (9), జేకబ్ బేతెల్ (6), జేమీ ఓవర్టన్ (19) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో హర్షిత్ 150 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం విశేషం.
హర్షిత్‌తో పాటు రవి బిష్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment