టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడ్డ బుమ్రా.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికి అతడి ఆడేది అనుమానమే. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు.
కనీసం ఎంతవరకు కోలుకున్నాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. . ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా టీమ్ మెనెజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశాడు. బుమ్రాకు బ్యాకప్‌గా యవ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)కు పరిగణలోకి తీసుకోవాలని, ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో అతడికి ఛాన్స్ ఇవ్వాలని చోప్రా అభిప్రాయపడ్డాడు.
కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన హర్షిత్ రాణా.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేసిన రాణా, ఇంగ్లండ్ సిరీస్‌తో వన్డేల్లో కూడా అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.
"బుమ్రా గాయంపై ఎటువంటి అప్‌డేట్ లేదు. పూర్తిగా ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మహ్మద్ సిరాజ్ కూడా లేడు. దీంతో హర్షిత్ రాణాను ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దం చేయండి. ఇంగ్లండ్‌తో వన్డేల్లో అతడిని ఆడించేందుకు ప్రయత్నించండి.
అదేవిధంగా అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటివరకు కేవలం 8 వన్డేలు మాత్రమే ఆడాడు. అతడికి వన్డేల్లో ఎక్కువగా అనుభవం లేదు. మరోవైపు మహ్మద్ షమీ తన రీఎంట్రీలో అంత రిథమ్‌లో కన్పించడం లేదు. ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో అతడు మూడు వికెట్లు పడగొట్టనప్పటికి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఒకవేళ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే భారత జట్టులో కేవలం ఇద్దరు పేసర్లు మాత్రమే మిగిలనున్నారు. ఇది జట్టుకు మంచిది కాదు. కాబట్టి బుమ్రా బ్యాకప్‌గా రాణాను సిద్దం చేయండి. అతడు అద్బుతాలు సృష్టిస్తాడు" అంటూ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
కాగా రాణా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో అరంగేట్రం చేశాడు. ఈ యువ పేసర్ శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన టీ20 అరంగేట్రంలో వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో కూడా రాణాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది.
ఈ క్రమంలోనే రాణాను మూడవ పేసర్‌గా ఉపయోగించాలని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ గురువారం నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. అదేవిధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
జట్లు
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా
ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.
చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ కెప్టెన్సీకి నేను సిద్ధం’
Comments
Please login to add a commentAdd a comment