కేకేఆర్ స్టార్ బౌలర్ హర్షిత్ రాణాకు భారీ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అతని మ్యాచ్ ఫీజ్‌లో 100 శాతం కోత విధించబడింది. ప్రస్తుత సీజన్‌లో రాణా రెండోసారి కోడ్ ఉల్లంఘనకు పాల్పడటంతో అతనిపై ఓ మ్యాచ్ నిషేధం కూడా పడింది.
ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ అభిషేక్ పోరెల్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు రాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. అభిషేక్ ఔటైన తర్వాత రాణా శృతిమించిన సంబురాలు (అభిషేక్‌ను డగౌట్ వైపు వెళ్లాలని కోపంగా ఆదేశించాడు) చేసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నాడు.
రాణా కొద్ది రోజుల కిందట కూడా ఇలాగే ప్రవర్తించి జరిమానాను ఎదుర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేశాక ఓవరాక్షన్ (ఫ్లయింగ్ కిస్ ఇస్తూ కోపంగా చూశాడు) చేశాడు. అందుకు మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం జరిమానాను ఎదుర్కొన్నాడు.
ఢిల్లీతో మ్యాచ్‌లో రాణా అతి చేసినా బౌలింగ్‌లో ఆట్టున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగా.. కేకేఆర్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఫిలిప్ సాల్ట్ (68) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
అంతకుముందు కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కుల్దీప్ యాదవ్ (35 నాటౌట్) ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా తలో 2 వికెట్లు, స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment